కజిన్ బ్రదర్ తో వెళ్తున్నా అనుమానిస్తున్నారన్న హీరోయిన్!

0

గాసిప్స్ సృష్టించే వాళ్లకు పని లేదంటోంది జరీన్ ఖాన్. ఈ సందర్భంగా ఆమె ఒకింత తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తన పేరును ఎవరితోనైనా లింకప్ చేస్తూ వచ్చే వార్తలపై ఈ హీరోయిన్ తీవ్రంగా స్పందించింది. ఈ నటీమణి ఒక ఫిట్ నెస్ ట్రైనర్ తో డేటింగ్ లో ఉందని కొన్నాళ్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే వాటిని ఖండించింది జరీన్.

అబ్బాస్ అలీ అనే ఫిట్ నెస్ ట్రైనర్ తో తను డేటింగ్ చేస్తున్న విషయం అబద్దమని జరీన్ తేల్చింది. అతడు సింగిల్ గా ఉంటున్నాడని తను కూడా సింగిల్ గా హ్యాపీగా ఉంటున్నట్టుగా చెప్పిన జరీన్.. అలాగని తామిద్దరం డేటింగ్ లో జతగా ఉంటున్నట్టు కాదని చెబుతోంది.

జనాలు అన్నింటికి అనుమానిస్తారని ఆఖరికి ఎవరైనా కజిన్ బ్రదర్ తో కలిసి వెళ్తున్నా.. ఇద్దరికీ ముడిపెట్టుస్తున్నారని ఈమె మండిపడింది. తన పక్క ఉన్న వ్యక్తి ఎవరో మీడియా వాళ్లకు తెలియకపోతే చాలని అతడితో ఎఫైర్ అంటగడతారని వాపోయింది.

సల్మాన్ ఖాన్ పరిచయం చేసిన నటీమణి జరీన్ ఖాన్. ఒక దశలో సల్లూ ఈమెతో ప్రేమలో పడ్డట్టుగా ప్రచారం జరిగింది. సల్మాన్ ప్రోత్సహించినీ – అందం ఉన్నా జరీన్ హీరోయిన్ గా అంత రాణించలేకపోయింది. ఈ మధ్యనే ఒక తెలుగు సినిమాలో కూడా చేసినట్టుగా ఉంది.
Please Read Disclaimer