డెవిల్ సెన్సార్.. డోస్ మామూలుగా లేదు

కళ్యాణ్ రామ్ హీరోగా అభిషేక్ నామా నిర్మాతగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం డెవిల్. ఈ సినిమా డిసెంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా లెవల్ లో ఐదు భాషలలో రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన ట్రైలర్ ఆకట్టుకుంది. బ్రిటిష్ ఇండియాలో పనిచేసే ఇండియన్ సీక్రెట్ ఏజెంట్ గా ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నాడు.

అతని కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో 1947 కంటే ముందు జరిగిన కథగా డెవిల్ సినిమాని చూపించబోతున్నారు. ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. మాళవిక నయ్యర్ కీలక పాత్రలో కనిపిస్తోంది. పవర్ యాక్షన్ సీక్వెన్స్ తో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో ట్రైలర్ ఆకట్టుకుంది. ట్రైలర్ తోనే సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశారు.

ఇదిలా ఉంటే తాజాగా మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ సెన్సార్ సభ్యులు ఇచ్చారు. దీనిని చిత్ర యూనిట్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. ప్రేక్షకులని థ్రిల్ చేసే పవర్ ఫుల్ యాక్షన్ మూవీ చూడటానికి ఎదురుచూడాలని పేర్కొన్నారు. ఇక ఈ సినిమాకు ట్రైలర్ తరువాత అంచనాలు మరింత పెరిగాయి. ఇక దిల్ రాజు కూడా సినిమా డిస్ట్రిబ్యూషన్ లో బాగమయ్యారు. ఇక హైప్ డోస్ ఎక్కువవుతోంది.

బింబిసారాతో కళ్యాణ్ రామ్ గత ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకున్నారు. తరువాత అమిగోస్ అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్ తో మూవీ చేశారు. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదు. కొంత గ్యాప్ తీసుకొని డెవిల్ మూవీతో ఇప్పుడు రాబోతున్నారు. ఈ సినిమాపై కళ్యాణ్ రామ్ చాలా హోప్స్ తో ఉన్నారు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ స్టోరీ కావడంతో కచ్చితంగా ప్రేక్షకులకి నచ్చుతుందని అంచనా వేస్తున్నారు.

ఈ ఏడాది విరూపాక్ష మూవీతో సంయుక్త మీనన్ హీరోయిన్ గా సక్సెస్ అందుకుంది. ఆ సినిమాలో రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న రోల్ లో మెప్పించింది. డెవిల్ మూవీలో మంచి పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలోనే ఆమె కనిపించబోతోందని తెలుస్తోంది. నిర్మాతగా సక్సెస్ అయిన అభిషేక్ నామా ఈ మూవీతో దర్శకుడిగా తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు.

Related Images:

కలవరమైన వేళ కరుణించే ఇలా.. డెవిల్ లవ్

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ మరికొద్ది రోజుల్లో డెవిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. పీరియాడిక్ యాక్షన్ అండ్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించబోతున్నారు. గతనెల 24వ తేదీనే ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల డిసెంబర్ 29వ తేదీకి రిలీజ్ వాయిదా వేయాల్సి వచ్చింది.

అయితే రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మేకర్స్ సినిమా ప్రమోషన్ల స్పీడ్ ను పెంచారు. ఇటీవలే ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ అందుకుంది. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచడంతోపాటు ఆడియెన్స్ లో కూడా సూపర్ బ్రజ్ క్రియేట్ చేసింది.

తాజాగా ఈ సినిమా నుంచి దూరమే తీరమై అంటూ సాగే మెలోడియస్ లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూర్చారు. సమీరా భరద్వాజ్ ఈ పాటను రాసి పాడటం విశేషం. ప్రస్తుతం ఈ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. కళ్యాణ్ రామ్, సంయుక్త కెమిస్ట్రీ బాగుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. పల్లెటూరి బ్యాక్ గ్రౌండ్ లో సాంగ్ అదిరిపోయిందని అంటున్నారు.

సలార్ విడుదలైన తర్వాత వారం రోజులకు రిలీజ్ అవ్వనున్న ఈ మూవీకి థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రలో రూ.8.5 కోట్ల బిజినెస్ జరిగినట్లు సమాచారం. సీడెడ్ హక్కులు రూ.3.25 కోట్లకు అమ్ముడైనట్లు సినీ వర్గాల్లో టాక్. ప్రపంచవ్యాప్తంగా రూ.21 కోట్లకుపైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం.

భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాలో హీరో కళ్యాణ్ రామ్ రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ఆయనకు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మించడంతోపాటు దర్శకత్వం వహించారు. శ్రీకాంత్ విస్సా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, త‌మిళ్‌, క‌న్న‌డ భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నారు. గ‌త ఏడాది తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచిన బింబిసారతో మెప్పించిన కళ్యాణ్ రామ్ ఈ ఏడాది డెవిల్ తో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. మరి నందమూరి హీరోకు సక్సెస్ దొరుకుతుందో లేదో చూడాలి.

Related Images:

డెవిల్ డ్రాప్ వెనుక మతలబేంటి

కళ్యాణ్ రామ్ డెవిల్ నవంబర్ 24 విడుదల నుంచి తప్పుకుంది. విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉండటం వల్లే వాయిదా వేస్తున్నామని యూనిట్ అధికారికంగా ప్రకటించింది. బ్రిటిష్ కాలంలో జరిగిన ఒక స్పై జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ పీరియాడిక్ థ్రిల్లర్ లో లక్కీ హీరోయిన్ సంయుక్త మీనన్ నందమూరి హీరోకి జోడిగా నటించింది. రిలీజ్ దగ్గరగా ఉన్నప్పటికీ ప్రమోషన్లు చేపట్టకపోవడం పట్ల గత కొద్దిరోజులుగా అభిమానుల్లో అనుమానాలు వ్యక్తమవుతూనే వచ్చాయి. ఇప్పుడవి నిజమై పోస్ట్ పోన్ కబురు వచ్చేసింది. కొత్త తేదీని ఇంకా ప్రకటించలేదు.

సరే అసలీ వాయిదా వెనుక మతలబేంటనే దాని మీద ఫిలిం నగర్ వర్గాల్లో రకరకాల వెర్షన్లు వినిపిస్తున్నాయి. డెవిల్ మొదలుపెట్టినప్పుడు దానికి దర్శకుడు నవీన్ మేడారం. రచనతో సహా పూర్తి బాధ్యతను తీసుకున్నాడు. కానీ తెరవెనుక ఏం జరిగిందో కానీ కొన్ని నెలల క్రితం నిర్మాత అభిషేక్ నామానే డైరెక్టర్ గా తన పేరు వేసుకుని ప్రమోషన్లు షురూ చేశారు. నవీన్ ఎందుకు తప్పుకున్నాడనే దాని గురించి ఈ రోజుకీ క్లారిటీ లేదు. మరోవైపు కళ్యాణ్ రామ్ ఈ వ్యవహారాల పట్ల సైలెంట్ గా ఉన్నాడు. ఏదైనా పాట ప్రమోషన్ ఉంటే దాన్ని ట్వీట్ చేయడం తప్ప ఇంకెలాంటి యాక్టివిటీ లేదు.

ప్రొడ్యూసర్ గా అభిషేక్ నామాకు ఎంత అనుభవమున్నా దర్శకుడిగా గ్రిప్ లేదు. పోస్ట్ ప్రొడక్షన్ అందులోనూ గ్రాఫిక్స్ కి సంబందించిన వ్యవహారం కాబట్టి పనులు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయట. ఫైనల్ కాపీ దగ్గరలో సిద్ధమయ్యే సూచనలు లేకపోవడంతో వాయిదా తప్ప వేరే మార్గం లేకపోయిందని వినికిడి. ఇది పక్కాగా తెలుసుకున్నాకే ఆదికేశవ, కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ లు నవంబర్ 24ని తీసేసుకున్నాయి. అసలే డిసెంబర్, జనవరిలో ఏ ఒక్క వారం ఖాళీగా లేదు. మొత్తం భారీ చిత్రాలతో నిండిపోయాయి. మరి డెవిల్ ఫిబ్రవరి లేదా ఆపై నెలల్లో తప్ప ముందుగా వచ్చే ఛాన్స్ దాదాపుగా లేనట్టుగానే కనిపిస్తోంది.

Related Images:

సావిత్రి దర్శకుడితో కళ్యాణ్ రామ్ కన్ఫర్మ్

‘ప్రేమ ఇష్క్ కాదల్’.. ‘సావిత్రి’ సినిమాలతో దర్శకుడిగా ప్రేక్షకులమ ముందుకు వచ్చిన పవన్ సాదినేని గత నాలుగు సంవత్సరాలుగా మూడవ సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడు. పలువురు హీరోలు కథలు విన్నా కూడా ఏవో కొన్ని కారణాల వల్ల ఆలస్యం చేస్తూ వస్తున్నారు. కళ్యాణ్ రామ్ తో పవన్ సాదినేని మూవీ గురించి ఏడాది కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇద్దరి మద్య అనేక దఫాలుగా చర్చలు జరిగాయి. అయినా ఇప్పటి వరకు సినిమాను అధికారికంగా కన్ఫర్మ్ చేయలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎట్టకేలకు పవన్ సాదినేకి వచ్చే ఏడాది ఆరంభంలో డేట్లు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడట.

హీరోగా నటించడంతో పాటు నిర్మాతగా కూడా తానే వ్యవహరించేందుకు కళ్యాణ్ రామ్ సిద్దం అయ్యాడని తెలుస్తోంది. ఈ ఏడాది చివరి వరకు ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. విభిన్నమైన కాన్సెప్ట్ లతో సినిమాలు తీసే పవన్ సాదినేని ఈసారి కూడా కళ్యాణ్ రామ్ ను కొత్తగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నాడట. కథ విషయంలో పూర్తి క్లారిటీగా ఉండటంతో పవన్ సాదినేనికి కళ్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటున్నారు.

మరో వైపు కళ్యాణ్ రామ్ తన తమ్ముడు ఎన్టీఆర్ చేయబోతున్న తదుపరి సినిమాను రాధాకృష్ణ తో కలిసి త్రివిక్రమ్ దర్శకత్వంలో నిర్మించబోతున్న విషయం తెల్సిందే. ఈ ఏడాది ఆరంభంలో ఎంత మంచివాడవురా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్ తన తదుపరి సినిమాను వచ్చే ఏడాది చివరి వరకు విడుదల చేయాలని భావిస్తున్నాడట.

Related Images: