బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా (వరల్డ్) సినిమాల్ని ప్రకటించి సంచలనాలకు తెర తీశాడు ప్రభాస్. ఈ వార్తలన్నీ సోషల్ మీడియాల్లో హాట్ కేకుల్లా వైరల్ అయ్యాయి. బాహుబలి స్టార్ వరుస పాన్ ఇండియా సినిమాలతో మరోసారి రికార్డులు బ్రేక్ చేయడం ఖాయం అంటూ సామాజిక మాధ్యమాల్లో అభిమానులు విశ్లేషించారు.
కారణం ఏదైనా కానీ.. ప్రభాస్ ఇప్పుడు వేరొక కోణంలోనూ రికార్డులు బ్రేక్ చేస్తూ హాట్ టాపిక్ గా మారాడు. ఫేస్ బుక్ లో ఏకంగా 2.1 కోట్ల మంది (21 మిలియన్ లు) ఫాలోవర్స్ తో డార్లింగ్ టాప్ హీరోగా రికార్డులకెక్కాడు. దక్షిణాదిలో అతడే నంబర్ వన్ అని తేలింది. ఏ ఇతర స్టార్ ఇప్పట్లో అందుకోలేని రికార్డ్ ఇదన్న చర్చా సాగుతోంది.
ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ సమ్మర్ రిలీజ్ కి రెడీ అవుతుందని ప్రచారమవుతోంది. అలాగే ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ 3డి జనవరి నుంచి సెట్స్ కెళుతుంది. అటుపై నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ మూవీని కూడా ప్రారంభించాల్సి ఉంటుంది.
డార్లింగ్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టుల్ని ప్రకటించి షాకిచ్చారు. ఓంరౌత్ తో ఆదిపురుష్ 3డి .. నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవి రెండూ వెంటనే వెంటనే సెట్స్ కెళతాయి.
ప్రస్తుతం నాగ్ అశ్విన్ సినిమా గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇప్పటికే వైజయంతి మూవీస్ ప్రీప్రొడక్షన్ పనులు వేగంగా పూర్తి చేస్తోంది. ఇక ఇందులో దీపిక పదుకొణేని కథానాయికగా ఎంపిక చేసుకున్న నాగ్ అశ్విన్ మరో కీలక పాత్ర కోసం అమితాబ్ బచ్చన్ ని ఎంపిక చేశారని ఇప్పటికే బిగ్ బి కాల్షీట్లు లాక్ చేశారని ప్రచారం సాగుతోంది.
తాజా సమాచారం ప్రకారం.. బిగ్ బి రోల్ కేవలం అతిథి పాత్ర మాత్రమే కాదు.. పూర్తి స్థాయిలో ప్రభాస్ రోల్ కి ధీటుగా పోటా పోటీగా ఉంటుందని తెలిసింది. ఇందులో ప్రభాస్ సూపర్ హీరో తరహా రోల్ లో కనిపిస్తారని యాక్షన్ అదిరిపోయే రేంజులో ఉంటుందని ప్రచారమవుతోంది. బిగ్ బి ఇంతకుముందు సైరా నరసింహారెడ్డి లాంటి పాన్ ఇండియా చిత్రంలో నటించినా కొద్ది సేపు కనిపించే పాత్రలోనే అలరించారు. ఇప్పుడు అందుకు భిన్నంగా ప్రభాస్ మూవీ ఆద్యంతం కనిపించనున్నారన్న వార్త ఆసక్తిని పెంచుతోంది.
డార్లింగ్ ప్రభాస్ కి మహిళా ఫాలోయింగ్ ఏ రేంజులో ఉంటుందో చెప్పాల్సిన పనే లేదు. బాహుబలిగా వరల్డ్ వైడ్ పాపులారిటీ దక్కించుకున్నాడు. అయితే సాటి హీరోలంతా బ్యాచిలర్ లైఫ్ ని విడిచి పెళ్లితో సెటిల్ అవుతుంటే ప్రభాస్ మాత్రం ఇంకా ఆ అంకానికి ఎస్ చెప్పడం లేదు. పెదనాన్న కృష్ణం రాజు నుంచి ఇంటి పోరు ఉన్నా కానీ ఇంకా పెళ్లి మాటను దాట వేస్తూనే ఉన్నాడు. ఈ లాక్ డౌన్ సీజన్ లో అయినా దానిపై క్లారిటీ వస్తుందని అనుకుంటే ఇప్పటికీ ఎలాంటి గుడ్ న్యూస్ రాలేదు.
ప్రభాస్ ఫలానా పారిశ్రామిక వేత్త కుమార్తెను మనువాడబోతున్నాడని ఫలానా రాజకీయ నాయకుడి కుమార్తెతో లగ్గం కుదిరిందని తామరతంపరగా వార్తలు వచ్చినా ఏవీ నిజాలు కాలేదు. అన్నట్టు ప్రభాస్ డేటింగ్ ఎవరితో? అంటే దానికి ఇప్పటికీ సమాధానం లేదు.
ఓ చిట్ చాట్ లో ఇంటర్వ్యూవర్ లక్ష్మీ మంచును ప్రభాస్ డేటింగ్ ఎవరితో? అని ప్రశ్నించడం ఆసక్తిని కలిగించింది. అలాగే ప్రభాస్ వాట్సాప్ గ్రూపుల నుండి ఎందుకు దూరంగా ఉంటాడు? అతను క్రమం తప్పకుండా అలా చేస్తాడా? అంటూ ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటిని లక్ష్మీ మంచు స్మార్ట్ గా ఆన్సర్లు ఇచ్చారు.
మహేష్ బాబు విషయానికి వస్తే..అతను కుటుంబంతో స్పెండ్ చేయడం మినహా హైదరాబాద్ లో ఎప్పుడైనా బయటికి వస్తే ఆశ్చర్యపోవాలని అన్నారు. అలాగే అమీర్ ఖాన్ అంటే ఎంత ఇష్టమో లక్ష్మీ మంచు ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కింగ్ నాగార్జునపై క్రష్ ఉండేదని.. అమీర్ అంటే ఎంతో ఇష్టమని లక్ష్మీ వెల్లడించారు. అమీర్ పెళ్లాడేశాక గట్టిగా అరిచేశానని కూడా లక్ష్మీ మంచు చెప్పడం విశేషం. సూర్య- విజయ్ సేతుపతి- అమీర్ ఖాన్ వంటి స్టార్లతో కలిసి నటించాలనుందన్న ఆసక్తిని వ్యక్తం చేశారు. ఇదివరకూ లక్ష్మీ టాక్ షోలో చాలామంది తన సన్నిహిత స్టార్లను లక్ష్మీ మంచు ఇంటర్వ్యూలు చేసిన సంగతి తెలిసిందే.
డార్లింగ్ ప్రభాస్ ఏం చేసినా ఎంతో స్పెషల్ గానే ఉంటుంది. ముఖ్యంగా ప్రభాస్ రాజు ఆతిథ్యం గౌరవ మర్యాదల గురించి సాటి తారలు ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఆయనను ఎందుకని డార్లింగ్ అని పిలుస్తారో తమకు ప్రత్యక్షంగా అర్థమవుతోందని మనసు విప్పి మాట్లాడతారు.
ఇంతకుముందు కాజల్.. అనుష్క.. శ్రద్ధా కపూర్..నదియా.. రవీనా టాండన్ సహా పలువురు తారలు ప్రభాస్ మంచి వ్యక్తిత్వాన్ని ఆకాశానికెత్తేశారు. ఇప్పుడు ప్రభాస్ రాధే శ్యామ్ లో నటిస్తున్న సీనియర్ నటుడు జయరామ్ కూడా అదే పంథాలో డార్లింగ్ మంచి మనసును నిబద్ధతను పొగిడేశాడు.
ఆయన ఇలా ఇన్ స్టాగ్రమ్ లో ప్రవేశించారో లేదో తొలిగా ప్రభాస్ తోనే మొదలు పెట్టారు. ప్రభాస్ పట్టుదల కసి నిబద్ధతను ప్రశంసించడమే గాక.. ప్రభాస్ నిజాయితీ విషయంలో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. రాధేశ్యామ్ లో ప్రభాస్ తో కలిసి జయరామ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
రాధేశ్యామ్ గొప్ప ప్రేమకథా చిత్రమని.. హృదయాన్ని తాకుతుందని జయరామ్ అన్నారు. ఆ అరుదైన ప్రేమకథను వీలైనంత త్వరగా పెద్ద తెరపై చూడటానికి ఆసక్తిగా ఉన్నామని తెలిపారు.
రాధేశ్యామ్ టీమ్ అన్ని భాషల నుంచి ప్రతిభావంతులైన తారల్ని ఎంపిక చేసుకుని పాన్-ఇండియన్ మూవీగా మసాలా దినుసులను జోడించడం ప్రధాన అస్సెట్ కానుంది. కోస్టార్స్ తో ఎంతో మర్యాదగా ప్రవర్తించే ప్రభాస్ వల్ల ప్రతిదీ సులువుగా సాగుతోందట. అల్లు అర్జున్ `అల వైకుంఠపురములో` జయరాం కీలక పాత్రను పోషించిన సంగతి తెలిసిందే.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఆదిపురుష్ షూటింగ్ లో జాయిన్ కాబోతున్న విషయం తెల్సిందే. వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాను పట్టాలెక్కంచి.. 2022 ఆగస్టులో సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా దర్శకుడు ఓం రౌత్ అధికారికంగా ప్రకటించాడు. సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన రామాయణాల్లో రాముడి మాదిరిగా కాకుండా విభిన్నంగా ప్రభాస్ రాముడి గెటప్ లో కనిపిచబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఇక ఆదిపురుష్ గెటప్ కోసం రాధేశ్యామ్ షూటింగ్ పూర్తి అయిన తర్వాత అయిదు వారాల పాటు టైం కేటాయించబోతున్నాడట. ఫిజిక్ విషయంలో డిఫరెంట్ గా ప్రభాస్ కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. అందుకోసం తన వ్యక్తిగత ట్రైనర్ తో పాటు అంతర్జాతీయ స్థాయి ట్రైనర్ ల పర్యవేక్షణలో అయిదు వారాల పాటు ప్రభాస్ ఈ వర్కౌట్లు చేయబోతున్నాడట. దాంతో పాటు అత్యుత్తమ విలు విద్య శిక్షకుడి వద్ద ప్రభాస్ మరోసారి బాణం వేయడంను నేర్చుకోబోతున్నాడట. బాహుబలి సినిమా కోసం ప్రభాస్ గతంలో విలు విద్య నేర్చుకున్నాడు. ఆది పురుష్ కోసం మళ్లీ ప్రభాస్ బాణం వేసేందుకు సిద్దం అవుతున్నాడు.
రాధేశ్యామ్ సినిమా డిసెంబర్ రెండవ లేదా మూడవ వారంకు పూర్తి చేసే అవకాశం ఉంది. ఆ వెంటనే ఆదిపురుష్ సినిమా పనిలో ప్రభాస్ పడే అవకాశం ఉంది. ఆదిపురుష్ తో పాటే నాగ్ అశ్విన్ మూవీలో కూడా ప్రభాస్ నటించబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటన వచ్చింది. వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ ల మూవీ పట్టాలెక్కే అవకాశం ఉంది.
ఆదిపురుష్ 3డి .. ప్రస్తుతం జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అవుతున్న ట్రెండీ పాన్ ఇండియా మూవీ. బాహుబలి స్టార్ తో తానాజీ డైరెక్టర్ మూవీ కాబట్టి సంచలనాలు ఖాయమన్న అంచనాలేర్పడ్డాయి. శ్రీరాముడి పాత్ర చిత్రణతో రామాయణం ఆధారాంగా రూపొందనున్న పౌరాణిక డ్రామా ఇది! అన్న ప్రచారం వేడెక్కిస్తోంది. ఈ స్ట్రెయిట్ మూవీతోనే ప్రభాస్ బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడన్న ప్రచారం హాట్ టాపిక్ గా మారింది. ఇందులో నాయికల్ని ఫైనల్ చేయాల్సి ఉంది. ఈ చిత్రం జనవరి నుండి చిత్రీకరణకు వెళ్లనుంది.
తాజా సమాచారం ప్రకారం.. తన పాత్రకు తగినట్లుగా ప్రభాస్ ఈ చిత్రం లో సన్నగా కనిపిస్తారట. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఇందులో రావణ్ పాత్రను పోషించనున్నారు. రాధే శ్యామ్ చిత్రీకరణ పూర్తయ్యాక అతను ఈ చిత్రానికి ప్రిపరేషన్ ప్రారంభిస్తాడు.
ఆదిపురుష్ 2022 ఆగస్టులో హిందీతో పాటు అన్ని దక్షిణ భారత భాషలలో విడుదల కానుంది. ఇది 3డి 2డి వెర్షన్లలో తెరకెక్కనుంది. ఆ మేరకు చిత్రబృందం అధికారిక ప్రకటన వెలువరించింది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ”ఆదిపురుష్” అనే పాన్ ఇండియా సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ – క్రిషన్ కుమార్ – ప్రసాద్ సుతార్ – రాజేష్ నాయర్ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఇతిహాస రామాయణం నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రంలో ప్రభాస్ ‘రాముడి’గా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ‘లంకేష్’ గా కనిపించనున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి నిత్యం ఏదొక గాసిప్ తో ఈ సినిమా పేరు వార్తల్లో న నిలుస్తోంది. ముఖ్యంగా ‘సీత’ పాత్రలో నటించే హీరోయిన్ విషయంలో ఈ రూమర్స్ ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ఈ పాత్రకు సంబంధించి మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
‘ఆదిపురుష్’ లో నటించే హీరోయిన్ విషయంలో అనేకమంది పేర్లు తెరపైకి వచ్చాయి. అనుష్క శర్మ – కీర్తి సురేష్ – కృతిసనన్ – కియారా అద్వానీ.. ఇలా చాలామంది పేర్లు చర్చకు వచ్చాయి. కానీ ఇంతవరకు ‘సీత’ పాత్రలో ఎవరు కనిపిస్తారు అన్నది మాత్రం తేలలేదు. ఈ క్రమంలో లేటెస్టుగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ప్రభాస్ కి జోడీగా నటించనుందనే వార్త సోషల్ మీడియాలో బాగా సర్క్యూలేట్ అవుతోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’ అనే చిత్రంలో నటిస్తున్న అనన్యపాండే ని ‘ఆదిపురుష్’ కోసం సంప్రదిస్తున్నారని అంటున్నారు. మరి మేకర్స్ చివరకు ఎవరిని ఫైనలైజ్ చేస్తారో చూడాలి. కాగా ప్రభాస్ నటిస్తున్న స్ట్రెయిట్ హిందీ మూవీ కావడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘ఆదిపురుష్’ ని వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్ పైకి తీసుకెళ్లి 2022లో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.
ప్రభాస్ సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండ్ అవుతూనే ఉంటాడు. మొన్నటి వరకు ఇటలీలో రాధేశ్యామ్ షూటింగ్ లో పాల్గొన్న ప్రభాస్ ఇటీవలే ఇండియాకు వచ్చాడు. త్వరలో రాధేశ్యామ్ హైదరాబాద్ షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది. ఈ గ్యాప్ లో ఆదిపురుష్ కు సంబంధించిన చర్చల నిమిత్తం ప్రభాస్ ముంబయి వెళ్లబోతున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఈ సమయంలోనే ప్రభాస్ ఇలా ఛార్మి పెంపుడు కుక్క అలస్కన్మాలమ్యూట్ తో ఇలా ఫొటో దిగాడు. చాలా గంభీరమైన ఛార్మీ పెట్ తో ప్రభాస్ కొద్ది సమయం టైమ్ గడిపినట్లుగా ఉన్నాడు.
ఈ ఫొటోను ఛార్మి షేర్ చేసింది. నా 9 నెలల బేబీ బాయ్ తో డార్లింగ్ అంటూ ఛార్మి కామెంట్ పెట్టి ఈ ఫొటోను షేర్ చేసింది. దాంతో పాటు పూరి కనెక్ట్స్ ను కూడా ఈ ఫొటోకు ట్యాగ్ చేయడంతో ప్రభాస్ ఎక్కడ ఉన్నాడు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పూరి ఆఫీస్ లో ఉండి ఉంటాడా అంటూ కొందరు.. ప్రభాస్ ఛార్మి ఎక్కడ ఎందుకు కలిసి ఉంటారు అంటూ మరి కొందరు నెట్టింట ప్రచారం మొదలు పెట్టారు. కొందరు ఔత్సాహిక అభిమానులు మాత్రం పూరి కథను ప్రభాస్ విన్నాడేమో.. త్వరలోనే వీరిద్దరి కాంబో మూవీ ఉంటుందేమో అంటూ ఎవరికి వారు ఊహించేసుకుంటున్నారు. మొత్తానికి ఛార్మి పెట్ డాగ్ తో ప్రభాస్ ఫొటో హాట్ టాపిక్ గా అయ్యింది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”రాధే శ్యామ్”. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్ మరియు యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై వంశీ – ప్రమోద్ – ప్రశీద నిర్మిస్తున్నారు. ఇది పీరియాడికల్ నేపథ్యంలో జ్యోతిష్యానికి సైన్స్ కు మధ్య సాగే బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. కోవిడ్ నేపథ్యంలో ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి ఇటలీ షెడ్యూల్ ని పూర్తి చేసుకొని చిత్ర యూనిట్ ఇండియాకి తిరిగొచ్చారు. ఇటలీ పరిసర ప్రాంతాల్లోని అద్భుతమైన లొకేషన్స్ లో సాంగ్స్ తో పాటు కొన్ని యాక్షన్ సన్నివేశాలు కూడా చిత్రీకరించారని తెలుస్తోంది. ‘రాధేశ్యామ్’ సినిమా షూటింగ్ కి సంబంధించన ఎక్స్ టీరియర్ పార్ట్ మొత్తం ఇటలీలో.. ఇంటీరియర్ షూటింగ్ మొత్తం హైదరాబాద్ లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
‘రాధేశ్యామ్’ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ మరియు రామోజీ ఫిలిం సిటీలలో ప్రత్యేకమైన సెట్స్ నిర్మాణం జరుగుతున్నట్లు సమాచారం. షూటింగ్ మొత్తం అన్నపూర్ణ 7 ఏకర్స్ లో చేయాలని భావించినప్పటికీ ‘బిగ్ బాస్ 4’ షో కి మూడు ఫోర్లు ఆల్రెడీ బుక్ అయిపోవడంతో కొన్ని సెట్స్ ఫిలింసిటీలో వేస్తున్నట్లుగా తెలిసింది. ఈ సినిమా కోసం మొత్తం మీద చిన్న పెద్దా అన్నీ కలిపి దాదాపు 60 సెట్స్ పైనే వేస్తున్నట్లుగా సమాచారం. ప్రభాస్ కెరీర్లో 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు మోషన్ టీజర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా లెవల్లో తెలుగు తమిళ హిందీ మలయాళ కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో జగపతిబాబు – సత్యరాజ్ – భాగ్యశ్రీ – కునాల్ రాయ్ కపూర్ – మురళి శర్మ – శాషా ఛత్రి – ప్రియదర్శి – రిద్దికుమార్ – సత్యాన్ తదితరులు నటిస్తున్నారు.
ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రూపొందుతున్న రాధేశ్యామ్ సినిమా గత నెల రోజులుగా ఇటలీలో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ఇటలీ నుండి పలు ఆన్ లొకేషన్ స్టిల్స్ ను కూడా విడుదల చేశారు. దాదాపు నెల రోజుల పాటు ప్రభాస్ తో కలిసి ఇటలీలో రాధే శ్యామ్ సినిమా షూటింగ్ లో పాల్గొన్న పూజా హెగ్డే నిన్న హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యింది. ఆ విషయాన్ని ఆమె సోషల్ మీడియ ద్వారా షేర్ చేసింది. రాధేశ్యామ్ ఇటలీ తన షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న పూజా హెగ్డే హైదరాబాద్ లో మరో షూటింగ్ లో పాల్గొనబోతుంది.
పూజా హెగ్డే వచ్చిన తర్వాత కూడా ప్రభాస్ తో పాటు మరికొందరు నటీనటులపై రాధాకృష్ణ ఇటలీలోనే చిత్రీకరణ జరుపుతున్నాడు. అతి త్వరలోనే ప్రభాస్ మరియు ఇతర యూనిట్ సభ్యులు కూడా ఇండియాకు రాబోతున్నారు. దాంతో విదేశీ షెడ్యూల్ అంతా పూర్తి అవ్వబోతుంది. మరి కొన్ని రోజుల్లోనే హైదరాబాద్ లో ప్రభాస్ మరియు పూజా హెగ్డేలపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపబోతున్నారు. ఆ షూటింగ్ కోసం వెయిట్ చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో పేర్కొని హైదరాబాద్ లో కలుద్దాం అంటూ ప్రభాస్ కు బై చెప్పింది. ఈ సినిమాతో పాటు అఖిల్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాలో కూడా ఈ అమ్మడు నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా బ్యాలన్స్ వర్క్ లో పూజా పాల్గొనే అవకాశం ఉందట.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా తెరకెక్కతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా ప్రభాస్ లుక్ ఇప్పటికే బయటకు వచ్చింది. చాలా స్టైలిష్ గా ప్రభాస్ కనిపించబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ సెట్ నుండి పలు ఫొటోలు మరియు వీడియోలు బయటకు వచ్చాయి. బర్త్ డే సందర్బంగా విడుదలైన ఫొటోలు మరియు వీడియోల్లో ప్రభాస్ చాలా స్టైలిగ్ గా కనిపిస్తున్నాడు అంటూ ఆ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి ప్రభాస్ ఈ ఫొటో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
స్టైలిష్ కాస్ల్టీ కారు వద్ద ప్రభాస్ నిల్చుని ఉన్నాడు. సూపర్ స్టైలిష్ కారు వద్ద అంతే స్టైలిష్ గా ప్రభాస్ నిల్చుని వావ్ అనిపించాడు. ఈ సినిమా పీరియాడిక్ లవ్ స్టోరీతో రూపొందుతున్న విషయం తెల్సిందే. పీరియాడిక్ డ్రామా అయినా కూడా ప్రభాస్ చాలా స్టైలిష్ గా కనిపించబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. ఇటలీ షెడ్యూల్ చివరి దశలో ఉన్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత విడుదల చేసే అవకాశం ఉంది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ”ఆదిపురుష్” అనే చిత్రంలో నటించనున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించనున్నారు. భూషణ్ కుమార్ – క్రిషన్ కుమార్ – ప్రసాద్ సుతార్ – రాజేష్ నాయర్ – ఓం రౌత్ లు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఇతిహాస రామాయణం నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రంలో ప్రభాస్ ‘రాముడి’గా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ ‘లంకేష్’ గా కనిపించనున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ‘సీత’ పాత్రలో ఏ హీరోయిన్ నటిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే అనేకమంది పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ సినిమాలో హీరోయిన్ ఎవరికైతే బాగుంటుందనే దానిపై క్లారిటీగా ఉన్నారని తెలుస్తోంది.
‘ఆదిపురుష్’ లో నటించబోయే హీరోయిన్ అంటూ అనుష్క శెట్టి – అనుష్క శర్మ – కీర్తి సురేష్ – కృతిసనన్ వంటి పేర్లు చర్చకు వచ్చాయి. అయితే ఇప్పటివరకు మేకర్స్ మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో కచ్చితంగా అన్ని ఇండస్ట్రీలలో గుర్తింపు ఉన్న హీరోయిన్ నే తీసుకోవాలని చిత్ర యూనిట్ డిసైడైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ‘సీత’ పాత్రకు బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ని తీసుకుంటే బాగుంటుందని డార్లింగ్ హీరో ఫ్యాన్స్ భావిస్తున్నారు. అందంతో పాటు అభినయం కలబోసిన కియారా అయితే ప్రభాస్ కటౌట్ కి సెట్ అవుతుందని వారు అంటున్నారు. మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాతో కియారా టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. మరి మేకర్స్ ఈ ధోని బ్యూటీని తీసుకుంటారో మరో ముద్దుగుమ్మని ఫిక్స్ చేస్తారో చూడాలి. ఈ సినిమాలో సీనియర్ నటి అజయ్ దేవగన్ సతీమణి కాజోల్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుందని టాక్ నడుస్తోంది. ‘ఆదిపురుష్’ ని వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్ పైకి తీసుకెళ్లి 2022లో రిలీజ్ చేయనున్నారు.
బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ సంచలనాల గురించి ఏమని చెప్పాలి. ప్రస్తుతం గూగుల్ ట్రెండింగ్ లో టాప్ పొజిషన్ లో ఉన్నది ఇదే. ప్రభాస్ – పూజా హెగ్డే జంటగా నటిస్తున్న రాధే శ్యామ్ మ్యూజికల్ మోషన్ పోస్టర్ నిన్న విడుదలైంది. విజయదశమి కానుకగా ఒక రోజు ముందే డార్లింగ్ అభిమానులకు అదిరిపోయే ట్రీటిచ్చాడు. దేశవ్యాప్తంగా అభిమానుల నుండి భారీ స్పందన అందుకుంది. అలాగే మోషన్ పోస్టర్ ఇండియా లెవల్లో భారీ రికార్డు సృష్టించింది. సల్మాన్.. షారూక్ .. అమీర్ కి సాధ్యం కాని రేంజులో అదిరిపోయే రికార్డునే అందుకున్నాడు ప్రభాస్.
విడుదలైన 24 గంటల్లోనే బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు… యూట్యూబ్.. ఇన్ స్టాగ్రామ్ .. ఫేస్ బుక్ లలో కోటి 50లక్షల (15 మిలియన్ల)కు పైగా వీక్షణలు పొందింది. ప్రభాస్ .. పూజా హెగ్డే జంటకు పాన్-ఇండియా లెవల్ ప్రజాదరణ దక్కింది. మోషన్ పోస్టర్ కోట్లాది మంది వీక్షణలతో సంచలనం సృష్టిస్తోంది. రెండున్నర కోట్ల వ్యూస్ ని అధిగమించేందుకు 48 గంటలు సరిపోతుందేమో అన్నంతగా దూసుకపోతోంది.
రాధే శ్యామ్ బీట్స్ కి మనోజ్ పరమహంస ఛాయాగ్రహణం అదనపు ఆకర్షణగా నిలిచింది. జస్టిన్ ప్రభాకరన్ మనోహరమైన సౌండ్ ట్రాక్ ప్రధాన హైలైట్ గా నిలిచింది మోషన్ పోస్టర్ కి. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం లో రెబెల్ స్టార్ కృష్ణరాజు గోపికృష్ణ మూవీస్ – యువి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
హైదరాబాద్ ను ముంచెత్తిన వాన చాలామందిని నిరాశ్రయులైన చేసింది. ఈ వరదల విపత్తుతోపాటు కరోనా కారణంగా అందరి ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. ఈ క్రమంలోనే వరద బాధితులను ఆదుకోవాలన్న సీఎం కేసీఆర్ పిలుపునకు అద్భుతమైన స్పందన వస్తోంది.సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులు ఇప్పటికే నిన్న విరాళాలు ప్రకటించారు.
ఇక తెలుగు రాష్ట్రాల ప్రజలు కష్టాల్లో ఉండే ప్రతిసారి స్పందించే టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ తాజాగా కూడా స్పందించింది. నిన్న చిరంజీవి నాగార్జున మహేష్ ఎన్టీఆర్ తదితర హీరోలు దర్శకులు తెలంగాణ ప్రభుత్వానికి విరాళాలు ప్రకటించారు.
తాజాగా మరో ఇద్దరు నటులు కూడా భారీ సాయం ప్రకటించారు. అగ్రహీరో రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వరద బాధితుల కోసం తన వంతుగా రూ .1 కోటి విరాళం ప్రకటించారు. పవన్కళ్యాణ్ ఈ మొత్తాన్ని తెలంగాణ సీఎం సహాయ నిధికి అందజేస్తున్నట్టు ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇక జనసైనికులు జనసేన నాయకులు కూడా సహాయ కార్యక్రమాలు విరాళాల్లో పాలుపంచుకోవాలని బాధితులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు.
పవన్ విడుదల చేసిన వీడియోలో సునిశిత విమర్శలు కూడా చేశారు. హైదరాబాద్ లో దశాబ్దాలుగా పట్టణ ప్రణాళిక లేకపోవడం వల్లే ఈ వరదలు వచ్చాయని.. పునరుద్దరణ చేయలేనంతగా హైదరాబాద్ లో పరిస్థితి తయారైందని విమర్శించారు. ఈ విపత్తుకు కారణాలను అన్వేషించకుండా ఈ మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వంకు అందజేస్తున్నానని సహాయక చర్యలు కొనసాగించాలని సూచించారు.
*ప్రభాస్ కోటిన్నర విరాళం
భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న హైదరాబాదీలకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన పెద్ద మనసు చాటుకున్నారు. దేశీయ లెవల్లో స్టార్ హీరో అయిపోయిన మన ప్రభాస్ విరాళాల్లోనూ అందరు తెలుగు హీరోలకంటే ఎక్కువే సాయం ప్రకటించడం విశేషం.
తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ వరద బాధితుల కోసం తన వంతు సాయం ప్రకటించాడు. తెలంగాణ సీఎం సహాయనిధికి కోటిన్నర రూపాయల విరాళం ప్రకటించి తనపెద్ద మనసు చాటుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ షూటింగ్ లో భాగంగా ఇటలీలో ఉన్న సంగతి తెలిసిందే
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”రాధేశ్యామ్”. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ – గోపీకృష్ణా మూవీస్ – టీ సిరీస్ బ్యానర్లు కలిసి నిర్మిస్తున్నాయి. ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ మూవీ షూటింగ్.. ఇటలీలో తిరిగి ప్రారభమైంది. ఈ అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టినరోజు కానుకగా ‘రాధేశ్యామ్’ నుంచి ఏదేమైనా అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ అనౌన్స్ చేసిన మూడు సినిమాల్లో ‘రాధేశ్యామ్’ ఎక్కువ భాగం షూటింగ్ జరిగింది కాబట్టి టీజర్ లేదా మోషన్ పోస్టర్ రావొచ్చని అందరూ అనుకున్నారు. అందరూ అనుకున్నట్లుగానే ‘రాధే శ్యామ్’ టీమ్ డార్లింగ్ బర్త్ డే గిఫ్ట్ అనౌన్స్ చేసింది.
అక్టోబర్ 23న ‘బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్’ పేరుతో ఈ చిత్రం నుంచి ఫస్ట్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీనిని బట్టి చూస్తే ఈ సర్ప్రైస్ సంగీతం పరంగా ఉండబోతోందని అర్థం అవుతోంది. అదే రోజు ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రభాస్ కెరీర్లో 20వ చిత్రంగా రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి తగ్గట్టే ఇప్పటికే రిలీజైన చిత్ర ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2021 సమ్మర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్స్ జరుగుతున్నాయి. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ‘రాధేశ్యామ్’ ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి దాదాపు 140 కోట్లకి పైగా ఖర్చు అయిందట. సినిమా పూర్తయ్యే లోపు మరో 30 కోట్ల వరకు అయ్యే అవకాశం ఉందట. భారీ సెట్టింగ్స్ తోనే ఈ సినిమా బడ్జెట్ అమాంతం పెరిగిపోయిందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ‘సాహో’ అందుకున్న రిజల్ట్ ని బట్టి ‘రాధేశ్యామ్’ మూవీ ఏ మేరకు బిజినెస్ చేస్తుందో చూడాలి.
యూత్ స్టార్ నితిన్ ప్రస్తుతం ”రంగ్ దే” అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నితిన్ కి జోడీగా మహానటి కీర్తి సురేష్ నటిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైమెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకున్నారు. కరోనా పరిస్థితుల కారణంగా షూటింగ్ నిలుపుదల చేసుకున్న ‘రంగ్ దే’ ఇటీవలే హైదరాబాద్ లో తిరిగి ప్రారంభమైంది. ఈ షూట్ పూర్తయిన తరువాత మూవీ టీమ్ ఫారిన్ షెడ్యూల్ ప్లాన్ చేసారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ‘రంగ్ దే’ టీమ్ మూడు వారాల షెడ్యూల్ కోసం ఇటలీకి వెళ్లనుందని సమాచారం. దీని కోసం ప్రస్తుతం వీసా ఫార్మాలిటీలు చూస్తున్నారు. ఇటలీ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు రెండు పాటలు కూడా చిత్రీకరించనున్నారు. అందుకు అక్టోబర్ చివరి వారంలో ఇటలీ పయనమవుతారని తెలుస్తోంది. ఇప్పటికే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’ షూటింగ్ కోసం ఇటలీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభాస్ బాటలో నితిన్ కూడా వెళ్లనున్నాడు. వివాహం అనంతరం నితిన్ వెళ్లే ఫారిన్ ట్రిప్ ఇదేనని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘రంగ్ దే’ ఫస్ట్ లుక్ మరియు నితిన్ మ్యారేజ్ నాడు రిలీజ్ చేసిన స్పెషల్ వీడియోకి మంచి స్పందన వచ్చింది. నితిన్ ‘రంగ్ దే’ షూట్ కంప్లీట్ చేసి ‘అంధాదున్’ తెలుగు రీమేక్ స్టార్ట్ చేయనున్నాడు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలతో ఇండియన్ ఫిల్మ్ మార్కెట్ లోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో `రాధేశ్యామ్` మూవీతో పాటు నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ మూవీకి సన్నాహాలు చేస్తున్నాడు. అలాగే బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ తో `ఆది పురుష్ 3డి` చిత్రాల్ని లైన్ లో పెట్టారు. ఇటీవల వరుసగా`ఆది పురుష్` చిత్రం వార్తల్లో నిలుస్తోంది. తాజాగా `మహానటి` ఫేమ్ నాగ్ అశ్విన్ చిత్రం హాట్ టాపిక్ గా మారింది.
లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక విషయాన్ని మేకర్స్ ప్రకటించారు. ప్రత్యేకంగా ఓ పోస్టర్ ని రిలీజ్ చేసిన మేకర్స్ ఈ సందర్భంగా ప్రచారంలో వున్న మూడు ఆసక్తికరమైన విషయాల్ని బయటపెట్టారు. ప్రభాస్ 21 మూవీ ఓ సైన్స్ ఫిక్షన్ అని తొలి నుంచి మేకర్స్ చెబుతూనే వున్నారు. అయితే తాజాగా ఇది టైమ్ మెషీన్ నేపథ్యంలో రూపొందుతున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని వైజయంతీ మూవీస్ కన్ఫమ్ చేస్తూ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావుని ఈ ప్రాజెక్ట్ కి మెంటర్ గా నియమించినట్టు వెల్లడించింది. దీంతో ఈ మూవీ `ఆదిత్య 369`కు సీక్వెల్ అనే వాదనకు బలం చేకూరినట్టయింది.
ఇక ప్రారంభం నుంచి ప్రభాస్ 21 అంటూ ప్రచారం చేసిన మేకర్స్ కి దీపిక ఇచ్చిన కౌంటర్ తెలిసిందే. అలా ప్రచారం చేయడం వల్ల దీపికా పదుకొనే హర్ట్ కావడంతో ఆ తర్వాత `ప్రభాస్ – దీపిక పాన్ ఇండియా మూవీ` అంటూ సరికొత్తగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఒక రకంగా ప్రభాస్ కి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అంతే ప్రాధాన్యత దీపికకు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ప్రమోషన్స్ పోస్టర్స్ లోనూ ఇది ప్రభాస్ – దీపిక పదుకొనే ఫిల్మ్ అని మెన్షన్ చేస్తున్నారు. ఈ రెండు విషయాల్లో ప్రభాస్ ఫ్యాన్స్ కి క్లారిటీ రావడంతో ఈ మూవీపై రానున్న రోజుల్లో పెద్ద రచ్చ జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రభాస్ ‘రాధేశ్యామ్’ తో పాటు ఆదిపురుష్ ఇంకా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. మొత్తం మూడు సినిమాల్లో ఇప్పటికే రాధేశ్యామ్ సినిమా కాన్సెప్ట్ క్లారిటీ వచ్చేసింది. ఇక ఆదిపురుష్ గురించి మొత్తం క్లారిటీ ఇచ్చేశారు. కాని మహానటి ఫేం నాగ్ అశ్విన్ మాత్రం సినిమా గురించి చాలా సస్పెన్స్ లో ప్రేక్షకులను ఉంచాడు. భారీ సోషియో ఫాంటసీ సినిమా అంటూ దర్శకుడు ఇప్పటికే చెప్పాడు.
వైజయంతి మూవీస్ బ్యానర్ లో రాబోతున్న మరో అద్బుత దృశ్య కావ్యం అంటూ చాలా నమ్మకాలు పెంచుతున్నారు. ఇలాంటి సమయంలో సినిమాలో దీపిక పదుకునే హీరోయిన్ అంటూ సినిమా స్థాయిని పెంచారు. తాజాగా ప్రముఖ లెజెండ్రీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు బర్త్ డే సందర్బంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన్ను ఈ ప్రాజెక్ట్ లోకి ఆహ్వానిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ వైజయంతి మూవీస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో ట్వీట్ చేయడం జరిగింది.
ప్రభాస్ మూవీకి ఈ లెజెండ్రీ డైరెక్టర్ కు సంబంధం ఏంటీ అంటూ చర్చ మొదలైంది. సింగీతం ఇప్పటి వరకు ఎన్నో దృశ్య కావ్యాలను ముఖ్యంగా సైన్స్ ఫిక్షన్ మూవీస్ మరియు సోషియో ఫాంటసీ చిత్రాలను తెరకెక్కించారు. కనుక ఆయన అనుభవంను ఆయన క్రియేటివిటీని ఈ సినిమాకు ఉపయోగించుకుంటున్నారా లేదంటే ఆయన గతంలో తీసిన సినిమాల్లో నుండే ఒక సినిమాను రీమేక్ లేదా ఫ్రీమేక్ చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో ఆధిత్య 369 కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందుతుంది అనే పుకార్లు షికార్లు చేశాయి. ఈ పరిణామంతో అవి నిజమేనేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. అసలు విషయం ఏంటీ అనేది యూనిట్ సభ్యులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
ప్రభాస్ సాహో సినిమా చేస్తున్న సమయంలో ‘రాధేశ్యామ్’ సినిమాను మొదలు పెట్టాడు. సాహో విడుదలకు ముందే రాధేశ్యామ్ కొంత మేరకు షూటింగ్ పూర్తి అయ్యింది. దాంతో సాహో విడుదల అయిన కొన్ని నెలల్లోనే రాధేశ్యామ్ వస్తుందని ప్రేక్షకులు ఆశించారు. కాని ప్రభాస్ బాహుబలి మరియు సాహోల రేంజ్ లోనే ఈ సినిమా కూడా చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది. సినిమా కు సంబంధించి అప్ డేట్ ఏమీ ఇవ్వక పోవడంతో సోషల్ మీడియాలో యూవీ క్రియేషన్స్ కు వ్యతిరేక ప్రచారం మొదలైన విషయం తెల్సిందే.
ఫ్యాన్స్ ఒత్తిడి వల్ల రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇక ప్రభాస్ బర్త్ డే వచ్చే నెల 23న జరుగబోతుంది. ఆ రోజున రచ్చ చేయాలని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ మరియు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తున్న నేపథ్యంలో రాధేశ్యామ్ కు సంబంధించిన హ్యాష్ ట్యాగ్ ను కూడా ట్రెండ్ చేసి రికార్డు సృష్టించాంటూ భావిస్తున్నారట. రాధేశ్యామ్ నుండి ప్రభాస్ బర్త్ డేకు టీజర్ ను విడుదల చేయాలని మొదట మేకర్స్ భావించారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మోషన్ పోస్టర్ వస్తుందేమో అంటున్నారు.
టీజర్ కాకుండా మోషన్ పోస్టర్ లేదా మరేదైనా పోస్టర్ విడుదల చేస్తే ప్రభాస్ ఫ్యాన్స్ ఊరుకుంటారా అనేది అనుమానంగా ఉంది. టీజర్ కోసం ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న అభిమానులకు నిరుత్సాహం తప్పదేమో అంటున్నారు. ఫ్యాన్స్ కోరిక మేరకు టీజర్ ను విడుదల చేయాలనుకుంటే అందుకు సంబంధించిన ఫుటేజ్ ఎక్కువగా లేదని ఇప్పటి వరకు తీసిన సీన్స్ లో టీజర్ షాట్స్ తక్కువగా ఉన్నాయనే ఉద్దేశ్యంతో మోషన్ పోస్టర్ మాత్రమే విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారంటూ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.
‘డార్లింగ్’ ప్రభాస్ ‘ఆదిపురుష్’ అనే స్ట్రెయిట్ హిందీ చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో దర్శకుడు ఓం రౌత్ రూపొందించనున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో ప్రభాస్ ‘రాముడి’గా కనిపించనున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సీత పాత్రల్లో ఎవరు నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ పాత్ర కోసం ‘మహానటి’ కీర్తి సురేష్ మరియు కియారా అద్వాణీ పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో మిస్ దివా యూనివర్స్ ఊర్వశి రౌతేలాను సీత పాత్ర కోసం సంప్రదించిన్నట్లు వార్తలు వినిపించాయి. అయితే అవన్నీ పుకార్లేనని ‘ఆదిపురుష్’ చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. అయితే లేటెస్టుగా బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ప్రభాస్ పక్కన నటించనుందని మరో రూమర్ పుట్టుకొచ్చింది.
కాగా అనుష్క శర్మ ప్రెగ్నెంట్ గా ఉన్నట్లు ఇటీవల ప్రకటించారు. జనవరి 2021లో మా ఫ్యామిలీలో మరో మెంబెర్ జాయిన్ అవుతారని చెప్పుకొచ్చింది. కానీ ‘ఆదిపురుష్’ సినిమాని 2021 జనవరిలో స్టార్ట్ చేయడానికి సన్నాహకాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జనవరిలో బేబీకి డెలివరీ ఇచ్చి.. బేబీ ఆలనాపాలనా చూసుకోకుండా వెంటనే షూటింగ్ లో పాల్గొనడం అసలు జరిగేపనేనా? సో ఇవన్నీ బేస్ లెస్ రూమర్స్ అని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ప్రతినాయకుడు లంకేష్ పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటించబోతున్నట్లు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. 3-డీలో రూపొందనున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ – కృష్ణ కుమార్ – ప్రసాద్ సుతార్ – రాజేష్ నాయర్ – ఓం రౌత్ లు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. తెలుగు హిందీ భాషల్లో రూపొందించి తమిళ మలయాళ కన్నడ భాషలతో పాటు ఇతర విదేశీ భాషల్లోకి డబ్ చేసి విడుదల చేయనున్నారు.