Sreekaram Subhakaram 12th Oct 2014

0

Sreekaram Subhakaram 12th Oct 2014

రాశి ఫలాలు

by Vakkantam Chandra Mouli, janmakundali.com

Weekly Horoscope (12th Oct 2014   –    18th Oct 2014)

మేషం

కష్టపడ్డా ఫలితం అంతగా కనిపించదు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు మధ్యలో విరమించాల్సిన పరిస్థితి.

తొందరపాటు మాటల వల్ల ఆప్తులు దూరమవుతారు. విలువైన వస్తువులు భద్రంగా చూసుకోండి. భార్యాభర్తలమధ్య వివాదాలు నెలకొంటాయి. రావలసిన సొమ్ము సకాలంలో అందక ఇబ్బంది పడతారు. వ్యాపారాలలో అనుకున్న పెట్టుబడులు ఆలస్యమవుతాయి. లాభాలు స్వల్పమే. ఉద్యోగాలలో విధుల్లో చికాకులు పెరుగుతాయి.

పారిశ్రామికవర్గాల వారు విదేశీ పర్యటనలు రద్దు చేసుకుంటారు. కళారంగంవారికి అవకాశాలుకొన్ని తృటిలో చేజారతాయి.

విద్యార్థులు మరింతగా శ్రమపడాలి.

అశ్వని వారికి ఆదివారం శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలబ్ధి. గురువారం మానసిక ఆందోళన. వ్యయప్రయాసలు.

భరణి వారికి సోమవారం ధన,వస్తులాభాలు. యత్నకార్యసిద్ధి. శుక్రవారం అనుకోని ఖర్చులు. మానసిక ఆందోళన. అనారోగ్యం.

కృత్తిక 1వ పాదం వారికి ఆదివారం ధనలాభం. భూవివాదాల పరిష్కారం. శనివారం ధనవ్యయం. కుటుంబసమస్యలు.

ఉత్తర దిశ ప్రయాణాలు సానుకూలం.

హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

వృషభం

 వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. అనుకున్న సమయానికి ఆప్తులు సహాయం అందిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. భూములు, వాహనాలు కొంటారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. పెండింగ్ బాకీలు వసూలవుతాయి. రుణాలు తీరతాయి. వ్యాపారాలు మరింతగా పుంజుకుంటాయి. పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు కోరుకున్న పదోన్నతులు దక్కవచ్చు.

పారిశ్రామికవర్గాలవారికి ఆకస్మిక విదేశీయానం. సన్మానాలు. కళారంగంవారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. అరుదైన అవకాశాలు. విద్యార్థుల యత్నాలు సఫలం.

కృత్తిక 2,3,4పాదాల వారికి ఆదివారం ధనలాభం. భూవివాదాల పరిష్కారం. శనివారం ధనవ్యయం. కుటుంబసమస్యలు.

రోహిణి వారికి సోమవారం శుభవార్తాశ్రవణం. వాహనయోగం. శుక్రవారం అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు.

మృగశిర 1,2పాదాల వారికి మంగళవారం అనుకోని ఆహ్వానాలు. విందువినోదాలు. శనివారం మానసిక అశాంతి. కుటుంబంలో చికాకులు.

తూర్పుదిశ ప్రయాణాలు సానుకూలం.

విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మిథునం

వ్యయప్రయాసలు. చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. మిత్రులతో అకారణంగా విభేదాలు. ఆరోగ్యపరంగా చికాకులు. భార్యాభర్తల మధ్య లేనిపోని అపార్ధాలు.

రావలసిన సొమ్ము ఆలస్యమవుతుంది. రుణాలు చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు కష్టమే. ఉద్యోగులకు బదిలీ అవకాశాలు. శ్రమ పెరుగుతుంది. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనల్లో ఆటంకాలు. కళారంగం వారికి అవకాశాలు కొంత అసంతృప్తి కలిగిస్తాయి.

 మృగశిర 3,4పాదాల వారికి  మంగళవారం అనుకోని ఆహ్వానాలు. విందువినోదాలు. శనివారం మానసిక అశాంతి. కుటుంబంలో చికాకులు.

ఆరుద్ర వారికి బుధవారం నూతనోత్సాహం. పట్టిందిబంగారమే. ధనలబ్ధి. శుక్రవారం అనుకోని ఖర్చులు. ఇంటాబయటా చికాకులు.

 పునర్వసు 1,2,3పాదాల వారికి ఆదివారం ధననష్టం. బంధువిరోధాలు. అనారోగ్యం. శుక్రవారం శుభవర్తమానాలు. ఆస్తివివాదాల పరిష్కారం. వాహనయోగం.

దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.

గాయత్రీ ద్యానం మంచిది.

కర్కాటకం

కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. సన్నిహితుల నుంచి ముఖ్యసమాచారం. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. అనుకున్న ఉద్యోగాలు దక్కే ఛాన్స్.

చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. రావలసిన పైకం అందుతుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి.

వ్యాపారులు పెట్టుబడులు సమకూర్చుకుంటారు. లాభాలు తథ్యం. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. ప్రమోషన్ అవకాశాలు. పారిశ్రామికరంగంవారికి  పరిశ్రమలు, సంస్థల విస్తరణ యత్నాలు అనుకూలిస్తాయి. కళారంగం వారికి అవార్డులు, పురస్కారాలు పొందుతారు. విద్యార్థులకు సాంకేతిక విద్యలలో అవకాశాలు.

పునర్వసు 4వ పాదం వారికి ఆదివారం ధననష్టం. బంధువిరోధాలు. అనారోగ్యం. శుక్రవారం శుభవర్తమానాలు. ఆస్తివివాదాల పరిష్కారం. వాహనయోగం.

పుష్యమి వారికి సోమవారం ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి విమర్శలు, ఉదర సంబంధిత రుగ్మతలు. శనివారం విందువినోదాలు. యత్నకార్యసిద్ధి.

ఆశ్లేష వారికి మంగళవారం వ్యయప్రయాసలు. మానసిక అశాంతి. గురువారం శుభవర్తమానాలు. ధనలాభం.కార్యసిద్ధి.

పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.

హనుమాన్ చాలీసా పఠించండి.

సింహం

మీపై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభావంతులుగా గుర్తింపు పొందుతారు. ఆరోగ్య సమస్యలు తీరతాయి. ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. బాకీలు అందుతాయి. వ్యాపార విస్తరణ యత్నాలు సానుకూలం. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో మీ శ్రమ ఫలిస్తుంది. ఉత్సాహంగా విధుల్లో పాల్గొంటారు. పారిశ్రామికవర్గాలకు ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. విదేశీయానం. కళారంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి.

మఖ వారికి మంగళవారం కార్యజయం. ఉద్యోగయోగం. బుధవారం ధననష్టం. కుటుంబంలో చికాకులు.

పుబ్బ వారికి సోమవారం  విందువినోదాలు.ధన,వస్తులాభాలు. ఉద్యోగలాభం. శుక్రవారం ఈతిబాధలు. మానసిక సంఘర్షణ.

ఉత్తర 1వపాదం వారికి ఆదివారం శుభవార్తా శ్రవణం. వాహనయోగం. సమస్యల పరిష్కారం. గురువారం కుటుంబసభ్యులతో తగాదాలు.ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం.

తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.

నృసింహస్తోత్రాలు పఠించండి.

కన్య

కార్యజయం. మీప్రతిభ గుర్తింపు పొందుతుంది. బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు,స్థలాలు కొనుగోలు చేస్తారు. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో మీదే పైచేయిగా ఉంటుంది. రావలసిన డబ్బు అంది అవసరాలు తీరతాయి. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కుతాయి. విధుల్లో ప్రశంసలు. పారిశ్రామికవేత్తల  శ్రమఫలించే సమయం. విదేశీ ఆహ్వానాలు అందుతాయి. కళారంగం వారికి కోరుకున్న అవకాశాలు దక్కుతాయి. నూతనోత్సాహం. విద్యార్థులు ఫలితాలపై సంతృప్తి చెందుతారు.

ఉత్తర 2,3,4పాదాల వారికి ఆదివారం శుభవార్తా శ్రవణం. వాహనయోగం. సమస్యల పరిష్కారం. గురువారం కుటుంబసభ్యులతో తగాదాలు.ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం.

హస్త వారికి మంగళవారం కుటుంబంలో చికాకులు. అనారోగ్యం, ఔషధసేవనం. గురువారం ఆత్మవిశ్వాసంపెరుగుతుంది. ధన,వస్తులాభాలు. ఉద్యోగయోగం. 

చిత్త 1,2పాదాల వారికి శుక్రవారం వాహనసౌఖ్యం. మనశ్శాంతి లభిస్తుంది. మీ కష్టం ఫలిస్తుంది.శనివారం ఆర్థిక ఇబ్బందులు. ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు.

దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.

వేంకటేశ్వరస్తుతి మంచిది.

తుల

పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. మిత్రుల నుంచి ఒత్తిడులు, విమర్శలు. ఉదర సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. భార్యాభర్తలు, సోదరులు, సోదరీలతో మనస్పర్థలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

కాంట్రాక్టుల కోసం చేసే యత్నాలు ఫలించవు. బాకీలు అందక ఇబ్బంది పడతారు. రుణాలు చేస్తారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు కష్టమే. పెట్టుబడుల్లో తొందరవద్దు. ఉద్యోగులకు పదోన్నతులు నిలిచిపోయే అవకాశం.

రాజకీయవర్గాల వారికి పదవులు త్యజించాల్సిన పరిస్థితి. కళారంగం వారు ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటారు.

 చిత్త 3,4పాదాల వారికి శుక్రవారం వాహనసౌఖ్యం. మనశ్శాంతి లభిస్తుంది. మీ కష్టం ఫలిస్తుంది.శనివారం ఆర్థిక ఇబ్బందులు. ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు.

స్వాతి వారికి గురువారం సహచరుల నుంచి సహాయం. ఉద్యోగయోగం. శుక్రవారం ఈతిబాధలు. మానసిక ఆందోళన. చర్మసంబంధిత రుగ్మతలు.

విశాఖ 1,2,3పాదాల వారికి ఆదివారం ధననష్టం. పనులు వాయిదా వేస్తారు. అనారోగ్యం. శుక్రవారం ఆస్తి ఒప్పందాలు. వాహన, గృహయోగాలు.

తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.

సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

వృశ్చికం

 ముఖ్యమైన కార్యక్రమాలు మధ్యలోనే విరమిస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువుల నుంచి మాటపడతారు.

సహచరులే సమస్యలు సృష్టించవచ్చు, అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్యం కొంతఇబ్బంది పెట్టవచ్చు, ఔషధ సేవనం తప్పదు. భార్యాభర్తల మధ్య లేనిపోని వివాదాలు. రుణదాతల ఒత్తిడులు అధిగమవుతాయి. రావ లసినసొమ్ము సకాలంలో అందక కొంత నిరాశ చెందుతారు. వ్యాపారాలలో కోరుకున్న లాభాలు దక్కే అవకాశంలేదు. పెట్టుబడుల్లో నిదానం అవసరం. పారిశ్రామికవేత్తలు విదేశీ పర్యటనలు రద్దు చేసుకుంటారు. సంస్థల ఏర్పాటులో అవరోధాలు.

కళారంగం వారికి అనుకున్న అవకాశాలు దూరమవుతాయి.

 విశాఖ 4వ పాదం వారికి  ఆదివారం ధననష్టం. పనులు వాయిదా వేస్తారు. అనారోగ్యం. శుక్రవారం ఆస్తి ఒప్పందాలు. వాహన, గృహయోగాలు.

అనూరాధ వారికి సోమవారం ధననష్టం, కుటుంబంలో చికాకులు. శనివారం విందువినోదాలు.ఆస్తిలాభం.

జ్యేష్ట వారికి సోమవారం కార్యసాధన, ధనలాభం. దూరమైన ఆప్తులు దగ్గరవుతారు. మంగళవారం కుటుంబ, ఆరోగ్య సమస్యలు. అనుకోని ఖర్చులు.

దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.

దుర్గాస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు

 కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులు మరింత దగ్గరవుతారు. భార్యాభర్తల మధ్య నెలకొన్న మనస్పర్థలు తొలగుతాయి. కష్టానికి తగ్గ ఫలితం అందుకుంటారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు,స్థలాలు కొనుగోలు చేస్తారు. ఒక వివాదం సామరస్యంగా పరిష్కరించుకుంటారు. వివాహ యత్నాలు ఫలిస్తాయి. పెండింగ్ బాకీలు అందుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగాలలో పదోన్నతులు,ఇంక్రిమెంట్లు అందుతాయి.

పారిశ్రామికవర్గాల వారికి విదేశీ సంస్థల్లో భాగస్వామ్యం లభిస్తుంది. కళారంగంవారు ఉత్సాహంగా ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. 

మూల నక్షత్రం వారికి ఆదివారం యత్నకార్యసిద్ధి. పరపతి పెరుగుతుంది. ధనలబ్ధి. గురువారం ఖర్చులు. మానసిక అశాంతి. బంధువిరోధాలు.

పూర్వాషాఢ వారికి గురువారం వివాదాల పరిష్కారం. శుభవార్తలు. వాహనయోగం. శుక్రవారం ధననష్టం. కుటుంబసభ్యుల నుంచి విమర్శలు.

ఉత్తరాషాఢ 1వపాదం వారికి ఆదివారం ఆకస్మిక ధనలాభం. భూవివాదాల పరిష్కారం. గురువారం మిత్రులతో కలహాలు. రుణాలుచేస్తారు. మానసిక అశాంతి.

పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.

విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మకరం

ఇంటిలో శుభకార్యాలపై చర్చలు జరుపుతారు. పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. మీపై వచ్చిన అపవాదులు తొలగుతాయి. భార్యాభర్తల మధ్య ఎంతోకాలంగా ఉన్న వివాదాలు సమసిపోతాయి. కార్యదీక్షాపరులై ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. రుణబాధల నుంచి విముక్తి.

వ్యాపారులు కొత్త పెట్టుబడులతో ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో కోరుకున్న పదోన్నతులు తథ్యం. విధుల్లో చికాకులు అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలు సమర్థతను చాటుకుంటారు. విదేశీయానం. కళారంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. సన్మానయోగం.

ఉత్తరాషాఢ 2,3,4పాదాల వారికి  ఆదివారం ఆకస్మిక ధనలాభం. భూవివాదాల పరిష్కారం. గురువారం మిత్రులతో కలహాలు. రుణాలుచేస్తారు. మానసిక అశాంతి.

శ్రవణం వారికి సోమవారం శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. శుక్రవారం మానసిక ఆందోళన. ఆరోగ్యం మందగిస్తుంది.

ధనిష్ట 1,2పాదాల వారికి గురువారం కుటుంబంలో చికాకులు. అనారోగ్యం.  శుక్రవారం ఆస్తివివాదాల పరిష్కారం. వాహనయోగం.

ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.

కుంభం

ఆలోచనలు స్థిరంగా ఉండవు. కొన్ని కార్యక్రమాలలో అవరోధాలు. బంధువులు, మిత్రులతో అకారణంగా విభేదాలు.

కష్టానికి ఫలితం కనిపించక డీలాపడతారు. ఆరోగ్యపరంగా కొంత చికాకు తప్పకపోవచ్చు. కొన్ని విలువైన వస్తువులు చేజారతాయి. ఇంటాబయటా సమస్యలు వేధిస్తాయి. రావలసిన సొమ్ము ఆలస్యమవుతుంది. వ్యాపారాలలో అనుకున్న సమయానికి విస్తరణ యత్నాలు అనుకూలించవు. ఉద్యోగులకు కొన్ని మార్పులు సంభవం. విధుల్లో కొంత అసంతృప్తి.

పారిశ్రామికవర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా వేస్తారు. కళారంగం వారికి అవకాశాలు తృటిలో తప్పిపోతాయి.

విద్యార్థులు మరింత కృషిచేస్తే ఫలితం ఉంటుంది.

ధనిష్ఠ 3,4 పాదాల వారికి గురువారం కుటుంబంలో చికాకులు. అనారోగ్యం.  శుక్రవారం ఆస్తివివాదాల పరిష్కారం. వాహనయోగం.

శతభిషం వారికి గురువారం ఆకస్మిక ధన,వస్తులాభాలు. యత్నకార్యసిద్ధి. శనివారం ఖర్చులు అధికం. పనుల్లో ఆటంకాలు.

పూర్వాభాద్ర 1,2,3పాదాల వారికి ఆదివారం వ్యయప్రయాసలు. అనారోగ్యం. శుక్రవారం శుభవార్తలు. వాహనయోగం. ఉద్యోగలాభం. 

పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.

పంచముఖాంజనేయస్వామి స్తోత్రాలు పఠించండి.

మీనం

అనుకున్న పనులు ముందుకు సాగవు. ఆత్మీయులతో విభేదాలు. ఆరోగ్యం మందగిస్తుంది, ఔషధసేవనం.

చోరభయం,కీలక డాక్యుమెంట్లు భద్రంగా చూసుకోండి. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది.రుణాలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. లాభాలు కష్టమే. ఉద్యోగులు పనిభారంతో సతమతమవుతారు. బదిలీ అవకాశాలు. పారిశ్రామికవర్గాలవారికి సంస్థల ఏర్పాటులో ఆటంకాలు. వ్యయప్రయాసలు. కళారంగం వారి కృషి ఫలించదు. అవకాశాలు దూరమవుతాయి.

మహిళలకు మానసిక ఆందోళన.

పూర్వాభాద్ర 4వపాదం వారికి గురువారం కుటుంబంలో చికాకులు. అనారోగ్యం.  శుక్రవారం ఆస్తివివాదాల పరిష్కారం. వాహనయోగం.

ఉత్తరాభాద్ర వారికి సోమవారం కుటుంబసమస్యలు. అనారోగ్యం. శనివారం ఆస్తిలాభం. కార్యసిద్ధి. ఇంటాబయటా అనుకూలం.

రేవతివారికి ఆదివారం వ్యయప్రయాసలు. మానసిక ఆందోళన. గురువారం నూతన పరిచయాలు. ప్రతిభకు గుర్తింపు. ధన,వస్తులాభాలు.

పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.

దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

Tags : Sreekaram Subhakaram 12th Oct 2014, srikaram subhakaram zee telugu program, Srikaram Subhakaram Episodes, Srikaram Subhakaram Weekly Astrology Predictions, Vakkantam Chandra Mouli Srikaram Subhakaram, Telugu Astrology, TeluguAstrology, Free Astrology in Telugu, janmakundali.com, Zee Telugu Srikaram Subhakaram 12th Oct 2014, srikaram subhakaram zee telugu,