రొమాన్స్ దట్టించిన జిందాబాద్ జిందాబాద్

0

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఇంట్రెస్టింగ్ ప్రోమోలతో పాజిటివ్ బజ్ తెచ్చుకుంటున్న ఈ సినిమా నుండి ఇప్పటికే ‘దిమాక్ ఖరాబ్’ అంటూ సాగే ఒక మాస్ సాంగ్ ను విడుదల చేశారు. మొదటి పాటకు సంగీతప్రియుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుండి సెకండ్ లిరికల్ సాంగ్ ‘జిందాబాద్ జిందాబాద్’ ను రిలీజ్ చేశారు.

‘జిందాబాద్ జిందాబాద్’ రామ్.. నభా నటేష్ ల మధ్య సాగే ఒక రొమాంటిక్ సాంగ్ ఇది. మాల్దీవ్స్ లోని బీచ్ లొకేషన్ లో చిత్రీకరించిన ఈ పాటకు సంగీత దర్శకుడు మణిశర్మ ఒక డిఫరెంట్ ట్యూన్ ను కంపోజ్ చేశారు. ఈ పాటకు సాహిత్యం అందించిన వారు భాస్కరభట్ల. రొమాంటిక్ సాంగ్ అయినా రామ్ పాత్రకు తగ్గట్టు కాస్త ఘాటు పదాలతో రొమాన్స్ దట్టించారు. “జిందాబాద్ జిందాబాద్ ఎర్రని పెదవులకి.. జిందాబాద్ జిందాబాద్ కుర్రాడి చూపులకి.. వహవా వహవా వావవా .. ఒక ముద్దు అప్పు కావాలా? వహవా వహవా వావవా.. తిరిగి ఇచ్చేస్తావా..అరెరే ఒకటికి నాలుగు వడ్డీతో ఇస్తాలే” అంటూ రచ్చగా సాగింది. అసలే బీచ్ లొకేషన్.. అందులో రామ్ లాంటి ఎనర్జిటిక్ హీరో.. నభా లాంటి అందమైన భామ. ఇద్దరి మధ్యలో ఈమాత్రం ఘాటు రొమాన్స్ లేకపోతే ఎలా అన్నట్టుగా పాటను డిజైన్ చేసినట్టున్నారు దర్శకులు పూరిగారు.

ఈ పాటను పాడిన వారు శరత్ సంతోష్.. రమ్య బెహరా. పాట మూడ్ కు తగ్గట్టు ఇద్దరూ అల్లరిగా చిలిపిగా పాడి మెప్పించారు. ఈ పాటను సూపర్ అని చెప్పలేం కాని ఒవరాల్ గా ఒకే. నాలుగైదు సార్లు వింటే నచ్చే పాట ఇది. అయితే ఒక నెటిజన్ ఈ పాటను ‘రఘువరన్ B.Tech’ లోని ‘చూడండి సారూ మన సూపర్ స్టారు’ పాటకు కాపీ అని అప్పుడే ఆరోపణ కూడా చేసి పారేశాడు.. మీరే పాట చూసి అవునో కాదో డిసైడ్ చెయ్యండి.

ఈ సినిమాలో నభ నటేష్ తో పాటుగా నిధి అగర్వాల్ కూడా హీరోయిన్ గా నటిస్తోంది. పూరి జగన్నాధ్.. ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జులై 12 న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.