జబర్దస్త్‌కి రోజా గుడ్ బై.. కొత్త జడ్జ్‌తో అనసూయ చిందులు

0

అన్ని షోల యందు జబర్దస్త్ షో వేరయా అన్నట్టుగా కామెడీతో కితకితలు పెట్టించే ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్. ఈ కామెడీ షోకి గత కొన్నేళ్లుగా జడ్జ్‌‌‌గా వ్యవహరిస్తూ ఎక్స్ ట్రా ఫన్ అందిస్తున్న స్మైలీ హీరోయిన్ రోజా.. ఆ షోకి గుడ్ బై చెప్పేశారు. అధికార వైసీపీ పార్టీ ఫైర్ బ్రాండ్‌గా నగరి ఎమ్మెల్యేగా పార్టీలో కీ రోల్ పోషిస్తున్న రోజా.. ఒకవైపు పార్టీ వ్యవహారాల్లో పాల్గొంటూనే గురు, శుక్రవారాల్లో జబర్దస్త్ కామెడీకి జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు.

గత కొన్నేళ్లుగా జబర్దస్త్ కామెడీ షో‌కి నాగబాబుతో కలిసి జడ్జ్‌గా వ్యవహరిస్తున్న రోజా.. ఎన్నికల సమయంలో వీరి స్థానంలో చాలా మంది జడ్జ్‌లుగా వచ్చినప్పటికీ ప్రేక్షకులకు రోజా లేని లోటు స్పష్టంగా కనిపించింది. చక్కని చిరునవ్వుతో పాటు ఇంట్రో సాంగ్‌కి అదిరిపోయే స్టెప్పులేయడం రోజాలో ఉన్న స్పెషల్ అట్రాక్షన్.

అయితే రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత రోజా మినిస్టర్ కావడం ఖాయమని ఆమె జబర్దస్త్ కామెడీ షోకి స్వస్తిపలుకుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. దీనికి తగ్గట్టుగా రోజా కూడా ఫ్యామిలీని విజయవాడకు షిప్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే అనూహ్య పరిణామాలు, కుల సమీకరణాలతో రోజాకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో మళ్లీ జబర్దస్త్ షోకి రీ ఎంట్రీ ఇచ్చారు రోజా.

అయితే రోజాకు మంత్రి పదవి అయితే దక్కలేదు కాని.. ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(ఏపీఐఐసీ) ఛైర్ పర్సన్ గా రోజా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే తొలి మంత్రివర్గంలో స్థానం దక్కించుకోలేకపోయిన రోజాకు తరుపరి మంత్రి వర్గ విస్తరణలో చోటు ఖాయంగా ఉండటంతో పూర్తిగా పార్టీ వ్యవహారాల్లో కీ రోల్ పోషించేందుకు సిద్ధమయ్యారు రోజా. దీంతో పాటు జబర్దస్త్ కామెడీ షోపై పార్టీ వర్గాల్లో కూడా విమర్శలు వస్తుండటంతో ఈ షోకి దూరం అయితేనే బెటర్ అనే అభిప్రాయానికి వచ్చారు రోజా.

తాజాగా బజర్దస్త్ వచ్చే వారానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో జడ్జ్ స్థానంలో రోజా కనిపించకోవడంతో పాటు.. ఆమె ప్లేస్‌లో ఢీ జడ్జ్, ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కనిపించారు. ఇక శేఖర్ మాస్టర్‌తో ‘చిలక చిలక చిలక పెట్టిపోరా చురకా’ అంటూ యాంకర్ అనసూయ ఓ రేంజ్ స్టెప్పులు వేస్తూ జబర్దస్త్ స్టేజ్‌ని షేక్ చేశారు.

అయితే వచ్చే వారానికి మాత్రమే రోజా తప్పుకున్నారా? లేక మొత్తం జబర్దస్త్ షో నుండే తప్పుకున్నారా అన్నది తెలియాల్సి ఉంది.
Please Read Disclaimer