బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్

తెలివైనోడే గెలిచాడు. మిస్టర్ కూల్‌గా ఆట ఆడి కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న సినీ హీరో అభిజిత్ బిగ్ బాస్ సీజన్ 4 విజేతగా అవతరించాడు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా బిగ్ బాస్ టైటిల్‌ను అందుకున్నాడు. 11 సార్లు నామినేట్ అయ్యి సేవ్ అవుతూ వచ్చిన అభిజిత్‌కి ప్రేక్షకులు పట్టం కట్టడంతో బిగ్ బాస్ సీజన్ 4 విజేత అయ్యి రూ. 25 లక్షల ఫ్రైజ్ మనీ అందుకున్నారు. రూ.25 లక్షల ప్రైజ్ మనీ ఎందుకంటే.. సొహైల్ పోటీ నుంచి తప్పుకోవడానికి రూ.25 తీసుకున్నాడు. ఈ మొత్తాన్ని ప్రైజ్ మనీ నుంచి కట్ చేశారు. దీనికి అఖిల్, అభిజీత్ అంగీకరించారు. కాబట్టి, విజేతకు రూ.25 లక్షలు మాత్రమే మిగిలింది. ఈ మనీ, టైటిల్‌ను అభిజీత్ సొంతం చేసుకున్నాడు.

ఇదిలా ఉంటే, ఆదివారం నాడు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ అంగరంగ వైభవంగా సాగింది. బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్‌ అంతా హాజరై తమ ఆటపాటలతో అలరించారు. టాప్ 5 ఫైనలిస్ట్‌ల్లో హారిక ఐదో స్థానంలో నిలిచింది. అరియానా గ్లోరి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. సొహైల్ మూడో స్థానం దక్కించుకున్నాడు. అఖిల్ రన్నర్‌గా నిలిచాడు.

కాగా, 2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన అభిజిత్.. రామ్ లీలా, మిర్చిలాంటి కుర్రాడు, అరెరే సినిమాల్లో నటించారు. అయితే ఈ సినిమాతో పెద్దగా పేరు కాకపోవడంతో.. 2015 నుంచి 2017 వరకూ గ్యాప్ తీసుకుని పెళ్లి గోల వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ పెళ్లి గోల వెబ్ సిరీస్1, 2, 3 అన్నీ సూపర్ హిట్ కావడంతో అభిజిత్‌కి మంచి పేరు వచ్చింది. దీంతో బిగ్ బాస్ సీజన్ 4లో అడుగుపెట్టి తొలివారం నుంచి తిరుగులేని క్రేజ్ దక్కించుకున్నాడు. మెచ్యూర్డ్ మైండ్‌తో వ్యవహరిస్తూ.. బిగ్ బాస్‌‌నే గర్వపడాలే చేశాడు అభిజిత్. తాజా ఎపిసోడ్‌లలో మీ లాంటి మెచ్యూర్డ్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్‌లో ఉండటం గర్వంగా ఉందని కొనయాడారు బిగ్ బాస్.

Related Images:

బిబి4: హారిక – అరియానా ముందే ఔట్

తెలుగు బిగ్ బాస్ 4 నుండి మిగిలి ఉన్న ఆ ఇద్దరు లేడీ కంటెస్టెంట్స్ కూడా బయటకు వచ్చేశారని సమాచారం అందుతోంది. టాప్ 5లో ఉన్న వారిలో నెం.5 గా హారిక మరియు నెం.4 గా అరియానా ఎలిమినేట్ అయ్యారనే వార్తలు జోరుగా వస్తున్నాయి. ఆదివారం ఎపిసోడ్ లో ఒకొక్కరు చొప్పున ఎలిమినేట్ చేస్తారనే అనుకున్నారు. కాని టీమ్ ప్లాన్ చేంజ్ చేసింది. అనూహ్యంగా శనివారం సాయంత్రం సమయంలోనే కొంత భాగంను షూట్ చేసినట్లుగా చెబుతున్నారు. అందులో అరియానా మరియు హారికలను ఎలిమినేట్ చేయడం జరిగింది అంటున్నారు. నెం.4 స్థానంలో అరియానా నిలిచింది అంటూ బిగ్ బాస్ నిర్వాహకులు నుండి అనధికారిక సమాచారం అందుతోంది.

ఆ ఇద్దరు ఎలిమినేట్ అవ్వడంతో నేడు బిగ్ బాస్ హౌస్ లో అఖిల్ అభిజిత్ సోహెల్ లు మాత్రమే ఉన్నారు. ఈ ముగ్గురిలో విజేత విషయంలో కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అఖిల్ నెం.3 గా నిలువ నుండగా అభిజిత్ విజేతగా సోహెల్ రన్నర్ గా నిలువబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నేటి మద్యాహ్నం రెండు లేదా మూడు గంటల నుండి షో షూటింగ్ ప్రారంభిస్తారని అంటున్నారు. విజేతను లైవ్ లో ప్రకటించే అవకాశం కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి షో ఫార్మెట్ ను నిర్వాహకులు మార్చి ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నారు. ఫినాలే ఎపిసోడ్ కు రికార్డు స్థాయి రేటింగ్ కోసం నిర్వాహకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

Related Images:

ఈ వారం బిగ్ బాస్ లో ఎలిమినేట్ అయ్యేది ఆమెనా..!?

బుల్లితెరపై తనదైన శైలిలో దూసుకెళ్తున్న షో బిగ్ బాస్. బిగ్‏బాస్ 4 చివరి దశకు చేరుకోవడంతో టాప్ 5లో ఎవరు ఉంటారనేది ప్రస్తుతం అందరిలో ఉన్న అనుమానం. అయితే టికెట్ టూ ఫినాలే సాధించిన అఖిల్ మినహా ఈ వారం అభిజిత్, సోహైల్, అరియానా, హారీక, మోనాల్ నామినేషన్స్‏లో ఉన్నారు. హౌస్ నుంచి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ ఆదివారం ఒకరు ఎలిమినేట్ అయితే మొత్తంగా ఐదుగురు మాత్రమే ఇంట్లో ఉంటారు. ప్రస్తుతం హౌస్‏లో ముగ్గురు ఫీమేల్ కంటెస్టెంట్లు, ముగ్గురు మేల్ కంటెస్టెంట్లు ఉన్నారు.

అయితే ఓటింగ్ విషయానికి వస్తే అభిజిత్‏కు ఎలాగు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండడంతో ఈసారి కూడా అతను టాప్‏లోనే ఉండనున్నాడు. ఆ తర్వాతి స్థానంలో సోహైల్‏ ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా బిగ్‏బాస్ దత్తపుత్రిక నామినేషన్స్‏లో ఉన్నా లేనట్లే. ఎందుకంటే తనకు ఓట్లు వచ్చినా రాకపోయిన బిగ్‏బాస్ ఆమెను ఎలిమినేట్ చేయడు అనే ఇన్ని రోజులు జరిగిన ఎలిమినేషన్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఈసారి కూడా మోనాల్ సేవ్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. ఇక మిగిలింది అరియానా, హారిక.

ఇక ఇప్పటి వరకు సూటీగా మాట్లాడుతూ.. మేల్ కంటెస్టెంట్లకు పోటీ ఇస్తూ స్ట్రాంట్‏గా గేమ్ ఆడోతూ వస్తుంది అరియానా. దీంతో అరియానాకు కూడా బయట ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. ఇక హారిక ఎప్పుడూ.. తనకు తన ఫ్యాన్స్‏తో పాటు అభిజిత్ ఫ్యాన్స్ కూడా ఓట్లు వేస్తూ హారికను సేవ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ వారం చివరి నామినేషన్స్ కావడంతో అభిజిత్ ఫ్యాన్స్ హారికకు బదులుగా అభిజిత్‏కు మాత్రమే ఓట్లు వేసేలా ఉన్నారు. అలా అయితే నామినేషన్స్‏లో ఉన్న ఐదుగురిలో హారికకు మాత్రమే తక్కువ ఓట్లు వచ్చే విధంగా ఉన్నాయి. దీంతో హారిక ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతుంది.

Related Images:

హారిక ఇచ్చిన షాక్ కు అభిజిత్ కంట కన్నీరు

బిగ్ బాస్ లో ఈ వారం నామినేషన్ ప్రేక్షకులు ఊహించని విధంగా జరిగాయి. ఈసారి ఇద్దరికి మించి నామినేట్ చేసే అవకాశంను బిగ్ బాస్ ఇచ్చాడు. కాని మోనాల్ మరియు అరియానాలు మాత్రమే ముగ్గురుని చేశారు. మిగిలిన వారు అంతా ఇద్దరు చొప్పున చేశారు. అభిజిత్ ను హారిక నామినేట్ చేస్తున్నట్లుగా చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. అదే సమయంలో అభిజిత్ కూడా కన్నీరు పెట్టుకున్నాడు. టాస్క్ చేసేందుకు ఒప్పుకోక పోవడమే దీనికి కారణం అంటూ హారిక చెప్పింది. ఆ టాస్క్ ఎందుకు చేయలేదు అనే విషయం నీకు తెలుసు. నీవే నన్ను నామినేట్ చేయడం ఏంటీ అన్నట్లుగా అభిజిత్ ఎమోషనల్ అయ్యాడు. ఆ సమయంలో హారిక కూడా ఏడుపు దిగమింగుకుంది.

అభిజిత్ మరియు అవినాష్ ను హారిక నామినేట్ చేసింది. అవినాష్ ను ఆమె నామినేషన్ చేయడం పెద్దగా షాకింగ్ గా అనిపించలేదు. ఆ తర్వాత అభిజిత్ మళ్లీ హారికను నామినేట్ చేశాడు. మోనాల్ వల్ల తనకు ఎందుకో మొదటి నుండి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. కాని వల్ల చాలా ఇబ్బంది పడ్డట్లుగా అనిపించింది. అందుకే మోనాల్ ను నేను నామినేట్ చేస్తున్నాను అంటూ అభిజిత్ తన వద్ద ఉన్న కలర్ వాటర్ దాదాపు పూర్తిగా పోశాడు. కేవలం 50 ఎంఎల్ మాత్రమే ఉంచి దాన్ని హారిక కంటైనర్ లో పోశాడు. అఖిల్ తో గొడవ ఇక్కడితో వదిలేద్దాం అనుకుని ఈ పని చేస్తున్నట్లుగా అన్నాడు.

తాజా నామినేషన్ ఎపిసోడ్ లో అభిజిత్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఇక మరో ఆసక్తికర విషయం ఏంటీ అంటే మోనాల్ టైం వచ్చినప్పుడు ఆమె చాలా సీరియస్ అయ్యింది. మొదట అవినాష్ ను నామినేట్ చేసిన ఆమె నీ కంటే నేను స్ట్రాంగ్ మళ్లీ నన్ను వీక్ అనొద్దు. ఆ విషయాన్ని ప్రేక్షకులు కూడా నిరూపించారు అంటూ మోనాల్ చెప్పింది. ఇక అభిజిత్ మరియు అఖిల్ లను కూడా నామినేట్ చేసింది. అభిజిత్ పెద్దగా స్పందించలేదు కాని అఖిల్ మాత్రం చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు. ఇద్దరి మద్య మాటల యుద్దం సాగింది.

ఆ కోపంలో ఉండగా అరియానా వచ్చి నామినేట్ చేయడం ఆ సమయంలో అవినాష్ తెలుగులో మాట్లాడాలంటూ చెప్పడం తో మోనాల్ కు తిక్క రేగినంత పనైంది. ఆమె సహనం కోల్పోయి అరిచేసింది. మొత్తానికి సోహెల్ మరియు అరియానా మినహా మిగిలిన అయిదుగుర అఖిల్.. అభిజిత్.. అవినాష్.. హారిక మరియు మోనాల్ లు ఈ వారం నామినేషన్ లో ఉన్నారు. మరి వీరిలో ఈ వారం పోయేది ఎవరో చూడాలి.

Related Images:

బిబి4 : అభిజిత్ విన్నర్ అయినా విమర్శలే.. కాకున్నా విమర్శలే

బిగ్ బాస్ రెండవ సీజన్ విజేత కౌశల్ అంటూ అయిదు ఆరు వారాల ముందే తేలిపోయింది. కౌశల్ ఆర్మీ నెటింట చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆయన కాకుండా మరెవ్వరికి బిగ్ బాస్ విన్నర్ టైటిల్ ఇచ్చినా కూడా ఊరుకునే పరిస్థితి లేదు అన్నంతగా హడావుడి కొనసాగింది. ఇప్పుడు అదే విధంగా అభిజిత్ విషయంలో జరుగుతుంది. అభిజిత్ కోసం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ నడుస్తోంది. అతడికి మద్దతుగా వేలాది మంది ఉన్నారు. సోషల్ మీడియాలో అతడి కోసం ట్రెండ్ లు కూడా నడుస్తున్నాయి అంటే ఏ స్తాయిలో అతడికి మద్దతు ఉందో అర్థం చేసుకోవచ్చు.

కౌశల్ ప్రతి టాస్క్ లో కూడా ఎంతో కష్టపడి చేసేవాడు. ప్రతి విషయంలో కూడా తన నూరు శాతం ఇచ్చేవాడు. కాని అభిజిత్ మాత్రం టాస్క్ ల విషయంలో చాలా సార్లు నిరాశ పర్చాడు. ఎక్కువగా ఎమోషన్స్ పలికించక పోవడం వల్ల ఆయన పట్ల బిగ్ బాస్ కూడా అసహనంతో ఉన్నాడు. గత వారంలో టాస్క్ చేసేందుకు నిరాకరించడంతో బిగ్ బాస్ తో పాటు నాగార్జున కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏకంగా మెయిన్ డోర్ ఓపెన్ చేసి వెళ్లి పోతావా అంటూ ప్రశ్నించాడు.

టాస్క్ ల విషయంలో ఒక్కటి రెండు సార్లు తప్ప అతడు ఎప్పుడు కూడా ఫిజికల్ గా పోరాడిన సందర్బాలు లేవు. అదే సమయంలో డాన్స్ కూడా చేసేందుకు ఇష్టపడడు. అలాంటి అభిజిత్ విన్నర్ అవ్వడం ఎంత వరకు కరెక్ట్ అంటూ అతడి యాంటీ ఫ్యాన్స్ తో పాటు బిగ్ బాస్ నిర్వాహకులు కూడా అంటున్నారు. బిగ్ బాస్ విజేత అంటే అన్ని విధాలుగా స్ట్రాంగ్ అయ్య ఉండాలి. కాని అభిజిత్ ఫిజికల్ గా స్ట్రాంగ్ కాదు. అందుకే ఆయన విజేత ఎలా అవుతాడు అంటున్నారు. శనివారం ఎపిసోడ్ లో మొత్తం కూడా అభిజిత్ ను టార్గెట్ చేశారు.

అతడిని అంతా వ్యతిరేకించేలా నాగార్జున ప్రయత్నించాడని.. బిగ్ బాస్ నిర్వాహకులకు అభిజిత్ విజేత అవ్వడం ఇష్టం లేనట్లుందని ఆరోపణలు వస్తున్నాయి. ఒక వేళ అభిజిత్ విన్నర్ అయితే టాస్క్ లు చేయని వ్యక్తిని విన్నర్ గా నిలిపారు అంటూ కొందరు విమర్శలు చేసే అవకాశం ఉంది. విన్నర్ కాకుంటే అభిజిత్ ఫ్యాన్స్ ఓటింగ్ ఆధారంగా విన్నర్ ఎంపిక కాలేదు అంటూ ట్రోల్స్ చేసే అవకాశం ఉంది. కనుక బిగ్ బాస్ నిర్వాహకులకు పెద్ద చిక్కొచ్చి పండింది.

Related Images:

నాగ్ ను ట్రోల్ చేస్తున్న అభిజిత్ ఫ్యాన్స్

బిగ్ బాస్ తెలుగు 2వ సీజన్ లో కౌశల్ ను ఎప్పుడైనా హోస్ట్ నాని ఏమైన్నా అన్నాడంటే వెంటనే ఆయనపై కౌశల్ ఆర్మి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్స్ మొదలు పెట్టేది. బిగ్ బాస్ కు నాని సూట్ కాడు అంటూ ఎన్నో సార్లు హ్యాష్ ట్యాగ్ ను నెటిజన్స్ ట్రెండ్ చేయడం జరిగింది. కౌశల్ ఆర్మీ తర్వాత ఇప్పుడు అభిజిత్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున చాలా తీవ్రంగా అభిజిత్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మెయిన్ గేట్ ఓపెన్ చేయించి పంపిస్తానన్నట్లుగా హెచ్చరించాడు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు బిగ్ బాస్ టాస్క్ లు చేయాల్సిందే. అది ఖచ్చితంగా పాటించాల్సిన రూల్. ఈ వారం నువ్వు రెండు టాస్క్ లను కూడా చేయకుండా దూరంగా ఉన్నావంటూ అభిజిత్ ను నాగార్జున టార్గెట్ చేశాడు.

నాగార్జున చాలా సీరియస్ గా అభిజిత్ ను మందలించడంతో నెట్టింట అభిజిత్ అభిమానులు స్టాప్ టార్గెటింగ్ అభి అంటూ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు. అభిని ఎందుకు అందరు కూడా టార్గెట్ చేస్తున్నారు అంటూ ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు చాలా సీరియస్ గా ట్విట్టర్ లో ఆ హ్యాష్ ట్యాగ్ తో పోస్ట్ లు చేశారు. చాలా మంది నాగార్జునను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. అభిజిత్ ఏం మాట్లాడినా కరెక్ట్ గా మాట్లాడుతాడు.. ఆలోచించి మాట్లాడుతాడు. అలాంటి అభిజిత్ ను ఎలా మీరు టార్గెట్ చేస్తారు అంటూ నాగార్జునపై నెటిజన్స్ మండి పడ్డారు.

ఇదే సమయంలో హారిక విషయంలో కూడా నాగార్జున వ్యవహరించిన తీరును నెటిజన్స్ వ్యతిరేకిస్తున్నారు. కన్ఫెషన్ రూంకు పిలిచి మరీ కెప్టెన్సీలో జరిగిన తప్పులను వల్లె వేయడం ఏంటీ.. ఆమె తప్పు చేశాను అంటూ ఒప్పుకునే వరకు ఆమెను మళ్లీ మళ్లీ మాటలతో నాగార్జున ఒప్పించడం ఏంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు. మోనాల్ విషయంలో తనకు అనిపించింది హారిక కెప్టెన్ గా చేసింది. అది ఆమె గేమ్. దాన్ని నాగార్జున ఎందుకు ప్రశ్నించాడో అర్థం కావడం లేదు అంటూ ఆయన తీరుపై ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ తో నాగార్జునపై చాలా పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి.

Related Images:

బిబికి వెళ్లనా అంటూ అభిజిత్ అడిగాడు : వర్షిణి

ఈమద్య కాలంలో బుల్లి తెరపై ఎక్కడ చూసినా కూడా యాంకర్ వర్షిణి కనిపిస్తుంది. ఢీ జోడీలో ఈమె సందడి మామూలుగా ఉండదు. అందుకే ఈమెకు వరుసగా ఏదో ఒక షోకు ఆఫర్ వస్తూనే ఉంది. ఈమె బిగ్ బాస్ కంటెస్టెంట్ అభిజిత్ తో కలిసి పెళ్లి చూపులు వెబ్ సిరీస్ ను చేసింది. ఆ వెబ్ సిరీస్ మూడు సీజన్ లు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అభిజిత్ తో కలిసి వర్క్ చేసిన అనుభవం ఉండటంతో పాటు అతడు తనకు మంచి స్నేహితుడు అవ్వడం వల్ల ఖచ్చితంగా అతడి గురించి తెలిసిన నాకు అతడు విజేతగా నిలుస్తాడనే నమ్మకంగా ఉందని చెప్పుకొచ్చింది.

తాజాగా యాంకర్ రవికి అక్క తో కలిసి ఇంటర్వ్యూ ఇచ్చిన వర్షిణి తన నమ్మకం మరియు విశ్లేషణ ప్రకారం అరియానా మరియు అభిజిత్ లు టాప్ లో ఉంటారు అనిపిస్తుంది. నాకు అభి స్నేహితుడు కాబట్టి అతడే గెలవాలని కోరుకుంటాను అంది. ఇక అభిజిత్ బిగ్ బాస్ కు వెళ్లే ముందు నాకు కాల్ చేసింది. నీకు టీవీ రంగం గురించి ఎక్కువ అవగాహణ ఉంది కదా. నాకు బిగ్ బాస్ నుండి ఆఫర్ వచ్చింది. వెళ్తే ఎలా ఉంటుంది అంటూ అడిగాడు. ఆ సమయంలో నేను నీవు తెలివిగా ఆలోచిస్తావు కనుక తప్పకుండా నీకు ఆ గేమ్ ఉపయోగంగా ఉంటుంది. నీవు అందులో నెగ్గుకు రాగలవు అంటూ చెప్పాను అంది. నేను అనుకున్నట్లుగానే అభిజిత్ బిబి హౌస్ లో మంచి ప్రదర్శణ ఇస్తున్నాడు అంటూ వర్షిణి పేర్కొంది.

Related Images:

విన్నర్ అయ్యేందుకు అభిజిత్ కు మరో ఓటు పడింది

బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ అంటూ ఎంత బలంగా ప్రచారం జరిగిందో ఇప్పుడు అంతగా కాకున్నా ఒక మోస్తరుగా అభిజిత్ విన్నర్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో అత్యధిక సోషల్ మీడియా క్రేజ్ ఉన్న వ్యక్తి అభిజిత్. అందుకే అభిజిత్ విన్నర్ అవుతాడు అంటూ అంతా బలంగా నమ్ముతున్నారు. కౌశల్ ఇటీవల తన వీడియోలో అభిజిత్ కు విజేత అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ విశ్లేషించాడు. ఇంకా చాలా మంది కూడా అభిజిత్ వైపు మొగ్గు చూపుతున్నారు. దాంతో ఆయన బలం మరింతగా పెరిగినట్లయ్యింది.

ఎంతో మంది ఆయన వైపు ఉంటే మనం మాత్రం వేరే ఎందుకు ఉండాలి అన్నట్లుగా న్యూట్రల్ గా ఉన్న వారు అభిజిత్ వైపు వెళ్తున్నారు. తాజాగా అభిజిత్ వెయిట్ మరింత పెరిగేలా నాగార్జున భార్య అయిన అమల అక్కినేని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో అభిజిత్ తల్లిగా అమలా అక్కినేని నటించిన విషయం తెల్సిందే. అప్పటి విషయాలను ఆమె గుర్తు చేసుకోవడంతో అభిజిత్ కు సంబంధించిన గ్రాఫ్ మరింతగా పెరిగింది.

అభిజిత్ చాలా సౌమ్యుడు.. పెద్దల పట్ల గౌరవం ఉన్న కుర్రాడు. నా కొడుకులాగా అభిజిత్ ను భావిస్తాను షూటింగ్ సమయంలో అభిజిత్ నన్ను తన తల్లి మాదిరిగా గౌరవించేవాడు అంటూ అమలా చెప్పుకొచ్చారు. అమలా చాలా పాజిటివ్ గా అభిజిత్ గురించి మాట్లాడటంతో అతడి మరింత పెరిగింది. అతడి అభిమానులు సోషల్ మీడియాలో అమలా మాటలను షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటూ మరింత మందిని అభిజిత్ అభిమానుల క్లబ్ లో చేర్చే ప్రయత్నం చేస్తున్నారు.

మరో మూడు వారాలు ఉన్న బిగ్ బాస్ విజేత ఎవరు అనే స్పష్టత అయితే వచ్చినట్లుగా అనిపిస్తుంది. కాని బిగ్ బాస్ లో ఏమైనా జరగవచ్చు. జనాల ఓట్ల ప్రకారమే అన్ని జరగవు అని గతంలో అనధికారికంగా నిరూపితం అయ్యింది. కనుక అభిజిత్ విజేత అయ్యేనా లేదా అనేది చివరి రోజు వరకు నూరు శాతం క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

Related Images:

బిబి4 : అతడికి ఆమెపై ప్రేమ.. అమ్మ గరంగరం

ఈ సీజన్ లో మొదటి సారి ఈ వారం ఎలిమినేషన్ నామినేషన్ పక్రియ రెండు రోజుల పాటు జరిగింది. మొదటి రోజు కోడి గుడ్లను కొట్టి ఒకొక్కరు ఇద్దరిని చొప్పున నామినేట్ చేయాల్సిందిగా బిగ్ బాస్ సూచించాడు. సోమవారం ప్రారంభం అయిన ఎలిమినేషన్ నామినేషన్ పక్రియ మంగళవారం ఎపిసోడ్ మొత్తం కూడా కొనసాగింది. గుడ్డు కొట్టే పక్రియలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ముఖ్యం రాజశేఖర్ మాస్టర్ పై అభిజిత్ మరియు అఖిల్ లు గుడ్డు పగులకొట్టే సమయంలో రచ్చ రచ్చ జరిగింది. అభిజిత్ మరియు అమ్మ ల మద్య జరిగిన గొడవ పతాక స్థాయికి చేరింది. గొడవ మద్యలో కల్పించుకునేందుకు హారిక ప్రయత్నించగా నువ్వు నోరు ముయ్యి అంటూ ఆమెను చాలా గట్టి స్వరంతో అమ్మ రాజశేఖర్ అరవడం ఆమెను బాధ పెట్టింది.

కష్టపడ్డ వారికి బాధ తెలుస్తుంది.. నువ్వు ఏం చేశావ్ అంటూ అభిజిత్ ను అమ్మ రాజశేఖర్ ప్రశ్నించాడు. ఇద్దరి మద్య వాడివేడిగా చర్చ జరిగింది. అఖిల్ వంతు వచ్చిన సమయంలో మీరు వెళ్తా వెళ్తా అంటున్నారు కనుక మిమ్ములను నామినేట్ చేస్తున్నాను అంటూ అమ్మ రాజశేఖర్ ను నామినేట్ చేశాడు. ఆ తర్వాత మోనాల్ ను అఖిల్ నామినేట్ చేశాడు. నీకు క్లారిటీ మిస్ అవుతుంది అంటూ అఖిల్ రీజన్ చెప్పడం మోనాల్ కు అస్సలు నచ్చలేదు. నా నుండి అఖిల్ కు ఫ్రెండ్ షిప్ లో మోర్ లభించలేదు. అందుకే నామినేట్ చేశాడు అంటూ మాట జారేసింది. మొత్తానికి ఈ వారం ఎలిమినేషన్ కు నామినేట్ అయిన వారు అమ్మ రాజశేఖర్ మోనాల్ అవినాష్ అభిజిత్ మరియు హారిక అంటూ బిగ్ బాస్ ప్రకటించాడు.

తర్వాత రోజు నామినేషన్ పక్రియ ఇంకా పూర్తి అవ్వలేదు. నామినేట్ అయిన అయిదుగురిలో ఒక్కరు సేవ్ అయ్యే అవకాశం బిగ్ బాస్ ఇస్తున్నాడు. మొహం జాగ్రత్త అంటూ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో భాగంగా నామినేట్ అయిన వారు టీ స్టాండ్ పై తల పెట్టి ఉండాలి. వారిని కదిలించేందుకు ఇతరులు ప్రయత్నించాలి. అలా ప్రయత్నించడంకు గడ్డం మట్టి ఐస్ క్యూస్ కొడి గుడ్లు ఇలా ఎన్నో రకాల ఐటెంలను ఉంచారు. వాటితో నామినేట్ అయిన వారికి చుక్కలు చూపించే ప్రయత్నం చేశారు. ఇది హధ్దు దాటుతుంది అంటూ అభిజిత్ వెళ్లి పోగా హారిక రెండు సార్లు కదలడంతో ఆమెను తప్పించారు.

మిగిలిన ముగ్గురు కూడా కదలక పోవడంతో బజర్ మోగడంతో ఎవరు సేవ్ అవ్వలేదు అంటూ ప్రకటించారు. మోనాల్ పై మట్టి పోసి ఇబ్బంది పెట్టేందుకు సోహెల్ మరియు మెహబూబ్ ప్రయత్నించగా అఖిల్ ఆమె మొహం తుడ్చి ఆమె కళ్లలో మట్టిని తొలగించే ప్రయత్నం చేశాడు. ఆమెను నామినేట్ చేసినా కూడా అతడికి ఆమెపై ప్రేమ అభిమానం ఉన్నట్లుగానే అనిపించింది. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ లో మొత్తం పరిస్థితి మారిపోయింది. ఎవరు ఎవరు ఏంటీ ఎవరితో ఉన్నారు అనే విషయంలో క్లారిటీ వచ్చేసింది.

Related Images:

బిబి4 : ఈసారి అభిజిత్ వర్సెస్ అవినాష్

బిగ్ బాస్ 9వ వారం ఎలిమినేషన్ పక్రియ నిన్నటి ఎపిసోడ్ లో జరిగింది. సాదారణంగా అయితే సోమవారం ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు అనే విషయంపై క్లారిటీ వచ్చేది. కాని నిన్న ఇతర ముఖ్యమైన సన్నివేశాలు సంఘటనలు కవర్ చేయాల్సి రావడంతో ఎలిమినేషన్ నామినేషన్ పక్రియ పూర్తిగా ప్రసారం చేయలేదు.

నేడు కూడా ఎలిమినేషన్ నామినేషన్ పక్రియ ప్రసారం కాబోతుంది. నేటి ఎపిసోడ్ పూర్తి అయిన తర్వాత ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవుతాయి. ఎలిమినేషన్ నామినేషన్ పక్రియలో భాగంగా ఒకొక్కరు ఇద్దరిపై ఒక్కో కోడిగుడ్డు పగులకొట్టాల్సి ఉంటుంది. కెప్టెన్ అయిన అరియానాపై ఎవరు కూడా గుడ్డు పగులకొట్టే వీలు లేదని బిగ్ బాస్ ప్రకటించాడు.

నామినేషన్ పక్రియ అరియానాతో ప్రారంభం అయ్యింది. మొదటి గుడ్డును హారికపై పగులకొట్టి నామినేట్ చేస్తున్నట్లుగా చెప్పింది. ఆ తర్వాత తన కెప్టెన్సీ బాధ్యతలను సరిగా నిర్వహించనివ్వడం లేదు.. తాను చెప్పింది సరిగా చేయడం లేదు అంటూ సోహెల్ ను నామినేట్ చేస్తున్నట్లుగా చెప్పి గుడ్డు అతడిపై పగులకొట్టి నామినేట్ చేస్తున్నట్లుగా చెప్పింది. ఈ సమయంలో సోహెల్ అరియానా మద్య గొడవ జరిగింది.

అరియానా తర్వాత అవినాష్ ను నామినేట్ చేయాల్సిందిగా బిగ్ బాస్ చెప్పాడు. మొదట అభిజిత్ తలపై గుడ్డు పగులకొట్టి ఆ తర్వాత హారిక తలపై గుడ్డు పగుల కొట్టి నామినేట్ చేస్తున్నట్లుగా చెప్పాడు. తనది చిల్లర కామెడీ అంటున్న సమయంలో వివరణ ఇచ్చుకోకుండా అభిజిత్ చేశాడు అంటూ అవినాష్ అసహనం వ్యక్తం చేశాడు.

సోహెల్ వంతు వచ్చిన సమయంలో నాకు అరియానాపై కొట్టాలని ఉన్నా కెప్టెన్ అవ్వడం వల్ల ఈ వారం వీలు పడటం లేదు వచ్చే వారం చూసుకుందాం అంటూ వెళ్లి మోనాల్ మరియు అభిజిత్ లపై గుడ్డు పగులకొట్టి నామినేట్ చేస్తున్నట్లుగా చెప్పాడు. అభిజిత్ తన వంతు వచ్చిన సమయంలో మొదటగా అవినాష్ ను నామినేట్ చేస్తున్నట్లుగా గుడ్డు పగులకొట్టాడు. ఆ సమయంలో ఇద్దరి మద్య మాటల తూటాలు పేళాయి.

కామెడీ చేసేందుకు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు నేను ఇక్కడ ఉన్నాను. నేను కామెడీ చేస్తాను అన్నాడు. నువ్వు ఎలాగూ చేయవు కనీసం నన్ను కూడా చేయవద్దంటే ఎలా అంటూ అవినాష్ చాలా సీరియస్ అయ్యాడు. నా కామెడీని నాగార్జున గారే మెచ్చుకున్నారు అంటూ అవినాష్ చెప్పాడు. ఇక నేటి ఎపిసోడ్ లో మరింత రచ్చ ఎలిమినేషన్ నామినేషన్ సందర్బంగా జరుగబోతుంది. ప్రోమోలో అమ్మ రాజశేఖర్ చాలా సీరియస్ అయినట్లుగా చూపిస్తున్నారు. నేడు మిగిలిన వారు ఎవరు ఎవరిని నామినేట్ చేస్తారో చూడాలి.

Related Images:

వర్కౌట్ అవ్వని అభిజిత్ ప్లాన్.. కెప్టెన్ అయిన సోహెల్

బిగ్ బాస్ ఈ వారం ఇచ్చిన టాస్క్ బిబి హోటల్ సాదా సీదాగా సాగిపోయింది. పెద్దగా వివాదం లేకుండా ఎవరికి వారు అన్నట్లుగా గేమ్ ఆడారు. గెస్ట్ ల టీం ఇవ్వాల్సిన స్టార్ లను హోటల్ మేనేజర్ అయిన అభిజిత్ కొట్టేయడం వాటిని అ తర్వాత హారిక చేతుల మీదుగా మళ్లీ వాటిని తీసుకుని గెస్ట్ లు ఆ స్టార్స్ ఇచ్చారంటూ అభిజిత్ ప్రకటించడం జరిగింది. టాస్క్ లో భాగంగా హోటల్ వారు ఇచ్చిన ఏ ఒక్క సర్వీసు నచ్చని కారణంగా ఒక్క స్టార్ కంటే ఎక్కువ ఇవ్వలేదని ధనికుల టీం చెప్పింది.

టాస్క్ ముగిసిన తర్వాత బిగ్ బాస్ హోటల్ సిబ్బందిని మీకు ధనికుల టీం ఎన్ని పాయింట్స్ ఇచ్చింది అంటూ ప్రశ్నించగా అయిదు స్టార్స్ అంటూ అభిజిత్ పేర్కొన్నాడు. ఆ సమయంలో ధనికుల టీం మేము మాత్రం ఆ స్టార్స్ ఇవ్వలేదు ఒకే ఒక్క స్టార్ మాత్రమే ఇచ్చాం బిగ్ బాస్ అంటూ చెప్పారు. కొద్ది సమయం చర్చ తర్వాత ఇంటి సభ్యులు కేవలం ఒక్క స్టార్ మాత్రమే ఇచ్చినట్లుగా పేర్కొంటూ ధనికుల టీం గెలిచినట్లుగా పేర్కొన్నారు.

గెలుపొందిన ధనికుల టీం నుండి ఒక ఉత్తమ ప్రదర్శణ కనబర్చిన వారిని ఎంపిక చేయాలంటూ బిగ్ బాస్ చెప్పగా ఇంటి సభ్యులు ఎవరికి వారు తామే బెస్ట్ అనుకుంటున్నట్లుగా చెప్పారు. ఆ తర్వాత సోహెల్ మరియు మెహబూబ్ ల మద్య చర్చ జరిగింది. కాయిన్ టాస్క్ లో నీకు నేను సాయం చేశాను కనుక ఈసారి నువ్వు నాకు మద్దతుగా నిలవాల్సిందే అంటూ సోహెల్ డిమాండ్ తో మెహబూబ్ కన్విన్స్ అవ్వలేదు. ఇద్దరి మద్య చాలా సమయం చర్చ జరిగింది. చివరకు మీ ఇద్దరితో పాటు నేను కూడా పోటీలో ఉంటాను అంటూ అరియానా రావడంతో ఆమెకు చోటు కల్పించడం ఎందుకు అనుకున్న మెహబూబ్ సరే అంటూ సోహెల్ ను ఏకగ్రీవంగా ఎంపిక చేస్తున్నట్లుగా ప్రకటించారు. దాంతో సోహెల్ ను మొదటి కెప్టెన్సీ పోటీదారుగా ప్రకటించారు.

హోటల్ సిబ్బంది టీం లో అఖిల్ ఎక్కువ టిప్పు పొందిన కారణంగా అతడిని రెండవ కెప్టెన్సీ పోటీదారుగా బిగ్ బాస్ ప్రకటించాడు. ఇక సీక్రెట్ టాస్క్ ను విజయవంతంగా నిర్వహించిన అవినాష్ ను మూడవ కెప్టెన్ పోటీ దారుగా ప్రకటించారు. వీరి ముగ్గరురికి మంచు నిప్పు టాస్క్ ను ఇవ్వడం జరిగింది. వెనకాల నిప్పుల కుంపటి వంగి చేతిలో ఐస్ బౌల్స్ పట్టుకోవాల్సి ఉటుంది. ఎక్కువ సేపు ఎవరు నిల్చుంటే వారు విన్నర్స్. అఖిల్ మొదట తప్పుకోగా.. అవినాష్ ఇంకా సోహెల్ లు చాలా సమయం ఉన్నారు. అవినాష్ ఇక తన వల్ల కాదంటూ తప్పుకోవడంతో సోహెల్ విజేతగా నిలిచాడు. కెప్టెన్ గా సోహెల్ ఎంపిక అయ్యాడంటూ సంజాలక్ అభిజిత్ ప్రకటించి కెప్టెన్ బ్యాండ్ పెట్టాడు.

Related Images:

బిబి4 : పుచ్చ లేపుతానన్న మెహబూబ్..కూల్ గా హారికను బుక్ చేసిన అభిజిత్

బిగ్ బాస్ ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల మరియు లగ్జరీ బడ్జెట్ టాస్క్ బిబి హోటల్ గందరగోళంగా మారింది. హోటల్ సిబ్బంది ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు వ్యవహరిస్తున్నారు. ఇక ధనికులు అయిన వారు సర్వీసులు పొంది టిప్పు ఇవ్వక పోవడం మరియు స్టార్ లు ఇవ్వకుండా ఆడుతున్నారు. ఇది ఎంత వరకు కరెక్ట్ అంటూ సిబ్బంది టీం వారు పదే పదే వారిని అడిగారు. ముఖ్యంగా మెహబూబ్ మరియు సోహెల్ లు టిప్పుగా ఒక్కరూపాయి ఇవ్వకూడదని అనుకున్నట్లున్నారు. దాంతో ఇంటి సభ్యులకు చిర్రెత్తుకు వచ్చింది. ఇదే సమయంలో అవినాష్ మాటలతో మెహబూబ్ రెచ్చి పోయాడు.

ఇద్దరి మద్య మాటలు ముదిరాయి. ఎవడైనా ఎక్కువ మాట్లాడితే పుచ్చ లేసి పోతుందంటూ మెహబూబ్ చాలా సీరియస్ గా అనడంతో అఖిల్ జోక్యం చేసుకుని మాటలు జాగ్రత్తగా రానివ్వు అంటూ హెచ్చరించాడు. అందరిని కలిపి ఏం మాటలు అవి అంటూ సీరియస్ అయ్యాడు. అవినాష్ నీ రౌడీయిజం ఇంటి వద్ద చూపించుకో అంటూ మెహబూబ్ కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

కొంత సమయం తర్వాత సోహెల్ కూడా అంత మాట అనకూడదురా అనడంతో తన తప్పు తెలుసుకున్న మెహబూబ్ అభిజిత్.. అఖిల్.. అవినాష్ వద్దకు వెళ్లి సారీ చెప్పాడు. ఆ తర్వాత మళ్లీ ఆట కొనసాగింది. ఆటలో భాగంగా తమ టీంకు దక్కాల్సిన స్టార్స్ ను ముందే అభిజిత్ తెలివిగా నొక్కేశాడు. ఇక తనకు ఇచ్చిన సర్వీస్ లు నచ్చడంతో తన వంతుగా ఒక స్టార్ ఇస్తానంటూ హారిక అంది. అయితే అప్పటికే స్టార్స్ అభిజిత్ వద్ద ఉండటంతో మొత్తం స్టార్ లు ఆమె చేతిలో పెట్టాడు. మొత్తం అక్కర్లేదు నాకు ఒకటి చాలు. ఆ ఒక్కటి నేను ఇస్తున్నాను అంటూ నాలుగు మరియు ఒకటి మళ్లీ అభిజిత్ చేతిలో పెట్టింది. దాంతో అభిజిత్ ధనికుల నుండి మా చేతికి అయిదు స్టార్స్ వచ్చాయి. హారిక ఆ జట్టు సభ్యురాలు అవ్వడం వల్ల ఆమె నుండి మాకు స్టార్స్ వచ్చాయంటూ అభిజిత్ ఆమెను బుక్ చేశాడు.

హారిక కెమెరా ముందుకు వచ్చి నేను ఒకే ఒక్క స్టార్ ఇచ్చాను. ఇతర స్టార్స్ విషయం నాకు తెలియదు అంటూ చెప్పింది. అభిజిత్ చీటింగ్ కు హారిక కన్నీరు పెట్టుకుంది. తనను చీటింగ్ చేసి అభిజిత్ నా చేత మొత్తం స్టార్స్ ఇప్పించుకున్నాడు అంటూ హారిక చిన్న పిల్లల కన్నీరు పెట్టుకుంది. ఇక నేటి ఎపిసోడ్ లో గేమ్ కు ఎలాంటి ముగింపు ఉంటుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మైండ్ గేమ్ ఆడిన అభిజిత్ కు బిగ్ బాస్ నుండి ఎలాంటి మాట వస్తుంది. అసలు గేమ్ ఎలా సాగిందనే విషయంపై బిగ్ బాస్ ఎలా రియాక్ట్ అవుతాడు అనేది నేటి ఎపిసోడ్ లో చూడాలి.

Related Images: