హిందీలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ అదితి రావు హైదరీ ఈమద్య కాలంలో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. 2018 ఏడాది సమ్మోహనం సినిమాలో సుధీర్ బాబు సినిమాలో నటించిన ఈ అమ్మడు ఆ తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ తో అంతరిక్షం సినిమాలో నటించింది. అందంతో పాటు నటనలో కూడా మంచి ప్రతిభ కనబర్చే ఈ అమ్మడు తాజాగా ‘వి’ సినిమాలో నానికి జోడీ నటించింది. సినిమాలో ఆమె కనిపించింది కొద్ది సమయం అయినా కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఈమద్య కాలంలో చిన్న హీరోయిన్స్ కూడా లక్షల రూపాయల పారితోషికాల కోసం యాడ్స్ లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కాని ఈమె మాత్రం యాడ్స్ లో నటించే విషయమై చాలా క్లారిటీగా ఉంది.
ఈమెకు ముఖ్యంగా బ్యూటీ ప్రోడక్స్ కు సంబంధించిన చాలా కంపెనీల నుండి బ్రాండ్ అంబాసిడర్ గా ఆఫర్ వచ్చిందట. కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తో పలు కంపెనీలు ఈమెను అప్రోచ్ అయ్యాయట. కాని బ్యూటీ ప్రాడక్ట్స్ కు అంబాసిడర్ గా చేయడం అంటే అబద్దాలు చెప్పడమే అంటూ ఈమె అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. అందం అనేది కేవలం జీన్స్ వల్ల వస్తుంది. ఇతర ప్రాడెక్ట్స్ పెడితే వచ్చేది అందం కాదు. జీవితానికి అందమే ప్రధానం అని చెప్పడాన్ని నేను అస్సలు ఒప్పుకోను. అందుకే బ్యూటీ ప్రాడక్ట్స్ ను ప్రమోట్ చేయను అంటూ తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఈమె రెండు తమిళ మరియు రెండు హిందీ సినిమాల్లో నటిస్తుంది. తెలుగు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం అవుతున్నట్లే భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఈ కేసు విచారణలో ఉండగా నిజానిజాలు బయటపడకుండానే రియా ను మీడియా ఇబ్బందులకు గురి చేయడం బాగాలేదంటూ ఓ వర్గం సెలెబ్రిటీలు ఆరోపిస్తూ వచ్చారు. మంచు లక్ష్మి సైతం రియాకు మద్ధతు తెలుపుతూ ‘నిజాలు తెలుసుకోకుండా ఒకరిని కించపరచడం సమంజసం కాదని.. వారి కుటుంబ సభ్యుల గురించి కూడా నిజాలు తెలుసుకోకుండా నిందలు వేయడం భావ్యం కాదని’ మంచు లక్ష్మీ సుధీర్ఘమైన పోస్ట్ పెట్టింది. దీనికి తాప్సీ – విద్యా బాలన్ – స్వర భాస్కర్ వంటి హీరోయిన్స్ సపోర్ట్ చేశారు. అంతేకాకుండా ఈ మధ్య ఎన్సీబీ విచారణకు హాజరైన రియా పట్ల మీడియా ప్రవర్తించిన తీరుపై.. మైకులతో ఆమె మీద పడిపోవడం వంటి దృశ్యాలపైనా స్పందించింది. ఈ క్రమంలో మరోసారి మంచు లక్ష్మి ఈ కేసులో మీడియా పాత్రపై స్పందించింది.
మంచు లక్ష్మి ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ పెడుతూ.. ”సుశాంత్ మరణం నుంచి ఎక్కువ డబ్బు సంపాదించినందుకు.. మన దేశానికి సేవ చేసిన కుటుంబాన్ని నాశనం చేసినందుకు ఇండియన్ మీడియా ఛానెళ్లకు అభినందనలు. ఈ రోజుల్లో మనస్సాక్షి అంటే ఓ లగ్జరీ అని గెస్ చేస్తున్నాను. మీరు నిజంగా సుశాంత్ సింగ్ గురించి పట్టించుకున్నారా లేదా అతని ఫేమ్ ను వాడుకుని డబ్బు మాత్రమే సంపాదించుకోవాలని అనుకున్నారా అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ దేశానికి ఎన్నో యేళ్లుగా ఎంతో మంది మహిళలు సేవలు చేస్తూ ఈ దేశ పునాదులు నిర్మించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇది మళ్లీ గుర్తు చేయడం.. దానిని చెప్పడం ఎంతో అవసరం. మనమందరం ఒక్కటే అని గ్రహించాలి.. లింగ వివక్ష చూపి రెండు వేర్వేరుగా చూడకూడదు. జస్టిస్ ఫర్ రియా” అని పేర్కొంది. అంతేకాకుండా ట్విట్టర్ లో వాస్తవాల ఆధారంగా ఇది నిజం అంటూ ఓ ఫైచార్ట్ పోస్ట్ చేసి ‘భారతీయులు దేని గురించి ఆందోళన చెందుతున్నారు’ అనే విషయంపై ట్వీట్ చేసింది. దీంట్లో ఎక్కువ శాతం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గురించి ఆందోళన చెందుతున్నట్లు చూపిస్తుండగా కేవలం కొద్ది శాతం మాత్రమే కరోనా గురించి ఆందోళన చెందుతున్నట్లు చూపిస్తోంది. మంచు లక్ష్మీ చేసిన ఈ రెండు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.