ఉత్తమ నటుడు చిరు.. ఉత్తమ నటి సమంత

0

టాలీవుడ్ లో అవార్డుల పండగల గురించి తెలిసిందే. ప్రతి ఏడాది జీ సినిమా అవార్డ్స్ కార్యక్రమం టాలీవుడ్ సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా 2020 అవార్డుల వేడుక కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. కళా తపస్వి కె. విశ్వనాథ్- మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథులుగా వేడుక ఘనంగా జరిగింది. ఇంకా పూరి జగన్నాథ్- ఎనర్జిటిక్ స్టార్ రామ్- చార్మీ- సమంత అక్కినేని- పూజాహెగ్దే- నిధి అగర్వాల్- సుష్మిత కొణిదెల- శ్రద్ధా శ్రీనాథ్- నీల్ నితిన్ ముఖేష్ తదిరుల వేడుకలో పాల్గొన్నారు.

2019 ఉత్తమ నటిగా అక్కినేని కోడలు సమంత అవార్డును అందుకున్నారు. మజిలి..ఓ బేబి చిత్రాల్లో సమంత పెర్పామెన్స్ గాను ఈ అవార్డు వరించింది. అవార్డుల వేదికపై డిజైనర్ డ్రెస్ లో సమంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేదికపై మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్ ఎంట్రీ అదిరిపోయింది. చిరు పాత పాటలతో వేదిక షేకైంది. ఆ పాటలకు యవ హీరో కార్తీకేయ డాన్సు లు చేసి మెగాస్టార్ మనసు గెలిచాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటనకుగాను ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు.

ఉత్తమ దర్శకుడిగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (ఇస్మార్ట్ శంకర్) అవార్డును అందుకున్నారు. ఉత్తమ నిర్మాతగా ఛార్మీ.. ఉత్తమ సంచలన హీరోగా రామ్ ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి అవార్డులు అందుకున్నారు. ఇంకా పలు విభాగాల్లో ఇస్మార్ట్ శంకర్ కు అవార్డులు దక్కాయి. ఇంకా వివిధ విభాగాల్లో జీ అవార్డులతో దర్శక నిర్మాత హీరోలను సత్కరించింది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-