పెదాలను మృదువుగా మార్చే గ్లిసరిన్

0

అందమైన పెదాలు మీ నవ్వుకు మాత్రమే కాదు ముఖ సౌందర్యాన్ని పెంచుతాయి. పెదాలకు కాస్మెటిక్ లను వాడటం ఇష్టం లేదా? అయితే గ్లిసరిన్ మీకు తప్పక సహాయపడుతుంది. గ్లిసరిన్ వలన పెదాలు మృదువుగా, ఆకర్షణీయంగా మారుస్తుంది.

1గ్లిసరిన్ మాయాజాలం
TV లలో వచ్చే ప్రకటనలలో కంపెనీలు వారు తయారు చేసిన లిప్ బామ్ లు పొడిగా, అందవికారంగా ఉన్న పెదాలు, అందంగా, ఆకర్షణీయంగా మారుతాయని చూపిస్తుంటారు. దానిలో ఎంత నిజమో తెలియదు కానీ గ్లిసరిన్ మాత్రం పెదాలను గులాభి రంగులో, మృదువుగా మారుస్తుంది. పెదాలను హైడ్రేటేడ్ గా ఉంచి, మూడు రంగును తొలగించి ఎల్లపుడు పెదాలను తేమభరితంగా మారుస్తుంది.

2వాటిని మృదువుగా మారుస్తుంది
తేమను అందించే గుణాలను గ్లిసరిన్ కలిగి ఉంటుందని అందరికి తెలిసిందే. పగిలిన మరియు పొడిగా ఉండే పెదాలకు ఇదొక మంచి ఔషదంగా చెప్పవచ్చు. ముఖ్యంగా గ్లిసరిన్ ను శీతాకాలంలో వాడటం వలన మంచి ఫలితాలను పొందవచ్చు. శీతాకాలంలో పెదాలు పగలటం మరియు కొన్ని సార్లు రక్త స్రావం కూడా జరగవచ్చు, ఇలాంటి సమయంలో గ్లిసరిన్ అన్ని విధాల సహాయపడుతుంది.

3పెదాలను గులాభి రంగులోకి మారుస్తుంది
సిగరెట్ తాగటం వంటి దురలవాట్ల అలవాట్ల పెదాలు ముదురు రంగులోకి మారతాయి. ఇలాంటి సమయంలో గ్లిసరిన్ సహాయపడుతుంది. రోజు రాత్రి పడుకునే ముందు గ్లిసరిన్ ను అప్లై చేసి పడుకొని, ఉదయాన మీ పెదాలను చూడండి.

4పెదాలకు తేమను అందిస్తుంది
పెదాలపై ఉండే చర్మం పలుచగా చాలా సున్నితంగా ఉంటుంది కావున ముఖ: చర్మానికి తీసుకునే జాగ్రత్తల కన్నా వీటికి మరింత జాగ్రత్త తీసుకోవాలి. సాధారణంగా వాడె లిప్ బామ్ లు కొన్ని గంటలలోనే వాటి సామర్థ్యాన్ని కోల్పోతాయి. కానీ గ్లిసరిన్ పూర్తి రోజు పెదాలకు తేమను అందిస్తుంది. కావున కృత్రిమ లిప్ బామ్ లకు బదులుగా గ్లిసరిన్ ను వాడటం మంచిది.

5చికాకులను దూరం చేస్తుంది
పొడిగా ఉండే పెదాలు సాధారణంగా దురదలకు మరియు చికాకుకు గురి చేస్తాయి. వీటిని గోకటం వలన పెదాలు పగిలి రక్తస్రావం కూడా జరగవచ్చు. ఇలాంటి పరిస్థితులలో పొడిగా ఉండే పెదాలపై గ్లిసరిన్ ను చేతి వేళ్ళతో పూయటం వలన దురదల నుండి ఉపశమనం పొందుతారు.
Please Read Disclaimer