యంగ్ టైగర్ ఫ్యాన్ మేడ్ లుక్ కిర్రాక్

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి మాస్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ టాప్ హీరోగా స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్ కు ప్రపంచ వ్యాప్తంగా అసాధారణ అభిమానగణం ఉన్నారు. గత దశాబ్ద కాలంగా ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ పెరుగుతూనే వుంది. అందుకు తగ్గట్టే పోటా పోటీ గా బాక్సాఫీస్ వద్ద తారక్ సినిమాలు రికార్డులు తిరగ రాస్తూనే ఉన్నాయి.

తాజా గా ఎన్టీఆర్ మెగా హీరో రామ్చరణ్ తో కలిసి `ఆర్.ఆర్.ఆర్` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశ లో వుంది. ఇందులో రామ్చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా ఎన్టీఆర్ ఆదివాసీ పోరాట యోధుడు కొమరం భీం పాత్ర లో కనిపించబోతున్నారు. ఈ మూవీ రాక కోసం తారక్ అభిమానులు.. చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తి గా వేచి చూస్తున్నారు.

జక్కన్న ఆర్.ఆర్.ఆర్ ని ప్రకటించిన దగ్గరి నుంచి ఫ్యాన్స్ ఫ్యాన్ మేడ్ పోస్టర్ల హడావుడి ఎక్కువైంది. ఏకంగా ఈ సినిమా తీస్తున్న మేకర్స్ నే కన్ఫ్యూజ్ చేసేంత క్వాలిటీ డిజైన్స్ రూపొందిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఓ ఫ్యాన్స్ గ్రూప్ హంగామా పీక్స్ లో సాగుతోంది. ఇదిలా వుంటే వెంకటగిరి నందమూరి ఫ్యాన్స్ అసోసియేషన్ ఫేస్బుక్ వేదిక గా పోస్ట్ చేసిన ఎన్టీఆర్ ఫొటోలు ఆసక్తి ని రేకెత్తిస్తున్నాయి. ఓ వీరాభిమాని ఎన్టీఆర్ సినిమా పేర్ల తో ఎన్టీఆర్ రూపాన్ని డిజైన్ చేసిన తీరు కిర్రాక్. ఫ్యాన్ మేడ్ లుక్ ఆకట్టుకుంటోంది. తమ ఆరాధ్య నటుడి కోసం ఓ వీరాభిమాని క్రియేటీవిటీ అభిమానుల్ని నెటిజనుల్ని అబ్బుర పరుస్తోంది.
Please Read Disclaimer