ఆహాలో రాబోతున్న చలం ‘మైదానం’

తెలుగు ఓటీటీ ఆహా లో కంటెంట్ విషయంలో జెట్ స్పీడ్ తో దూసుకు వెళ్తున్నారు. మీడియం బడ్జెట్ సినిమాలు మరియు టాక్ షోలు ఇంకా వెబ్ సిరీస్ లు ఇలా కంటెంట్ తో ఆహా ప్రేక్షకులను ముంచెత్తుతున్నారు. తాజాగా మరో మూవీ ని ఆహా వారు ప్రకటించారు. వేణు ఉడుగుల వంటి విలక్షణ దర్శకుడి నిర్మాణంలో రూపొందుతున్న ‘మైదానం’ సినిమా ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. మైదానం అనేది ప్రముఖ రచయిత చలం 1927లో రాసిన ఒక నవల. ఆ నవల కథ ఆధారంగా అదే టైటిల్ తో మైదానం సినిమాను రూపొందించారు.

వేణు ఉడుగుల నిర్మిస్తున్న ఈ ఆహా సినిమాకు కవి సిద్దార్థ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మైదానం నవల ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. అలాంటి నవల ఆధారంగా సినిమా అంటే ఖచ్చితంగా మ్యాటర్ ఉంటుంది. ఆర్ట్ ఫిల్మ్ లా కాకుండా కాస్త కమర్షియల్ టచ్ కూడా ఇవ్వాలని భావిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న మైదానం త్వరలోనే ఆహాలో స్ట్రీమింగ్ అవ్వబోతుంది.

ప్రస్తుతం రానాతో విరాటపర్వం సినిమాను తెరకెక్కిస్తున్న దర్శకుడు వేణు ఉడుగుల మైదానంపై ఆసక్తితో ఇష్టంతో ఈ సినిమాను నిర్మించేందుకు వచ్చాడట. మీడియం బడ్జెట్ లో కొత్త వారితో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించబోతున్నారు. మైదానం సక్సెస్ అయితే చలం మరిన్ని రచనలు సినిమాలుగా వచ్చే అవకాశం ఉంది.

Related Images:

ఆహా అనిపిస్తున్న తమషా హర్ష

తెలుగు ఓటీటీ ఆహా కొత్త కంటెంట్ తో మరింత మంది అభిమానంను చురగొనేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఆహా వారు చేస్తున్న కార్యక్రమాలతో చిన్న నటీనటులకు మరియు యూట్యూబర్స్ కు మంచి ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న తమాషా విత్ హర్ష కార్యక్రమం ఎంటర్ టైన్ గా ఉంటుంది. అంతకు ముందు సుమ హోస్ట్ గా ఆల్ ఈజ్ వెల్ అనే టాక్ షో వచ్చేది. ఇప్పుడు తమాషా విత్ హర్ష మరియు సామ్ జామ్ టాక్ షో లు ఆహా లో వస్తున్నాయి.

సామ్ జామ్ కంటే ఒక వారం ముందే ప్రారంభం అయిన తమాషా విత్ హర్షకు మంచి రెస్పాన్స్ వచ్చింది. నెటిజన్స్ చర్చించుకుంటున్న దాని ప్రకారం సమంత సామ్ జామ్ కంటే కూడా హర్ష హోస్ట్ చేసిన తమాషా విత్ హర్ష టాక్ షో రెండు ఎపిసోడ్ లు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి అంటున్నారు. ముందు ముందు పరిస్థితి ఎలా ఉన్నా ఆహాలో ప్రస్తుతం తమాషా విత్ హర్ష ఎంటర్ టైన్ చేస్తున్నాడు.

హర్ష ‘ఆహా’లో వచ్చిన కలర్ ఫొటో సినిమాలో కూడా ముఖ్య పాత్రలో నటించి మెప్పించిన విషయం తెల్సిందే. యూట్యూబర్ అయిన హర్ష ఇప్పుడు ఆహాలో ఎక్కువ కంటెంట్ లో కనిపిస్తున్నాడు. హర్ష ఒక వెబ్ సిరీస్ లో కూడా ఆహా కోసం నటించాడు. సామ్ జామ్ లో కూడా మద్య మద్యలో వస్తూ పోతూ ఎంటర్ టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు.

Related Images:

‘ఆహా’ ఈవెంట్ లో బన్నీ రివీల్ చేసిన సర్ప్రైజెస్ ఇవే..!

డిజిటల్ వరల్డ్ లో 100శాతం తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అంటూ వచ్చిన ‘ఆహా’ ఓటీటీ అనతికాలంలోనే మంచి విజయాన్ని అందుకుంది. అప్పటికే సత్తా చాటుతున్న ఓటీటీ దిగ్గజాలకు పోటీగా నిలిచింది. థియేటర్స్ మూతబడటంతో ‘ఆహా’ లో ఎంటర్టైన్మెంట్ కోసం ఒరిజినల్ మూవీస్ – వెబ్ సిరీస్ లతో పాటు కొత్త సినిమాలు కూడా డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో రిలీజ్ చేస్తున్నారు. అయితే ‘ఆహా’ సక్సెస్ వెనుక స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఉన్నాడనే విషయం తెలిసిందే. ‘ఆహా’లో వర్కింగ్ పార్టనర్ గా ఉండటంతో పాటు అన్నింటా తానే ఉంటూ ఈ యాప్ ను ముందుకు నడిస్తున్నాడు. ఇప్పటికే 18 మిలియన్ల యూజర్స్ మరియు 5 మిలియన్ల డౌన్ లోడ్స్ తో జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో దీపావళి ని పురస్కరించుకుని శనివారం రాత్రి హైదరాబాద్ లో ‘అల్లు అర్జున్ సమర్పించు ఆహా గ్రాండ్ రివీల్ ఈవెంట్’ నిర్వహించారు.

ఈ సందర్భంగా బన్నీ నాలుగు సర్ప్రైజ్ లు రివీల్ చేసాడు. ‘‘తెలుగులో నలుగురు బిగ్ డైరెక్టర్స్ సుకుమార్ – హరీశ్ శంకర్ – సురేందర్ రెడ్డి – వంశీ పైడిపల్లి ‘ఆహా’లో షోలు చేయబోతున్నారు. ఈ నలుగురితోనూ నేను వర్క్ చేసాను” అని బన్నీ తెలిపారు. ఇంకా బన్నీ మాట్లాడుతూ.. ‘సినీ ఇండస్ట్రీ టీవీ ఇండస్ట్రీ ఎలా ఉన్నాయో రేపు ఓటీటీ అనేది డిజిటల్ ఇండస్ట్రీగా ఎదుగుతుంది. దాన్ని మా నాన్న తెలుగుకు తీసుకురావడం అచ్చమైన తెలుగు ఓటీటీ ‘ఆహా’ ప్రారంభం కావడం గర్వంగా ఉంది. ఈ ఓటీటీ వేదిక కంటెంట్ కి సంబంధించినది. నా స్నేహితుడు రామ్ జూపల్లి వాళ్ల ఫ్యామిలీకి చెందిన మైహోమ్ గ్రూప్ ఎంటర్టైన్మెంట్ కు ఇండస్ట్రీలోకి ప్రవేశించాలని ఉందని చెప్పారు. మా నాన్నకూ ఇటువంటి ఐడియా ఉందని మేమంతా కలిశాం. ఇవాళ ‘ఆహా’ ఇంతలా ఎదగడానికి జూపల్లి కుటుంబానికి మాపై ఉన్న నమ్మకమే కారణం. అల్లు కుటుంబాన్ని జూపల్లి కుటుంబం ఎంతోగానో నమ్మింది” అని చెప్పారు. ఈ సందర్భంగా ఆహా కోసం వర్క్ చేసిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి కి బన్నీ స్పెషల్ థ్యాంక్స్ తెలిపారు.

ఆహా ఈవెంట్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన నవదీప్ ‘ఓటీటీ స్క్రీన్ పైకి అల్లు అర్జున్ ఎంట్రీ ఎప్పుడు?’ అని ప్రశ్నించగా… ‘వెయిట్ చేయాలి. సర్ప్రైజ్ కింద వస్తున్నాం’ అని బన్నీ సమాధానమిచ్చారు.
ఇక ఈవెంట్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘ఆహా’ ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించారు. అలానే ఈ దీపావళి నుంచి వచ్చే దీపావళి వరకూ ‘ఆహా’లో రాబోయే కంటెంట్ ‘’రుద్రవీణ’ ‘కంబాలపల్లి కథలు’ ‘కుబూల్ హై’ ‘కుడి ఎడమైతే’ ‘తోడేళ్ళు’ ‘ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్’ ‘సూపర్ ఓవర్’ ‘లెవన్త్ అవర్’ ‘మైదానం’ ‘బియాండ్ టెక్ట్స్ బుక్’ ‘మేజ్’ ‘అన్యాస్ ట్యుటోరియల్’ ప్రచార చిత్రాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులు వంశీ పైడిపల్లి – నందిని రెడ్డి – దిల్ రాజు – తమన్నా – పాయల్ రాజ్ పుత్ – సీరత్ కపూర్ – చాందిని చౌదరి తో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.

Related Images:

‘ఆహా’ వేడుకలో ఆహా అనిపించేంత అందం

మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల కరోనాను జయించింది. కరోనా సమయంలో తీవ్రమైన ఒత్తిడికి గురైనట్లుగా చెప్పిన తమన్నా తాను బతుకుతాను అనుకోలేదు అంటూ ఎమోషనల్ అయ్యింది. దాదాపు నెలన్నర రోజుల తర్వాత మళ్లీ సినిమాలు మరియు ఈవెంట్స్ తో బిజీ అయ్యింది. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత తమన్నా కాస్త లావు అయినట్లుగా అనిపించింది. ఆ ఫొటోలకు చాలా కామెంట్స్ వచ్చాయి. కేవలం మూడు వారాల్లోనే తమన్నా వెయిట్ లాస్ అయ్యి మునుపటి రూపంకు వచ్చేసింది.

నిన్న జరిగిన ఆహా ఈవెంట్ లో మిల్కీ బ్యూటీ ఆహా అనిపించేలా అలరించింది. చీరలో క్లీ వేజ్ షో చేస్తూ మిల్కీ బ్యూటీ ఆకట్టుకుంది. ఆ వేడుకలో తమన్నా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తమన్నా 11త్ అవర్ అనే వెబ్ సిరీస్ ను ఆహా కోసం చేసింది. ఇటీవలే ఆ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ వచ్చింది. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపొందిన ఆ వెబ్ సిరీస్ త్వరలో ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉంది. ఆ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా తమన్నా ఆహా వేడుకలో ఆహా అనిపించేంత అందంగా తయారు అయ్యి హాజరు అయ్యింది.

Related Images:

పాయల్ మరో ఆర్ఎక్స్ 100

తెలుగు ప్రేక్షకులకు ఆర్ఎక్స్ 100 సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పూత్. మొదటి సినిమాలోనే నటిగా మంచి గుర్తింపును దక్కించుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత బిజీ బిజీ అయ్యింది. మొదటి సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన పాయల్ మళ్లీ ఇన్నాళ్లకు అదే తరహా పాత్రలో కనిపించబోతుంది. ‘అనగనగా ఓ అతిథి’ సినిమాతో పాయల్ రాజ్ పూత్ ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పాయల్ రాజ్ పూత్ మరియు చైతన్య కృష్ణ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు దయాల్ పద్మనాభన్ దర్శకత్వం వహించాడు.

ఇటీవల కాలంలో ఆహా వరుసగా చిన్న సినిమాలను స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ సినిమాను ఈనెల 20వ తారీకున విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు. అనగనగా ఓ అతిథి ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందింది. సినిమాలో పాయల్ రాజ్ పూత్ పాత్ర చాలా విభిన్నంగా ఉంది.

ఆమె గెటప్ కూడా కొత్తగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమాతో ఆమెకు మరోసారి నటిగా మంచి మార్కులు తెచ్చుకుంటుందనిపిస్తుంది. బాడీలాంగ్వేజ్ తో పాటు ఆమె వాయిస్ చాలా మాస్ గా ఉంది. పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమా కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీగా రూపొందింది. కథ ఈ సినిమా బలం అంటూ మేకర్స్ చెబుతున్నారు. ఇప్పటికే ఆహా ద్వారా విడుదలైన సినిమాలకు మంచి టాక్ వచ్చింది. కనుక ఈ సినిమా మరో మంచి సినిమాగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Related Images:

లాక్ డౌన్ తర్వాత అతి పెద్ద ‘ఆహా’ అనిపించే వేడుక

అల్లు అరవింద్ ప్రారంభించిన ఆహా ఓటీటీ మెల్ల మెల్లగా కంటెంట్ విషయంలో స్పీడ్ పెంచింది. మొదట్లో ఆహాలో కంటెంట్ అస్సలు ఉండటం లేదు అనే ఫిర్యాదు ఉండేది. కాని ఇప్పుడు సినిమాలు.. వెబ్ సిరీస్ లు.. టాక్ షోలు డబ్బింగ్ సినిమాలు ఇలా ఆహా ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ను అందిస్తుంది. ముందు ముందు మరింతగా కూడా ఆహా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు సిద్దం అయ్యింది. ఆ విషయాన్ని ఈనెల 13వ తారీకున ఒక భారీ వేడుకను ఏర్పాటు చేసి ప్రకటించబోతున్నారు. ఆ విషయమై ఆహా అధికారికంగా ప్రకటించింది.

అల్లు అర్జున్ ప్రధాన గెస్ట్ గా ఆహా భారీ వేడుక జరుగబోతుంది. కరోనా లాక్ డౌన్ కారణంగా మార్చి నుండి ఇప్పటి వరకు ఒక్కటి అంటే ఒక్కటి కూడా భారీ సినిమా వేడుక జరగలేదు. కనీసం ప్రెస్ మీట్ లు కూడా పెట్టలేని పరిస్థితి ఉంది. కరోనా భయం మెల్ల మెల్లగా తగ్గుతున్న ఈ సమయంలో సినీ వేడుకలకు కూడా ప్రభుత్వం నుండి అనుమతులు వస్తున్నాయి. ఆహాలో రాబోయే సంవత్సర కాలం పాటు స్ట్రీమింగ్ అవ్వబోతున్న కార్యక్రమాలు సినిమాలు మరియు ఇతర కార్యక్రమాలను అల్లు అర్జున్ తో అనౌన్స్ చేయించబోతున్నారు.

ఇదే సమయంలో ఆహా బ్రాండ్ అంబాసిడర్ గా అల్లు అర్జున్ ను ప్రకటించే అవకాశం కూడా ఉందని మీడియా సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ ఆహా కోసం పబ్లిసిటీ చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు అల్లు అర్జున్ రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈనెల 13న భారీ ఎత్తున మెగా అభిమానులు ఈ కార్యక్రమంకు హాజరు అయ్యేలా ఇప్పటికే పాస్ లను కూడా జారీ చేశారట. ఆహా వేడుకతో మళ్లీ టాలీవుడ్ సినీ వేడుకలు పునః ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

The grand event #AAPresentsAHA on NOVEMBER 13 from 5 PM onwards

Related Images:

‘ఆహా’ వేదికగా సమంత ‘సామ్ జామ్’ టాక్ షో..!

అక్కినేని సమంత ఇటీవల ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 4కు పార్ట్ టైం హోస్టుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. దసరా స్పెషల్ లో రియాలిటీ షో కి హోస్ట్ గా చేసి సామ్.. ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఓ టాక్ షో తో ఫుల్ టైమ్ హోస్ట్ గా రాబోతోంది. సినిమాలు వెబ్ సిరీస్ లతోనే కాకుండా స్పెషల్ టాక్ షోలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న తెలుగు ఓటీటీ ‘ఆహా’ కోసం సమంత ఓ టాక్ షో చేస్తోంది. ”సామ్ జామ్” అనే టాక్ షో కు సమంత హోస్ట్ చేస్తారని ‘ఆహా’ అధికారికంగా ప్రకటించింది. దీపావళి సందర్భంగా ఈ నెల 13వ తేదీ నుంచి ‘సామ్ జామ్’ టాక్ షో ప్రసారం కానుందని తెలుస్తోంది.

కాగా ‘సామ్ జామ్’ టాక్ షో లో మెగాస్టార్ చిరంజీవి – అల్లు అర్జున్ – విజయ్ దేవరకొండ – తమన్నా భాటియా – రష్మిక మందన్న – సైనా నెహ్వాల్ వంటి సెలబ్రిటీలతో అక్కినేని సమంత మాట్లాడనుంది. ఈ టాక్ షోకి దర్శకురాలు నందిని రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హిందీలో బాగా పాపులర్ అయిన ‘కాఫీ విత్ కరణ్’ షో మాదిరిగా ‘సామ్ జామ్’ టాక్ షో ఉంటుందని తెలుస్తోంది. ఇందుకోసం ఒక్కో ఎపిసోడ్ కి సమంతకి 40 లక్షల వరకు ఇస్తున్నారట. హీరోయిన్ గా సక్సెస్ అయిన సమంత ఇప్పుడు సక్సెస్ ఫుల్ హోస్ట్ అనిపించుకుంటుందేమో చూడాలి. తాజాగా ‘సామ్ జామ్’ షో గురించి వివరాలు వెల్లడించిన సామ్ ‘ఇది కేవలం టాక్ షో మాత్రమే కాదని.. సమాజంలోని సమస్యల గురించి ప్రశ్నించడం.. టాలెంట్ ను ఎంకరేజ్ చేయడం వంటివి ఇందులో ప్రేక్షకులు చూడవచ్చ’ని తెలిపింది. ఏదేమైనా ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో ‘ఆహా’ డైరెక్ట్ సినిమాల రిలీజులతో పాటు ఇలాంటి స్పెషల్ షో లతో క్రేజ్ ని పెంచుకుంటోందని చెప్పవచ్చు.

Related Images:

ఆహా ప్రమోషన్ లో బన్నీ

అల్లు అరవింద్ ప్రారంభించిన ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ కు విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆ బాధ్యతను అల్లు అర్జున్ తీసుకోబోతున్నాడా అంటూ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. అధికారికంగా అంబాసిడర్ గా వ్యవహరించకున్నా ఇకపై ఆహాకు సంబంధించిన సినిమాలు మరియు షో లను ప్రమోట్ చేయాలని బన్నీ భావిస్తున్నాడట. ఇప్పటికే ఆహా లో విడుదల అయిన కలర్ ఫొటో సనిమా యూనిట్ సభ్యులను ప్రత్యేకంగా కలిసి వారిని అభినందించిన అల్లు అర్జున్ ఆహా కోసం ఒక ఈవెంట్ లో పాల్గొనబోతున్నాడు.

ఆహాలో పలు సినిమాలు మరియు టాక్ షో లు వెబ్ సిరీస్ లను అతి త్వరలో స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. వాటిని అల్లు అర్జున్ తో అనౌన్స్ చేయించబోతున్నారు. ఈ విషయమై ఆహా ఒక భారీ ఈవెంట్ ను నిర్వహించబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఆ ఈవెంట్ లో అల్లు అర్జున్ వాటిని ప్రకటించబోతున్నారు. అందులో సమంత టాక్ షో కూడా ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి ఆహా కు అల్లు అర్జున్ ప్రమోషన్ తో మరింతగా ఆధరణ దక్కే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇప్పటికే ఆహాకు భారీగా ఖాతాదారులు చేరారు. తెలుగు ప్రత్యేకమైన ఓటీటీ అవ్వడంతో తెలుగు వారికి ఆహా బాగా కనెక్ట్ అవుతోంది.

Related Images:

కొత్త కంటెంట్ తో నిండు కుండలా ఆహా

ఆహా-తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ గేమ్ ఛేంజర్ కాబోతోందా? అంటే .. నెమ్మదిగా ఛేంజ్ కనిపిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. ఆరంభం కాస్త నెమ్మదిగా ఉన్నా కంటెంట్ పుల్ చేసే కొద్దీ సబ్ స్క్రైబర్లు పెరుగుతున్నారన్న సమాచారం ఉంది. ఈ ప్రయత్నంలో భాగంగా చిన్న సినిమాలతో ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు ఆహా టీమ్. ఇటీవల ఆహాలో విడుదలైన చిన్న చిత్రం `కలర్ ఫొటో`. సుహాస్- చాందిని ప్రధాన పాత్రల్లో నటించారు. రివ్యూస్.. డివైడ్ టాక్ వంటివి వినిపించినా ఈ మూవీ బాగానే గెయిన్ చేసింది. ఆహాకు మంచి మైలేజ్ ని తీసుకొచ్చింది. దీంతో ఆహా టీమ్ అలర్ట్ అయినట్టుగా కనిపిస్తోంది. కొత్త తరహా కంటెంట్ ని ప్రోత్సహించాలని ఒరిజినల్స్ ని రంగంలోకి దింపాలని తన గేమ్ ఛేంజ్ చేసినట్టు తెలుస్తోంది.

`కలర్ ఫొటో` ఊహించని విధంగా విజయవంతం కావడం.. చాలా మంది సెలబ్రిటీలు ఈ మూవీకి స్వచ్ఛందంగా ప్రచారం చేయడంతో `ఆహా`కు మంచి మైలేజ్ వచ్చింది. ఇప్పటి వరకు కంటెంట్ లేమీతో వున్న ఆహా క్రమ క్రమంగా పాపులర్ ఓటీటీల జాబితాలోకి వెళుతోంది. అందుకు అనుగుణంగా తన గేమ్ ప్లాన్ని మార్చుకుంటోంది. దీనికి బిహార్ కి చెందిన ఓ వ్యక్తి కారణంగా చెబుతున్నారు.

నవంబర్ లో ప్రాంతీయ వేదికపై ప్రసారం అవుతున్న ఆహా ఒరిజినల్స్ జాబితాని సరికొత్తగా సిద్ధం చేస్తోంది. వీటన్నిటిలో చాలా ఆసక్తికరమైనది సమంతా అక్కినేని .. వెన్నెల కిషోర్ ల ‘సామ్ జామ్’. ఇది వినోదాన్ని లక్ష్యంగా చేసుకోవడంతో పాటు ప్రేక్షకులను మరింతగా పెంచేలా ఈ ప్రోగ్రామ్ ని డిజైన్ చేశారు. వివా హర్షతో ‘తమాషా విత్ హర్ష’ టాక్-స్కెచ్ కామెడీ షో ని కూడా స్ట్రీమింగ్ చేయబోతున్నారు.

పునర్నవితో చేసిన ‘కమిట్ మెంటల్’ .. పాయల్ రాజ్పుత్… చైతన్య కృష్ణలతో చేసిన ‘అనగనగా ఓ అతిథి’.. సిద్ధూ జొన్నలగడ్డ `మన వింత గాథ వినుమ` ఆహాలో నవంబర్ నెలలో స్ట్రీమింగ్ కానున్నాయి. కొత్తదనంతో కొత్త కంటెంట్ తో ఆహా ఒరిజినల్స్ తో రెడీ గా వుంది. ఇక ఆడియన్స్ దే ఆలస్యం.. కంటిన్యూగా గ్యాప్ లేకుండా ఆస్వాధించేంత కొత్త కంటెంట్ అందుబాటులోకి వస్తోంది మరి.

Related Images:

‘ఆహా’ ఏమి ప్రమోషనో..

తన నిర్మాణంలో తెరకెక్కిన చిత్రాలకు తోడు కొన్ని కొత్త సినిమాలేవో అందుబాటులోకి తీసుకొచ్చి ఈ ఏడాది ఆరంభంలో ‘ఆహా’ ఓటీటీని మొదలుపెట్టారు టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్. కంటెంట్ పరిమితం పైగా అది కేవలం తెలుగుకే పరిమితం. నెట్ ఫ్లిక్స్ అమేజాన్ ప్రైమ్ హాట్ స్టార్ లాంటి సంస్థలు వందలు వేలల్లో సినిమాలు వెబ్ సిరీస్లు అందుబాటులో ఉంచిన నేపథ్యంలో ‘ఆహా’ ఏమాత్రం ప్రేక్షకులను ఆకర్షిస్తుంది సబ్స్క్రైబర్లను ఆకర్షిస్తుంది అని చాలామంది సందేహించారు. కానీ లాక్ డౌన్ దానికి వరంలా కలిసొచ్చింది. ఓ మోస్తరు కంటెంట్తోనే ఆహా సక్సెస్ అయింది. దాన్ని చక్కగా ప్రమోట్ చేసుకోవడం కూడా కలిసొచ్చింది. ఐతే మధ్యలో కొత్త ఎక్స్క్లూజిక్ కంటెంట్ పెద్దగా లేకపోవడం పేరున్న సినిమాలు లేకపోవడం వల్ల కొంచెం జోరు తగ్గినా ఈ మధ్య మళ్లీ ‘ఆహా’ పుంజుకుంటోంది. కంటెంట్ నెమ్మదిగా పెంచుతున్నారు.

‘ఆహా’ను ప్రమోట్ చేయడానికి అల్లు అరవింద్ తన సర్కిల్ను కూడా బాగానే ఉపయోగిస్తున్నట్లుగా కనిపిస్తోంది. టాలీవుడ్లో ప్రముఖులందరూ ‘ఆహా’ కంటెంట్ను బాగా ప్రమోట్ చేస్తుండటం ట్విట్టర్ లో గమనించవచ్చు. ఆ ఓటీటీలో ఏ సినిమా రిలీజైనా ట్విట్టర్లో సెలబ్రెటీలు బాగా స్పందిస్తున్నారు. దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఈ మధ్యే విడుదలైన చిన్న సినిమా ‘కలర్ ఫోటో’ సంగతే తీసుకుంటే.. ఓ సినిమా యావరేజ్ అన్న ఫీడ్ బ్యాక్ వచ్చింది కానీ.. ఇండస్ట్రీ జనాలు దీన్ని నెత్తికెత్తుకుని ప్రమోట్ చేసిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు వేరే వాళ్ల సినిమాల గురించే స్పందించని రవితేజ ‘కలర్ ఫోటో’ గురించి ట్వీట్ వేయడం ఆశ్చర్యం కలిగించే విషయం. విజయ్ దేవరకొండ అయితే పెద్ద పోస్టే పెట్టాడు దీని గురించి. నాని సైతం ఈ సినిమాకు మాంచి ప్రమోషన్ ఇచ్చాడు.

వీళ్లందరికీ కేవలం సినిమా నచ్చడం వల్లే ప్రమోట్ చేశారని అనుకోలేం. ఒక చిన్న సినిమాకు ఇలా స్వచ్ఛందంగా సపోర్ట్ ఇచ్చేంత పెద్ద మనసైతే ఇండస్ట్రీ జనాలకు ఉందందే సందేహమే. దీని వెనుక ‘అల్లు’ బ్రాండ్ ఉందనే భావించాలి. ‘కలర్ ఫోటో’ అనే కాదు.. ‘ఆహా’లో వస్తున్న రాబోయే కంటెంట్ అంతటికీ ప్రమోషన్ ఓ రేంజిలో ఉంటుందన్నది స్పష్టం. ఈ ఓటీటీకి కంటెంట్ రూపొందించడం కోసం కూడా తక్కువ పారితోషకాలతో చాలామంది ప్రముఖులు పని చేస్తుండటం కూడా గమనార్హం. దీన్ని బట్టి అల్లు అరవింద్ సత్తా ఎలాంటిదన్నది అర్థం చేసుకోవచ్చు.

 

View this post on Instagram

 

One of the many reasons why you need to look into this mirror! Watch #AddhamOnAHA @varusarathkumar @actorkishore @arjunchidambaram @Prasanna_actor @pavithrah_10 @abhirami.venkatchalam @ rohinimolleti @praveen_5529 @siva_ananth @sreekar.prasad @sarjunkm @barathneelakantan @shelley_calist @selvakumar.sk_dop @sundaramurthyks @artdirector Kadhirr @anuparthasarathy @varunonthemix @sarang_thiagu @nsujatha0108 @devasena_es @dugu_vh @globalvillagers @k_aparajitha_rao

A post shared by ahavideoIN (@ahavideoin) on

Related Images:

ఆహాలో మరో చిన్న మూవీ ‘అనగనగా ఓ అతిథి’

తెలుగు ఓటీటీ వరుసగా చిన్న సినిమాలను.. కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తుంది. కొన్ని రోజుల క్రితం ఒరేయ్ బుజ్జిగాను విడుదల చేసిన ఆహా ఇటీవల కలర్ ఫొటోను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది. కలర్ ఫొటోకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రేక్షకులు మరియు సినీ ప్రముఖుల వారు కూడా కలర్ ఫొటోను ఆస్వాదిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ సమయంలోనే ఆహా నుండి కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ‘మా వింత గాథ వినుమా’ అంటూ అల్లు అరవింద్ కొత్త సినిమాను ప్రకటించాడు. ఆ సినిమాను నవంబర్ 13న స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అదే రోజున మరో సినిమాను కూడా స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా ఆహా నుండి అధికారిక ప్రకటన వచ్చింది.

పాయల్ రాజ్ పూత్ హీరోయిన్ గా చైతన్యకృష్ణ హీరోగా దయాల్ పద్మనాభన్ దర్శకత్వంలో రూపొందిన ‘అనగనగా ఓ అతిథి’ సినిమా రూపొందింది. ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దం అయ్యింది. ఆ సినిమాకు సంబంధించిన స్ట్రీమింగ్ రైట్స్ ను ఆహా వారు కొనుగోలు చేశారు. నవంబర్ 13న ఆ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా ఆహా నుండి ప్రకటన వచ్చింది. అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

ఫస్ట్ లుక్ లో చైతన్య కృష్ణ హీరోయిన్ పాయల్ మెడపై కత్తి పెట్టి ఉన్నాడు. ఆమె మాత్రం చాలా పొగరుతో అతడి వైపు చూస్తుంది. పోస్టర్ చూస్తుంటే సినిమాపై ఆసక్తి కలుగుతోంది. పాయల్ రాజ్ పూత్ ఆర్ఎక్స్ 100 తర్వాత మరో మంచి పాత్రను ఈ సినిమాలో చేసిందని నటనకు ఆస్కారం ఉన్న పాత్ర అవ్వడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని మేకర్స్ అంటున్నారు. త్వరలో ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది.

Related Images:

ఆహా లో రాబోతున్న పునర్నవి

ఒకప్పుడు నటీ నటులు అంటే కేవలం సినిమాల్లో మాత్రమే పరిమితం. కాని ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. టీవీ.. సోషల్ మీడియా.. ఓటీటీ ఇలా అనేక రకాలుగా అవకాశాలు ఉన్నాయి. కష్టపడితే అదృష్టం ఉంటే అన్నింట్లో కూడా స్టార్ గా గుర్తింపు తెచ్చుకోవచ్చు. నటిగా ఉయ్యాల జంపాల సినిమాతో పరిచం అయిన పునర్నవి భూపాలం ఆ తర్వాత అంతగా అవకాశాలు దక్కించుకోలేక పోయింది. అంతా మర్చి పోతున్న సమయంలో అనూహ్యంగా ఈమెకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. అప్పటి నుండి ప్రేక్షకుల ముందుకు ఏదో ఒక ప్లాట్ ఫామ్ ద్వారా వస్తూనే ఉంది. ఇప్పుడు ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.

పవన్ సాదినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఒక వెబ్ సిరీస్ లో పునర్నవి కీలక పాత్రలో కనిపించబోతుంది. యూట్యూబ్ కు చెందిన స్టార్స్ తో ఈ వెబ్ సిరీస్ ఆహా కోసం రూపొందుతుంది. త్వరలోనే షూటింగ్ ను పూర్తి చేసి స్ట్రీమింగ్ చేయబోతున్నారట. పున్ను ఈ వెబ్ సిరీస్ లో ఒక మంచి ఎంటర్ టైన్ మెంట్ అందించే పాత్రలో కనిపించబోతుంది.

నటిగా ఆఫర్ల కోసం వెయిట్ చేస్తున్న పున్నుకు ఇది కెరీర్ లో ఒక మరో టర్నింగ్ గా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈమద్య కాలంలో స్టార్స్ కూడా వెబ్ సిరీస్ లపై ఆసక్తి చూపుతున్నారు. సినిమాలు లేకపోవడంతో ప్రేక్షకులు వెబ్ సిరీస్ లను ఎంటర్ టైన్ కోసం ఆధరిస్తున్నారు. కనుక ఆహాలో త్వరలో రాబోతున్న ఆ వెబ్ సిరీస్ అందరిని ఆకట్టుకుంటుందని ఆశిద్దాం.

Related Images:

ఆహా చేతి మా ‘మా వింత గాథ వినుమా’

ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకుల కోసం తెలుగు కంటెంట్ తో వచ్చిన ‘ఆహా’ చిన్న సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పాత సినిమాలతో పాటు అప్పుడప్పుడు చిన్న సినిమాలు వెబ్ సిరీస్ లతో ఆహా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది. మలయాళంలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాలను తీసుకు వచ్చి డబ్బింగ్ చేసి సక్సెస్ ను అందుకున్న ఆహా ఇటీవల కలర్ ఫొటో సినిమాను విడుదల చేసింది. కృష్ణ అండ్ ఇజ్ లీలా సినిమా ఆహాలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాలో నటించిన సిద్దు మరో సినిమాతో రెడీ అయ్యాడు. ఆ సినిమాను కూడా ఆహాలో స్ట్రీమింగ్ చేసేందుకు సిద్దం అయ్యారు.

ఆదిత్య మందాల దర్శకత్వంలో సంజయ్ రెడ్డి నిర్మించిన ‘మా వింత గాథ వినుమా’ అనే సినిమాను సిద్దు జొన్నలగడ్డ మరియు సీరత్ కపూర్ లు జంటగా చేశారు. వీరిద్దరు ఇంతకు ముందు కృష్ణ అండ్ ఇజ్ లీలా సినిమాలో కూడా నటించారు. ఈతరం యూత్ కు కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ను ఎంపిక చేసుకుని సిద్దు వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. మా వింత గాథ వినుమా సినిమాకు కూడా సిద్దు రచన సహకారం అందించాడు. ఈ సినిమాను ఆహాలో నవంబర్ 13న దీపావళి సందర్బంగా విడుదల చేయబోతున్నట్లుగా అల్లు అరవింద్ తాజాగా సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. మంచి కంటెంట్ అవ్వడం వల్లే విడుదలకు ముందుకు వచ్చినట్లుగా ఆయన పేర్కొన్నాడు.

Related Images:

ప్రముఖ ఓటీటీలకు పోటీగా నిలిచిన ‘ఆహా’…!

కరోనా పుణ్యమా అని దేశవ్యాప్తంగా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ హవా పెరిగిందని చెప్పవచ్చు. ఓటీటీలలో వచ్చే ఒరిజినల్ మూవీస్ వెబ్ సిరీస్ చూడటానికే అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి తోడు థియేటర్స్ క్లోజ్ అవడం వల్ల కొత్త సినిమాలు కూడా ఓటీటీలలోనే డైరెక్ట్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీక్షకులకు అనేక డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్ అందుబాటులో తీసుకొచ్చారు. భవిష్యత్ లో ఓటీటీల ప్రభావాన్ని ముందే ఊహించి ఓటీటీ వరల్డ్ లోకి ప్రవేశించారు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. వంద శాతం తెలుగు యాప్ అంటూ ”ఆహా” ఫ్లాట్ ఫార్మ్ ని క్రియేట్ చేశారు. తెలుగు సినిమాలు వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కి పెడుతూ ఇతర ఓటీటీలకు పోటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

‘ఆహా’ కంటే ముందు ఓటీటీ దిగ్గజాల్లో ఒకటైన అమెజాన్ ప్రైమ్ వీడియో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్ ని అప్లోడ్ చేస్తూ మంచి ఆదరణ తెచ్చుకుంది. అయితే ఈ మధ్య తెలుగు సినిమాలను డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేసే విషయంలో మాత్రం కాస్త వెనుక పడ్డారని ఓటీటీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఏ సినిమాకి కూడా పాజిటివ్ రెస్పాన్స్ రాలేదనే చెప్పాలి. అదే సమయంలో ఈ లోటుని ‘ఆహా’ టీమ్ తమకు అనుకూలంగా మార్చుకుంటోంది. ఇతర భాషల్లో హిట్ సినిమాలను తెలుగులోకి డబ్బింగ్ చేసి రిలీజ్ చేయడంతో పాటు.. తెలుగు కామెడీ అండ్ ఫ్యామిలీ సినిమాలని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తూ ఆదరణ పొందుతున్నారు. ఈ మధ్య ఆహాలో రిలీజ్ అయిన సినిమాలన్నీ ఓటీటీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ ని అప్లోడ్ చేస్తుండటంతో యూత్ కూడా ఇప్పుడు ‘ఆహా’ వైపు మల్లుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సబ్ స్క్రైబర్స్ ని వ్యూవర్ షిప్ ని పెంచుకుంటూపోతోంది. ఈ విధంగా అమెజాన్ ప్రైమ్ వీడియోకి తెలుగు రాష్ట్రాల్లో ‘ఆహా’ ఫ్లాట్ ఫార్మ్ గట్టి పోటీనిస్తూ దూసుకుపోతోందని చెప్పవచ్చు.

Related Images:

ఒకరోజు ముందే ‘ఆహా’ సర్ప్రైజ్

రాజ్ తరుణ్ హీరోగా హెబ్బా పటేల్ మరియు మాళవిక నాయర్ హీరోయిన్స్ గా విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో రూపొందిన ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాను విడుదల చేయాలనుకున్న సమయంలో లాక్ డౌన్ విధించారు. ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టిన తర్వాత లాక్ డౌన్ విధించడంతో థియేటర్ల ఓపెన్ కోసం ఆరు నెలలుగా వెయిట్ చేశారు. థియేటర్లు ఇంకా కూడా పునః ప్రారంభం అయ్యే అవకాశం లేకపోవడంతో చేసేది లేక ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అయ్యారు. అక్టోబర్ 2వ తారీకున ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. కాని ఈ సినిమా ను సర్ ప్రైజింగ్ గా ఒక్క రోజు ముందే విడుదల చేయబోతున్నారు.

వరుసగా విజయాలు అందించుకున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ ఈమద్య కాలంలో కాస్త నిరాశ పర్చుతూ వచ్చాడు. దాంతో ఈ సినిమా అయినా ఆయన కెరీర్ కు బూస్టింగ్ ఇస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజ్ తరుణ్.. హెబ్బా పటేల్ కాంబోకు మంచి క్రేజ్ ఉండటంతో పాటు విజయ్ కుమార్ కొండ కూడా యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్స్ ను తెరకెక్కించి సక్సెస్ దక్కించుకున్నాడు. కనుక ఈ సినిమాతో ఆయన సక్సెస్ కొడతాడని అంతా భావిస్తున్నారు. రేపు సాయంత్రం ఆరు గంటలకు ఆహాలో స్ట్రీమింగ్ ప్రారంభం కాబోతుంది.

Related Images:

రాహుల్ రామ కృష్ణ ‘ఆహా ‘ అనిపించడం గ్యారెంటీ!

ఆహా.. ఓటీటీ స్ట్రీమింగ్ యాప్ ని అల్లు అరవింద్ మై హోమ్ గ్రూప్ తో కలసి ఈ ఏడాది జనవరిలో ప్రారంభించారు. ఆ తర్వాత మార్చి లో అధికారికంగా లాంచ్ చేశారు. సినీ రంగంలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లతో అల్లు అరవింద్ అగ్రనిర్మాత గా కొనసాగుతున్నాడు. అల్లు అరవింద్ కి జనం నాడి పట్టడంలో మంచి పేరుంది. అందుకే ఆయన ఓ కథ ఎంపిక చేశారంటే విజయం గ్యారెంటీ అని అందరూ అంటూ ఉంటారు.
ఇప్పుడు కూడా ఓటీటీ ఎప్పుడైతే మొదలుపెట్టారో అప్పుడే డిజిటల్ వేదికలో కూడా డిమాండ్ పెరగడం మొదలైంది. ఇక కరోనా రాకతో జనాల ఎంటర్టైన్మెంట్ కి సినిమా యాప్ లే దిక్కుగా మారాయి.

దీంతో అల్లు అరవింద్ ఆహా యాప్ లో పలు సూపర్ హిట్ సినిమాలను విడుదల చేయడంతో పాటు ప్రత్యేక షోలు కామెడీ స్కిట్లు నిర్వహిస్తున్నారు. ఆహా ఓటీటీ కోసం అల్లు అరవింద్ పలువురు నిర్మాతలతో కలిసి టాలీవుడ్ దర్శకులతో పలు వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం దర్శకుడు వేణు ఊడుగుల ఓ వెబ్ సిరీస్ ప్లాన్ నిర్మిస్తున్నారు. రాహుల్ రామకృష్ణ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ ప్రాజెక్ట్ కి వేణు దర్శకత్వం వహించడంలేదు. కేవలం నిర్మాణ బాధ్యతలనే చూడనున్నారు.

రాహుల్ రామకృష్ణ కెరీర్ షార్ట్ ఫిలిమ్స్ తోనే మొదలయింది. అతడి ‘సైన్మా ‘ షార్ట్ ఫిల్మ్ సూపర్ హిట్ గా నిలిచింది. ఆయనకు వెబ్ సిరీస్ పాత్రలు అంటే కొట్టిన పిండే. రాహుల్ రామకృష్ణ నటుడే కాదు.. రచయిత కూడా. పెళ్లి చూపుల కోసం రెండు పాటలు కూడా రాశాడు. అర్జున్ రెడ్డి గీత గోవిందం హుషారు బ్రోచేవారెవరురా భరత్ అనే నేను తాజాగా అల వైకుంఠపురములో సినిమాలతో వరుస హిట్లు అందుకున్న రాహుల్ రామకృష్ణ వెబ్ సిరీస్ లో ఎలా ఆకట్టుకుంటాడో చూడాల్సి ఉంది.

Related Images:

‘ఆహా’ సూపర్ సెప్టెంబర్ లో ‘జ్యోతిక డబుల్ ధమకా’…!

తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ‘ఆహా’ యాప్ లో గత నెలలో ‘ఆగస్టు బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్’తో వచ్చినట్లే ఈ నెలలో ‘సూపర్ సెప్టెంబర్’ అంటూ మరికొన్ని సినిమాలను స్ట్రీమింగ్ పెడుతోంది. సీనియర్ హీరోయిన్ జ్యోతిక నటించిన రెండు తమిళ్ సినిమాల తెలుగు డబ్బింగ్ వర్షన్ స్ట్రీమింగ్ చేయనున్నారు. ‘జ్యోతిక డబుల్ ధమకా’ పేరుతో వారాంతంలో ఆమె నటించిన ‘మగువలు మాత్రమే’ మరియు ‘బంగారు తల్లి’ డిజిటల్ ప్రీమియర్స్ విడుదల కానున్నాయి. ఇంతకముందు జ్యోతిక నటించిన ’36 వయాధినైల్’ అనే తమిళ్ సినిమా తెలుగు డబ్బింగ్ ’36 వయసులో’ పేరుతో ఆహాలో విడుదలై విశేష ఆదరణ తెచ్చుకుంది. ఈ క్రమంలో తమిళ్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న జ్యోతిక సినిమాలు ‘పొన్మగల్ వంధల్’ చిత్రాన్ని ‘బంగారు తల్లి’ పేరుతో.. ‘మగలిర్ మాట్టం’ అనే సినిమాని ‘మగువలు మాత్రమే’ అనే పేరుతో రేపు(సెప్టెంబర్ 11న) స్ట్రీమింగ్ కి పెడుతున్నారు.

కాగా ‘బంగారు తల్లి’ సినిమా 2004వ సంవత్సరంలో ఊటీలో జరిగిన కిడ్నాప్ నేపథ్యంలో రూపొందింది. జేజే ఫ్రెడ్రిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై జ్యోతిక భర్త హీరో సూర్య నిర్మించారు. కోర్ట్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో జ్యోతిక ‘వెన్నెల’ అనే క్యారక్టర్ ప్లే చేసింది. జ్యోతికతో పాటు భాగ్యరాజ్ – పార్థీబన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ‘మగువలు మాత్రమే’ సినిమాలో ప్రభ అనే పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం స్నేహం మరియు సోదరభావం విశిష్టతను తెలియజేస్తుంది. జ్యోతిక విభిన్న పాత్రల్లో నటించిన ఈ రెండు సినిమాలు ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించనున్నాయి. ఆహాలో స్ట్రీమింగ్ కానున్న ఈ రెండు సినిమా ట్రైలర్స్ హీరో సూర్య ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. జ్యోతిక తన చిత్రాల ప్రీమియర్ల గురించి మరియు ’36 వయసులో’ మంచి ఆదరణ తెచ్చుకోవడంపై మాట్లాడుతూ “తెలుగు ప్రేక్షకులు ఇన్ని సంవత్సరాల తరువాత నాపై ఇంత ప్రేమను కనబరిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ రెండు స్పెషల్ సినిమాలు కూడా మిమ్మల్ని అలరిస్తే నేను సంతోషిస్తున్నాను” అని పేర్కొన్నారు.

Related Images:

మరో బుడ్డ సినిమా పట్టిన ఆహా

ప్రత్యేకంగా తెలుగు కంటెంట్ తో తెలుగు ప్రేక్షకుల కోసం అల్లు అరవింద్ ప్రారంభించిన ‘ఆహా’ ఓటీటీ ప్లాట్ ఫామ్ మెల్ల మెల్లగా కంటెంట్ విషయంలో జోరు పెంచుతోంది. అయితే భారీ సినిమాలు పెద్ద హీరోల సినిమాల వరకు మాత్రం ఇంకా వెళ్లడం లేదు. కంటెంట్ ఉన్న సినిమాలను కొనుగోలు చేసి స్ట్రీమింగ్ చేస్తోంది. ఇప్పటికే జోహార్.. బుచ్చినాయుడు కండ్రిగ.. నేను నా నేస్తం.. ట్రాన్స్.. ఫోరెన్సిక్ అనే సినిమాలు వచ్చాయి. చిన్న సినిమాలే అయినా అవి మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. భారీ సినిమాలను కాకుండా చిన్న సినిమాలను కంటెంట్ ఉన్న సినిమాలను చూసి మరీ అల్లు అరవింద్ కొనుగోలు చేస్తున్నట్లుగా దీన్ని బట్టి అర్థం అవుతుంది.

తాజాగా మరో చిన్న సినిమాను ఆహా కోసం అల్లు వారు కొనుగోలు చేశారు. ప్రముఖ కమెడియన్ సుహాస్ హీరోగా ఛాందిని చౌదరి హీరోయిన్ గా సునీల్ కీలక పాత్రలో తెరకెక్కిన ‘కలర్ ఫొటో’ ఓటీటీ రైట్స్ ను ఆహా దక్కించుకుంది. ఈ సినిమాను హృదయ కాలేయం దర్శక నిర్మాత అయిన స్టీవెన్ శంకర్ అలియాస్ సాయి రాజేష్ నిర్మించాడు.

ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. దాంతో సినిమాను ఆహా వారు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను దీపావళి సందర్బంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ఆహా ప్లాన్ చేస్తుందట. సందీప్ రాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఒక పల్లెటూరు ప్రేమను ప్రేక్షకుల ముందు ఉంచబోతుంది. అల్లు అరవింద్ నచ్చడంతో సినిమాపై అప్పుడే జనాల్లో ఆసక్తి మొదలైంది. త్వరలో స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.

Related Images:

OTT లో ఆ ఒక్కటే ఎందుకు నంబర్- 1 అంటే?

థియేటర్లు ఓపెన్ చేయకపోవడంతో ఓటీటీ వెలిగిపోతోంది. థియేటర్లు తెరిచినా ఓటీటీ ఇలానే వెలుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే యూత్ సహా ఫ్యామిలీస్ అన్నీ ఓటీటీలకు అడిక్ట్ అయిపోయాయన్నది ఓ సర్వే. అమెజాన్.. నెట్ ఫ్లిక్స్.. జీ5.. డిస్నీ హాట్ స్టార్.. ఈరోస్.. ఆహా ఇలా ఎన్నో ఓటీటీలు తెలుగు ప్రేక్షకులకు బోలెడంత వినోదాన్ని రెగ్యులర్ గా అందించేందుకు పోటీపడుతున్నాయి.

ఇక వీటిలో తెలుగు వరకూ ఏది నంబర్ 1…? అంటే నిస్సందేహంగా అమెజాన్ ప్రైమ్ గురించే చెబుతున్నారు. ఇందులో తెలుగు సినిమాలు నేరుగా చూడొచ్చు.. దాంతో పాటే అన్ని భాషల సినిమాలను తెలుగు సబ్ టైటిల్స్ సహా తెలుగు అనువాదాల రూపంలో వీక్షించే వెసులుబాటు ఇతర ఓటీటీలతో పోలిస్తే చాలా ఎక్కువ. నెట్ ఫ్లిక్స్ లాంటి ఇంటర్నేషనల్ దిగ్గజాన్ని బీట్ చేసి తెలుగులో పాపులరైన ఓటీటీగా అమెజాన్ ప్రైమ్ గురించి చెప్పవచ్చు.

రీసెంట్ తెలుగు బ్లాక్ బస్టర్లు అన్నీ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉన్నాయి. అల వైకుంఠపురములో… ఉమమహేశ్వర ఉగ్రరూపాస్య సహా దక్షిణ భారత చలన చిత్రాలు చాలావరకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో మాత్రమే కనిపిస్తాయి. తదుపరి నాని- సుధీర్ బాబు `వి`.. సూర్య సూరరై పొట్రు అమెజాన్ లోనే రిలీజవుతున్నాయి. నెట్ ఫ్లిక్స్- జీ 5- డిస్నీ హాట్స్టార్ వంటి ఇతర ఓటీటీలు పోటీలో ఉన్నా వీటితో పోలిస్తే అమెజాన్ ప్రైమ్ బెస్ట్ అన్న టాక్ వినిపిస్తోంది.

అయితే ఇలా అమెజాన్ వాళ్లు దూసుకుపోవడానికి కారణమేమిటి? అన్నది ఆరా తీస్తే నిర్మాతల ఫ్రెండ్లీ కావడమేనని తెలిసింది. సినిమాని సైట్ లో ప్రసారం చేసిన 30 రోజుల నుండి సంతకం చేసిన మొత్తాన్ని క్లియర్ చేసేస్తారట. డీల్ వేగంగా మాట్లాడతారు. ఇక నెట్ ఫ్లిక్స్ అయితే ఐదారు నెలల సమయం వెచ్చిస్తే కానీ డీల్ ని పూర్తి చేయదు. చాలా నెమ్మది. తెలుగు మార్కెట్ పై నెట్ ఫ్లిక్స్ కి గ్రిప్ కూడా తక్కువే. ఇలా అయితే అప్పులు చేసిన నిర్మాతలు ఆగుతారా? అందుకే అమెజాన్ ప్రైమ్ ని సురక్షితం అనుకుంటున్నారు. అలాగే ఇక్కడ భారీ చందాదారులు సినిమాల్ని బంపర్ హిట్లు గా మలుస్తున్నారు.

అమెజాన్ తర్వాత.. హాట్ స్టార్ లాంటి బడా సంస్థ ప్రత్యక్ష తెలుగు విడుదలలను సొంతం చేసుకోవడానికి తెలుగు మార్కెట్లో భారీగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతోంది. జీ 5కి నిధుల కొరత ఉందట. సన్ఎన్ఎక్స్ కి తెలుగు పై అంత ఆసక్తి లేదు. ఇతరులకు కూడా ఆసక్తి తక్కువగా ఉండడం వల్లనే అమెజాన్ ని బీట్ చేయలేకపోతున్నారు. ఇక అమెజాన్ మాత్రం సౌత్ లో భారీగా పెట్టుబడులు వెదజల్లేందుకు ఎంతమాత్రం వెనకాడకపోవడం వల్లనే నంబర్ వన్ స్థానాన్ని కొనసాగించగలుగుతోందట.

Related Images:

ఆహాని చూసి.. కొరివితో తల గోక్కుంటారా?

చాలా ముందు చూపుతో ఆహా-తెలుగు ఓటీటీని ప్రారంభించారు అల్లు అరవింద్. కానీ దీనిని సక్సెస్ చేసేందుకు ఆయన పెడుతున్న పెట్టుబడులు చూసి చాలామందికి కళ్లు భైర్లు కమ్ముతున్నాయి. వందల కోట్లను వెచ్చిస్తున్నారన్నది థింక్ చేస్తేనే సౌండ్ ఉండదు. అయినా.. కొరివిని చూసి దాంతోనే తల గోక్కున్నట్టు ఈ రంగంలోకి పలువురు రంగ ప్రవేశం చేయనున్నారని తెలిసింది. ఇంతకీ ఎవరా నిర్మాతలు కం సౌండ్ పార్టీలు? అంటే.. ఇప్పటికి సస్పెన్స్.

ఆహాకి ఆరంభం అంతగా క్రేజు లేదు. కానీ నెమ్మదిగా పెంచేందుకు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇటీవలి కాలంలో ఆహా యాప్ కి తెలుగునాట క్రేజ్ పెంచుతున్న వి ఏవి? అంటే.. మళయాలీ డబ్బింగ్ సినిమాలేనని చెప్పాలి. ఒరిజినల్ కంటెంట్ ని మించి ఇవి ఆదరణ పొందుతున్నాయి. ఇతర ఓటిటి ఫ్లాట్ ఫామ్స్ లో ఉన్న ఇతర భాషా హిట్ సినిమాలను తెలుగులోకి డబ్బింగ్ చేసి ఆహా లో విడుదల చేయడం ప్లస్ అవుతోంది.

ఇటీవలే `ఫోరెన్ సిక్` అనే మళయాలం డబ్బింగ్ సినిమాతో మొదలుపెట్టి ఇప్పటివరకు మూడు సినిమాలు విడుదల చేశారు. ఈ డబ్బింగ్ సినిమాలుతో ఆహా కు తెలుగులో వ్యూయర్ షిప్ బాగానే పెరిగింది. దానికి తోడు కంటెంట్ ని కూడా ఫిల్టర్ చేసి వదులతుండటంతో ఈ ఓటిటి వైపు తెలుగు సినిమా నిర్మాతలు కూడా దృష్టి పెడుతున్నట్లు సమాచారం. ఎవరైనా పెద్ద హీరో సినిమాకి డిజిటల్ పార్టనర్ గా వ్యవరిస్తే ఆహా మరింతగా జనాల్లోకి వెళ్లే అవకాశం ఉందన్నది అనుభవజ్ఞుల విశ్లేషకుల సూచన. మరి ఈ యాప్ కి బ్రాండింగ్ చేస్తున్న విజయ్ దేవరకొండ అప్ కమింగ్ సినిమాకి ఆహానే స్టీమింగ్ పార్టనర్ గా ఉంటుందేమో చూడాలి..!

Related Images: