త్వరలోనే మరో లెజెండరీ క్రికెటర్ బయోపిక్..

0

భారతీయ సినిమా రంగంలో ప్రస్తుతం బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుంది. ఏ బాషా చలనచిత్ర రంగం చూసినా ఫేమస్ పర్సనాలిటీల లైఫ్ స్టోరీలను తెరమీదకు తీసుకురావడానికి పోటీపడుతున్నారు. సినిమా స్టార్ బిజినెస్ మాన్ పొలిటీషియన్ లతో పాటు క్రికెటర్ల లైఫ్ స్టోరీస్ కూడా బయోపిక్ ల రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎంఎస్ ధోని సచిన్ టెండూల్కర్ల బయోపిక్ లతో పాటు ఇప్పుడు ఇండియన్ గ్రేట్ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ కూడా రూపొందిస్తున్నారు.

కానీ ఈ బయోపిక్ ల ట్రెండ్ అనేది ప్రస్తుత సినిమారంగంలో ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తుంది అనే చెప్పాలి. జనాలకు తెలిసి తెలియకుండా కనుమరుగైన ఫేమస్ స్టార్లను సినిమా రూపంలో మన కళ్లముందు ఉంచుతున్నారు. ఈ బయోపిక్ టాపిక్ మరో ఫేమస్ క్రికెటర్ చెవిన కూడా పడింది. మరి ఆయన ఊరుకుంటారా.. కాస్త అలోచించి ఓకే చెప్పేశారట. ఆయనెవరో కాదండి.. లెజెండరీ క్రికెటర్ యువరాజ్ సింగ్.

యువరాజ్ సింగ్ కూడా ఈ మధ్య మీడియా ఇంటర్వ్యూ లో అన్ని కుదిరితే తన లైఫ్ స్టోరీని సినిమాగా తెరకెక్కించడానికి ఏ అభ్యంతరం లేదు అన్నాడట. అంతేగాక నా బయోపిక్ లో నా పాత్రను మాత్రం గల్లిబాయ్ చిత్రంలో నటించిన సిద్దాంత్ చతుర్వేది పోషిస్తే బాగుంటుంది అని సలహా ఇచ్చాడట. చూడాలి మరి ఈ మాట ఏ డైరెక్టరైనా విన్నాడో లేదో.. జనాలు కూడా బయోపిక్ లను ఆదరిస్తుండటంతో ఫిల్మ్ మేకర్స్ కూడా వాటిని రూపొందించడానికి మక్కువ చూపిస్తున్నారు. అన్ని కుదిరితే మన యువీని కూడా థియేటర్లో చూసే అవకాశం దక్కుతుంది మరి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-