అనుపమ నటించిన షార్ట్ ఫిల్మ్ ఫస్ట్ లుక్..!

మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ అరంగేట్రం చేసిన తొలి చిత్రంతోనే నటిగా మంచి గుర్తింపు పొందింది. ‘అ ఆ’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ‘ప్రేమమ్’ ‘శతమానం భవతి’ ‘ఉన్నది ఒకటే జిందగీ’ ‘కృష్ణార్జున యుద్ధం’ ‘హలో గురూ ప్రేమ కోసమే’ ‘రాక్షసుడు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. విభిన్న పాత్రలతో యువ హృదయాల్ని దోచుకుంటోన్న అనుపమ.. త్వరలో ఓ లఘు చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ షార్ట్ ఫిల్మ్ కు ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు.

దీపావళి సందర్భంగా ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్’ లఘు చిత్రం నుంచి అనుపమ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఆదివారం విడుదల చేశారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ చీరకట్టుతో.. కాటుక కళ్లతో కనువిందు చేస్తోంది. తన అందమైన ఉంగరాల కురులు.. నుదుటిన పెద్ద బొట్టు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. ఆర్ జే షాన్ ఈ లఘుచిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. అఖిల్ మిధున్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ షార్ట్ ఫిల్మ్ విడుదల కానుంది. ఇన్నాళ్లూ సినిమాలతో ప్రేక్షకులని అలరించిన అను బ్యూటీ.. ఇప్పుడు షార్ట్ ఫిక్షన్ తో ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

Related Images:

తెలుగు తెర మలయాళం ముద్దుగుమ్మలను పక్కన పెట్టేసిందా…!

దక్షిణాదిలో హీరోయిన్లు కావాలంటే ఇప్పడందరు కన్నడ బ్యూటీస్ వెంట పడుతున్నారు.టీవీ చానల్లకే కాకుండా.. సినిమాలకు అక్కడి నటీమణులు కరెక్ట్ గా సెట్ అయిపోతున్నారు. గతకొంతకాలంగా తెలుగు పరిశ్రమలో రష్మిక లాంటి కన్నడిగుల హవా పెరిగిపోతుంది. కన్నడ పరిశ్రమకు ధీటుగా మలయాళ తీరం కనిపిస్తున్నప్పటికీ… ఎందుకనో మనవాళ్లు మునుపటిలా అక్కడి తారలను తెచ్చుకుని ఇక్కడ సినిమాలు చేయడం లేదు.

జస్ట్ సాయిపల్లవి,అనుపమ పరమేశ్వరన్ తోనే మనం సరిపెట్టేసుకుంటున్నాం.అను ఇమాన్యుయల్ ,మంజిమా మోహన్ ,మడోనా సెబాస్టియన్ లన్నారనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయాం.వీరిలో ఎవరో ఒకరు బ్లాక్ బస్టర్ సినిమాలో చేస్తేగాని బహుశా మనం వీరిని పికప్ చేసుకోలేమనుకుంట. పేటతో కలరింగ్ ఇచ్చి..మాస్టర్ తో స్టయిల్ గా లుక్ ఇచ్చిన మాళవిక మోహన్ ఇప్పుడు తెలుగు దర్శకులకు హాట్ ఫేవరెట్ గా కనిపిస్తుంది.మాస్టర్ రిలీజై హిట్ పడితే ఆమెకు తెలుగులో రెండు మూడు ఆఫర్లు వచ్చినా ఆశ్చర్యం లేదు.

మాళవిక మోహనన్ తో పాటు…తాజాగా నిఖిలా విమల్ ,దీప్తి సతి,సంయుక్త మీనన్ లాంటి హీరోయిన్లు టాలీవుడ్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు.వీరిని మనవాళ్లు తీసుకోవాలంటే సాలిడ్ హిట్ అయినా పడాలి… లేదంటే లవ్ స్టోరీస్ హ్యాండిల్ చేసే శేఖర్ కమ్ముల,ఇంద్రగంటి వారు వీరి క్రేజ్ చూసి తమ సినిమాకైనా తీసుకోవాలి.అప్పుడే వీరికంటూ తెలుగులో సినిమాలు వచ్చేది.

అలాగే నమితా ప్రమోద్ ,గుజరాతి గాళ్ అనార్కలి ఫేం ప్రియా గోర్ ,బెంగుళూరు డేస్ ఫేం పార్వతిలను తెలుగు సినీ ఆడియన్స్ నెట్టింట్లో ఎంతగానో ఆదరిస్తున్నారు.వారి ఇన్ స్టా అకౌంట్ లను మన కేరళ బ్యాచ్ కంటే ఎక్కువగా ఫాలో అయిపోతున్నారు.మరి ఇంతలా ఫాలోయింగ్ ఉన్నా కూడా మాలీవుడ్ బ్యూటీస్ ను మనవాళ్లు ఎందుకు ఇక్కడకు తీసుకురావడంలో ఫెయిల్ అవుతున్నారు.

 

Related Images:

వీపందం ఏముందని..అనుపమ ఆల్మోస్ట్ అర్థనగ్నమే!!

టెంప్టింగ్ అనేది ఒక అరుదైన కళ. ఈ కళలో ఆరితేరిపోతున్నారు నవతరం కథానాయికలు. ఏం చేస్తే బోయ్స్ ని టెంప్ట్ చేయగలరో అది చేసి చూపిస్తున్నారు. ఫోటోషూట్ల పేరుతో ఆల్మోస్ట్ కుర్రకారును టీజ్ చేస్తూ కంటికి కునుకుపట్టనీకుండా చేస్తున్నారు. రేతిరేల కలల ప్రపంచంలో ఈ అమ్మణ్ణులదే సామ్రాజ్యంగా మారుతోంది మరి.

ఇదిగో ఇప్పుడు అదే తరహాలో కవ్వించింది ప్రేమమ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. అనుపమ పరమేశ్వరన్ తన ఇన్ స్టాగ్రామ్ లో షాకిచ్చే ఫోటోను షేర్ చేసింది. ఇన్నాళ్లు పక్కింటి అమ్మాయి ఇమేజ్ ను చూపించిన అనుపమ ఉన్నట్టుండి ఇలా మారిందేమిటి? అంటూ సందేహించాల్సిందే.

వీపు చూడు వీపందం చూడు! అన్న చందంగా ఆల్మోస్ట్ అర్థనగ్న రూపంతో కనిపించి షాకిచ్చింది. ఇది పక్కాగా టెంప్టింగ్ లుక్ అని చెప్పాలి. ఆ అందమైన వీపు భాగం.. కాళ్ళు .. రింగుల జుత్తులోకి జొనిపిన చేతులు.. ఆ లుక్ సంథింగ్ హాట్ అనే చెప్పాలి. “నా చేతులు కాళ్ళు మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తే … దయచేసి సోదరసోదరీమణులారా నాకు దూరంగా ఉండండి“ అంటూ వేడెక్కించే కామెంట్ ని జోడించింది ఈ ఫోటోకి. అసలే కర్లీ హెయిర్ తో టెంప్ట్ చేసే అనుపమ క్యూట్ అప్పియరెన్స్ మతి చెడగొడుతోంది. ఇకపై ఎలాంటి మొహమాటం లేకుండా గ్లామర్ షోకి సిద్ధమవుతున్నానని సిగ్నల్ ఇస్తోందా? ఈ క్యూటీ అన్నదే ఇప్పుడు అందరిలోనూ డౌట్. కెరీర్ సంగతి చూస్తే ప్రస్తుతం నిఖిల్ సరసన 18 పేజెస్ లో కథానాయికగా నటిస్తోంది.

Related Images:

అనుకు అక్కడ కూడా నిరాశే

మలయాళంలో ‘ప్రేమమ్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్ తెలుగులో మరియు తమిళంలో ఆ తర్వాత నటించింది. తెలుగులో అఆ మరియు ప్రేమమ్ సినిమాలు సక్సెస్ అయినా కూడా ఈమెకు ఆశించిన స్థాయిలో క్రేజ్ మాత్రం దక్కలేదు. మరో వైపు తమిళంలో కూడా ఈమె ప్రత్నాలు చేసింది ఇంకా చేస్తూనే ఉంది. కాని ఈమెకు అక్కడ కూడా స్టార్ డం రాలేదు. మలయాళంలో చాలా కాలంగా సినిమాల్లో నటించని ఈమె మళ్లీ ఇన్నాళ్లకు దుల్కర్ సల్మాన్ సినిమా అయిన మణిరైలే అశోకన్ లో కీలక పాత్రలో నటించింది.

మణిరైలే అశోకన్ సినిమాలో హీరోయిన్ గా కాకుండా కీలకమైన గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వడంతో పాటు ఆ సినిమాకు సహాయ దర్శకురాలిగా కూడా వ్యవహరించింది. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో నేరుగా విడుదల అయ్యింది. తెలుగు తమిళంలో ఈమద్య వరుసగా ఫ్లాప్స్ చవిచూసిన అనుపమ పరమేశ్వరన్ తన సొంత భాష మలయాళంలో కూడా ఫ్లాప్ ను చవి చూసింది. నటిగా మంచి ప్రతిభ కనబర్చినా కూడా ఈమె సినిమాలు కమర్షియల్ గా మాత్రం ఆశించిన స్థాయిలో కమర్షియల్ విజయాలను సొంతం చేసుకోవడంలో విఫలం అవుతున్నాయి.

Related Images:

ఇక్కడ బెల్లకొండ.. అక్కడ విశాల్…!

సినీ ఇండస్ట్రీలో ఒక్కసారి స్టార్ స్టేటస్ వచ్చాక వెనక్కి తిరిగి చూడాలని ఎవరూ అనుకోరు. అదే ఇమేజ్ ని కాపాడుకుంటూ ముందుకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో మేల్ డామినేషన్ ఉండే ఇండస్ట్రీలో హీరోయిన్స్ కూడా అలానే ఆలోచిస్తుంటారు. హీరోయిన్ గా కొనసాగినన్ని రోజులు మంచి ఇమేజ్ తెచ్చుకొని నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని చూస్తుంటారు. ఈ నేపథ్యంలో ఒక్కసారి స్టార్ హీరోయిన్ అనిపించుకున్న తర్వాత మీడియం రేంజ్ మార్కెట్ ఉన్న హీరోలతో నటించడానికి వెనకడుతుంటారు. అయితే సౌత్ ఇండస్ట్రీలో ఇద్దరు మీడియం రేంజ్ హీరోలతో నటించడానికి స్టార్ హీరోయిన్స్ రెడీగా ఉంటారు. వారెవరో కాదు బెల్లకొండ శ్రీనివాస్ – విశాల్.

కాగా ‘అల్లుడు శీను’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్.. తాను నటించే ప్రతి సినిమాలో స్టార్ హీరోయిన్ ఉండేలా చూసుకుంటాడు. ఈ క్రమంలో అక్కినేని సమంత – కాజల్ అగర్వాల్ – పూజాహెగ్డే – తమన్నా – రకుల్ ప్రీత్ సింగ్ – అనుపమ పరమేశ్వరన్ – మెహ్రీన్ – నభా నటేష్ వంటి హీరోయిన్స్ తో కలిసి నటించాడు బెల్లంకొండ. కోలీవుడ్ లో విశాల్ కూడా తన సినిమాల్లో ఆల్మోస్ట్ స్టార్ హీరోయిన్స్ నే తీసుకుంటున్నాడు. అయితే ఈ ఇద్దరు హీరోల సినిమాలలో నటించడానికి స్టార్ హీరోయిన్స్ ఇంట్రెస్ట్ చూపించడానికి కారణంగా వారి సినిమాలకు ఇచ్చే రెమ్యూనరేషన్ అని తెలుస్తోంది. ఈ హీరోల సినిమాలలో హీరోయిన్లకి మార్కెట్ రేటు కంటే ఎక్కువ ఇస్తారని టాక్. సినిమా హిట్ అయితే డబ్బులతో పాటు క్రెడిట్ కొట్టేయొచ్చు.. అదే ప్లాప్ అయితే రెమ్యూనేషన్ ఎలానూ ఎక్కువగానే వస్తోందిగా అనే విధంగా హీరోయిన్స్ ఆలోచిస్తున్నారని కాస్టింగ్ వర్గాలు చెప్తున్నాయి.

Related Images: