ఆ టైమ్‌లో సెక్స్ చేసుకుంటే మజానే వేరట!

0

స్త్రీ, పురుషుల సంగమమే సెక్స్. పెళ్లయిన కొత్తలో జంటలు సమయం సందర్భం చూసుకోకుండా మూడ్ ఎప్పుడు వస్తే అప్పుడే పని కానిచ్చేస్తారు. అయితే కొంతమందికి నిర్ణీత సమయాన్ని బట్టి సెక్స్ ఆసక్తి కలుగుతుందని సెక్సాలజిస్టులు చెబుతున్నారు. ఎక్కువ మంది రాత్రి వేళలో పడుకునే ముందు శృంగారానికి ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. రోజులోని ఆయా సమయాలే సెక్స్ సామర్థ్యాన్ని నిర్ణయిస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. గర్భధారణపైనా ఇది ప్రభావం చూపిస్తుందట. ఆయుర్వేదం ప్రకారం అర్ధరాత్రికి ముందు శృంగారంలో పాల్గొంటే మంచిదట. సెక్స్ ఏయే సమయాల్లో చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకుందామా.

ఉదయం
ఉదయం 6-8 గంటల మధ్య పురుషులకు సెక్స్ కోరికలు ఎక్కువగా ఉండటమే కాదు, ఆ సమయంలో వారి సామర్థ్యం బాగా ఉంటుందట. అయితే మహిళల విషయంలో ఇది పూర్తి విరుద్ధంగా ఉంటుంది. అయితే 8-10 గంటల మధ్య ఎండార్ఫిన్ అనే హార్మోన్లు విడుదల అవ్వడం వల్ల మహిళలకు సెక్స్ కోరికలు కలుతుగాయి. కాని ఆ సమయంలో పురుషుల్లో ఆ కోరికలు అంతగా ఉండవు. ఈ సమయాల్లో ఇద్దరూ ఇష్టపడితే పని కానియొచ్చు.

మధ్యాహ్నం
మధ్యాహ్నం 12 -2 గంటల మధ్య స్త్రీ, పురుషులు ఇద్దరూ వివిధ పనుల్లో నిమగ్నమై ఉంటారు కాబట్టి సెక్స్‌పై అంతగా ఆసక్తి చూపరు. 2-4 గంటల మధ్య స్త్రీలలో ప్రత్యుత్పత్తి బాగా పనిచేస్తుంది. దీంతోపాటు ఈ సమయంలో పురుషుడిలో విడుదలయ్యే వీర్యం నాణ్యతగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో సెక్స్ చేస్తే పిల్లలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆయుర్వేదం చెబుతోంది.

సాయంత్రం
సాయంత్రం సమయంలో సెక్స్‌కు అనువుగా ఉండదు. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల మధ్య ఎక్కువగా ఆకలి వేస్తుంటుంది. అంతేకాదు సెక్స్ కోరికలు, సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయం శృంగారానికి అనువు కాదు.

రాత్రి
రాత్రి 8 నుండి 10 గంటల వరకు స్త్రీ, పురుషుల్లో శక్తి నిల్వలు పెరిగి సెక్స్‌కు అనువుగా మారతాయట. అందుకే ఈ సమయం శృంగారానికి అత్యంత అనువైనది. ఆయుర్వేదం కూడా ఇదే చెబుతోంది. రాత్రి 10 నుండి 12 గంటల మధ్య సెక్స్‌కు అత్యంత అనుకూల సమయం. ఈ సమయంలో ఇద్దరిలోనూ హార్మోన్లు బాగా పనిచేసి సెక్స్‌పై ఆసక్తి కలిగిస్తాయి. సెక్స్ తర్వాత నిద్ర బాగా పడుతుంది కాబట్టి ఎక్కువ మంది ఈ సమయానికే మొగ్గు చూపుతారట.