Srikaram Subhakaram 13th July 2014

0

Srikaram Subhakaram 13th July 2014

రాశి ఫలాలు

by Vakkantam Chandra Mouli, janmakundali.com

Weekly Horoscope (13th Jul 2014   –    19th Jul 2014)

మేషం…

 —–

 ఈ వారం ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

 కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు.

 అప్రయత్నంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు.

 ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఇబ్బందిపెట్టవచ్చు.

 నిరుద్యోగులకు అనుకూలమైన  సమయం.

 వాహనాలు, స్థలాలు కొంటారు.

 భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.

 ఉద్యోగాల్లో ముందడుగు వేస్తారు.

 పారిశ్రామికవేత్తలకు అరుదైన పురస్కారాలు దక్కుతాయి.

 కళాకారులకు సన్మానాలు. సత్కారాలు.

 శుక్ర, శనివారాలలో ధననష్టం. కుటుంబంలో చికాకులు.

 ద క్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.

 దుర్గాపూజలు మంచిది.

 

 

వృషభం…

 —–

 కొత్త పనులు చేపడతారు.

 బంధువర్గం నుంచి ముఖ్యమైన సమాచారం అందుతుంది.

 వివాదాల నుంచి బయటపడతారు.

 ఆలోచనలు కలసివస్తాయి.

 ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు.

 ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.

 పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

 వ్యాపారాల్లో పురోగతి.

 ఉద్యోగులకు కాస్త ఊరట లభించే సమయం.

 పారిశ్రామికవేత్తలు ఉత్సాహంగా పనులు చేపడతారు.

 కళాకారులకు తగిన గుర్తింపు లభిస్తుంది.

 మహిళలకు కుటుంబంలో గౌరవం.

 ఆది, సోమవారాలలో వ్యయప్రయాసలు. మానసిక అశాంతి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.

 తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.

 శివస్తోత్రాలు పఠించండి.

 

మిథునం….

 ——

 కొత్త విషయాలు తెలుసుకుంటారు.

 శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు.

 దూరపు బంధువుల తోడ్పాటుతో పనులు పూర్తి చేస్తారు.

 ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

 భూములు, భవనాలు కొంటారు.

 ఆరోగ్య సమస్యలు కాస్త చికాకు పరుస్తాయి.

 భార్యాభర్తల మధ్య కొద్దిపాటి వివాదాలు.

 వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు.

 ఉద్యోగులు పదోన్నతి అవకాశాలు పొందుతారు.

 పారిశ్రామికవేత్తలు విదేశీ పర్యటనలు సాగిస్తారు.

 కళాకారులకు అవార్డులు, రివార్డులు దక్కుతాయి.

 మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

 మంగళ, బుధవారాలలో కుటుంబసమస్యలు. సోదరులతో విభేదాలు.

 పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.

 హనుమాన్‌కు పూజలు చేయండి.

 

 

కర్కాటకం…

 ——-

 కొత్త నిర్ణయాలు తీసుకుంటారు.

 ఆర్థిక వ్యవహారాలు కొంత నిరుత్సాహపర్చినా ఏదోవిధంగా సర్దుబాటు కాగలవు.

 భార్యాభర్తల మధ్య స్వల్ప వివాదాలు నెలకొంటాయి.

 ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి అనుకున్న  లక్ష్యాలు సాధిస్తారు.

 సంగీత, సాిహత్య విషయాలపై ఆసక్తి చూపుతారు.

 నిరుద్యోగులకు కీలక సమాచారం అందుతుంది.

 గృహం కొనుగోలు యత్నాలు కార్యరూపం దాలుస్తాయి.

 వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. కొత్త వ్యాపారాలకు శ్రీకారం.

 ఉద్యోగులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

 పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ ఆహ్వానాలు.

 కళాకారులకు విదేశీ పర్యటనలు తథ్యం.

 మహిళలు శుభకార్యాలకు హాజరవుతారు.

 శుక్ర, శనివారాలలో ధననష్టం. శ్రమాధిక్యం.

 తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.

 ఆదిత్యుని పూజించండి.

 

 

సింహం…

 ——

 వ్యవహారాలలో  ముందడుగు వేస్తారు.

 ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.

 మిత్రుల నుంచి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు.

 ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు.

 ఇంతకాలం నిరీక్షణ ఫలించి నిరుద్యోగులు అనుకూల ఫలితాలు సాధిస్తారు.

 ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారతారు.

 సేవాభావం పెరుగుతుంది.

 వాహనసౌఖ్యం.

 వ్యాపారాల్లో అనుకూల వాతావరణం.

 వారం మధ్యలో ఆరోగ్యం పట్ల మెలకువ పాటించండి.

 ఉద్యోగులకు పదోన్నతులు దక్కే అవకాశం. సమర్థతను చాటుకుంటారు.

 పారిశ్రామికవేత్తలకు ఊహించని విదేశీ పర్యటనలు.

 కళాకారులు ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు అందుకుంటారు.

 భార్యాభర్తల మధ్య  అపార్ధాలు తొలగుతాయి.

 గురు, శుక్రవారాలలో పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. మనశ్శాంతి లోపిస్తుంది.

 దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.

 విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

 

 

కన్య….

 —–

 ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు.

 ఆర్థిక లావాదేవీలలో పురోగతి ఉంటుంది.

 మీ అభిప్రాయాలకు తగిన గుర్తింపు లభిస్తుంది.

 ఆస్తి విషయాల్లో  ఒప్పందాలు చేసుకుంంటారు.

 భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుని ముందుకు సాగుతారు.

 ఓర్పు, చాకచక్యంగా కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు.

 గృహ నిర్మాణ యత్నాలు ఫలిస్తాయి.

 వ్యాపారాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి, అనుకున్న లాభాలు అందుతాయి.

 ఉద్యోగులకు ఊహించని విధంగా హోదాలు దక్కుతాయి.

 పారిశ్రామికవేత్తలు కొత్త లెసైన్సులు దక్కించుకుంటారు.

 కళాకారులకు ఉత్సాహవంతంగా గడుస్తుంది.

 మహిళలకు మానసిక ప్రశాంతత.

 శనివారం కొంత ఆదుర్దా, కుటుంబసభ్యులతో వైరం, పనులు వాయిదా.

 తూర్పుదిశప్రయాణాలు అనుకూలం.

 గణేశాష్టకం పఠించండి..

 

 

తుల….

 —-

 ప్రారంభంలో ఒడిదుడుకులు ఎదురైనా క్రమేపీ అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.

 బంధువులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు.

 ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది.

 ఆసక్తికరమైన సమాచారం అందుతుంది.

 ఆలోచనలు అమలు చేస్తారు.

 సంఘంలో గౌరవం మరింతగా పెరుగుతుంది.

 విలువైన వస్తువులు, వాహనాలు కొంటారు.

 చిరకాల కోరిక  నెరవేరుతుంది.

 .చర్మ, గొంతు సంబంధిత రుగ్మతలు బాధించే వీలుంది.

 బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగ్గా ఉంటాయి.

 వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి.

 ఉద్యోగాల్లో చికాకులు తొలగుతాయి.

 పారిశ్రామికవేత్తలకు విదేశీ సంస్థల తోడ్పాటు లభిస్తుంది.

 కళాకారులకు కలసివచ్చే కాలం, పురస్కారాలు అందుతాయి.

 మహిళలు కుటుంబంలో కొద్దిపాటి చికాకులు ఎదుర్కొంటారు.

 ఆది, సోమవారాలలో బంధువిరోధాలు. కార్యక్రమాలలో అవరోధాలు. చికాకులు.

 ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.

 ఆంజనేయస్వామికి పూజలు చేయండి.

 

వృశ్చికం…

 ——–

 ముఖ్యమైన కార్యక్రమాలు నెమ్మదిగా పూర్తి చేస్తారు.

 ఆత్మీయులతో మాటపట్టింపులు .

 ఆరోగ్యం, వాహనాల విషయంలో నిర్లక్ష్యం వద్దు.

 కుటుంబసభ్యుల నుంచి విమర్శలు, ఒత్తిడులు ఎదురవుతాయి.

 ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

 ఆర్థిక విషయాలు కాస్త నిరాశ కలిగించవచ్చు.

 కొత్త రుణాల కోసం అన్వేషణ.

 దూరపు బంధువుల నుంచి ఉపయుక్తమైన సమాచారం అందుతుంది.

 భాగస్వామ్య వ్యాపారాలు కాస్త లాభిస్తాయి.

 ఉద్యోగాల్లో కొన్ని మార్పులు జరిగే వీలుంది.

 పారిశ్రామికవేత్తలకు కొంత పరీక్షాసమయం.

 కళాకారులు అందిన అవకాశాలపై నిరుత్సాహం చెందుతారు.

 భార్యాభర్తల మధ్య లేనిపోని అపార్ధాలు.

 ఆది, సోమవారాలలో శుభవర్తమానాలు. ధన,వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు.

 పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.

 దుర్గాదేవికి సహస్ర కుంకుమార్చన చేయించుకుంటే మంచిది.

 

ధనుస్సు…

 ——-

 బంధువులు, శ్రే యోభిలాషులు మీపై అభాండాలు మోపుతారు.

 విచిత్రమైన సంఘటనలు.

 పనుల్లో జాప్యం తప్పదు.

 ప్రత్యర్థుల చర్యలతో కొంత అసహనానికి లోనవుతారు.

 ఆరోగ్యం మందగించి ఆస్పత్రులు సందర్శిస్తారు.

 నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు.

 పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

 సభలు, సమావేశాలలో పాల్గొంటారు.

 వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు.

 ఉద్యోగస్తులకు నిరుత్సాహమే.

 పారిశ్రామిక, వైద్యరంగాల వారికి ఒడిదుడుకులు ఎదురవుతాయి.

 కళాకారులకు ఉత్సాహ ం తగ్గుతుంది.

 మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది.

 మంగళ, బుధవారాలలో విందువినోదాలు. కుటుంబసభ్యుల ప్రోత్సాహం. ధన,వస్తులాభాలు.

 ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.

 శివాష్టకం పఠించండి.

 

మకరం…

 ——-

 చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు తొలగుతాయి.

 చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు.

 విలువైన వస్తువులు సేకరిస్తారు.

 ఆర్థికంగా బలపడతారు. రావలసిన బాకీలు అందుతాయి.

 దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడే సూచనలు.

 ముఖ్య విషయాలపై కుటుంబసభ్యుల సూచనలు పాటిస్తారు.

 ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

 భార్యాభర్తల మధ్య వివాదాలు సమసిపోతాయి.

 ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది కలిగినా సర్దుబాటు కాగలదు.

 వ్యాపారాల్లో కొత్త ఆశలు చిగురిస్తాయి, లాభాలు దక్కుతాయి.

 ఉద్యోగులకు విధుల్లో సమస్యలు తీరే సూచనలు.

 పారిశ్రామిక వేత్తలకు సంతోషకరమైన సమాచారం.

 కళాకారులకు అనుకోని అవకాశాలు లభించవచ్చు.

 శనివారం కాస్త మందకొడిగా ఉంటుంది. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు.

 దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.

 గణేశ్ పూజలు చేయండి.

 

కుంభం…

 ——-

 చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

 అందివచ్చిన అవకాశాలు నిరుద్యోగులు  సద్వినియోగం చేసుకుంటారు.

 ఇళ్లు, వాహనాల కొనుగోలు ప్రయత్నాలు సఫలం.

 ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

 బంధువులు, మిత్రులతో దీర్ఘకాలికంగా ఉన్న వివాదాలు తీరతాయి.

 ఎంతటి వారినైనా ఆకట్టుకుని ముందడుగు వేస్తారు.

 కాంట్రాక్టులు దక్కించుకుంటారు.

 చర్మ, ఉదర సంబంధిత వ్యాధులు కొంత బాధిస్తాయి.

 వ్యాపారాలు పుంజుకుంటాయి.

 ఉద్యోగాల్లో నూతనోత్సాహం.

 పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు.

 కళాకారులకు అరుదైన సత్కారాలు.

 ఆది, సోమవారాలలో వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో తగాదాలు.

 పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.

 హనుమాన్ చాలీసా పఠించండి.

 

మీనం…

 —–

 వ్యవహారాలలో పట్టింది బంగారమా అన్నట్లుంటుంది.

 ఎంతటి కార్యాన్నైనా అవలీలగా పూర్తి చేస్తారు.

 భవనాలు, వాహనాలు కొంటారు.

 నిరుద్యోగులకు స్థిరమైన ఉపాధి అవకాశాలు దక్కుతాయి.

 విద్యార్థులు లక్ష్యసాధనలో ముందడుగు వేస్తారు.

 శుభకార్యాలకు డబ్బు వె చ్చిస్తారు.

 ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.

 బంధువులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు.

 ఆరోగ్య సమస్యలు తీరి ఊరట చెందుతారు.

 వ్యాపారాలు కొత్త పెట్టుబడులతో విస్తరిస్తారు.

 ఉద్యోగులకు  కొత్త బాధ్యతలు లభిస్తాయి.

 పారిశ్రామికవేత్తలకు ఊహించని ప్రగతి ఉంటుంది.

 కళాకారులకు నూతనోత్సాహం, కొత్త అవకాశాలు.

 మంగళ, బుధవారాలలో గందరగోళ పరిస్థితి. శ్రమ తప్పదు.

 ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి.

 శ్రీరామరక్షాస్తోత్రం పఠించండి.

 

Tags: srikaram subhakaram zee telugu program, Srikaram Subhakaram Episodes, Srikaram Subhakaram Weekly Astrology Predictions, Vakkantam Chandra Mouli Srikaram Subhakaram, Telugu Astrology, TeluguAstrology, Free Astrology in Telugu, janmakundali.com, Zee Telugu Srikaram Subhakaram 13th July 2014, srikaram subhakaram zee telugu,