Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> Srikaram Subhakaram 27th April 2014

Srikaram Subhakaram 27th April 2014


రాశి ఫలాలు

by Vakkantam Chandra Mouli, janmakundali.com

Srikaram Subhakaram, 27th April 2014 Episode

Weekly Horoscope (2014-04-27  –  2014-05-03)

మేషం…

—–

కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. కొన్ని మొండి బాకీలు వసూలవుతాయి. మీఆశయాలు నెరవేరతాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. కాంట్రాక్టులు పొందుతారు. జీవితభాగ స్వామిద్వారా ఆస్తిలాభం. ఇంటి నిర్మాణాల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆర్థికలావాదేవీలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలుతథ్యం. పారిశ్రామిక,వైద్యరంగాల వారికి యోగవంతంగా ఉంటుంది. కళాకారులకు పట్టింది బంగారమే. మహిళలకు కుటుంబసభ్యులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆది,సోమవారాలలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. దక్షిణదిశ ప్రయాణాలు సానుకూలం. గణపతిని పూజించండి.

వృషభం…

——

ఈవారం అనూహ్యమైన రీతిలో పనులు పూర్తి చేస్తారు. సంఘంలోనూ,కుటుంబంలోనూ మీమాటకు ఎదురుండదు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుని మీదారికి తెచ్చుకుంటారు. సంగీత,సాహిత్య విషయాలపై ఆసక్తి చూపుతారు. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. భూములు, వాహనాలు కొంటారు. దేవాలయాలు సందర్శిస్తారు. పరపతి కలిగిన వ్యక్తులు పరిచయంకాగలరు. ఆదాయం కొంత పెరిగి ఊరట కలిగిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. కొత్తపెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు విధుల్లో అనుకూల వాతావరణం. పారిశ్రామిక,రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. మహిళలకు ఆస్తి విషయాలలో చికాకులు తొలగుతాయి. మంగళ , బుధవారాలలో మిత్రులతో విభేదాలు. రుణాలు చేస్తారు. ఉత్తరదిశ ప్రయాణాలుసానుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.

మిథునం..

——-

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి వ్యవహారాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకివచ్చి గుర్తింపు పొందుతారు. భూములు, వాహనాలు కొంటారు. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి చేయూతనందిస్తారు. ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. ఒక ప్రకటనతో నిరుద్యోగులు ఊరటచెందుతారు. ఆర్థికలావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి.రుణబాధలు తొలగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కుతాయి. పారిశ్రామిక,వైద్యరంగాల వారికి సన్మానాలు. కళాకారులకు ఒత్తిడులు తొలగుతాయి. మహిళలు అనుకోని విజయాలు సాధిస్తారు. గురు,శుక్రవారాలలో కుటుంబసభ్యులతో విభేదాలు. మానసిక ఆందోళన. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కర్కాటకం..

——–

ఆర్థిక పరిస్థితి గతంకంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులుసాయంతో పనులు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలకు లోటు ఉండదు. ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. ఆసక్తిరమైన సమాచారం అందుతుంది. దేవాలయాలు సందర్శిస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారలావాదేవీలు ఉత్సాహంగాసాగి లాభాలదిశగా సాగుతారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. రాజకీయ,సాంకేతికరంగాలవారికి పట్టింది బంగారమే. కళాకారులు అనుకున్న అవకాశాలు అప్రయత్నంగా దక్కించుకుంటారు. మహిళలకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆది,సోమవారాలలో ధనవ్యయం.కుటుంబ,ఆరోగ్యసమస్యలు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిని పూజించండి.

సింహం..

——

మొదట్లో కాస్త నిరాశ కలిగినా క్రమేపీ అనుకూలపరిస్థితులు నెలకొంటాయి. భవిష్యత్‌పై కొత్తఆశలు చిగురిస్తాయి. బంధువులు, మిత్రులతో వ్యక్తిగత విషయాలు చర్చిస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్నిబాకీలువసూలయ్యే అవకాశం. రుణదాతల ఒత్తిడులు కొంతతగ్గే సూచనలు. పనులు నెమ్మదిగాసాగుతాయి. వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకోని మార్పులు, అదనపు విధులు. పారిశ్రామిక,రాజకీయవర్గాలకు ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. కళాకారులకు అవకాశాలు ఊరిస్తాయి. మహిళలకు కుటుంబంలో గౌరవం. సోమ,మంగళవారాలలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. ఆరోగ్యభంగం. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

కన్య…

——

ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిస్తుంది. కొత్తగా రుణాలు సైతం చేస్తారు. పనులు కొంత జాప్యంతో పూర్తి కాగలవు. బంధువులు, మిత్రుల నుంచి కొన్ని వ్యవహారాలలో ఒత్తిడులు తప్పవు. తీర్థయాత్రలు చేస్తారు. ఆలోచనలు అమలులో కొంత ఆటంకాలు. అనుకున్నది సాధించాలన్న తపన పెరుగుతుంది. జీవిత భాగస్వామితో వివాదాలు కొంతవరకూపరిష్కారం. శుభకార్యాలకు అధికంగా ఖర్చు చేస్తారు. ఆత్మీయులనుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగులకు విధుల్లో ఒత్తిడులు పెరుగుతాయి. పారిశ్రామిక,వైద్యరంగాల వారికి విదేశీ పర్యటనలలో మార్పులు. కళాకారులకు నిరుత్సాహం తప్పదు. మహిళలకు కుటుంబసభ్యుల నుంచి విమర్శలు ఎదురై డీలా చెందుతారు. సోమ, మంగళవారాలలో ధననష్టం. కుటుంబంలో చికాకులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.

తుల…

——

చేపట్టిన కార్యక్రమాలు సాఫీగా పూర్తి చేస్తారు. మీ అంచనాలు, ఊహలు నిజం కాగలవు. పరిచయాలు పెరుగుతాయి. రావలసిన సొమ్ము సకాలంలో అందుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. చిరకాల మిత్రుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వేడుకల్లో పాల్గొంటారు. పెద్దల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఉన్నత హోదాలు, ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలకు కొత్త ఆశలుచిగురిస్తాయి. కళాకారులకు సన్మానాలు, సత్కారాలు. మహిళలకు సంతోషకరమైన వార్తలు అందుతాయి. గురు, శుక్రవారాలలో పనుల్లో అవాంతరాలు. ఆస్తి వివాదాలు. మానసిక ఆందోళన. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృశ్చికం…

——

కొత్తపనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి విశేషఆదరణ చూరగొంటారు. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. మీ ఊహలు నిజం చేసుకుంటారు. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. వాహనాలు,ఆభరణాలుకొంటారు. జీవిత భాగస్వామి నుంచి ఆస్తిలాభ సూచనలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు విస్తరిస్తారు.పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు ఖాయం. పారిశ్రామికరంగంవారికి విదేశీపర్యటనలు. కళాకారులు కొత్త ఆశలతో ముందుకుసాగి విజయాలు సాధిస్తారు. మహిళలకు మానసిక ఆందోళన తొలగుతుంది. శనివారం అనుకోని ఖర్చులు. కుటుంబసభ్యుల విమర్శలు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

ధనుస్సు..

—–

కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆశయాలు నెరవేరతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. చర్చలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుతాయి. ప్రత్యర్థులు సైతం అనుకూలంగా మారతారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆర్థికపరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు. పారిశ్రామిక, వైద్యరంగాల వారికి విదేశీ పర్యటనలు. కళాకారులకు కొత్త అవకాశాలు దగ్గరకు వచ్చే సమయం. మహిళలకు శుభవార్తలు అందుతాయి. సోమ, మంగళవారాలలో ధననష్టం. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.

మకరం…

——-

పనులు నెమ్మదిగా పూర్తి కాగలవు. ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా ఉన్నా అవసరాలకు సొమ్ము అందుతుంది. ప్రత్యర్థుల పట్ల అప్రమత్త అవసరం. దూరపు బంధువులను కలుసుకుని ముఖ్యవిషయాలు చర్చిస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఒక ప్రకటన పట్ల నిరుద్యోగులు ఆకర్షితులవుతారు. చాకచక్యం, ఓర్పుతో ముందుకు సాగండి. విలువైన వస్తువులు సేకరిస్తారు. స్నేహితులు సమస్యలు సృష్టించినా అధిగమిస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు కాస్త తొలగుతాయి.స్వల్ప లాభాలు. ఉద్యోగులకు విధుల్లో ఒత్తిడులు తప్పవు. పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా. కళాకారులకు అవకాశాలలో కొంత జాప్యం. మహిళలకు ఆస్తి , ధనలాభం. మంగళ, బుధవారాలలో కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతిని పూజించండి.

కుంభం..

——-

ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు. ధనవ్యయం. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు చికాకు పరుస్తాయి. ఇంటాబయటా విమర్శలు ఎదుర్కొంటారు. వాహనాల విషయంలో అప్రమత్తత పాటించండి. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆలోచనలు స్థిరంగా ఉండవు. చర్మ, ఉదర సంబంధితరుగ్మతలు. వ్యాపారాలలో గందరగోళంగా ఉంటుంది. లాభాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు స్థానచలన సూచనలు. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి అంతగా అనుకూలించదు. విదేశీ పర్యటనలు వాయిదా. కళాకారులు నిర్ణయాలలో తొందరపడకుండా ఆలోచించి ముందుకు సాగండి. మహిళలకు మానసిక అశాంతి. మంగళ, బుధవారాలలో ఆస్తిలాభం. యత్నకార్యసిద్ధి. వివాదాల పరిష్కారం. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయుని పూజించండి.

మీనం…

——

పనుల్లో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. చర్చలు సఫలం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కాంట్రాక్టులు పొందుతారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆలయాలు సందర్శిస్తారు. భూములు, వాహనాలు కొంటారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. జీవితాశయం నెరవేరుతుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, విధుల్లో ఆటంకాలు తొలగుతాయి. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు సన్మానాలు. కళాకారులకు మంచిగుర్తింపు రాగలదు. మహిళలకు కుటుంబసమస్యల నుంచి బయటపడతారు. శనివారం ధననష్టం. అనారోగ్యం. బంధువిరోధాలు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతిని పూజించండి.

Tags : Srikaram Subhakaram Episodes, Srikaram Subhakaram Weekly Astrology Predictions, Vakkantam Chandra Mouli Srikaram Subhakaram, Telugu Astrology, TeluguAstrology, Free Astrology in Telugu, janmakundali.com, Srikaram Subhakaram 27th April 2014,