రెండోసారి కూడా కరోనా…ఈ కారణం వల్లే సోకేది

0

కరోనా వైరస్ వచ్చిన వారి లో చాలా సందేహాలు లెక్క లేనన్ని అనుమానాలు ఉంటున్నాయి. ఒకసారి కరోనా వచ్చి కోలుకున్న తర్వాత మరోసారి దాని బారిన పడమని చాలా మంది అనుకుంటున్నారు. తమకు ఇక ఏమీ కాదని విచ్చలవిడిగా బయట తిరుగుతున్నారు. మాస్కు ధారణ భౌతిక దూరం సహా ఎటువంటి జాగ్రత్తలు పాటించడం లేదు. తాజాగా తెలంగాణ లో కరోనా నుంచి కోలుకున్న ఇద్దరికీ మళ్లీ వ్యాధి వచ్చింది. కరోనా నుంచి ఓసారి కోలుకుంటే మళ్ళీ రాదనేది నిజం కాదని ఈ సంఘటన రుజువు చేస్తోంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఓసారి వ్యాధిబారిన పడిన తర్వాత తిరిగి మళ్ళీ రాదు అనేది అబద్ధమని.. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అది ఎన్ని సార్లైనా వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. ప్రజలు ఎప్పట్లాగే భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ ధరిస్తూ బయట సాధ్యమైనంత తక్కువగా తిరగాలని సూచిస్తున్నారు. దీనిపై రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఒకసారి కరోనా వ్యాధి బారినపడి కోలుకున్నప్పటికీ ఎవరి లో అయితే యాంటీ బాడీలు ఎక్కువగా ఉత్పత్తి కావో అలాంటి వారికి మళ్లీ వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.

రెండోసారి వ్యాధి బారిన పడ్డ వారి కూడా వైద్యం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. వైద్య నిపుణులు సూచించినట్లు కరోనా నుంచి కోలుకున్నవారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధికి దూరంగా ఉండొచ్చు.