మతం మారాలని సంగీత దర్శకుడిపై భార్య ఒత్తిడి?

0

సంగీత దర్శకుడు దిలీప్ కుమార్.. మతం మార్చుకుని ఏ.ఆర్.రెహమాన్ అయ్యాడు. అల్లా ఆశీస్సులతోనే తాను గొప్ప సంగీత దర్శకుడిగా ఎదిగానని.. ఖురాన్ తాను మెచ్చిన పవిత్ర గ్రంధం అని రెహమాన్ చెబుతుంటారు. సూఫీ సంగీతాన్ని ఇష్టపడడానికి కారణం కూడా ఆయన ఇదివరకూ వెల్లడించారు. మతమార్పిడికి రెహమాన్ కి తన కారణాలు తనకు ఉన్నాయి. కానీ ఇక్కడ యువన్ శంకర్ రాజా సన్నివేశమే వేరు.

భార్య ఒత్తిడికి తలొగ్గి ఇళయరాజా వారసుడు యువన్ శంకర్ రాజా మతమార్పిడికి పాల్పడ్డారా.. అంటూ తాజాగా సోషల్ మీడియాలో హాట్ డిబేట్ నడుస్తోంది. ఇటీవల ఓ లైవ్ ఇంటరాక్షన్ లో యువన్ భార్యామణి జాఫ్రూన్ నిజార్ పై యువన్ ఫ్యాన్స్ కాస్త కఠినమైన ప్రశ్నల్ని సంధించారు. మీ ఒత్తిడి వల్లనే హిందువు అయిన ఇళయరాజా కుమారుడు ముస్లిముగా మారాడు! అంటూ యువన్ ఫ్యాన్స్ అనడంతో దానికి కోపగించుకున్న జాఫ్రూన్ .. నేరుగా ఆయనే లైవ్ లోకి వచ్చి మాట్లాడతారు.. అప్పుడే మీ సందేహం తీరుతుంది! అంటూ రుసరుసలాడేసారు.

తనను కలిసేందుకు మూడేళ్ల ముందే యువన్ మతం మారారని.. తాను కోరుకునే అన్ని సమాధానాలను ఖురాన్ లో కనుగొన్నానని ఆమె తెలిపారు. మా మనసులు కలిసాయి. పెళ్లి చేసుకున్నాం అని అన్నారు. అయితే యువన్ శంకర్ రాజాకు మూడో భార్యగా వచ్చారు జాఫ్రూన్ నిజార్. 2002లో సుజయ చంద్రన్ ని పెళ్లాడిన అతడు అటుపై ఆమె నుంచి విడిపోయాడు. ఆ తర్వాతా 2011లో శిల్పా మోహన్ ని పెళ్లాడాడు. కాపురంలో కలతల వల్ల ఆమె నుంచి విడిపోయాడు. ఇటీవలే జాఫ్రూన్ ని మూడో వివాహం చేసుకున్నారు. వీరికి ఓ ఆడబిడ్డ జన్మించింది. మతమార్పిడి తర్వాత అబ్ధుల్ ఖాలిక్ అని పేరు మార్చుకున్నారు యువన్. ఈ వివాహానికి యువన్ కుటుంబ సభ్యుల మద్ధతు లేదని సోషల్ మీడియాలో ఇంతకుముందు పలు కథనాలు వేడెక్కించిన సంగతి తెలిసిందే. ఇక సౌత్ లోనే యూనిక్ ట్యాలెంట్ ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా యువన్ ఎప్పుడూ బిజీ అన్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer