Home / LIFESTYLE / తొలి రాత్రి తెల్లని వస్త్రాలే ఎందుకు ధరిస్తారు?

తొలి రాత్రి తెల్లని వస్త్రాలే ఎందుకు ధరిస్తారు?

భారతీయ వివాహ వ్యవస్థ గొప్పదనాన్ని ప్రపంచ దేశాలు ఎంతో గొప్పగా కీర్తిస్తాయి. ఇండియాలో ఫిబ్రవరి నెలలోనే వివాహాలకు ముహూర్తాలు ఎందుకు నిర్ణయిస్తారంటే, హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘ మాసం ఎంతో పవిత్రమైంది. ఇదంతా ఒక ఎత్తు అయితే పెళ్లి తర్వాత వధూవరులు ఎదురుచూసేది తొలిరాత్రి కోసం. పురాతన కాలం నాటి ఆచారాలను, సంప్రదాయాలను చాలా మంది భారతీయులు నేటికీ అనుసరిస్తున్నారు. కానీ వీటిపై చాలా విమర్శలున్నాయి. అసలు శోభనం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు.

శోభనం రోజు కొత్త దంపతులు పడుకునే మంచంపై తెల్లటి దుప్పటి లేదా బెడ్‌షీట్ వేస్తారు. తెల్లని వస్త్రం వేయడం వెనుక రహస్యం ఏమిటంటే.. దీని వల్ల వధువు కన్వత్వాన్ని తెలుసుకోవచ్చట. తొలిరాత్రి కలయిక వల్ల రక్తం స్రావం జరిగితే అది తెల్లని వస్త్రంపై స్పష్టంగా కనపడుతుంది. ఆ మరుసటి రోజు ఉదయం అత్తగారు ఆ వస్త్రంపై రక్తపు మరకలు గుర్తిస్తే వధువు కన్య అనేది పూర్వీకులు నమ్మకం. దీన్ని కూడా సంబరంగా జరుపుకునేవారు. దీన్ని ఉతకడానికి ముందు ఎంతో పవిత్రంగా ఆరాధించేవారు. అయితే, కన్యత్వం తెలుసుకోవడానికి రక్తం రావాలనే రూల్ లేదు. కొంతమంది అమ్మాయిలకు రక్తస్రావం జరగదు. కాబట్టి.. అలాంటి అమ్మాయిలను అనుమానించకూడదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి.

కన్యత్వ పరీక్ష: పురాతన భారతీయ సంప్రదాయం. కానీ ఈ దురాచారం కొన్ని ప్రాంతాల్లో నేటికీ కొనసాగుతుంది. ఈ ఆచారం ప్రకారం శోభనం తర్వాత రోజు ఉదయం అత్తగారు ఆ గదిలోకి రహస్యంగా దూరి దంపతలు నిద్రించిన మంచం మీద వేసిన తెల్లని వస్త్రంపై రక్తపు మరకలను పరిశీలిస్తుంది. పశ్చిమాఫ్రికాలో శోభనం రోజు కోడలు కన్వత్వాన్ని నిరూపించుకుంటే అత్త కొంత నగదు చెల్లిస్తుందట.

కాళ రాత్రి: ఇది పురాతన బెంగాలీ సంప్రదాయం. దీని ప్రకారం పెళ్లైన తర్వాత వరుడి ఇంట్లో కొత్త దంపతలు వేర్వేరు గదుల్లో నిద్రిస్తారు. ఒకరి ముఖం ఒకరు చూసుకోరు కూడా. ఆ తర్వాత రోజు ఉదయం వధువు తన పుట్టింటికి వెళ్లి అత్తగారిల్లు తనకు అనుకూలంగా ఉందని నిర్ణయానికి వచ్చిన తర్వాతే శోభనం జరిపిస్తారు.

పాన్ తినిపిస్తారు: కొన్ని సంప్రదాయాల్లో వధూవరులతో శోభనం రోజు పాన్ తినిపిస్తారు. రాత్రంతా జాగారం చేస్తారు కాబట్టి పాన్ తింటే నోటి దుర్వాసన ఉండదు. అలాగే చెడు వాసనలను దంపతులకు కూడా దూరం చేస్తుంది. బంధువులు, స్నేహితులు శోభనం కోసం మంచాన్ని పూలతో అందంగా అలంకరిస్తారు. ఎందుకంటే పూల వెదజల్లే సువాసనలు కొత్త జీవితాన్ని ప్రారంభించే జంట మధ్య శృంగారానికి ప్రేరిపించే స్థితిని కలుగజేస్తాయి.

సహన పరీక్ష: శోభనం రోజు రాత్రి కొత్త జంట సహనాన్ని పరీక్షించడానికి బంధువులు, స్నేహితులు ఆటపట్టిస్తారు. సాధ్యమైనంత ఆలస్యంగా నిద్రపోయేలా ప్రయత్నాలు చేస్తారు. అందుకే కొన్ని రకాల ఆటలు ఆడిస్తారు. శోభనం గదిలోకి పాల గ్లాసు అనే సంప్రదాయం భారతీయ వివాహాల్లో సర్వసాధారణం. కుంకుమ పువ్వు, బాదం వేసిన పాలను వధూవరులు తొలిరాత్రి తాగితే సత్వరమే శక్తినిస్తుంది. ఈ పాలు శోభనం రాత్రి భార్యభర్తల మధ్య సాగే చర్యలను నిర్ధారించడానికి ఓ వాహకంగా పనిచేస్తాయి.

Related Images:

SEO Keywords: Not Found

About TeluguNow .

Reviews, Live Updates, Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets Telugu Movie Review, Telugu Movie Ratings, Telugu News, News in Telugu, AP Politics, Telangana News, Gossips, Telugu Cinema News, Wallpapers, Actress Photos, Actor Photos, Hot Photos,
Scroll To Top