జూనియర్‌ ఎన్టీఆర్‌ కొత్త అవతారం.. ఆర్‌ఆర్‌ఆర్‌ కన్నా ముందేనా?

0

యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ మరో కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. ప్రస్తుతం హీరోగా ఫుల్‌ ఫాంలో ఉన్న ఈ స్టార్‌ హీరో త్వరలో కొత్త బాధ్యతలు తలకెత్తుకునేందుకు సిద్ధమవుతున్నాడు. అధికారికంగా ప్రకటించకపోయినా త్వరలోనే ఎన్టీఆర్‌ అభిమానులకు బిగ్‌ న్యూస్‌ చెప్పనున్నాడన్న టాక్‌ బలంగా వినిపిస్తోంది.

అదేంటంటే ఎన్టీఆర్ కూడా త్వరలో నిర్మాతగా మారుతున్నాడట. ఇప్పటికే ఈ జనరేషన్‌ హీరోలు మహేష్ బాబు, పవన్‌ కళ్యాణ్‌, రామ్‌ చరణ్‌, నితిన్‌ లాంటి హీరోలతో పాటు మరికొంత మంది యంగ్‌ హీరోలు నిర్మాతలుగా మారి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అదే బాటలో ఎన్టీఆర్‌ కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.

ఇప్పటికే నందమూరి ఫ్యామిలీ నుంచి రామకృష్ణ సినీ స్టూడియోస్‌, ఎన్టీఆర్ట్స్‌ బ్యానర్లు ఉన్నాయి. తాజాగా బాలకృష్ణ కూడా ఎన్బీకే ఫిలింస్‌ బ్యానర్‌ను స్థాపించి ఎన్టీఆర్‌ బయోపిక్‌ను రెండు భాగాలుగా స్వయంగా నిర్మించాడు. ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి నాలుగో నిర్మాణ సంస్థగా ఎన్టీఆర్‌ సొంత నిర్మాణ సంస్థ ప్రారంభం కానుంది.

అయితే ఈ బ్యానర్‌లో వరుస సినిమాలు చిత్రీకరిస్తారా లేక.. కేవలం ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహిస్తాడా అన్న విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ విషయంపై తన సన్నిహితులతో ఎన్టీఆర్‌ జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై తారక్‌ ఓ నిర్ణయం తీసుకొని అభిమానులకు స్వయంగా తెలుపనున్నాడు. అయితే ఆ నిర్ణయం ప్రస్తుతం సెట్స్‌ మీద ఉన్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమా రిలీజ్‌ కన్నా ముందే ఉండవచ్చన్న టాక్‌ కూడా వినిపిస్తోంది

ఇక సినిమాల విషయానికివస్తే ఎన్టీఆర్‌ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్‌ సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ మరో హీరోగా నటిస్తున్నాడు. చరణ్ అల్లూరి సీతా రామరాజు పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ తెలంగాణ సాయుధపోరాట యోధుడు కొమరం భీం పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను 2020 జూలై నెలాఖరున రిలీజ్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Please Read Disclaimer