Home / LIFESTYLE / Sreekaram Subhakaram 30th Nov 2014

Sreekaram Subhakaram 30th Nov 2014

Sreekaram Subhakaram 30th Nov 2014

రాశి ఫలాలు

by Vakkantam Chandra Mouli, janmakundali.com

Weekly Horoscope (30th Nov 2014   –    6th Dec 2014)

మేషం

వ్యవహారాలలో అనూహ్యంగా విజయం. సంఘంలో ఎదురులేని పరిస్థితి. సన్నిహితులు, మిత్రులు పూర్తిగా సహకరిస్తారు. రాబడి పెరిగి అప్పులు తీర్చి ఊరట చెందుతారు. భూములు, వాహనాలు  కొంటారు. ఆరోగ్యపరంగా స్వల్ప చికాకులు. భార్యాభర్తల మధ్య వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. బంధువుల నుంచి శుభవార్తలు. నిరుద్యోగులకు  ఉద్యోగయోగం. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. అనుకున్న విధంగా లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులతో కూడిన మార్పులు సంభవం. రాజకీయవర్గాలకు  పదవులు దగ్గరకు వస్తాయి. కళాకారులు  ఈతిబాధలు తొలగి ముందడుగు వేస్తారు. షేర్ల విక్రయాలలో లాభాలు అందుతాయి.

అశ్వని వారికి ఆదివారం వ్యయప్రయాసలు, ఖర్చులు పెరుగుతాయి.గురువారం శుభవార్తా శ్రవణం. కుటుంబసౌఖ్యం.

భరణి వారికి  సోమవారం ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. శుక్రవారం ధన,వస్తులాభాలు. యత్నకార్యసిద్ధి.

కృత్తిక 1వ పాదం వారికి  ఆదివారం పనుల్లో ఆటంకాలు. దుబారా ఖర్చులు. శనివారం కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం.

ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.

గణేశాష్టకం పఠించండి.

వృషభం

కొత్త కార్యక్రమాలు చేపడతారు. కుటుంబసభ్యులతో విభేదాలు పరిష్కారమై ఊపిరిపీల్చుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి సంఘటనలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. పలుకుబడి కలిగిన వారు పరిచయమవుతారు. రాబడి అనుకున్నంతగా ఉంటుంది. నిరుద్యోగులకు ఊరట కలిగించే ప్రకటన రావచ్చు. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ. భార్యాభర్తల మధ్య విభేదాలు తీరతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. భాగస్వాములతో వివాదాలు తీరతాయి. ఉద్యోగులకు చిరకాలంగా ఎదుర్కొంటున్న చికాకులు తొలగుతాయి. కళాకారులకు సన్మానాలు అందుతాయి. రాజకీయరంగం వారికి కొత్త్త పదవులు ఊరిస్తాయి. షేర్ల విక్రయాల్లో లాభాలు.

 కృత్తిక 2,3,4పాదాల వారికి  ఆదివారం పనుల్లో ఆటంకాలు. దుబారా ఖర్చులు. శనివారం కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం.

రోహిణి వారికి  సోమవారం అనుకోని ఖర్చులు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మంగ ళవారం వాహనయోగం. వివాదాల పరిష్కారం.

మృగశిర 1,2పాదాల వారికి మంగళవారం ధననష్టం, కుటుంబంలో చికాకులు. బుధవారం ఆస్తిలాభం. ఇంటర్వ్యూలు అందుతాయి.

 దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.

శివపంచాక్షరి పఠించండి.

 

మిథునం.

విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయం. శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. పాతమిత్రులు కలుసుని చర్చలు జరుపుతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త కాంట్రాక్టులను చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. అందరిలోనూ మంచి గుర్తింపు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆదాయం ఆశించినంతగా పెరుగుతుంది. వ్యాపారాల్లో మొదట్లో కొద్దిగా నిరాశ పరిచినా క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. విధి నిర్వహణలో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయరంగంవారికి పదవులు దక్కే అవకాశముంది. కళాకారులకు అనుకోని అవకాశాలు దక్కించుకుని ముందుకు సాగుతారు. షేర్ల విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.

 మృగశిర 3,4పాదాల వారికి  మంగళవారం ధననష్టం, కుటుంబంలో చికాకులు. బుధవారం ఆస్తిలాభం. ఇంటర్వ్యూలు అందుతాయి.

ఆరుద్ర వారికి ఆదివారం పనుల్లో విజయం. శుభవార్తలు. వాహనయోగం.బుధవారం వ్యయప్రయాసలు. మానసిక అశాంతి.

పునర్వసు 1,2,3పాదాల వారికి సోమవారం కార్యజయం. శుభవార్తలు. గురువారం అనారోగ్యం. కుటుంబసమస్యలు.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

 

కర్కాటకం

కొన్ని కార్యక్రమాలలో కొంత జాప్యం. పట్టుదల పెరుగుతుంది. సన్నిహితులు, మిత్రుల సాయం కోరతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిరకాల ప్రత్యర్థులు సైతం అనుకూలంగా మారతారు. కాంట్రాక్టుల కోసం చేసే యత్నాలు నిదానంగా సాగుతాయి. ఆదాయం కొంత  మెరుగుపడుతుంది. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు అధిగమిస్తారు. వ్యాపారాలలో ఆశించినమేర పెట్టుబడులు, లాభాలు అందుతాయి. రాజకీయరంగం వారికి కొన్ని  ఊరిస్తాయి. సభలు, సమావేశాలకు హాజరవుతారు. కళాకారులకు యత్నకార్యసిద్ధి, సన్మానయోగం. షేర్ల విక్రయాలు సామాన్యంగా లాభిస్తాయి.

 పునర్వసు 4వ పాదం వారికి  సోమవారం కార్యజయం. శుభవార్తలు. గురువారం అనారోగ్యం. కుటుంబసమస్యలు.

పుష్యమి వారికి గురువారం వ్యవహారాలలో విజయం. భూలాభం. శుక్రవారం కుటుంబసమస్యలు. అనారోగ్యం.

ఆశ్లేష వారికి బుధవారం కార్యజయం. ఆప్తుల నుంచి ఆస్తిలాభం. శనివారం మానసిక అశాంతి. ఆరోగ్యసమస్యలు.

దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.

ఆదిత్య హృదయం పఠించండి.

 

సింహం

ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. బంధువర్గం నుంచి విమర్శలు, అపవాదులు తప్పవు. నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించండి. ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. కొత్తగా రుణాలు కూడా చేస్తారు. కొత్త వ్యాపారయత్నాలు మందగిస్తాయి. పెట్టుబడులు అంతగా కనిపించవు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ఊరిస్తాయి. విధుల్లో ప్రతిబంధకాలు. పారిశ్రామికవేత్తలకు కొత్త పరిశ్రమల ఏర్పాటులో కొంత జాప్యం తప్పదు. రాజకీయరంగం వారికి అవకాశాలు కొన్ని చేరతాయి. కళాకారులకు అవకాశాల కోసం నిరీక్షణ ఫలించకపోవచ్చు. షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

మఖ వారికి ఆదివారం నిర్ణయాలలో మార్పులు. మానసిక ఆందోళన. శనివారం భూ,గృహయోగాలు. కార్యజయం.

పుబ్బ వారికి సోమవారం ధననష్టం. సోదరులతో కలహాలు. శుక్రవారం ఆస్తి, ధనలాభాలు. యత్నకార్యసిద్ధి. 

ఉత్తర 1వ పాదం వారికి ఆదివారం ప్రయాణాలలో ఆటంకాలు.  వృథా ఖర్చులు.సోమవారం కార్యజయం. ఆసక్తికరమైన సమాచారం.

పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.

ఆంజనేయ దండకం పఠించండి.

 

కన్య

ప్రతిభాపాటవాలకు గుర్తింపు పొందుతారు. ఆప్తులు మరింత చేరువ కాగలరు. అనుకున్న లక్ష్యాలు సాధించే వరకూ విశ్రమించరు. కుటుంబ సమస్యల నుంచి కొంత విముక్తి పొందుతారు. వాక్చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. కొత్త వ్యాపారాలు చేపడతారు. అనుకున్నంతగా లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు ఉంటాయి. పారిశ్రామికవేత్తలు కొత్త సంస్థల ఏర్పాటులో విజయం సాధిస్తారు. రాజకీయవర్గాలకు పదవీయోగం, సన్మానాలు. కళాకారులు అవార్డులు, పురస్కారాలు పొందుతారు.

 షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

ఉత్తర 2,3,4పాదాల వారికి  ఆదివారం ప్రయాణాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు.సోమవారం కార్యజయం. ఆసక్తికరమైన సమాచారం.

హస్త వారికి మంగళవారం సమస్యల పరిష్కారం. శుభవార్తలు. బుధవారం కుటుంబంలో చికాకులు. అనారోగ్యం.

చిత్త 1,2పాదాల వారికి గురువారం ఖర్చులు పెరుగుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. శుక్రవారం ఆస్తిలాభం. యత్నకార్యసిద్ధి.

తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.

గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

 

తుల

ఉత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. బంధువులతో ముఖ్యమైన విషయాలపై చర్చిస్తారు. ఆహ్వానాలు అందుతాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లేదా ధనలాభ సూచనలు. ప్రతిభకు తగ్గ గుర్తింపు పొందుతారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగావకాశాలు దక్కుతాయి. రాబడి పెరుగుతుంది. వ్యాపారులు కొత్త పెట్టుబడులతో ముందడుగు వేస్తారు. ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగాలలో పదోన్నతి అవకాశాలు. ఉన్నతస్థాయి ప్రశంసలు. రాజకీయరంగం వారు ఊహించిన రీతిలో పదవులు దక్కించుకుంటారు. పారిశ్రామికవేత్తలు విదేశీ పర్యటనలు సాగిస్తారు. కళాకారులు అనుకున్నది సాధించేవరకూ విశ్రమించరు. షేర్ల విక్రయాలలో లాభాలు.

 చిత్త 3,4పాదాల వారికి  గురువారం ఖర్చులు పెరుగుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. శుక్రవారం ఆస్తిలాభం. యత్నకార్యసిద్ధి.

 స్వాతి వారికి ఆదివారం యత్నకార్యసిద్ధి. భూవివాదాల పరిష్కారం. బుధవారం కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు.

విశాఖ 1,2,3పాదాల వారికి మంగళవారం ధననష్టం. కుటుంబంలో చికాకులు. శుక్రవారం ఉద్యోగలాభం. కార్యజయం.

ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.

హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

 

వృశ్చికం

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సోదరులు, సోదరీలతో వివాదాల సర్దుబాటు కాగలవు. ఆరోగ్య సమస్యల నుంచికొంత ఉపశమనం. ప్రయత్నాలకు కుటుంబసభ్యులు చేయూతన్తిస్తారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. వివాహ,ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కుతాయి, విధి నిర్వహణలో అవరోధాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీయానం, కొత్త పరిశ్రమల ఏర్పాటు యత్నాలు. రాజకీయరంగం వారు అనుకోని అవకాశాలు దక్కుతాయి. కళాకారులు నూతనోత్సాహంతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. షేర్ల విక్రయాలలో అనుకున్న లాభాలు అందుతాయి.

విశాఖ 4వ పాదం వారికి  మంగళవారం ధననష్టం. కుటుంబంలో చికాకులు. శుక్రవారం ఉద్యోగలాభం. కార్యజయం.

అనూరాధ వారికి బుధవారం బంధువులతో విభేదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. ధననష్టం. శనివారం కార్యజయం. భూలాభం.

జ్యేష్ఠ వారికి గురువారం కార్యక్రమాలలో ఆటంకాలు. దుబారా ఖర్చులు. శుక్రవారం గృహయోగాలు. యత్నకార్యసిద్ధి.

పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.

శివాష్టకం పఠించండి.

 

ధనుస్సు

ఆర్థిక వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు లభిస్త్తాయి. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. కాంట్రాక్టు పనులు చేపడతారు. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కొత్త వ్యాపారాలు చేపడతారు. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలు విదేశీ పర్యటనలు సాగిస్తారు. ప్రభుత్వ పరంగా చేయూత అందుతుంది. రాజకీయరంగం వారికి సన్మానాలు, సత్కారాలతో బిజీగా గడుపుతారు. కళాకారులకు ఊహించని విధంగా అవకాశాలు దగ్గరకు వస్తాయి. షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

మూలనక్షత్రం వారికి ఆదివారం బంధువులతో తగాదాలు. అనారోగ్యం. గురువారం శుభవార్తలు. భూములు, వాహనాలు కొంటారు. 

పూర్వాషాఢ వారికి సోమవారం ప్రయాణాలు వాయిదా. అనారోగ్యం. శుక్రవారం పనుల్లో విజయం. ఆప్తుల నుంచి ధనలాభం.

ఉత్తరాషాఢ 1వ పాదం వారికి మంగళవారం ధననష్టం. కుటుంబంలో చికాకులు. శనివారం  వివాదాల పరిష్కారం. అనుకోని ఉద్యోగయోగాలు.

దక్షిణ దిశ  ప్రయాణాలు సానుకూలం.

పంచముఖ ఆంజనేయ స్తోత్రాలు పఠించండి.

 

మకరం

పనులు కొంత నెమ్మదించినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. రాబడి కొంత సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల యత్నాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. సంఘంలో గౌరవానికి లోటు ఉండదు. ఆరోగ్యపరంగా స్వల్ప చికాకులు. భార్యాభర్తల మధ్య వివాదాలు నెలకొనవచ్చు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు లభిస్తాయి. పెట్టుబడులలో తొందరవద్దు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు ఉండవచ్చు, అయితే. మీ సేవలకు గుర్తింపు పొందుతారు. పారిశ్రామికవర్గాలకు విదేశాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. రాజకీయరంగంవారికి ఊహలు నిజం చేసుకుంటారు.  కళాకారులు గతంలో పెండింగ్‌లో పడిన అవకాశాలు కూడా దక్కించుకుంటారు. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

ఉత్తరాషాఢ 2,3,4పాదాల వారికి  మంగళవారం ధననష్టం. కుటుంబంలో చికాకులు. శనివారం  వివాదాల పరిష్కారం. అనుకోని ఉద్యోగయోగాలు.

శ్రవణం వారికి ఆదివారం యత్నకార్యసిద్ధి. బంధువుల నుంచి ఆస్తిలాభం. బుధవారం ఆరోగ్యసమస్యలు. కుటుంబంలో సమస్యలు.

ధనిష్ట 1,2పాదాల వారికి  మంగళవారం కుటుంబసభ్యుల నుంచి విమర్శలు. అనుకోని సంఘటనలు. శుక్రవారం కోర్టు కేసుల పరిష్కారం. శుభవార్తా శ్రవ ణం. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.

లక్ష్మీధ్యానం మంచిది.

 

కుంభం

పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గతంలో జరిగిన సంఘటన గుర్తుకువస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. భార్యాభర్తల మధ్య అపోహలు తొలగుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. అనుకున్న పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు. రాజకీయరంగంవారికి పదవులు దక్కుతాయి. ప్రజాదరణ లభిస్తుంది. పారిశ్రామికవర్గాల వారికి కొత్త పరిశ్రమలు ఏర్పాటు యత్నాలు సఫలం. కళాకారులు పురస్కారాలు పొందుతారు. శ్రమ ఫలిస్తుంది.  షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

 ధనిష్ఠ 3,4పాదాల వారికి  మంగళవారం కుటుంబసభ్యుల నుంచి విమర్శలు. అనుకోని సంఘటనలు. శుక్రవారం కోర్టు కేసుల పరిష్కారం. శుభవార్తా శ్రవ ణం. శతభిషం వారికి ఆదివారం కార్యక్రమాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. బుధవారం ఆకస్మిక ధనలాభం. ఇంటర్వ్యూలు అందుతాయి.

పూర్వాభాద్ర 1,2,3పాదాల వారికిసోమవారం మానసిక అశాంతి. బంధువిరోధాలు. గురువారం వ్యయప్రయాసలు. అనారోగ్యం.

పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

 

మీనం

ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబసభ్యుల సూచనలు, సలహాలు పాటిస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాల రీత్యా ఖర్చులు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి.  ఉద్యోగులు అనుకోని ఇంక్రిమెంట్లు లభిస్తాయి. పారిశ్రామికవర్గాల వారికి  ఉత్సాహవంతంగా ఉంటుంది, అనుకున్న ఫలితాలు సాధిస్తారు. కళాకారులకు సంతోషకరమైన సమాచారం. షేర్ల విక్రయాలలో లాభాలు.

పూర్వాభాద్ర 4వ పాదం వారికి  వారికిసోమవారం మానసిక అశాంతి. బంధువిరోధాలు. గురువారం వ్యయప్రయాసలు. అనారోగ్యం.

ఉత్తరాభాద్ర వారికి మంగళవారం ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుక్రవారం ధనవ్యయం. కుటుంబంలో కలహాలు.

రేవతి వారికి మంగళవారం ఈతిబాధలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. బుధవారం కార్యజయం. ఉద్యోగలాభం.

ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.

విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

Related Images:

SEO Keywords: Not Found

About TeluguNow .

Reviews, Live Updates, Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets Telugu Movie Review, Telugu Movie Ratings, Telugu News, News in Telugu, AP Politics, Telangana News, Gossips, Telugu Cinema News, Wallpapers, Actress Photos, Actor Photos, Hot Photos,
Scroll To Top