ఈ జాను కు ఏమైంది హైప్ లేదు.. .బజ్ లేదు!

0

రీమేక్ సినిమాలు చేయడం విజయానికి ఓ షార్ట్ కట్ అని చాలామంది నమ్ముతూ ఉంటారు. అయితే కల్ట్ ఫిలింగా పేరు తెచ్చుకున్న సినిమాలను రీమేక్ చెయ్యడం మాత్రం ఎప్పుడూ కత్తిమీద సామే. శర్వానంద్- సమంతా హీరో హీరోయిన్లుగా ‘జాను’ అనే ఒక లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తమిళ సూపర్ హిట్ ’96’ కు రీమేక్. త్వరలో ‘జాను’ విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రమోషన్స్ కూడా ప్రారంభం అయ్యాయి. అయితే ఇప్పటికీ సినిమా బజ్ మాత్రం లేదు.

ఈ సినిమా నుండి టీజర్.. రెండు పాటలు విడుదల అయ్యాయి కానీ వాటికి పెద్దగా స్పందన దక్కడం లేదు. యూట్యూబ్ లో ఈ టీజర్.. పాటల వ్యూస్ కౌంట్ చూస్తేనే ఈ సినిమాపై స్పందన ఎంత తక్కువగా ఉందో మనకు తెలుస్తుంది. ’96’ స్లోగా సాగే సినిమా.. విజయ్ సేతుపతి.. త్రిషలు తమ నటనతో నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళారు. సినిమా కథకు సేతుపతి.. త్రిష వయసు కూడా చక్కగా సరిపోయింది. స్లోగా ఉన్నప్పటికే తమిళ ప్రేక్షకులు ఆ సినిమాను ఆదరించారు. అయితే తెలుగు ప్రేక్షకుల అభిరుచి భిన్నంగా ఉంటుంది. పైగా శర్వా వయసు తక్కువ కావడంతో టీజర్ ఎఫెక్టివ్ గా లేదనే కామెంట్లు కూడా వినిపించాయి.

శర్వా లాస్ట్ సినిమా ‘రణరంగం’ తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. దానికి ముందు ‘పడిపడి లేచే మనసు’ కూడా ఫ్లాపే. దీంతో శర్వా కొత్త సినిమా పై పెద్దగా ఆసక్తి కనిపిచడం లేదు. ఈ సినిమాకు ఉన్న ప్లస్ సమంత ఒక్కటే. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ విషయం లో ‘జాను’ టీమ్ కేర్ లెస్ గా ఉండడం తో ఏమాత్రం హైప్ రావడం లేదు. ఇప్పటికైనా ‘జాను’ టీమ్ మేల్కొని ప్రమోషన్స్ చేయకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర కష్టమే అనే మాట వినిపిస్తోంది.
Please Read Disclaimer