బాలయ్యకు సీఎం జగన్ వీరాభిమాని అట..!

0

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు అందరికీ అభిమానం.. ఆయన ఇప్పుడు రాజకీయాల్లో యువ సంచలనం.. కోట్ల మంది ఫ్యాన్స్ జగన్ కు ఉన్నారు. అంతమంది అభిమానించే జగన్ కు కూడా ఓ హీరో అంటే పిచ్చి అట.. ఆ హీరో ఫ్యాన్ గా జగన్ తన చిన్నతనంలో ఉన్నాడట..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి తనదైన ముద్ర వేస్తున్న ఈ యువనాయకుడు సీఎం జగన్ కూడా ఓ హీరో అంటే పడిచచ్చేవాడని తాజాగా ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నటుడు విజయ్ చందర్ తెలిపాడు. ఆయన కూడా సాధారణ మనిషే అని.. జగన్మోహన్ రెడ్డికి కూడా నచ్చిన ఓ హీరో ఉన్నాడని సీక్రెట్ చెప్పాడు.

ఏపీ సీఎం జగన్ కు సినిమాలంటే చిన్నప్పటి నుంచి పిచ్చి అని ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నటుడు విజయ్ చందర్ తెలిపాడు. తాజాగా విలేకరులతో మాట్లాడిన విజయ్ చందర్.. హీరో నందమూరి బాలక్రిష్ణ ఫ్యాన్ జగన్ అని చెప్పుకొచ్చాడు. బాలక్రిష్ణ సినిమా విడుదలవుతుంటే జగన్ ఊళ్లల్లో సెలబ్రేట్ చేసేవాడని విజయ్ చందర్ తెలిపాడు. బాలయ్య సినిమాలు మిస్ అవ్వకుండా చూసేవాడని తెలిపారు. ఈయనే కాదు.. సుమన్ సినిమాలను కూడా జగన్ బాగా చూసేవాడని ఆయన తెలిపాడు.

నిజానికి చాలా రోజులుగా బాలయ్య అభిమాని జగన్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై జగన్ కానీ బాలక్రిష్ణ కానీ స్పందించలేదు. అయితే ఇప్పుడు జగన్ కు సన్నిహితుడైన విజయ్ చందర్ ఈ విషయాన్ని రుఢీ చేశారు. దీంతో ఏపీ సీఎం జగన్ తన అభిమాని అని తెలుసుకున్న బాలక్రిష్ణ ఎలా స్పందిస్తాడనేది వేచిచూడాలి.
Please Read Disclaimer