రేవ్ పార్టీలో ప్రొడ్యూస‌ర్‌, హీరోయిన్‌!

0

దేశం మొత్తం క‌రోనా భ‌యంతో వ‌ణికిపోతుంటే కొంత మంది అదేమీ ప‌ట్ట‌న‌‌ట్టు రేవ్ పార్టీలు, బ‌ర్త్‌డే పార్టీలు చేసుకుంటూ వైర‌స్‌కి దారులు తెరుస్తున్నారు. ఇటీవ‌ల బంజారాహిల్స్‌లో ఓ వ‌జ్రాల వ్యాపారి పుట్టిన రోజు వేడుక‌లో వంద మందికి పైగా హైద‌రాబాద్‌కి చెందిన రాజ‌కీయ నాయ‌కులు, మంత్రులు, సెల‌బ్రిటీలు, కార్పొరేట‌ర్‌లు పాల్గొన్న విష‌యం తెలిసిందే. ఈ పార్టీ జ‌రిగిన కొన్ని రోజుల‌కే ఆ వ‌జ్రాల వ్యాపారి క‌రోనా సోక‌డంతో మృతి చెందారు.

అప్ప‌టి నుంచి ఆ పార్టీకి హాజ‌రై చిందులేసిన వారంతా గుండె ప‌ట్టుకుని బిక్కు బిక్కు మంటున్నారు. ఈ ఉదంతం మ‌ర‌వ‌క‌ముందే రెండు రోజుల క్రితం బంజారా హిల్స్‌లోని స్టార్ హోట‌ల్‌లో రేవ్ పార్టీ జ‌రిగింది. దీనికి పెద్ద సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు. ఈ విష‌యాన్ని ఛేధించిన పోలీసులు రేవ్ పార్టీ నిర్వ‌హించిన వ్య‌క్తిని అదుపులోకి తీసుకుని పార్టీకి ఎవ‌రెవ‌రు హాజ‌ర‌య్యారో ఆరా తీస్తున్నారు. ఇదే పార్టీలో ఉక్రెయిన్‌కు చెందిన ఓ యువ‌తి కూడా ప‌ల్గొంద‌ట‌. దీంతో ఆమెని కూడా కస్ట‌డీలోకి తీసుకున్న పోలీసులు మిగ‌తా వారిపై దృష్టి పెట్టిన‌ట్టు తెలిసింది.

ఈ పార్టీలో టాలీవుడ్‌కు చెందిన ఓ యంగ్ ప్రొడ్యూస‌ర్‌తో పాటు బుల్లితెర న‌టి కూడా పాల్గొన్నార‌ట‌. ప్ర‌స్తుతం పార్టీలో పాల్గొన్న వారిపై పోలీసులు ఆరా తీస్తుండ‌టంతో యంగ్ ప్రొడ్యూస‌ర్‌, టీవీ న‌టి భ‌యంతో వ‌ణికిపోతున్నార‌ట‌. ఎక్క‌డ త‌మ పేరు బ‌య‌టికి వ‌స్తుందోన‌ని హ‌డ‌లిపోతున్నార‌ట‌. ఇంత‌కీ వారు ఎవ‌ర‌న్న‌ది మాత్రం బ‌య‌టికి తెలియ‌డం లేదు. వారి పేర్లు బ‌య‌టికి రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నార‌ని, ఆ కార‌ణంగానే వారి పేర్లు బ‌య‌టికి రావ‌డం లేద‌ని తెలుస్తోంది.