Templates by BIGtheme NET
Home >> Telugu News >> తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు?

తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు?

తెలంగాణలో మొత్తం 119 స్థానాలకు గాను కాంగ్రెస్‌ పార్టీ 64 సీట్లలో గెలిచి అధికారం కైవసం చేసుకోగా.. భారాస 39; భాజపా 8, ఎంఐఎం 7, సీపీఐ ఒక చోట విజయం సాధించాయి. కాంగ్రెస్‌కు 92,35,792 ఓట్లు (39.40శాతం) రాగా.. భారాసకు 87,53,924 ఓట్లు (37.35శాతం); భాజపా 32,57,511 ఓట్లు (13.90శాతం); ఎంఐఎం 5,19,379 ఓట్లు (2.22శాతం); నోటాకు 1,71,940 (0.73శాతం) ఓట్లు వచ్చాయని కేంద్ర ఎన్నికల సంఘం తన అధికారిక వెబ్‌సైట్‌లో గణాంకాలను వెల్లడించింది.”

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) వికాస్‌రాజ్‌ సోమవారం ఉదయం గవర్నర్‌ తమిళిసైను కలవనున్నారు. శాసనసభ ఎన్నికలపై గవర్నర్‌కు నివేదిక అందజేయనున్నారు.కొత్త శాసనసభ ఏర్పాటు చేస్తూ సోమవారం నోటిఫికేసన్‌ జారీ కానుంది.

సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌  ‘గవర్నర్‌ను కలిశాం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు చెప్పిన డీకేఎస్‌ మాకు 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని గవర్నర్‌కు చెప్పాం, కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశం సోమవారం ఉదయం 9.30గంటలకు జరుగుతుందని డీకేఎస్‌ వెల్లడి.

గవర్నర్‌ తమిళిసైని కాంగ్రెస్‌ నేతల బృందం కలిసింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ గవర్నర్‌కు లేఖ అందజేత, రేపు శాసనసభాపక్ష సమావేశం అనంతరం సీఎల్పీ నేత పేరును నివేదిస్తామని చెప్పిన నేతలు. గవర్నర్‌ను కలిసిన వారిలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డితో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలు డీకే శివకుమార్‌, మాణిక్‌రావ్‌ ఠాక్రే, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, మల్లు రవి తదితరులు ఉన్నారు. సోమవారం సాయంత్రం ప్రమాణస్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.