సినిమాకి టైటిలే సగం బలం. సక్సెస్ కి ప్రధాన ఆయుధంగా ఉపయోగపడుతుంది. అందుకే టైటిల్ ఎంపిక విషయంలో చాలా సమయం శ్రద్ధ తీసుకుంటారు. సెన్సిటివ్ సినిమాల దర్శకుడు క్రిష్ తన సినిమా టైటిల్ ఎంపిక విషయంలో అంతే ఆచితూచి అడుగులు వేస్తారన్న సంగతి తెలిసిందే. అలాగే తన టైటిల్లో తెలుగుదనానికి పెద్ద పీట వేస్తారాయన.
కృష్ణ వైష్ణవ్ తేజ్- రకుల్ ప్రీత్ నాయకానాయికలుగా క్రిష్ ప్రస్తుతం ఓ సినిమా తీస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని కొండపొలం అనే నవల ఆధారంగా రూపొందిస్తున్నారు. ఆ నవలను క్రిష్ ఎంతగానో ప్రేమించారు గనుకే సినిమాగా మలిచారట. అంతేకాదు నవలా రచయితకు పెద్ద మొత్తాలను చెల్లించి హక్కులను కొన్నాడు. క్రిష్ తన చిత్రానికి కొండపోలం పేరు పెట్టాలని నిర్ణయించుకున్నా ఎందుకనో ఇంకా సస్పెన్స్ మెయింటెయిన్ చేస్తున్నారట.
కొండ కోనల్లో విలేజ్ నేపథ్యంలో ఆద్యంతం పచ్చదనం నడుమ రక్తి కట్టించే చిత్రమిదని ఇందులో పులి పాత్ర ఆశ్చర్యపరుస్తుందని కూడా చెబుతున్నారు. రొటీనిటీకి భిన్నంగా అలరించే చిత్రమిది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ విలేజ్ గాళ్ పాత్రలో కనిపిస్తుంది. వైష్ణవ్ తేజ్ పల్లె యువకుడిగా కనిపిస్తారట. ప్రస్తుతానికి మూవీ పోస్ట్ ప్రొడక్షన్ జోరందుకుంది. సాధ్యమైనంత తొందరలోనే మూవీని రిలీజ్ చేయనన్నారు.
అగ్ర కథానాయిక అక్కినేని సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ తో వెబ్ వరల్డ్ లో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ కి కొనసాగింపుగా ఈ సీజన్ ని రూపొందించారు. ఇందులో సమంత నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించనుందని తెలుస్తోంది. ఆమె డీ గ్లామర్ లుక్ లో అందరిని షాక్ కి గురి చేస్తుందని టాక్. ఇప్పటికే విడుదలైన సమంత బ్యాక్ సైడ్ లుక్ లో ప్యాంటు షర్ట్ ధరించి డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో కనిపించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిసెంబర్ నెలలో విడుదల చేస్తారని అనుకున్నారు. అయితే ఈ సీజన్ మరింత ఆలస్యం కానుందని వార్తలు వస్తున్నాయి.
‘ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ వీఎఫ్ఎక్స్ వర్క్ పూర్తవడానికి ఇంకా సమయం పడుతుందట. అందుకే డిసెంబర్ నెలలో రావడం కష్టమని అంటున్నారు. దీంతో ఈ సిరీస్ 2021 జనవరి చివర్లో లేదా ఫిబ్రవరి ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ఏదేమైనా ‘ఫ్యామిలీ మ్యాన్’ మంచి ఆదరణ దక్కించుకోవడంతో సీజన్ 2 పై మంచి అంచనాలు ఉన్నాయి. రాజ్ – కృష్ణ డీకే ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. ఫస్ట్ సీజన్ లో నటించిన మనోజ్ బాయ్ పాయ్ – ప్రియమణి లు ఇందులో కూడా కొనసాగుతున్నారు. ఈ వెబ్ సిరీస్ తో సమంత పాన్ ఇండియా స్టార్ గా మారుతుందని నేషనల్ వైడ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. సమంత సైతం ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ఆలస్యానికి మూల్యం కొన్నిసార్లు ఊహకు అందని రీతిలో ఉంటుంది. తాజాగా అలాంటి ఉదంతం బయటకు వచ్చింది. ప్రఖ్యాత టెక్ కంపెనీ యాపిల్.. తన తాజా ఐఫోన్ 12ను మార్కెట్లోకి తీసుకురావటంలో ఆలస్యమైన విషయం తెలిసిందే. దీని కారణంగా ఆ కంపెనీ ఫ్యూచర్ స్టాక్ విలువ ఐదు శాతం పతనమైంది. చూసేందుకు ఐదు శాతమే అయినా.. దాని విలువ భారీగా ఉన్నట్లు లెక్క కట్టారు. అనుకున్న సమయానికి మార్కెట్లోకి ఐఫోన్ 12ను తీసుకురావటంలో జరిగిన ఆలస్యానికి వంద బిలియన్ డాలర్ల మొత్తం పతనమైందని చెబుతున్నారు.
మన రూపాయిల్లో చూస్తే.. అది కాస్తా రూ.7.42లక్షల కోట్లుగా చెబుతున్నారు. గడిచిన ఏడేళ్లుగా ప్రతి ఏడాదిగా సెప్టెంబరులో యాపిల్ సంస్థ తన కొత్త ఫోన్ ను లాంచ్ చేస్తూ ఉంటుంది. ఈసారి 5జీ ఫోన్ మార్కెట్లోకి వస్తుందన్న మాటతో భారీ అంచనాలు సాగాయి. ఆ ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వారు మరే ఫోన్ కొనకుండా ఉండిపోయారు. దీంతో అమ్మకాల మీద ప్రభావం పడింది. అయితే.. కరోనా కారణంగా మాక్ లు.. ఎయిర్ పాడ్ ల విక్రయాలు పెరగటంతో కంపెనీ లాభాల్లో పెరుగుదలకు కారణమైంది. అదే జరగకుండా మరింత ఇబ్బందికరంగా ఉండేది.
మొత్తంగా విక్రయాల్లో 20.7 శాతం తగ్గినప్పటికి.. మిగిలిన వాటి అమ్మకాలు కవర్ చేశాయి. దీంతో మొదట్లో అంచనా వేసిన దానితో పోలిస్తే.. త్రైమాసిక లాభాలపై ప్రభావాన్ని చూపింది. ఈ కారణంగా ఒక్కో షేరుకు 0.73 డాలర్ల ఆదాయం వచ్చేలా చేసింది. అనుకున్న సమయానికి ఐఫోన్ మార్కెట్లోకి వచ్చి ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేదంటున్నారు. దీంతో పాటు.. చైనా మార్కెట్లో ఈసారి అమ్మకాలు 29 శాతం తగ్గటం కంపెనీ లాభాల పెరుగుదలపై ప్రభావాన్ని చూపిందని చెప్పాలి. మార్కెట్లోకి యాపిల్ 12 సిరీస్ వచ్చిన తర్వాత పరిస్థితి మెరుగైనట్లుగా కంపెనీ చెబుతోంది.