వర్షాకాలంలో కాకర కాయ ఎందుకు తినాలి? ప్రయోజనాలేమిటీ?


కాకర కాయ.. ఈ పేరు వింటేనే ముఖాన్ని చిట్లిస్తారు. అందులోని చేదు ఎవరికీ రుచించదు. అందుకే, ఈ పేరు వినగానే.. ఎంత తిండి ప్రియుడైనా సరే.. భయం భయంగా ప్లేటు ముందు కుర్చుంటాడు. కానీ, చేదు ఎప్పుడూ మంచే చేస్తుంది. ముఖ్యంగా కాకర కాయలోని చేదు.. మీకు మరింత ఆరోగ్యాన్ని అందిస్తుంది. రోగాల నుంచి కాపాడుతూ సంజీవినిలా పనిచేస్తుంది.

కాకర కాయను అనేక రకాలుగా తీసుకోవచ్చు. ఉడికించి కూరలా వండినా, ఫ్రై చేసినా, జ్యూస్ రూపంలో తీసుకున్నా.. పోషకాలకు ఎలాంటి నష్టం ఉండదు. ముఖ్యంగా రోగాల సీజనైన వర్షాకాలంలో కాకర కాయను రోజు విడిచి రోజైనా తినాలి. ముఖ్యంగా ఈ ‘వైరస్’ కాలంలో కాకర కాయ తినడం తప్పనిసరి. ఎందుకంటే.. కాకర కాయ రోగనిరోధక వ్యవస్థను పెంపొందిస్తుంది. కాకర కాయ తీసుకోవడం ఇంకా ఏయే ప్రయోజనాలు లభిస్తాయో చూడండి.

❂ వర్షాకాలంలో కాకర కాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల అందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి రక్షణ కల్పించి వ్యాధులను దరిచేరనివ్వవు.
❂ కాకర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఫలితంగా ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి.
❂ కాకర కాయలో కెలరీలు, కొవ్వు, కార్బోహైడ్రేట్లు చాలా తక్కువ.
❂ మధుమేహం (డయాబెటిస్)తో బాధపడుతున్న రోగులకు కాకర కాయ ఓ వరం.
❂ కాకరలోని ఆల్కలైడ్లు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి.
❂ కాకరలోని చార్న్‌టిన్ పెప్‌టైడ్లు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి.
❂ కాకరలోని యాంటీ మైక్రోబియాల్, యాంటీఆక్సిడెంట గుణాలు రక్తాన్ని శుద్ధి చేయడానికి సహకరిస్తాయి.❂ కాకరను తరచుగా తినడం వల్ల చర్మ, రక్త సంబంధ సమస్యలు దూరమవుతాయి.❂ ఆస్తమా, బ్రాంకైటిస్, దగ్గు, శ్వాస సంబంధ సమస్యలను తగ్గించడంలోనూ కాకర కాయ ఉత్తమంగా పనిచేస్తుంది.
❂ కాకర కాయలోని యాంటీఆక్సిడెంట్లు శరీరం నుంచి ట్యాక్సిన్లు బయటకు పోయేలా చూస్తాయి.
❂ కాకర కాయ వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పని చేసి బరువు తగ్గుతారు. కాబట్టి.. ఆలస్యం చేయకుండా ఈ రోజు నుంచే మీ డైట్‌లో కాకరను చేర్చుకోండి. వైరస్, వైరల్ ఫీవర్ల నుంచి విముక్తి పొందండి.