ప్రభాస్ `ఆదిపురుష్ 3డి` ప్రస్తుతం ట్రెండీ టాపిక్. భారతీయ పురాణేతిహాసం రామాయణం ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. ఓంరౌత్ దర్శకత్వం వహించనున్నారు. పాన్ ఇండియా కేటగిరీలో తెరకెక్కనున్న 3 డి యాక్షన్ డ్రామా ఇది. ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ లంకేష్ గా రావణుడి పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మణుడి పాత్రకు సోనూకి టిటులీ ఫేం.. బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ ని ఎంపిక చేశారన్న కథనాలొచ్చాయి.
ఇంతకీ సీత ఎవరు? అన్న ప్రశ్నకు ఇప్పటివరకూ సరైన ఆన్సర్ లేదు. సీత పాత్రకు పలువురు నాయికల పేర్లను పరిశీలించిన ఓంరౌత్ తాజాగా కృతి సనోన్ ని ఫైనల్ చేశారని కథనాలొస్తున్నాయి. కృతి తెలుగు తెరకు కొత్తేమీ కాదు. ఇంతకుముందు మహేష్ సరసన `1నేనొక్కడినే`.. నాగచైతన్య సరసన `దోచేయ్` చిత్రాల్లో నటించింది.
ఇప్పుడు క్రేజీగా డార్లింగ్ ప్రభాస్ పాన్ ఇండియా చిత్రంలో ఆఫర్ దక్కించుకుంటోందన్న వార్త ఆసక్తిని పెంచుతోంది. అయితే కృతి ఎంపికపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ప్రస్తుతానికి బాలీవుడ్ మీడియా కథనాల్లో కృతి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కృతి ప్రస్తుతం బాలీవుడ్ లో పలు క్రేజీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఆదిపురుష్ 3డిని అత్యంత భారీ బడ్జెట్ తో టీసిరీస్ నిర్మించనుంది.
డార్లింగ్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో స్పీడ్ పెంచేశాడు. ఇప్పటికే నాగ్ అశ్విన్ తో పాన్ వరల్డ్ సినిమాని ప్రకటించి.. ఆ వెంటనే తానాజీ దర్శకుడు ఓంరౌత్ ప్రాజెక్టును ఖాయం చేసుకున్నాడు. ఓంరౌత్ తో ఆదిపురుష్ 3డి అంటూ టైటిల్ ప్రకటించేసి షాకిచ్చాడు. జనవరి నుంచి సెట్స్ కి వెళ్లిపోతున్నారు
ఇక ఈ చిత్రంలో ఏ పాత్రకు ఎవరిని ఎంపిక చేశారు? అన్నదానిపైనా ఇప్పటికే రకరకాల లీకులు అందాయి. ఇది భారతీయ పురాణేతిహాసం రామాయణం ఆధారంగా రూపొందుతున్న సినిమా. శ్రీరాముడిగా ప్రభాస్ నటిస్తుండగా రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తారు. ఇవన్నీ ఫిక్షనల్ క్యారెక్టర్స్ అని ఓంరౌత్ వెల్లడించారు.
అయితే ఇందులో సీత ఎవరు? లక్ష్మణుడు ఎవరు? అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. సీత పాత్రధారిని ఇంకా ఓంరౌత్ లీక్ చేయలేదు కానీ.. లక్ష్మణుడి పాత్ర మాత్రం రివీలైంది. `సోను కె టిటు కి స్వీటీ` ఫేం సన్నీ సింగ్ ఆ పాత్రకు ఎంపికయ్యారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అంటే శ్రీరాముడిగా ప్రభాస్ కనిపిస్తే సోదరుడు లక్ష్మణుడిగా సన్నీ సింగ్ కనిపిస్తారన్నమాట. హిందీ చిత్రసీమలో సన్నీసింగ్ మంచి నటుడు అన్న గుర్తింపు ఉంది. ప్రభాస్ – సన్నీ సోదరులుగా కనిపిస్తే అది హిందీ బెల్టుకి మంచి కనెక్టివిటీ ఎలిమెంట్. అందుకే రౌత్ అలా ప్లాన్ చేశారనుకోవచ్చు.
బాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ ఫేవరేట్ గా వెలిగిపోతోంది కియరా. `లస్ట్ స్టోరీస్`తో ఈ భామ పేరు దేశం మొత్తం మార్మోగింది. ఒక్క బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ లోనూ మంచి క్రేజ్ని సొంతం చేసుకుంది. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ టాప్ హీరోయిన్ గా స్టార్ డమ్ ని దక్కించుకున్న కియారా `భరత్ అనే నేను` చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది.
ఆ మూవీ హిట్ కావడంతో టాలీవుడ్ దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించి మరో ఆఫర్ ని దక్కించుకుంది. 2019లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం `వినయ విధేయ రామ`. ఈ సినిమాలో కియారా హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. దీంతో టాలీవుడ్ లో కియారాకు ఫ్యాన్ ఫాలోయింగ్ బీభత్సంగా పెరిగిపోయింది. ఉత్తరాదితో పాటు దక్షిణాదిని కూడా తన గ్రిప్ లో పెట్టుకున్న కియారాకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.
తాజాగా `ఆస్క్ మీ ఎనీథింగ్` అనే సెషన్ ని నిర్వహించింది. ఈ సెషన్ లో ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు కియారా ఆసక్తికర సమాధానాలు చెప్పింది. ఇదే సందర్భంలో ఓ అభిమాని మరిన్ని సౌత్ చిత్రాల్లో మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం` అని అడిగితే స్మార్ట్ గా సమాధానం చెప్పింది. `త్వరలోనే మీరు చూస్తారని` స్మార్ట్ గా తెలుగులో తను చేయబోతున్నకొత్త సినిమా ప్రాజెక్ట్ ఏంటో చెప్పకుండానే తెలుగు సినిమా చేస్తున్నానని హింట్ ఇచ్చేసింది. ప్రభాస్ నటిస్తున్న `ఆదిపురుష్` చిత్రంలో సీత పాత్ర కోసం కియారాని చిత్ర బృందం సంప్రదిస్తున్నారంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కియారా ఇండైరెక్ట్ గా తెలుగు సినిమా చేయబోతున్నానంటూ హింట్ ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ హింట్ చూస్తుంటే మహానటి కీర్తి సురేష్ కి ఆ ఛాన్స్ మిస్సయినట్టేనని అంతా భావిస్తున్నారు.