Srikaram Subhakaram 27th July 2014

0

Srikaram Subhakaram 27th July 2014

రాశి ఫలాలు

by Vakkantam Chandra Mouli, janmakundali.com

Weekly Horoscope (27th Jul 2014   –    2nd Aug 2014)

మేషం…

 ——

 వారం ప్రారంభం కంటే చివరిలో మరింత అనుకూల సమయం.  చేపట్టిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు.

 ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. మీ శక్తియుక్తులు ఉపయోగించి కొన్ని వివాదాల నుంచి బయటపడతారు.  భార్యాభర్తల మధ్య నెలకొన్న అపార్ధాలు తొలగుతాయి. ఆరోగ్యపరంగా చికాకులు తప్పకపోవచ్చు. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. సమర్థత చాటుకుంటారు. రాజకీయవర్గాలకు పదవీయోగం.  కళాకారుల అంచనాలు నిజమయ్యే వేళ. ఆది, సోమవారాలలో పనుల్లోజాప్యం. ఆర్థిక ఇబ్బందులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీలక్ష్మీ నృసింహస్తోత్రాలు పఠించండి.

 

వృషభం…

 ——

 మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా క్రమేపీ అనుకూల పరిస్థితి ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. రావలసిన డబ్బు అంది ఊరట చెందుతారు. ఒక దీర్ఘకాలిక సమస్య అనుకూలంగా పరిష్కారమవుతుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు సానుకూలం.

 ఆరోగ్యపరంగా మొదట్లో కొంత ఇబ్బంది కలుగుతుంది. ఒక సంఘటన లేదా ప్రకటన ఆకట్టుకుంటుంది.

 వ్యాపారస్తులు అనుకున్న లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగవర్గాలకు నూతనోత్సాహం. ఇంక్రిమెంట్లు లభిస్తాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ యానం. కళాకారులు రెట్టించిన ఉత్సాహంతో అడుగు వేస్తారు.

 మంగళ, బుధవారాలలో ధననష్టం. చికాకులు. మానసిక ఆందోళన. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.

 శ్రీకృష్ణాష్టకం పఠించండి.

 

మిథునం..

 ——-

 ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. అనుకున్న కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.

 ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. మీ శ్రమకు తగ్గ ఫలితం దక్కక నిరాశ చెందుతారు. ఆత్మీయులతో విరోధాలు నెలకొంటాయి. విలువైన సామగ్రి జాగ్రత్త. ఇంటి నిర్మాణాలలో కొద్దిపాటి అవరోధాలు.

 ఆరోగ్యం, వాహనాలు విషయంలో నిర్లక్ష్యం వద్దు. వ్యాపారులు ఆచితూచి పెట్టుబడులు పెట్టాలి. ఉద్యోగస్తులకు కొన్ని మార్పులు జరిగే సూచనలు. రాజకీయ, పారిశ్రామికరంగాల వారు విదేశీ పర్యటనలు రద్దు చేసుకుంటారు.

 కళాకారులకు కొంత గందరగోళ పరిస్థితి తప్పకపోవచ్చు. మంగళ, బుధవారాలలో శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలబ్ధి. ఆహ్వానాలు అందుతాయి. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతిని పూజించండి.

 

కర్కాటకం..

 ——-

 పట్టుదలతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణతో ముందడుగు వేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు.  ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. వాహనాలు, స్థలాలు కొంటారు. మీ సత్తాను కుటుంబసభ్యులు గుర్తించి ప్రశంసలు కురిపిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.  ఆరోగ్యం కుదుటపడినా కొంత ఆవేదన తప్పకపోవచ్చు. పరపతి కలిగిన వ్యక్తులు పరిచయం కాగలరు. వ్యాపారులు లాభాల బాటలోసాగుతారు.

 ఉద్యోగులకు కొత్త హోదాలు లభిస్తాయి. పారిశ్రామికవర్గాలకు సన్మాన, సత్కారాలు. కళాకారులు అనుకున్నది సాధిస్తారు. పురస్కారాలు సైతం అందుతాయి. శనివారం ధనవ్యయం. శ్రమాధిక్యం. మానసిక ఆందోళన.

 దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

 

సింహం..

 ——

 కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులు బంధువుల ఆదరణ పొందుతారు. మీలో దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కాంట్రాక్టులు కైవసం చేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

 పాతమిత్రులను కలుసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. ఇంటిలోశుభకార్యాల నిర్వహణ.

 గొంతు, ఉదర సంబంధిత రుగ్మతలు కొంత బాధించవచ్చు. వ్యాపారాలు విస్తరిస్తారు. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కే అవకాశం. పారిశ్రామికరంగం వారికి ప్రభుత్వ పరంగా అవార్డులు దక్కవచ్చు. కళాకారులకు ఊహించనిరీతిలో అవకాశాలు. ఆది,సోమవారాలలో వ్యయప్రయాసలు. కుటుంబసభ్యుల నుంచి విమర్శలు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

 

కన్య…

 —–

 ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. కొన్ని రుణాలు తీరి ఊరట చెందుతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. గతంలో దూరమైన వ్యక్తులు తిరిగి దగ్గరకు చేరతారు. కొత్త కాంట్రాక్టు పనులు దక్కించుకుంటారు. సేవలకు తగిన గుర్తింపు రాగలదు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాల విషయంలో మాత్రం అప్రమత్తత అవసరం. వ్యాపారులకు లాభాలు అందుతాయి. పెట్టుబడులకు ఢోకా ఉండదు. ఉద్యోగులు కోరుకున్న హోదాలు దక్కించుకుంటారు.

 రాజకీయవర్గాలకు నూతన పదవులు లభిస్తాయి. కళాకారులు అవకాశాలు పెరిగి ఉత్సాహంగా సాగుతారు.

 మంగళ, బుధవారాలలో ధనవ్యయం. బంధువిరోధాలు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.

 

తుల…

 —–

 ఈవారం అన్నింటా విజయమే. పట్టింది బంగారంగా ఉంటుంది. ఉద్యోగయత్నాలలో నిరుద్యోగులకు శుభవార్తలు.

 ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. వాహనాలు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. పోటీపరీక్షల్లో విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలు విస్తరించి ముందుకు సాగుతారు. ఉద్యోగులకు ప్రమోషన్లు లభిస్తాయి. పారిశ్రామికవేత్తలు, నాయకులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కళాకారులు అంచనాలు నిజం చేసుకుంటారు. కొన్ని ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. గురు, శుక్రవారాలలో వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో కలహాలు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతిని పూజించండి.

 

వృశ్చికం…

 ——

 ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఆలోచనలు అమలు చేస్తారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయకారిగా నిలుస్తారు. కాంట్రాక్టులు పొందుతారు. ఆశయాలు నెరవేరతాయి. వాహనాలు, స్థలాలు కొంటారు.

 భార్యాభర్తల మధ్య విభేదాలు సమసిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. ప్రతిభావంతులుగా గుర్తింపు పొందుతారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం.

 ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. విధుల్లో చికాకులు తొలగుతాయి. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు నిరుత్సాహం. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆది, సోమవారాలలో పనుల్లో ఆటంకాలు. దుబారా ఖర్చులు. బంధువిరోధాలు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ  పారాయణ మంచిది.

 

ధనుస్సు…

 ——

 మొదట్లో కొంత గందరగోళ పరిస్థితి ఉన్నా క్రమేపీ అనుకూలంగా మారుతుంది. నిర్ణయాలలో కొంత నిదానం పాటించడం మంచిది. పనులు విజయవంతంగా సాగుతాయి. బంధువులు, మిత్రుల సహాయసహకారాలతో ముందుకు సాగుతారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. భార్యాభర్తల మధ్య సామరస్య పూర్వక వాతావరణం నెలకొంటుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. రాబడి గతం కంటే పెరుగుతుంది. ఆత్మీయుల ఆదరాభిమానాలు చూరగొంటారు. నిరుద్యోగుల యత్నాలు సఫలం. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి.

 ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం, విదేశీ పర్యటనలు.

 కళాకారులు ఈవారం బిజీగా గడుపుతారు. సన్మానాలు. ఆది, సోమవారాలలో వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. బంధువిరోధాలు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గామాతకు కుంకుమార్చన చేయించుకోండి.

 

మకరం…

 —–

 ముఖ్యమైన కార్యక్రమాలు కాస్త నిదానిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. రావలసిన సొమ్ము కొంత అందుతుంది. ఒక సమస్య నుంచి బయటపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆత్మీయులు, బంధువుల నుంచి శుభవర్తమానాలు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. సోదరీ,సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు క్రమేపీ తొలగుతాయి.

 ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. పారిశ్రామిక, సాంకేతికరంగాల వారు విదేశీ పర్యటనలు వాయిదా వేసుకుంటారు. కళాకారులకు ఒత్తిడులు తొలగుతాయి. మంగళ, బుధవారాలలో కుటుంబంలో చికాకులు. చోరభయం. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షా స్తోత్రాలు పఠించండి.

 

కుంభం…

 ——

 కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులు మరింత దగ్గరవుతారు. సేవాభావంతో ముందుకు సాగి గుర్తింపు పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలోపాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు.

 వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. మీ శ్రమ వృథా కాదు. అనుకున్న లక్ష్యాలవైపు సాగుతారు. వివాహయత్నాలు సానుకూలం. చర్మ, గొంతు సంబంధిత రుగ్మతలు కొంత బాధిస్తాయి. వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులకు పైస్థాయి అధికారుల నుంచి ప్రశంసలు. విధుల్లో చికాకులు తొలగుతాయి.

 రాజకీయవర్గాలకు కొత్త పదవులు వరిస్తాయి.  కళాకారుల ఆశలు నెరవేరతాయి. గురు, శుక్రవారాలలో ధననష్టం. బంధువులతో మాటపట్టింపులు.  దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

 

మీనం…

 ——

 ఆదాయం కొంత తగ్గినా అవసరాలు తీరతాయి. పెండింగ్ కార్యక్రమాలపై దృష్టి సారించి విజయం సాధిస్తారు.

 బంధువుల ఆదరణ లభిస్తుంది. ఇంతకాలం దూరమైన ఆప్తులు తిరిగి దరిచేరతారు. విలువైన వస్తువులు కొంటారు.

 ఆస్తి వివాదాలు. కోర్టు కేసులు పరిష్కారదశకు చేరడం ఊరటనిస్తుంది. వివాహ, ఉద్యోగయత్నాలు  అనుకూలిస్తాయి. ప్రతిభావంతులుగా గుర్తింపు రాగలదు. ఆరోగ్య సమస్యలు కాస్త చికాకు పరుస్తాయి.

 వ్యాపారులకు కొంత వరకూ లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు కోరుకున్న బదిలీలు ఉంటాయి.

 పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. కళాకారుల కృషి కొంతవరకూ ఫలిస్తుంది. ఆది, సోమవారాలలో పనుల్లో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.

 

Tags: srikaram subhakaram zee telugu program, Srikaram Subhakaram Episodes, Srikaram Subhakaram Weekly Astrology Predictions, Vakkantam Chandra Mouli Srikaram Subhakaram, Telugu Astrology, TeluguAstrology, Free Astrology in Telugu, janmakundali.com, Zee Telugu Srikaram Subhakaram 27th July 2014, srikaram subhakaram zee telugu,