జూనియర్ ఎన్ఠీఆర్ సూపర్ హిట్ మూవీ రిలీజ్ ఫిక్స్

టాలీవుడ్ లో నడుస్తోన్న రీరిలీజ్ ట్రెండ్ లో కొనసాగింపుగా పాత హిట్ సినిమాలు అన్ని మళ్ళీ తెరపైకి వస్తోన్న సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ ఇంటరెస్ట్ ని దృష్టిలో ఉంచుకొని ఒకటి నుంచి మూడు రోజుల పాటు పాత సినిమాలని థియేటర్స్ లో ప్రదర్శిస్తున్నారు. వీటిలో కొన్నింటికి మంచి ఆదరణ లభించింది. కొన్ని మూవీస్ మాత్రం పెద్దగా ప్రభావం చూపించలేదు. పోకిరి సినిమాతో మొదలైన ఈ రీరిలీజ్ ట్రెండ్ లో భాగంగా రీసెంట్ గా 7/G బృందావన్ కాలనీ మూవీ వచ్చింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ హిట్ మూవీ రీరిలీజ్ కి సిద్ధమవుతోంది. వివి వినాయక్ దర్శకత్వంలో జూనియర్ ఎన్ఠీఆర్ డ్యూయల్ రోల్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ అదుర్స్. ఈ చిత్రాన్ని ఈ నెల 18న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రీరిలీజ్ కి రెడీ చేస్తున్నారు. జూనియర్ ఎన్ఠీఆర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 23 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆ రోజు అదుర్స్ మూవీని రీరిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం మూవీ 4కె వెర్షన్ సిద్ధం అవుతోందని తెలుస్తోంది. జూనియర్ ఎన్ఠీఆర్ సింహాద్రి ఇప్పటికే రీరిలీజ్ అయ్యి సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ ని క్రియేట్ చేసింది. 5 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇప్పుడు అదుర్స్ కి కూడా అదే స్థాయిలో స్పందన వస్తుందని అంచనా వేస్తున్నారు.

మీమర్స్ అందరూ ఈ రెండు పాత్రలని ఉపయోగిస్తూ చాలా కామిక్ కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో ఈ క్యారెక్టర్స్ నిత్యం ట్రెండ్ అవుతూనే ఉంటాయి. అంతలా జనాల్లోకి బలంగా చేరిపోయాయి. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత బిగ్ స్క్రీన్ పై చారి-బంటు కామెడీని ఎంజాయ్ చేయడానికి తారక్ ఫ్యాన్స్ అయితే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా రీరిలీజ్ పైన మీమర్స్ ఇంకెన్ని మీమ్స్ క్రియేట్ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకి వచ్చే ఆదరణ బట్టి రీరిలీజ్ సినిమాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Related Images:

రామరాజుతో రాకింగ్ దీపావళి అదుర్స్

టాలీవుడ్ లో మెగా కాంపౌండ్ .. మంచు కాంపౌండ్ మధ్య స్నేహానుబంధం గురించి తెలిసిందే. పండగలు పబ్బాల వేళ చిటపటలు ఛమత్కారాలు అభిమానులకు సుపరిచితమే. నేటితరం ఫ్యామిలీ హీరోలు వివాదాలకు తావివ్వకుండా సరదాగా కలిసి మెలిసి సెలబ్రేట్ చేస్తుంటారు. ఆ సాంప్రదాయాన్ని మెగా – మంచు హీరోలు కొనసాగిస్తున్నారు.

కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఇటీవలే మెగాస్టార్ చిరంజీవితో కలిసి పలు కార్యక్రమాల్లో సందడి చేశారు. సినీపెద్దలుగా టాలీవుడ్ కి దారి చూపిస్తున్నారు ఆ ఇద్దరూ. ఇక మంచు యువ హీరోలు విష్ణు.. మనోజ్.. ట్యాలెంటెడ్ నటి కం హోస్ట్ కం నిర్మాత మంచు లక్ష్మి .. చరణ్ కి ఎంతో క్లోజ్.. ఫ్యామిలీ ఫంక్షన్లు సహా ప్రతి వేడుకకు వీళ్లంతా కలిసి సెలబ్రేట్ చేస్తుంటారు.

మొన్న దీపావళి సంబరాన్ని రాకింగ్ స్టార్ మనోజ్ చాలా స్పెషల్ గా ప్లాన్ చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతిథిగా కేక్ కటింగ్ సెలబ్రేషన్ తో దీపావళి సంబరాల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మనోజ్.. లక్ష్మీ మంచుతో దీపావళి జరుపుకోవడంపై తన ఆనందాన్ని పంచుకున్నారు చరణ్. # సీతారామరాజు చరణ్ # మనోజ్ మంచు # లక్ష్మిమంచూ.. అంటూ హ్యాష్ ట్యాగ్ లతో చరణ్ ప్రత్యేకంగా తన సెలబ్రేషన్ ని హైలైట్ చేసారు. మొత్తానికి అల్లూరి సీతారామరాజుతో రాకింగ్ సెలబ్రేషన్ ఇది అని చెప్పాలి. ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ లో అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా మంచు మనోజ్ సొంతంగా బ్యానర్ ప్రారంభించి అందులో సినిమా చేస్తున్నారు. ఇది మనోజ్ కి కంబ్యాక్ సినిమా అనే చెప్పాలి.

Related Images: