హాట్ అందాలతో యువత మతిపోగొడుతున్న జాహ్నవి

0

శ్రీదేవి కుమార్తె జాహ్నవీ కపూర్ బాలివుడ్లో ధడక్ లాంటి మంచి విజయంతో ఆరంగేట్రం చేసింది. తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్ తో జాహ్నవి అభిమానులకు కనులవిందు చేస్తోంది అని చెప్పవచ్చు.ప్రతి రోజు జిమ్ కి పోయేముందో ..జిమ్ చేసి బయటకి వచ్చిన తరువాతనో ఫొటోలకి ఫోజులిస్తూ యువతని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం జాహ్నవి చేతిలో నాలుగైదు చిత్రాలు ఉన్నాయి. అవన్నీ కూడా భారీ చిత్రాలే కావడం మరో విశేషం.

ఇకపోతే తాజాగా జాహ్నవి ఫొటోస్ కొన్ని సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో జాహ్నవి తెలుపు రంగు కుర్తా ప్లాజా వేసుకొని ఫ్లైట్ నేర్చుకోవడానికి వెళ్తుంది. అదేంటి జాహ్నవి ఫైలెట్ కాదు కదా మరి ఫ్లైట్ నేర్చుకోవడానికి ఎందుకు వెళ్తుంది అని అనుకుంటున్నారా.. ప్రస్తుతం జాహ్నవి ..Gunjan Saxena బయోపిక్ లో నటిస్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో మొట్టమొదటి మహిళా ఆఫీసర్.

ది కార్గిల్ గర్ల్ గా తెరకెక్కుతున్న ఈ బయోపిక్ లో Gunjan Saxena పాత్రలో జాహ్నవి నటిస్తుంది. ఈసినిమా 1990 లో ఇండో ..పాక్ యుద్ధ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. దీనితో పాత్రలో కొంచెమైనా సహజమైన స్వభావం కనిపించడానికి ఫ్లైట్ నేర్చుకోవడానికి వెళ్తుంది. శరన్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2020 మార్చి 13 న ప్రేక్షకుల ముందకు రాబోతుంది. అలాగే జాహ్నవి కరణ జోహార్ నిర్మించే దోస్తానా 2 లో కూడా నటిస్తుంది.
Please Read Disclaimer