రెక్కలు తొడిగిన పింక్ గులాబీ

అందానికి అందం వేడి పెంచే టెక్నిక్ కొందరికే సాధ్యం. ఈ కోవకే చెందుతుంది హేట్ స్టోరి బ్యూటీ ఊర్వశి రౌతేలా. సినిమాల పరంగా ఎంచుకునే కంటెంట్ తోనే కాదు.. నిరంతరం మీడియా హెడ్ లైన్స్ లో నిలవడం ఎలా అన్నది ఈ భామకు తెలిసినంతగా వేరొక భామకు తెలీదు. అందంతో పాటు సోషల్ మీడియాల్లో వేడి పెంచడం ఎలానో తెలిసిన భామగా ఊర్వశి రౌతేలా పేరు మార్మోగుతోంది.

సాటి నాయికలతో పోలిస్తే ఊర్వశి పబ్లిసిటీ స్టంట్ వేరే లెవల్లో ఉంటోంది. ఇటీవల ఇన్ స్టా వేదికగా ఈ బాలీవుడ్ బ్యూటీ షేర్ చేస్తున్న వరస ఫోటోషూట్లు అంతర్జాలంలో అగ్గి రాజేస్తున్నాయి.

తాజాగా మరో హాట్ ఫోటోషూట్ ని ఊర్వశి షేర్ చేసింది. మిల్కీ వైట్ అందాలను హైలైట్ చేస్తూ పింక్ గులాబీని తలపించే వస్త్రధారణతో మైండ్ బ్లాక్ చేసింది ఊర్వశి. ఒక కొండ రాతిపై నిలుచుని ఊర్వశి ఇచ్చిన ఆ ఫోజు కుర్రకారులోకి దూసుకెళుతోంది. పింక్ లో ఊర్వశి థై సొగసుల ఎలివేషన్ హీట్ పెంచుతోంది. రెక్కలు తొడిగిన పింక్ గులాబీని తలపిస్తోంది ఊర్వశి.. అంటూ కామెంట్లను జోడిస్తున్నారు ఫ్యాన్స్.

గోపిచంద్ సినిమాతో పాటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చిత్రంలోనూ ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ నంబర్ చేస్తోంది. ఉత్తరాది తో పాటు సౌత్ లోనూ మెరవాలన్న తన కలను నెరవేర్చుకోబోతోంది. ఆ క్రమంలోనే పబ్లిసిటీని పీక్స్ కి చేరుస్తోంది.

Related Images:

మిడిల్ ఈస్ట్ కి హేట్ స్టోరి బ్యూటీ గ్లామర్ ట్రీట్

వేడెక్కించే హాట్ ఫోటోషూట్లతో చెలరేగడం హేట్ స్టోరి 4 బ్యూటీ ఊర్వశి రౌతేలాకు కొత్తేమీ కాదు. ఇటీవల పలు సందర్భాల్లో బికినీ బీచ్ సెలబ్రేషన్ కి సంబంధించిన హాట్ ఫోటోల్ని ఇన్ స్టాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు అంతర్జాలాన్ని షేక్ చేశాయి.

అలాగే జిమ్ వీడియోలు ఫోటోలు ఇంటర్నెట్ లో ట్రెండింగ్ అయ్యాయి. తాజాగా మరోసారి ఊర్వశి తనదైన శైలిలో రెచ్చిపోయింది. యుఏఇకి చెందిన ప్రఖ్యాత XPEDITION మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ఊర్వశి రౌతేలా ఇచ్చిన ఫోజులు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి.

ప్రత్యేక దీపావళి సంచిక ముఖచిత్రంగా ఊర్వశి అందచందాలు హీటెక్కిస్తున్నాయి. ఆమె అద్భుతమైన శైలి.. అందమైన రూపం.. మైమరిపిస్తోంది. భారతదేశాన్ని మధ్యప్రాచ్యానికి సువిశాల ప్రపంచానికి ప్రకాశింపజేస్తున్న హాటెస్ట్ బ్యూటీగా రౌతేలా పాపులరవుతోంది.

ఈ ఫోటోషూట్ లో దేనికదే ప్రత్యేకం. ఓ ఫోటోలో బర్డ్ క్వీన్ గా ఫెదర్ డిజైన్ తో కనిపించిన ఊర్వశి వేరొక ఫోటోలో క్రిస్టల్స్ తో డిజైన్ చేసిన స్పెషల్ డిజైనర్ వేర్ లో అదరగొట్టేసింది. ఈ ఫోటోషూట్ కోసం వరల్డ్ క్లాస్ టెక్నీషియన్లు పని చేశారు. క్రియేటివ్ డైరెక్టర్ ..ఆర్ట్ డైరెక్టర్ లు టాప్ క్లాస్.. అలాగే ఆర్ట్ ఎడిటర్ E2 స్క్వేర్డ్ ఫోటోగ్రఫి.. విమిజోషి మేకప్ .. మాకోస్మెటిక్స్మిడిల్ ఈస్ట్.. మాంగెమోంగ్ వీడియోగ్రఫీ అంటూ తన బృందాన్ని ఊర్వశి పరిచయం చేసింది. ఊర్వశి ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉంది. సౌత్ లోనూ బిజీ నాయిక కావాలని కలలు కంటోంది. టాలీవుడ్ టాప్ హీరోలు చరణ్ .. బన్ని వంటి స్టార్ల సరసన అవకాశాలు అందుకోనుందని ఇటీవల గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related Images:

బన్ని డ్యాన్సులంటే పడి చస్తున్న బుట్ట బొమ్మలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డ్యాన్సింగ్ స్కిల్ గురించి చెప్పాల్సిన పనే లేదు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ క్లాస్ డ్యాన్సర్లలో బన్ని ఒకరు. బన్ని డ్యాన్సులకు హృతిక్ అంతటి వాడే ఫిదా అయ్యాడు. అతడికి అటు బాలీవుడ్ లోనూ స్టార్లలో వీరాభిమానులున్నారంటే అర్థం చేసుకోవచ్చు. కేవలం బాలీవుడ్ లోనే కాదు.. ఇరుగు పొరుగు పరిశ్రమలలో ఈ నటుడికి భారీ అభిమానులు ఉన్నారు. అన్నట్టు ఆయన అభిమానుల ఖాతాలో ఊర్వశి రౌతేలా కూడా చేరింది.

నేను లేడీ అల్లు అర్జున్ లాగా వ్యవహరించినప్పుడు నా చిత్రం బ్లాక్ రోస్ కోసం నా సౌత్ ఇండియన్ డాన్స్ స్టైల్ ని మీకు అందిస్తున్నాను అంటూ ఓ డ్యాన్సింగ్ వీడియోని అభిమానులకు ట్విట్టర్ లో షేర్ చేసింది ఊర్వశి. అల్లు అర్జున్ తనకు ప్రేరణ అని ఊర్వశి వెల్లడించారు. బాలీవుడ్ నుండి జనాదరణ పొందిన వ్యక్తిత్వాన్ని చూడటం చాలా అరుదు. అయితే ఇలా దక్షిణాది హీరోపై ఉత్తరాది భామ అభిమానం పెంచుకోవడం ఆసక్తికరం.

అదంతా సరే కానీ.. ఊర్వశి మాత్రమేనా? అంటే బన్ని అంటే పడిచచ్చే భామల జాబితాలో చాలామంది ఉన్నారు. తొలిగా ఆర్య లో డ్యాన్సులకు ఫిదా అయిపోయన కాజల్ .. ఓ పబ్లిక్ వేదికపై బన్ని గ్రేట్ డ్యాన్సర్ అంటూ పొగిడేసింది. అంతకుముందు దిశా పటాని కూడా `బుట్ట బొమ్మ` కోసం డ్యాన్స్ చేసి అల్లు అర్జున్ కు అంకితం చేసింది. దిశా పటానీ మరోసారి టాలీవుడ్ లో అడుగు పెడితే బన్నితో సినిమా చేయాలనుకుంటోందట. ఇకపోతే బుట్ట బొమ్మలో ఒరిజినల్ ప్యారీ పూజా హెగ్డే అయితే బన్ని డ్యాన్సులకు ఏనాడో ఫిదా అయిపోయానని అల.. ప్రమోషన్స్ లో చెప్పింది. ఇలా చూస్తే చాలా మంది బుట్టబొమ్మలకు బన్ని డ్యాన్సులన్నా అతడన్నా విపరీతమైన క్రష్ అని అర్థమైపోతోంది.

Related Images:

టాలీవుడ్ డైరెక్టర్ కి చుక్కలు చూపిస్తున్న మాజీ మిస్ ఇండియా…?

టాలీవుడ్ డైరెక్టర్ సంపత్ నంది లేటెస్టుగా ”బ్లాక్ రోజ్” అనే చిత్రాన్ని క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ హాట్ బ్యూటీ మాజీ మిస్ ఇండియా ఊర్వశి రౌతేలా హీరోయిన్ గా నటిస్తోంది. షేక్స్ పియర్ రచన ‘ద మర్చంట్ ఆఫ్ వెనిస్’లో షైలాక్ అనే పాత్రని ఆధారంగా చేసుకుని ఈ ఫిమేల్ ఓరియంటెడ్ ఎమోషనల్ థ్రిల్లర్ ని రూపొందిస్తున్నారు. ఊర్వశి రౌతెలా టాలీవుడ్ డెబ్యూగా వస్తున్న ‘బ్లాక్ రోజ్’ కథ చాలా హాట్ హాట్ గా సాగుతుందని తెలుస్తోంది.

కాగా సంపత్ నంది ప్లాన్ ప్రకారం ఈ సినిమాని ముందుగా హిందీ తెలుగు భాషల్లో తీసి.. ఆ తరువాత మిగతా భాషల్లోకి డబ్ చేద్దామనుకున్నాడట. అయితే ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం విషయంలో ఊర్వశీ రౌతేలా మేకర్స్ కి చుక్కలు చూపిస్తోందని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు. ‘బ్లాక్ రోజ్’ సినిమాని ముందు హిందీలో రిలీజ్ చేసి ఆ తరువాత తెలుగులో విడుదల చేయాల్సిందిగా ఊర్వశి ప్రెజర్ చేస్తోందట. అంతేకాకుండా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర మిగతా షూట్ మొత్తం ముంబైలో చేయాల్సిందిగా ఈ హాట్ బ్యూటీ కండిషన్స్ పెడుతోందట. బాలీవుడ్ లో తనుకున్న ఫేమ్ పోతుందేమో అనే భయంతోనే ఊర్వశీ ఈ విధంగా ఆలోచిస్తోందట. ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీని టాలీవుడ్ లో ఇంట్రడ్యూస్ చేద్దామనుకున్న సంపత్ నందికి అమ్మడి వ్యవహారం తలనొప్పిగా మారుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Related Images: