మెగా ఇంటి కోడలు ఉపాసన మల్టీ ట్యాలెంటెడ్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె ఎన్నో వ్యాపారాలు చేస్తూనే ఫిట్ నెస్ పై అత్యధిక దృష్టి పెడుతుంది. ఆమె యువర్ లైఫ్ అనే వెబ్ పోర్టల్ కు గెస్ట్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. యువర్ లైఫ్ కోసం ప్రతి వారం ఒక సెలబ్రెటీని తీసుకు వచ్చి ఆరోగ్యపరమైన అప్ డేట్ ను ఇస్తూ ఉంటుంది. హెల్త్ టిప్స్ ను ఇవ్వడంతో పాటు వారికి సంబంధించిన ఆహారపు అలవాటర్లను తెలుసుకుంటుంది. ఇక ఈవారం నవదీప్ ను ఉపాసన తీసుకు వచ్చారు. నవదీప్ అనగానే ఎక్కువ మంది పార్టీలు పబ్ లు డ్రగ్స్ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఉపాసన కూడా తన షో లో నవదీప్ తో డ్రగ్స్ గురించి చర్చించినట్లుగా తెలుస్తోంది.
ప్రతి ఒక్కరి జీవితంలో డ్రగ్స్ ను ఏదో ఒక విధంగా తీసుకుంటున్నారు. మెడిసిన్స్ రూపంలో తీసుకునే డ్రగ్స్ ను కంట్రోల్ చేయడం ఎలా.. ఒక్కసారి అలవాటు పడ్డ డ్రగ్స్ కు దూరం అవ్వడం ఎలా అనే విషయాలను ఉపాసన ఈ వారం తన షోలో చూపించబోతున్నారు. హై ఆన్ లైఫ్ పేరుతో సాగబోతున్న ఈ చర్చ కార్యక్రమంలో న్యూరాలజీ డాక్టర్ సి రాజేష్ తో కలిసి నవదీప్ డ్రగ్స్ విషయమై మాట్లాడబోతున్నారు. డ్రగ్స్ వ్యసనంగా మారిన సమయంలో దాన్ని ఎలా అధిగమించాలనేది డాక్టర్ తన సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు నవదీప్ తన అనుభవాలను వివరించబోతున్నాడు.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత బాలీవుడ్ లోని డ్రగ్స్ దందా మొత్తం వెలుగుచూసింది. బాలీవుడ్ ప్రముఖులు ఈ డ్రగ్స్ వాడుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే పలువురిని పోలీసులు విచారించారు.
తాజాగా బాలీవుడ్ కామెడీ క్వీన్ నటి భారతీ సింగ్ కు షాక్ తగిలింది. తాజాగా ముంబైలో ఉన్న ఆమె నివాసంపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) దాడి చేసింది. భారతి సింగ్ తోపాటు ఆమె భర్తపైనా నిషేధిత పదార్థాలు తీసుకున్న ఆరోపణలు వచ్చాయని ఏజెన్సీ వర్గాలు తెలిపాయి. ఆమె ఇంట్లో కొద్దిమొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సీనియర్ అధికారి తెలిపారు. భారతి ఆమె హర్ష్ కు ఎన్సీబీ పోలీసులు సమన్లు జారీ చేశారు.
ఇప్పటికే బాలీవుడ్ ప్రముఖ నటుడు అర్జున్ రాంపాల్ ఇంటిపై కూడా ఎన్సీబీ దాడులు చేసింది. రాంపాల్ అతడి స్నేహితురాలు గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్ ఇద్దరినీ ప్రశ్నించారు. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఆ మందులు వాడుతున్నామని.. డ్రగ్స్ తో సంబంధం లేదని అర్జున్ పేర్కొన్నాడు. తాజాగా మరో ప్రముఖ నటి పట్టుబడడం కలకలం రేపింది.
హైదరాబాద్ లో డ్రగ్స్ దందా ఎప్పటి నుంచో జరుగుతుందనే విషయం అందరికీ తెలిసిందే.టాలీవుడ్ లోనూ డ్రగ్స్ మూలాలు బయటపడి పలువురు సినీ ప్రముఖులు సైతం విచారణ ఎదుర్కొన్నారు. గోవా సహా కొన్ని నగరాల నుంచి ఇప్పటికీ డ్రగ్స్ హైదరాబాద్ చేరుతోందని పోలీసుల విచారణల్లో వెల్లడైంది.
ఇప్పుడు హైదరాబాద్ లో డ్రగ్స్ పట్టుబడడం మామూలైపోయింది. అయితే ఈసారి కొత్త తరహా డ్రగ్స్ పట్టుబడడం విశేషంగా మారింది. ఈ డ్రగ్స్ వాడితే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందంటూ నగరంలో జోరుగా విక్రయాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పబ్ లకు వచ్చే వాళ్లను టార్గెట్ చేసి ఈ అమ్మకాలు సాగిస్తున్నారట.. పెద్ద ఎత్తున డ్రగ్స్ అమ్మకాలు సాగిస్తున్నట్టు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కనిపెట్టారు.
తాజాగా టాస్క్ ఫోర్స్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరి దగ్గర 200 గ్రాముల మత్తు మందు మెఫిడ్రిన్ స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి తీసుకొని వీరు హైదరాబాద్ లో అమ్ముతున్నట్టు గుర్తించారు.
హైదరాబాద్ లోని ప్రముఖ హోటల్ లో పనిచేసిన చెఫ్ సలీమ్ ఇందులో సూత్రదారిగా గుర్తించారు. ఇక టెలి మార్కెటింగ్ చేస్తున్న ముగ్గురిని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.
బాలీవుడ్ లో అనూహ్యంగా వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారం సినీ ఇండస్ట్రీలో తీవ్ర ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసుని విచారిస్తున్న క్రమంలో డ్రగ్స్ కోణం బయటకు వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో.. డ్రగ్స్ కేసులో హీరోయిన్ రియా చక్రవర్తితో పాటు పలువురిని అరెస్ట్ చేసి విచారించారు. దాదాపు నెల రోజుల పాటు జైలులో ఉన్న రియా బెయిల్ పై విడుదలైంది. ఇదే కేసులో ఎన్సీబీ స్టార్ హీరోయిన్లు దీపిక పదుకొనే – సారా అలీఖాన్ – రకుల్ ప్రీత్ సింగ్ – శ్రద్ధా కపూర్ లను కూడా విచారించారు. అలానే టాలెంట్ మేనేజర్ జయ సాహా మరియు దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాష్ లను కూడా ప్రశ్నించారు. కరణ్ జోహార్ కు చెందిన ధర్మ ప్రొడక్షన్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్ రవి ప్రసాద్ ను అరెస్ట్ చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మరోసారి బాలీవుడ్ డ్రగ్ రాకెట్ పై పంజా విసిరారని తెలుస్తోంది.
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ముందస్తు సమాచారం మేరకు దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాష్ నివాసంలో మెరుపు దాడులు చేసారు. ముంబైలోని కరిష్మా ఇంట్లో నిర్వహించిన దాడులలో 1.8 గ్రాముల నిషేధిత మాదక ద్రవ్యాలు లభించినట్లు ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖేడే వెల్లడించారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసులో మరోసారి దీపికా మేనేజర్ కరిష్మా ప్రకాష్ కు ఎన్సీబీ సమన్లు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే దాడుల తర్వాత ఆమె జాడ కనబడకపోవడంతో.. కరిష్మా ఇంటి తలుపులకు అధికారులు నోటీసు అంటించారు. కాగా పెను సంచలనంగా మారిన బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ‘ఊపిరి’ ఫేమ్ గాబ్రియెల్లా డెమెట్రియేడ్ సోదరుడుని అరెస్ట్ చేసారు. అలానే నటి సప్నా పబ్బాకు ఎన్సీబీ సమన్లు జారీ చేసింది. ఇప్పుడు కరిష్మా ప్రకాష్ కు మరోసారి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు నోటీసులు ఇవ్వడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
ముంబై డ్రగ్స్ కు అడ్డా అని మరోసారి రుజువైంది. ఇప్పటికే సుశాంత్ సింగ్ కేసులో తీవ్రంగా విమర్శలపాలైన బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి మరో షాక్ తగిలింది. ఈసారి తాజాగా ప్రముఖ టీవీ నటి ప్రీతికా చౌహాన్ డ్రగ్స్ కొనుగోలు చేస్తూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం కలకలం రేపింది.
పోలీసులకు అందిన సమాచారం ప్రకారం ముంబైలోని వెర్సోవా ప్రాంతానికి సాధారణ దుస్తుల్లో వెళ్లిన అధికారులు.. అక్కడ ఓ వ్యక్తి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న ప్రీతికా అనే టీవీ నటిని రెడ్ హ్యాండెడె గా పట్టుకొని అరెస్ట్ చేశారు.
వెర్సోవాలోని మచ్చిమార్ ప్రాంతంలో శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో ‘ఫైజల్’ అనే 20 ఏళ్ల యువకుడి నుంచి ప్రీతికా డ్రగ్స్ కొనుగోలు చేస్తుండగా ప్రీతికాను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 99 గ్రాముల గంజాయితోపాటు మారిజునా మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ డ్రగ్స్ కొనుగోలు అమ్మకంలో మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు ముంబై అధికారులు. దీపక్ రాథౌర్ అనే వ్యక్తిని కూడా పోలీసులు తర్వాత అరెస్ట్ చేశారు. రాథౌర్ రౌడీషీటర్ అని తెలిసింది. రాథౌర్ వెర్సోవా ప్రాంతంలో చాలా మంది హైప్రొఫైల్ వ్యక్తులకు చాలాకాలంగా రాథౌర్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ముంబైలోని కిల్లా కోర్టులో వీరిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ప్రీతికా ప్రస్తుతం హిందీలోని ప్రముఖ సీరియళ్లు అయిన సావధాన్ దేవోకే దేవ్ మహారాజ్ లలో నటిస్తోంది. ఆమె డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో ముంబై మరోసారి ఉలిక్కిపడింది. సుశాంత్ కేసులో జరిగిన రచ్చ నేపథ్యంలో మరోసారి ప్రీతికా అరెస్ట్ తో బాలీవుడ్ ఉలిక్కిపడింది.
తెలంగాణ మహిళా కమిషన్ ఆవశ్యకత-ఏర్పాటుపై సోమవారం తెలంగాణ టీడీపీ తెలుగు మహిళ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన టీడీపీ మహిళా నేత దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఎంతవరకు వచ్చిందో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
వివిధ రంగాల్లో ఉన్నట్లే సినీ రంగంలో కూడా డబ్బు ఉన్నవాళ్లదే రాజ్యమని..రకుల్ ప్రీత్ సింగ్ కు ఉన్నదేంటి? ప్రణీతకు లేనిదేంటి? అని దివ్యవాణి ప్రశ్నించారు. పెద్ద హీరోలతో నటించకపోవడానికి ఎక్కువ సినిమాలు చేయకపోవడానికి వివిధ కారణాలున్నాయని ఆమె ఆరోపించారు. ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ల పిల్లలు సైతం డ్రగ్స్ కు అలవాటు పడ్డారని వివరించారు.
నా కూతురు చదువుతున్న హైదరాబాద్ లోని కాలేజీలో కూడా డ్రగ్స్ కు అలవాటు పడిన విద్యార్థులు ఉన్నారని దివ్యవాణి ఆరోపించారు.
డ్రగ్స్ వ్యవహారం సినీ ఇండస్ట్రీని కుదిపేస్తున్న సమయంలో దివ్యవాణి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
బాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారంలో గత రెండు రోజులుగా స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే పేరు కూడా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ పెడ్లర్స్ తో దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాశ్ సంబంధాలు బయటకు రావడంతో డ్రగ్ వ్యవహారంలో దీపికా పేరు వెల్లడైంది. బాలీవుడ్ డ్రగ్స్ మాఫియాపై ఫోకస్ పెట్టిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు హీరోయిన్ రియా చక్రవర్తిని అరెస్ట్ చేయడంతో పాటు పలువురు సెలబ్రిటీలను విచారించారు. ఈ క్రమంలో ఇప్పటివరకు దీపికా పదుకొనె – సారా అలీఖాన్ – శ్రద్ధా కపూర్ వంటి స్టార్ హీరోయిన్ల పేర్లతో పాటు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా వినిపించింది. ఈ వార్తలను నిజం చేస్తూ తాజాగా దీపికా పదుకునే – శ్రద్ధా కపూర్ – సారా అలీ ఖాన్ – రకుల్ ప్రీత్ సింగ్ లకు ఎన్సీబీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వీరిని మూడు రోజుల్లోగా తమ ముందు విచారణకు హాజరు కావాలని ఎన్సీబీ ఆదేశాలు జారీ చేసిందని తెలుస్తోంది.
కాగా దీపికా పదుకునే ప్రస్తుతం షూటింగ్ నిమిత్తం గోవాలో ఉన్నారని తెలుస్తోంది. డ్రగ్స్ విచారణ నేపథ్యంలో ఏ క్షణంలోనైనా ఆమెకు సమన్లు జారీ చేయొచ్చనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నమే షూటింగ్ కి ప్యాకప్ చెప్పి ముంబైకి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకున్నారనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో అనుకున్నట్లే తాజాగా దీపికాకు ఎన్సీబీ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సమన్లపై ఎలా స్పందించాలనే విషయాన్ని దీపికా తన టీమ్ తో చర్చిండమే కాకుండా లీగల్ టీమ్ ని న్యాయపరమైన సలహాలను కోరుతోందట. ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయ నిపుణులతో దీపిక మరియు ఆమె భర్త రణ్ వీర్ సింగ్ మాట్లాడారట. దీనిలో భాగంగా ఈ రోజు సాయంత్రం గోవా నుంచి బయలుదేరి ముంబైకి చేరుకొనే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు డ్రగ్స్ దర్యాప్తులో ఎన్సీబీకి వివరాలను వెల్లడించవద్దని మేనేజర్ కరిష్మా ప్రకాష్ పై దీపికా పదుకొనే ఒత్తిడి తెస్తున్నట్లు జాతీయ మీడియా ఛానల్ రిపబ్లిక్ టీవీ వెల్లడించింది.
సుశాంత్ మృతి కేసు విచారణలో సీబీఐ కి డ్రగ్స్ కు సంబంధించిన వివరాలు లభించడంతో రంగంలోకి ఎన్ సీ బీ దిగింది. ఇప్పటికే డ్రగ్స్ డీలర్లతో పాటు డ్రగ్స్ కొనుగోలు చేసిన అనుమానంతో రియా చక్రవర్తి మరియు ఆమె సోదరుడు శోవిక్ చక్రవర్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ అయిన వారు చెప్పిన వివరాల ప్రకారం బాలీవుడ్ లో పలువురు ప్రముఖులు డ్రగ్స్ కేసులో నింధితులుగా ఉన్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పలువురు బాలీవుడ్ స్టార్స్ కు ఎన్ సీ బీ నుండి నోటీసులు వెళ్లబోతున్నట్లుగా ఇటీవలే వార్తలు వచ్చాయి. అందులో భాగంగా మొదటగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకునే కు ఎన్ సీ బీ విచారణకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేయబోతున్నట్లుగా జాతీయ మీడియా కథనాలు వస్తున్నాయి.
జాతీయ మీడియా కథనాల ప్రకారం డ్రగ్స్ రాకెట్ లో ఉన్న వ్యక్తులతో దీపిక కు సంబంధాలు ఉన్నాయని ఎన్ సీ బీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. ఇంకా పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ఈ కేసులో ఉన్నట్లుగా కూడా జాతీయ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. ఎన్ సీ బీ నుండి మీడియా వర్గాలకు అందుతున్న లీక్స్ ప్రకారం ఇప్పుడు దీపిక పదుకునేకు సమన్లు పంపనున్నారట. ఈ కేసు విచారణ సమయంలో ఎవరిపై అయినా అనుమానం కలిగితే వెంటనే వారిని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటూ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
పెళ్లి అయిన తర్వాత కూడా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతున్న దీపిక పదుకునే ఇటీవలే ప్రభాస్ కు జోడీగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చ ఏడాది సమ్మర్ నుండి షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఇలాంటి సమయంలో ఎన్ సీ బీ అధికారులు ఆమెకు సమన్లు పంపబోతున్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో సౌత్ లో కూడా ఈ విషయం చర్చనీయాంశం అయ్యింది.
కన్నడ హీరోయిన్స్ రాగిణి ద్వివేది మరియు సంజనలు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెల్సిందే. వారిని అరెస్ట్ చేసిన వీడియోలు మరియు విచారిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని లేడీ కానిస్టేబుల్స్ షూట్ చేసినట్లుగా క్లీయర్ గా తెలుస్తుంది అంటూ హీరోయిన్ పరూల్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో ఒక వైపు లక్షల్లో పెరుగుతున్న కరోనా కేసులు.. మరో వైపు చైనా ఆగడాలు.. ఆర్థిక వ్యవస్థ అస్థవ్యస్థం అవ్వడం వంటి అతి పెద్ద సమస్యలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో డ్రగ్స్ కేసును దేశ విపత్తు అన్నట్లుగా మీడియా మరియు కొందరు ఫోకస్ చేస్తున్నారు అంటూ పరూల్ యాదవ్ అసహనం వ్యక్తం చేసింది. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి ఇంకా వారి కేసు నిర్థారణ కాకుండానే వారి వీడియోలను లీక్ చేయడం ద్వారా వారి జీవితాలను నాశనం చేసినట్లే అంటూ ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది.
దేశంలో ఉన్న సమస్యల గురించి ప్రస్తుతం ఎక్కడ చర్చ జరుగుతున్నట్లుగా అనిపించడం లేదు. ప్రజలకు ఉన్న కష్టాల గురించి రాజకీయ నాయకులు మరియు మేధావులు పట్టించుకోవడం లేదు. కాని ఎక్కడ చూసినా కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ముగ్గురు హీరోయిన్స్ గురించి మాత్రమే చర్చ జరుగుతోంది. పోలీసు డిపార్ట్ మెంట్ మొత్తం కూడా ఇతర చోట్ల ఎక్కడ కేసులు లేవు అన్నట్లుగా మొత్తం దృష్టి ఈ కేసుపైనే పెట్టడం విడ్డూరంగా ఉంది. దేశంలో రాజకీయ నాయకులు మరియు వ్యాపారస్తులు ఎంతో మంది తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. అయినా వారిని పట్టించుకునేందుకు జనాలకు సమయం లేదు. కాని డ్రగ్స్ విషయంలో మాత్రం చర్చించుకునేందుకు వారి వద్ద కావాల్సినంత సమయం ఉంది. పోలీసులు ప్రజల కోసం పని చేయాలి. కాని వారు చేస్తున్న పని ఒక్కొసారి చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కావాలని ప్రజల ఆలోచన తప్పుదారి పట్టించి అసలు సమస్యలు వారికి కనిపించకుండా కొందరు చేస్తున్నారేమో అనిపిస్తుంది. దేశంలో ఉన్న సమస్యలు మరియు వాటికి సంబంధించిన పరిష్కారాల గురించి ఆలోచించే వారే నిజమైన దేశ భక్తులు. ఇప్పుడు దేశంలో దేశభక్తులు ఎక్కడ కనిపించడం లేదంటూ పరూల్ ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో డ్రగ్స్ మూలాలు బయటపడడంతో ఆ దిశగా ఎన్.సీ.బీ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే సుశాంత్ ప్రియురాలు నటి రియా చక్రవర్తితోపాటు ఆమె సోదరుడు సుశాంత్ మేనేజర్ ఇద్దరు డ్రగ్ డీలర్లను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే..
తాజాగా సుశాంత్ మేనేజర్ జయ సాహా సోమవారం ఎన్.సీబీ ఎదుట హాజరైనట్లు సమాచారం. ఆమె ఫోన్ నుంచి సేకరించిన డేటా ఆధారంగా పలువురు బాలీవుడ్ సెలెబ్రెటీలు సీబీడీ ఆయిల్ (గంజాయి ఆకుల నుంచి తీసిన ద్రవం) డ్రగ్స్ ను సరఫరా చేయాల్సిందిగా తనను కోరినట్లు వెల్లడించినట్టు సమాచారం.
ఈ క్రమంలోనే పలువురు బాలీవుడ్ సెలెబ్రెటీల కోసం జయసాహా ప్రత్యేకంగా ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినట్లు సమాచారం. దీంతో జయకు సీబీడీ ఆయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై పోలీసులు ఆరాతీస్తున్నట్టు తెలిసింది.
మీటూ ఉద్యమం తర్వాత కథానాయికల మధ్య స్నేహ సంబంధాలు బలపడ్డాయనడానికి అలాగే మహిళా యునైటీ కూడా బలపడిందనడానికి ఇటీవల డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి దర్యాప్తులో ఎదురైన సంఘటనలే ఎగ్జాంపుల్. రియా చక్రవర్తి మాదక ద్రవ్యాలను సేవించడం.. సరఫరా చేయడం వగైరా కేసుల్లో ఇరుక్కున్నా బాలీవుడ్ లో తన సన్నిహితులు సహా పలువురు నాయికలు బహిరంగ మద్థతును పొందగలిగింది. ఈ కేసులో తనని బలిపశువును చేస్తున్నారన్న వాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారన్న వాదన వినిపించారు. కరీనా.. లక్ష్మీ మంచు.. తాప్సీ పన్ను వీళ్లంతా తనని బలిపశువును చేస్తున్నారనే కోణంలో మీడియా వైఖరిని ఖండించే ప్రయత్నమే చేశారు. ఇంకా ఎవరు దోషి ఎవరు నిర్ధోషి అన్నది తేలక ముందే రియాను దోషిగా డిక్లేర్ చేసేస్తారా? అన్న ఆవేదనను వ్యక్తం చేశారు.
తాజాగా తాప్సీ పన్ను మీడియాపై గరంగరంగా స్పందించింది. సహనాన్ని కోల్పోయిన తాప్సీ మీడియా ఇలా అండర్ ట్రయల్ చేయడం ఏం బాలేదని సీరియస్ అయ్యింది. అసలింతకీ మీడియా నిజంగా ఏం కోరుకుంటోంది? అసలు అపరాధికి శిక్ష పడాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. ఇలాంటి సందర్భంలో నేను ఎప్పుడూ చెప్పినట్లుగానే ఆమె(రియా) ఎవరో నాకు తెలియకపోయినా.. పరస్పరం కలవకపోయినా తనకు మద్ధతుగానే నిలుస్తాను అని ధైర్యంగా ముందుకొచ్చింది తాప్సీ. సున్నితమైన విచారణలో ఇప్పటికే రియాపై తీర్పు ఇచ్చేస్తున్నారు అందరూ.
ఏదైనా తప్పు చేస్తే నిందించేందుకు చాలా ముందుంటారు. అన్నిచోట్లా జరుగుతున్నవే ఇవి అయినా.. కానీ రియాపై మీడియా ట్రయల్ .. కొన్ని చోట్ల శారీరక వేధింపుల విధానం చాలా షాక్ ని ఇచ్చింది. అందుకే తన గురించి మాట్లాడాల్సి వచ్చిందని తాప్సీ తెలిపింది.
బాలీవుడ్ లో డ్రగ్స్ కల్చర్ ఉందని సుశాంత్ సింగ్ రాజ్పుత్ స్నేహితుడు యువరాజ్ ఎస్ సింగ్ పేర్కొన్నారు. సినీ పరిశ్రమలో ఎ లిస్ట్ నటులు చాలా మంది కొకైన్ కు బానిసలని నటుడు కమ్ నిర్మాత అన్నారు. యువరాజ్ ఎస్. సింగ్ బాలీవుడ్ పరిశ్రమలో మాదకద్రవ్యాల వాడకం గురించి కొన్ని షాకింగ్ విషయాల్ని వెల్లడించారు. బాలీవుడ్ లో విలాసాలకు డ్రగ్స్ ఒక మార్గం అని సుశాంత్ సింగ్ రాజ్పుత్ స్నేహితుడు యువరాజ్ అన్నారు. 1970 ల నుండి డ్రగ్స్ వాడుతున్నారని కానీ అప్పటికి సోషల్ మీడియా లేదని కానీ ఇటీవల డిజిటల్ మీడియా చాలా భారీగా రూపాంతరం చెందినందున బాలీవుడ్ పరిశ్రమలో మాదకద్రవ్యాల వాడకం ఇప్పుడు వెలుగులోకి వస్తోంది అని అన్నారు.
చాలా మంది నటులు.. దర్శకులు డ్రగ్స్ వాడుతున్నారని చుట్టూ చాలా గందరగోళం నెలకొనడానికి కారణం ఇదేనని యువరాజ్ ఎస్ సింగ్ చెప్పారు. ఇతరులలో చాలా మంది సిబ్బంది.. సాంకేతిక నిపుణులు .. కెమెరా డిపార్ట్ మెంట్ వ్యక్తులు `కలుపు` (ఔషధాలు) తెస్తారని ఆయన అన్నారు. కలుపు సిగరెట్ల మాదిరిగానే ఉంటుందని యువరాజ్ చెప్పారు.
తాజా నివేదిక ప్రకారం కొకైన్ బాలీవుడ్లో ఉపయోగించబడుతున్న కీలకమైన మాదకద్రవ్యం అని సుశాంత్ సింగ్ రాజ్పుత్ స్నేహితుడు యువరాజ్ పేర్కొన్నాడు. నటుడు కమ్ నిర్మాత MDMA వంటి కొన్ని డ్రగ్స్ ని ఔధాలను వెరైటీ మారు పేర్లతో పిలుస్తారని అన్నారు. ఎక్స్టసీ కో పేరు ఉంది.. LSD ని యాసిడ్ అని పిలుస్తారు. కెటామైన్ను గుర్రపు ప్రశాంతత అని కూడా పిలుస్తారు. ప్రజలు ఈ ఔషధాలను ఉపయోగిస్తున్నారని … దాదాపు 15-20 గంటలు దాని ప్రభావంలో ఉన్నారని సుశాంత్ సింగ్ రాజ్ పుత్ స్నేహితుడు తెలిపారు. బాలీవుడ్ లో సుమారు 5 నుండి 8 మంది నటులు తమ మాదకద్రవ్యాల అలవాటును విడిచిపెట్టాల్సిన అవసరం ఉందని లేదా వారు చనిపోవచ్చని యువరాజ్ ఎస్ సింగ్ పేర్కొన్నారు. యువరాజ్ ఎస్. సింగ్ తనకు కూడా డ్రగ్స్ ఇచ్చేవారని పరిశ్రమ ఎలా పనిచేస్తుందో కూడా వెల్లడించారు.
అతను ఇంకా చాలా గుట్టు మట్లు లీక్ చేశారు. డ్రగ్స్ కారణంగా చాలా మందికి పరిశ్రమలో పని లభిస్తుంది. మీరు సరైన దర్శక నటుడు అయితే నటితో ఈ అలవాటులోకి వస్తే వారు డ్రగ్ కనెక్షన్ ఏర్పరుస్తారు. అలాంటి వారు ఈ సర్కిల్ లో పనిచేయడానికి ఇష్టపడతారు. బాలీవుడ్ లో ఎక్కువ మంది డ్రగ్స్ తయారు చేసేవారని ఆయన అన్నారు. అక్షయ్ కుమార్ మినహా పరిశ్రమలోని టాప్ 10-15 నటీనటులు మాదకద్రవ్యాల అలవాటులో ఉన్నారని యువరాజ్ ఎస్ సింగ్ పేర్కొన్నారు. పరిశ్రమ అంతా కొందరి నాటకాల పైనే నడపబడుతున్నందున తనకు రక్షణ అవసరమని అతను చెప్పాడు. అందువల్ల అతను పేర్లు చెప్పేందుకు సిద్ధంగా లేనని అన్నారు.
మాదకద్రవ్యాల వాడకం పరిశ్రమలో ఒక సాధారణ విషయంగా మారిందని కూడా యువరాజ్ చెప్పారు. ఒక సమూహం ఒక విధంగా డ్రగ్స్ పార్టీలతో లాబీని ఏర్పాటు చేసింది. అక్కడికి వచ్చేవాళ్లు ఆ సరిహద్దుల్లో పనిచేయాలి. కొందరు కీలక వ్యక్తుల పేర్లను వెల్లడిస్తే.. ఈ వ్యక్తులు తన సినిమాలకు బ్యాక్ అవుట్ చేయమని పంపిణీదారులకు చెబుతారని ఆయన చెప్పారు. షకున్ బాత్రా తనకు స్నేహితుడని ప్రస్తుతం తన తదుపరి చిత్రం కోసం దీపికా పదుకొనేతో షూటింగ్ చేస్తున్నానని తెలిపారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ స్నేహితుడైన బాత్రా పరిశ్రమ వ్యక్తులు ఒక రకమైన ప్రకంపనలను ఎలా సృష్టిస్తారో తనకు చెప్పాడని అలాగే స్వలింగ సంపర్కం ముసుగులో కూడా బాలీవుడ్ తారను తమ సర్కిల్ ల నుండి తయారు చేస్తారని షాకింగ్ నిజాన్ని చెప్పారు. బాలీవుడ్ లో డ్రగ్స్ లింకులు.. అందులో ప్రముఖులెవరు? అన్నది ఆయనకు తెలుసు. ఇక్కడ స్వలింగ సంపర్కం టాపిక్ అగ్గి రాజేసేదే.
తనకు భద్రత కల్పిస్తే టాలీవుడ్ లోని డ్రగ్స్ రాకెట్ విషయాలు బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నానని వివాదాస్పద నటి శ్రీరెడ్డి కామెంట్ చేసింది. తాజాగా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేసింది.
టాలీవుడ్ లో కొందరు మూవీ మాఫియాగా మారి చిన్న చిన్న హీరోలను తొక్కేస్తూ వేషాల ఎరవేసి అమ్మాయిలతో తీర్చుకుంటున్నారనే విషయాన్ని గతంలో చెప్పానని శ్రీరెడ్డి తెలిపింది. అప్పట్లోనే డ్రగ్స్ గురించి కూడా నేను చెప్పానని వివరించింది. చాలా మంది సెలెబ్రెటీలు రేవ్ పార్టీలు నిర్వహిస్తూ విచ్చలవిడిగా డ్రగ్స్ తీసుకుంటున్నారనే విషయం నాకు తెలుసు అని శ్రీరెడ్డి తెలిపారు.
నాకు భద్రత కల్పిస్తే టాలీవుడ్ లో డ్రగ్స్ వాడే వారి పేర్లు చెబుతానని.. పెద్ద పెద్ద హోటళ్లలో పార్టీలు ఏర్పాటు చేసుకుంటూ డ్రగ్స్ పార్టీలు చేసుకుంటున్నారని శ్రీరెడ్డి ఆరోపించింది. ఆ పార్టీలకు వచ్చే అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి వారిని వాడుకుంటున్నారని శ్రీరెడ్డి అన్నారు.
బాలీవుడ్ రాకెట్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ విషయంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం బాగుందని శ్రీరెడ్డి తెలిపారు. దేశ సినీ పరిశ్రమ ప్రతిష్టకు మచ్చ రాకుండా కేంద్రం చేపట్టిన దర్యాప్తుపై ఆమె ప్రశంసల వర్షం కురుస్తోంది. అలాగే టాలీవుడ్ పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని శ్రీరెడ్డి అభిప్రాయపడ్డారు.
బాలీవుడ్ – శాండల్ వుడ్ లలో రేగిన డ్రగ్స్ మంటలు.. టాలీవుడ్ నూ తాకాయి. డ్రగ్స్ వ్యవహారం లో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. టాలీవుడ్ లో డ్రగ్స్ ఆరోపణలు రావడం కొత్తేమీ కానప్పటికీ.. ఈసారి స్టార్ హీరోయిన్ పై ఆరోపణలు రావడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసు లో ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోయిన్ రియా చక్రవర్తిని మాదకద్రవ్యాల కేసులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో రియా.. డ్రగ్స్ తో సంబంధమున్న పలువురు సెలబ్రిటీల పేర్లు చెప్పిందని.. అందులో సారా అలీఖాన్ – రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు ఉన్నాయని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇప్పటి వరకు ఇతర ఇండస్ట్రీలలో డ్రగ్స్ మాఫియా గురించి వింటూ వస్తున్న టాలీవుడ్ జనాలు షాక్ అయ్యారు. దీంతో నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా రకుల్ ని ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు.
అదే సమయంలో ఎన్సీబీ లో కీలక పదవిలో ఉన్న ఓ అధికారి.. డ్రగ్స్ వ్యవహారంలో రియా చక్రవర్తి రకుల్ ప్రీత్ సింగ్ – సారా అలీఖాన్ ల పేర్లు వెల్లడించిందని వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. రియా ఇచ్చిన స్టేట్మెంట్ లో ఏ హీరోయిన్ పేరు లేదని.. కేవలం డ్రగ్స్ పెడ్లర్లు మరియు స్మగ్లర్ల పేర్లు మాత్రమే చెప్పిందని సదరు అధికారి చెప్పినట్లు న్యూస్ వచ్చింది. దీంతో రకుల్ ప్రీత్ సింగ్ మద్ధతుగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా ‘సారీ రకుల్’ అంటూ పోస్టులు పెడుతూ ట్రెండ్ చేశారు. సినీ ఇండస్ట్రీలోని చాలామంది రకుల్ కు సపోర్ట్ చేస్తూ పోస్టులు పెట్టారు. అయితే ఎన్సీబీ డైరెక్టర్ మల్హోత్రా జాతీయ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ‘ఈ కేసులో రకుల్ ప్రీత్ సింగ్.. సారా అలీఖాన్ పేర్లు ప్రచారం అయ్యాయి. ఇందులో నిజా నిజాలేమిటి? తదుపరి చర్యలేమిటి అన్న దానిపై మేం ఇంకా ఏదీ చెప్పలేం. అనవసర వ్యాఖ్యలు చేయలేం’ అని చెప్పినట్లు మరో న్యూస్ వచ్చింది. దీంతో రకుల్ పేరు ఆ జాబితా లో ఉన్నట్లా లేనట్లా అని మళ్ళీ అందరూ ఆలోచించడం స్టార్ట్ చేశారు.
అయితే ఇంత జరుగుతున్నా రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం దీనిపై స్పందించలేదు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే రకుల్.. కనీసం దీనిపై స్పందిస్తూ ఓ పోస్ట్ కూడా పెట్టలేదు. దీంతో ఆమె అభిమానులు కలవరపడుతున్నారని తెలుస్తోంది. మరోవైపు రకుల్ మాత్రం ఈ విషయంపై సైలెన్స్ మైంటైన్ చేస్తూ తన సినిమా షూటింగులు చేసుకుంటోందని సమాచారం. అయితే సైలెంటుగా ఉండకుండా డ్రగ్స్ వ్యవహారంలో తన పేరు రావడాన్ని ఖండిస్తూ రకుల్ ఓ ట్వీట్ చేస్తే బాగుంటుందని.. లేకపోతే దీని పై అందరూ మరోలా ఆలోచించే అవకాశం ఉందని ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేస్తున్నారు.
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ కేసులో అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ఆరోపణలు ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రియా పై మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసే ఈడీ ఆమెను విచారించింది. మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కూడా ఈ కేసుని విచారించింది. అయితే సుశాంత్ కేసులో అనూహ్యంగా డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చింది. రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారించగా.. ఆమె డ్రగ్స్ వినియోగించినట్లుగా తేలడంతో ఆమెను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సుశాంత్ కూడా డ్రగ్స్ తీసుకునే వాదనే కొత్త విషయం బయటకు వచ్చింది. దీంతో నిజంగానే సుశాంత్ డ్రగ్స్ సేవించేవారా? సుశాంత్ తో పాటు రియాకు కూడా డ్రగ్స్ అలవాటు ఉందా? అని అనేక డౌట్స్ అందరిలోనూ మొదలయ్యాయి.
ఇదిలా ఉండగా సుశాంత్ సింగ్ మరియు రియా చక్రవర్తి ఇద్దరూ డ్రగ్స్ తీసుకుంటున్నట్లు చూపిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ పార్టీలో సుశాంత్ రియాలు కలిసి ఎంజాయ్ చేస్తూ డ్రగ్స్ సేవిస్తున్నట్లుగా ఈ వీడియోలో దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే రియానే సుశాంత్ కి డ్రగ్స్ అలవాటు చేసిందని అతని సపోర్టర్స్ కామెంట్స్ చేస్తున్నారు. సుశాంత్ మాజీ గర్ల్ ఫ్రెండ్ అంకిత సైతం అతను డిప్రెషన్ లో ఉన్నాడని తెలిసీ డ్రగ్స్ ఇచ్చిందని.. ఆమె కూడా డ్రగ్స్ తీసుకుందని కామెంట్స్ చేసింది. మరికొందరు మాత్రం సుశాంత్ కి ఎవరో బలవంతంగా డ్రగ్స్ ఇవ్వడానికి అతనేమీ చిన్న పిళ్లాడు కాదని కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా సుశాంత్ రియా ఇద్దరూ డ్రగ్స్ సేవించారని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు చెబుతున్నారు.
This video tells a lot about rhea! she is so fake Justice for Sushant 🙏❤️ Credit 👉 @zeenews . #sushantsinghrajput #ripsushantsinghrajput #justiceforsushantsinghrajput #rheachakraborty #shouvikchakraborty #zeenews #drugaddict #nbc #cbi #ed
null
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత జరుగుతున్న పరిణామాలు బాలీవుడ్‌తో సహా సౌత్ ఇండియన్ సినీ వర్గాలను సైతం వణికిస్తున్నాయి. సుశాంత్ సూసైడ్ కేసు ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా సీబీఐతో పాటు ఈడీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) రంగంలోకి దిగి కీలక ఆధారాలు సేకరిస్తున్నాయి. డ్రగ్స్ వాడకం, సరఫరా ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిని కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్ రాకెట్‌లో ఊహించని విధంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్ పేర్లు బయటకు రావడం సంచలనంగా మారింది.
డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా.. ఒక్కొక్కటిగా ఆమె రివీల్ చేస్తున్న విషయాలు సినీ ఇండస్ట్రీని వణికిస్తున్నాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల ఇంటరాగేషన్‌లో దాదాపు 25 మంది సినీ ప్రముఖుల పేర్లు రియా బయటపెట్టినట్లుగా గత రెండు రోజులుగా మీడియాలో కథనాలు చూస్తున్నాం. డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్న వారిలో ఎక్కువగా బాలీవుడ్ అగ్ర హీరో హీరోయిన్లే ఉన్నట్లు తెలిసింది.
అయితే తాజాగా పలు జాతీయ మీడియాల్లో షికారు చేస్తున్న వార్తల సారాంశం మేరకు డ్రగ్స్ మాఫియాతో మేజర్‌గా డీలింగ్స్ ఉన్న వారిలో బాలీవుడ్ భామలు సారా అలీ ఖాన్, సైమోన్ కంబట్టాలతో పాటు టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నారని తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా సౌత్ ఇండియన్ సినీ వర్గాల్లో వణుకు పుట్టింది. ఎన్‌సీబీ విచారణలో రియా చక్రవర్తి ఈ ముగ్గురి పేర్లు బయటపెట్టిందని సమాచారం.
రకుల్ ప్రీత్‌కు రియాకు మధ్య మంచి స్నేహం ఉందని ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో పలు వార్తలు షికారు చేస్తున్న ఈ తరుణంలో డ్రగ్స్ రాకెట్‌లో అమ్మడి పేరు బయటపడటం హాట్ టాపిక్ కావడమే గాక జనాల్లో పలు అనుమానాలకు తావిచ్చింది. సో.. చూడాలి మరి దీనిపై రకుల్ నుంచి గానే సారా నుంచి గానీ ఎలాంటి రియాక్షన్ వస్తుందనేది.
సుశాంత్ సింగ్ కేసులో అరెస్టుల పర్వం తెలిసింది. బెయిల్ అభ్యర్ధనను తిరస్కరించిన తరువాత రియా చక్రవర్తిని స్థానిక కోర్టు సెప్టెంబర్ 22 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అనంతరం రియా చక్రవర్తి తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి పేరు ట్విట్టర్ ఖాతా నుండి కొన్ని ట్వీట్లు విస్మయపరిచాయి.
అవన్నీ నేటి ఉదయం వైరల్ అయ్యాయి. రియా ఏ తప్పు చేయకుండా అరెస్టయ్యిందని ఇది అన్యాయమని ఆయన ఆవేదనను వ్యక్తం చేయడమే గాక.. సుశాంత్ బతికి ఉంటే అరెస్టయ్యేవాడని అవన్నీ ఆయన ఖాతాలో చేరేవని అనడం వైరల్ అయ్యింది. ఈ కేసులో తన కూతురు బలిపశువు అయ్యిందని సుశాంత్ ని ప్రేమించడం వల్లనే ఇలా అయ్యిందని రియా తండ్రి ఇంద్రజీత్ అతఃహశుడయ్యారు. అంతేకాదు.. తన కూతురుకి ఇలా అవ్వడం తట్టుకోలేకపోతున్నానని ఆత్మహత్య చేసుకుంటానని అనడం కలకలం రేపింది.
అయితే ఇవేవీ రియా తండ్రి ట్విట్టర్ నుంచి వచ్చినవి కాదని తేలింది. ఇవి నకిలీ వార్తలు అని ఫాక్ట్ చెకింగ్ వెబ్సైట్ బూమ్ లైవ్.ఇన్ ధృవీకరించింది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంతో సంబంధం ఉన్న డ్రగ్స్ కేసు వల్ల అరెస్టయిన రియాకు నకిలీ ట్విట్టర్ హ్యాండిల్ ఉందని అందులో అభిమానులు న్యాయం కోరుతున్నారని తేలింది.
బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో రియాను స్థానిక కోర్టు సెప్టెంబర్ 22 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. రియా ఒక డ్రగ్స్ సిండికేట్ లో “క్రియాశీల సభ్యురాలు” అని సుశాంత్ కోసం మాదక ద్రవ్యాలను సేకరించేదని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) పేర్కొంది. రియాను ఎన్డిపిఎస్లోని 27 ఎ- 21- 22- 29- 28 సెక్షన్ల కింద అరెస్టు చేసినట్లు ఎన్సిబి డిప్యూటీ డైరెక్టర్ కె పి ఎస్ మల్హోత్రా తెలిపారు.
సుశాంత్ మరణానికి సంబంధించిన వివిధ కోణాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరియు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) సహా మూడు ఫెడరల్ ఏజెన్సీలు పరిశీలిస్తున్నాయి.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం కేసులో రియా చక్రవర్తిని ఎన్.సి.బి బృందాలు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రియాను విచారించిన నార్కోటిక్స్ అధికారులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడమే గాక బెయిల్ రాకుండా నిర్భంధించారు. డ్రగ్స్ లో రియా ప్రమేయం.. అమ్మకాలు కొనుగోళ్లు పెడ్లర్లతో సంబంధాలు అన్నిటిపైనా ఆరాలు తీసి కేసులు బనాయించారు. ఇందులో సుశాంత్ పై కుట్ర కోణం కేసు కూడా ఉందని తెలుస్తోంది.
ఎన్.సి.బి ఉచ్చులోంచి బయటపడడం అన్నది అసంభవం అన్నంత బలమైన కేసులు ఇవని చెబుతున్నారు. అయితే ఈ కేసులో రియాకు ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుంది? అన్న దానిపై ఓ నిపుణుడు ఇచ్చిన విశ్లేషణ ఇలా ఉంది.
డ్రగ్స్ కొనడం.. వినియోగించడం.. ఎగుమతి దిగుమతి లేదా అమ్మకాలు సాగించడం .. రాష్ట్రాలకు సరఫరా చేయడం వంటివి నిషేధం. కానీ రియా ఈ తప్పులన్నీ చేసి దొరికిపోయింది. తప్పులన్నిటినీ స్వయంగా అంగీకరించింది. దీంతో నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్ స్టాన్సెస్ (పదార్థాలు) యాక్ట్ (ఎన్డీపీఎస్) యాక్ట్ 1985 ప్రకారం సెక్షన్ 89 (సీ).. 20(b)- 27(a)- 28- 29 కింద కేసులు బుక్ చేశారు. డ్రగ్స్ అక్రమ నిల్వ -సరఫరా- వినియోగంపై సెక్షన్ 8 (సీ)…. అక్రమ రవాణా.. రాష్టాల మధ్య సరఫరా.. జరిమానా అంశాలపై 20 (బీ).. నార్కోటిక్ డ్రగ్స్ … సైకోట్రాపిక్ పదార్థం వినియోగం కింద 27 (a) కేసు.. క్రిమినల్ కుట్ర.. ఆత్మహత్యకు ప్రేరణ అంశాలపై 28- 29 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ప్రముఖ లాయర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒక్కో సెక్షన్ కి ఒక్కో శిక్ష ఉంటుంది. సెక్షన్ 8 సీ కింద 10 ఏళ్ల జైలు ఉంటుంది. 2 లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తారు. ఇతర సెక్షన్ల లో 1 -10 ఏళ్లు శిక్ష- 20కె- 2 లక్షల లోపు జరిమానా విధిస్తారని తెలుస్తోంది. ఈ కేసులో దొరికిపోయిన రియా సహచరులకు తీవ్రతను బట్టి శిక్షలు ఉంటాయని చెబుతున్నారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మృతి కేసు అనేక మలుపులు తిరుగుతూ సీబీఐ చెంతకు చేరింది. అక్కడ విచారణ సందర్బంగా కూడా ఈ కేసుతో డ్రగ్స్ జోక్యం ఉన్నట్లుగా నిర్థారణ అయ్యిందని ఇప్పటికే సుశాంత్ ప్రియురాలు అయిన శోవిక్ చక్రవర్తిని అరెస్ట్ చేయడం జరిగింది. నేడు రియా చక్రవర్తిని కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. ఈ విషయమై రియా చక్రవర్తి తరపు లాయర్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. కక్ష సాధింపు చర్య అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
రియా అరెస్ట్ అయిన తర్వాత ఆమె తరపు లాయర్ మాట్లాడుతూ.. న్యాయం ఓడిపోయింది. డిప్రెషన్ తో బాధపడుతున్న ఒక వ్యక్తి ఇల్లీగల్ మందులు వాడి డ్రగ్స్ కూడా అలవాటు ఉండటంతో ఆత్మహత్య చేసుకున్నాడు. అలాంటి వ్యక్తిని రియా ప్రేమించింది. అలాంటి వ్యక్తిని ప్రేమించినందుకు రియాను మూడు జాతీయ దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టి అరెస్ట్ చేశారు. ఒక మహిళ అని కూడా చూడకుండా ఒకేసారి మూడు జాతీయ దర్యాప్తు సంస్థలు ఆమెను టార్గెట్ చేయడంతో న్యాయం ఓడిపోయింది.
విచారణ పేరుతో ఆమెను తీవ్రంగా హింసించారు.. వెంటాడారు అంటూ వ్యాఖ్యలు చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థలపై ఆయన చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుబడుతున్నారు. ఒక లాయర్ అయ్యి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అంటూ ఆయన తీరును ప్రశ్నిస్తున్నారు. వారు నిర్దోషులు అయితే నిరూపించి బయటకు తీసుకు రమ్మంటూ సుశాంత్ అభిమానులు ఛాలెంజ్ చేస్తున్నారు.
గత కొన్ని రోజులుగా మీడియాలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సినీ ఇండస్ట్రీలోని డ్రగ్స్ వ్యవహారాల గురించే వార్తలు వస్తున్నాయి. అయితే గతంలో చాలాసార్లు ఇండస్ట్రీలోని డ్రగ్స్ మాఫియా గురించి వార్తలు వచ్చినప్పటికీ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. సుశాంత్ అనుమాస్పద మృతి కేసులో అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి డ్రగ్ వ్యవహారం బయటకు పొక్కడంతో శాండిల్ వుడ్ లోనూ దీని ప్రతిధ్వనులు వినిపించాయి. ఇప్పటికే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో బాలీవుడ్ డ్రగ్స్ మాఫియాపై ఫోకస్ పెట్టి పలువురిని అరెస్ట్ చేసింది. డ్రగ్స్ వ్యాపారి బాసిత్ పరిహార్ మరియు రియా చక్రవర్తి సోదరుడు షోవిక్.. సుశాంత్ మేనేజర్ శామ్యూల్ మిరిండా.. దీపేష్ సావంత్.. డ్రగ్ పెడ్లర్ కైజెన్ ఇబ్రహీం లను అరెస్ట్ చేసింది. తాజాగా రియా ని కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. ఇప్పటికే రియాను విచారించిన అధికారులు పలువురు బాలీవుడ్ స్టార్ల పేర్లను రాబట్టినట్టు సమాచారం.
మరోవైపు శాండిల్ వుడ్ లో అనేకమంది సినీ నటీనటులు మ్యూజిషియన్లు కూడా నిషేధిత డ్రగ్ యూజర్లేనని తేలింది. బెంగుళూరులోని ఓ హోటల్లో పలువురిని అరెస్టు చేసిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. వీరు సినీ నటులకు సంగీత దర్శకులకు విద్యార్థులకు రకరకాల మత్తు మందులను సప్లయ్ చేస్తారని సమాచారం రాబట్టారు. ఈ క్రమంలో కన్నడ హీరోయిన్ రాగిణి ద్వివేదితో పాటు పలువురిని అరెస్టు చేసిన సీసీబీ.. తాజాగా హీరోయిన్ సంజన గల్రానీ ని కూడా అరెస్ట్ చేసింది. దీంతో ఈ వ్యవహారం మరింత మంది నటీనటుల మెడకు చుట్టుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అయితే అసలు సినీ సెలబ్రిటీలు ఎందుకు డ్రగ్స్ కి బానిసలు అవుతున్నారు?.. ఎప్పుడూ వారే తెరపైకి ఎందుకు వస్తుంటారనే అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
కాగా సినీ సెలబ్రిటీలు ఎక్కువగా ఒత్తిడికి లోనవుతూ.. వర్క్ టెన్షన్ తో.. ఫ్యామిలీ టెన్షన్స్ తో మాదకద్రవ్యాలు తీసుకుంటారని.. దాని వల్ల ఉపశమనం పొందుతారనే భ్రమలో ఉంటారని వైద్య నిపుణులు చెప్తున్నారు. సినీ ఇండస్ట్రీలలో జరిగే పార్టీ కల్చర్ లో వీటిని అలవాటు చేసుకొని.. మెల్లమెల్లగా డ్రగ్స్ కి బానిసలుగా మారి వాటి నుంచి బయటపడలేకపోతున్నారని అంటున్నారు. అదే సమయంలో వారి వీక్ నెస్ ని క్యాష్ చేసుకోవడానికి కొంతమంది డ్రగ్ డీలర్స్ ఇతర దేశాల డ్రగ్ వ్యాపారులతో డీలింగ్స్ పట్టుకొని.. ఇక్కడ సెలబ్రిటీలను డ్రగ్స్ ఉచ్చులోకి దింపుతారని తెలుస్తోంది. ఈ మధ్య హీరోయిన్ కంగనా రనౌత్ సైతం బాలీవుడ్ లో 99 శాతం డ్రగ్స్ తో నిండి ఉందని.. మాదకద్రవ్యాలు లేకుండా పార్టీలు ఉండవని.. నీళ్లలా తీసుకుంటారని.. రణవీర్ సింగ్ – విక్కీ కౌశల్ వంటి హీరోలపై డ్రగ్స్ ఆరోపణలు చేసింది. ఇక టాలీవుడ్ లో కూడా డ్రగ్స్ దందా నడుస్తుందని హీరోయిన్ మాధవీలత కామెంట్స్ చేసింది. డ్రగ్స్ అనేది చాలా చోట్ల ఉన్నప్పటికీ.. సెలబ్రిటీల మీద అందరి ఫోకస్ ఉంటుంది కాబట్టి వాళ్ళ పేర్లు హైలైట్ అవుతుంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన ఈ డ్రగ్స్ కేసులో రానున్న రోజుల్లో ఎంతమంది పేర్లు బయటకి వస్తాయో చూడాలి.