ఒక సూపర్ స్టార్ కథ ఇంకో సూపర్ స్టార్ ద్వారా శింబు వద్దకు..!

యూనివర్శిల్ స్టార్‌ కమల్‌ హాసన్ ఒక వైపు హీరోగా వరుసగా సినిమాలు చేస్తూనే మరో వైపు నిర్మాతగా కూడా సినిమాలు నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు తన సొంత సినిమాల నిర్మాణంలో నిర్మాణ భాగస్వామిగా కొనసాగిన కమల్‌ హాసన్‌ ఇప్పుడు ఇతర హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తున్న విషయం తెల్సిందే.

తాజాగా శింబు హీరోగా దేశింగు పెరియసామి దర్శకత్వంలో ఒక సినిమాను కమల్‌ నిర్మించబోతున్నాడు. ఈ సినిమా కథపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తమిళ మీడియాలో ఈ సినిమా ను మరో బాహుబలి అంటూ కొందరు ప్రశంసిస్తున్నారు. ఇదే సమయంలో మొదట ఈ కథ ను దర్శకుడు దేశింగు పెరియసామి రాసుకున్నప్పుడు రజినీకాంత్ కోసం అనుకున్నాడట.

రజినీకాంత్‌ ను దృష్టిలో పెట్టుకుని దేశింగు పెరియసామి ఈ కథ ని రూపొందించాడు అంటూ తమిళ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రజినీకాంత్‌ బిజీగా ఉండటం వల్ల కమల్‌ హాసన్ ద్వారా ఈ కథ చివరికి శింబు వద్దకు చేరిందట. కమల్‌ హాసన్‌ కథ పై ఆసక్తి మరియు నమ్మకంతో భారీగా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చాడట.

ఈ మధ్య కాలంలో శింబు ఒక్క హిట్‌ కొడితే మూడు నాలుగు ఫ్లాప్స్ పడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఓ మంచి కథ లభించడంతో పాటు కమల్‌ హాసన్‌ నిర్మాణం అవ్వడం తో కచ్చితంగా హిట్ గ్యారెంటీ అనే టాక్‌ తమిళ మీడియా వర్గాల్లో వినిపిస్తోంది. టైటిల్‌ ఖరారు కాని ఈ సినిమా త్వరలో పట్టాలెక్కబోతుంది. పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారట.

Related Images:

షాకింగ్ న్యూ లుక్.. బిగ్ బాస్ 4 కోసం విశ్వనటుడు ఇలా..

మాస్ న్యూ లుక్ తో `బిగ్ బాస్ 4` కోసం కమల్ హాసన్ సిద్ధంగా ఉన్నారా? అంటే ఇదిగో ఇదే ప్రూఫ్. కింగ్ నాగార్జున అక్కినేని వరుసగా రెండవ సంవత్సరం బిగ్ బాస్ తెలుగుకు హోస్ట్ గా కొనసాగుతుంటే తమిళ బిగ్ బాస్ నాల్గవ సీజన్ కి కమల్ ఇదిగో ఇలా ప్రిపేరయ్యారు. ఈ షోని సెప్టెంబర్ చివరి నాటికి ప్రారంభించాలని ప్లాన్ చేసినా కోవిడ్ వల్ల వాయిదా పడింది. ఇప్పటికి ఈ రియాలిటీ షో ప్రదర్శన ప్రణాళిక ట్రాక్ లో ఉంది.

మూడేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కమల్ హాసన్ మరోసారి తిరిగి హోస్ట్ అవతారం ఎత్తారు. అందుకు సంబంధించిన షాకింగ్ లుక్ తాజాగా రివీలైంది. ఫోటోషూట్ నుండి స్టిల్స్ నిన్నటి నుండి ఇంటర్నెట్లో వైరల్ గా మరాయి. `ఇండియన్ 2` స్టార్ హ్యాండిల్ బార్ మీసం.. స్టైలిష్ గుబురు గడ్డంతో ఉప్పు నిప్పులా కనిపిస్తున్నారు మరి. వైట్ హ్యాట్ బ్లాక్ అండ్ బ్లాక్ స్టైలిష్ డ్రెస్ లో ఈ లుక్ చూశాక… ఊబర్ స్టైలిష్ లుక్ బావుందని ….. సూపర్ ఉలగనాయగన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు ఫ్యాన్స్.

కమల్ హాసన్ ప్రముఖ టెలివిజన్ రియాలిటీ షో కోసం ప్రోమో వీడియో రెడీ చేశారట. ఇందులో బయటి ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేని ఇంట్లో 15 మంది పోటీదారులంతా కనిపిస్తారట. ఈసారి తమిళ బిగ్ బాస్ లో రమ్య పాండియన్… పుజ్ఘల్… అతుల్య రవి.. విద్యాలేఖ రామన్ … కిరణ్ రాథోడ్ వంటి సెలబ్రిటీలను సంప్రదించినట్లు సమాచారం.

శంకర్ దర్శకత్వం వహిస్తున్న `ఇండియన్ 2` షూటింగ్ కూడా తిరిగి ప్రారంభం కావాల్సి ఉండగా నిర్మాతలతో వివాదం తెలిసినదే. కమల్ హాసన్ బిగ్ బాస్ 4 పనిలోనే బిజీ అయ్యారు దీనివల్ల. తదుపరి ఓ రెండు చిత్రాల్లో నటించాలన్న ప్లాన్ తో ఉండగా వాటిలో ఒకదానికి ఆయనే దర్శకత్వం వహించనున్నారు.

Related Images:

2021 ఎన్నికలే లక్ష్యంగా కమల్ హాసన్ మూవీ ప్లాన్?

ఎన్నికలొస్తున్నాయి అంటే అందుకు తగ్గట్టు స్టార్ల సినిమాల్లో కంటెంట్ కూడా మారుతుంటుంది. ఇక రాజకీయాల్లో ఉన్న స్టార్లు నటించే సినిమాలు పొలిటికల్ కథాంశంతో వేడెక్కించేవే అయ్యి ఉంటాయి. రాజకీయాలు సామాజిక సేవ అంటూ ప్రత్యర్థులపై పంచ్ లు అదిరిపోయే రేంజులో ఉంటాయి. ఇంతకుముందు ఎన్నికల ముందు విజయ్ నటించిన మెర్సల్ ఈ తరహాలోనే వచ్చి వివాదాస్పదమైంది. ఓటు హక్కు నేపథ్యంలో తంబీలు చేసిన రచ్చ చాలా దూరమే వెళ్లింది. ఆ తర్వాత విజయ్ ని తమిళనాడు ప్రభుత్వం రకరకాలుగా ఇబ్బందులకు గురి చేయడం తెలిసినదే.

అదంతా సరే కానీ.. 2021లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పలువురు అగ్ర దర్శకులు మాస్టర్ ప్లాన్ తో ముందుకు దూసుకు రావడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా రాజకీయ ప్రాబల్యం ఉన్న కమల్ హాసన్ లాంటి స్టార్ తో మురుగదాస్ తొడకొట్టించేందుకు గట్టి ప్లాన్ లోనే ఉన్నాడట.

అందుకోసం ఏకంగా దళపతి విజయ్ సినిమానే వదిలేస్తున్నాడట. ఇప్పటికే విజయ్ తో ప్లాన్ ని పక్కన పెట్టేశాడట. నిజానికి ఈ చిత్రం 2021 ప్రథమార్థంలోనే సెట్స్ కెళ్లాల్సి ఉండగా.. అంతకంటే ముందే కమల్ హాసన్ తో సినిమాని లాక్ చేశాడట. తాజా సమాచారం ప్రకారం.. ఇటీవల యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ను ఒక ప్రత్యేకమైన సామాజిక అంశాన్ని కలిగి ఉన్న స్క్రిప్ట్ తో మురుగదాస్ సంప్రదించారు. 2021 లో కమల్ హాసన్ తన మొదటి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నందున ఈ ఏడాది చివరి నాటికి ఈ ప్రాజెక్టును ప్రారంభించి ఎన్నికలకు ముందే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇదే నిజమైతే విజయ్ తో సినిమాని మురుగదాస్ పక్కన పెట్టినట్టేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related Images: