కెరీర్ ప్రారంభించిన తక్కువ సమయంలోనే అగ్ర కథానాయికల జాబితాలో చేరిపోయింది ఆలియాభట్. బాలీవుడ్ లో ఎందరు టాప్ హీరోయిన్లు ఉన్నా ఈ కుర్రబ్యూటీ ముందు దిగదుడుపే అన్నంతగా ఎదిగేసింది. ఒక్కో సినిమాకి 8-10 కోట్ల పారితోషికం అందుకునే రేంజు ఆలియాది. అలాంటి డిమాండ్ ఉన్న స్టార్ ని దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తన ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ కోసం లాక్ చేయడం ఆసక్తికరం.
ఆలియా ఇప్పటికిప్పుడు వరుసగా నాలుగైదు పాన్ ఇండియా సినిమాలతో బిజీ. అయినా ఎస్.ఎస్.రాజమౌలి పీరియడ్ డ్రామా ఆర్.ఆర్.ఆర్ కి ఎలాంటి ట్రబుల్ ఇవ్వకుండా సెట్లో జాయినవుతుండడం ఆసక్తికరం. ఈ క్రేజీ మూవీ లో నటించేందుకు తిరిగి సెట్స్ కి జాయిన్ అయ్యింది.
రామ్ చరణ్ ఇందులో స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గా నటిస్తుండగా.. అతడి సరసన సీత పాత్రలో నటిస్తోంది. అలియాపై కొన్ని ఎమోషనల్ సన్నివేశాలను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్నారని సమాచారం.
తాజా సమాచారం ప్రకారం.. గత రాత్రి వరకు తన సోదరి నిహారికా వివాహం కోసం రాజస్థాన్ ఉదయపూర్ లో ఉన్న రామ్ చరణ్ ఈ రోజు హైదరాబాద్ చేరుకోనున్నారు. చరణ్ ఇక్కడికి చేరుకున్నాక ఎక్కువ విరామం తీసుకోకుండా సెట్లో జాయినవుతారని తెలుస్తోంది. శుక్రవారం నుండే RRR షూట్ ను తిరిగి ప్రారంభిస్తారట. ఆలియాతో కాంబినేషన్ సన్నివేశాలను పూర్తి చేయడానికి రెడీ అవుతున్నారట. అలియా షెడ్యూల్ వచ్చే వారం వరకు ఉంటుంది.
నటిస్తున్న తొలి సినిమాతోనే సత్తా చాటేందుకు ఆలియా ఎంతగానో తపిస్తోంది. ఇప్పటికే అలియా కోచ్ ని నియమించుకుని తెలుగు నేర్చుకుంది. ఆమె తన సొంత స్వరంతో తన పాత్ర కోసం డబ్బింగ్ చెప్పుకోనుంది. ఈ ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా మూవీతోనే దక్షిణాది చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతున్న ఆలియా తనదైన ముద్ర వేయాలనుకుంటోందట. ఈ హిస్టారికల్ ఫిక్షనల్ మూవీ కోసం డివివి దానయ్య రూ .400 కోట్ల బడ్జెట్ ని వెచ్చిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ – ఒలీవియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
నాలుగు విభిన్న కథలతో తెరకెక్కిన తమిళ వెబ్ సిరీస్ ‘పావ కథైగల్’ డిసెంబర్ 18న నెట్ ఫ్లిక్స్ లో విడుదలవుతోంది. తాజాగా రిలీజైన ట్రైలర్ హాట్ టాపిక్ గా మారింది. ఇందులో తెలుగమ్మాయి అంజలి బాలీవుడ్ నటి కల్కి కొచ్లిన్ తో ఘాటైన లిప్ లాక్ లు రొమాన్స్ చేయడం యాక్ట్ కి సిద్ధం కావడం ఫ్యాన్స్ కి షాక్ నిచ్చిందనే చెప్పాలి. ‘పావ కథైగల్’కు నలుగురు ప్రముఖ దర్శకులు దర్శకత్వం వహించారు. సుధ కొంగర- వెట్రిమారన్- గౌతమ్ మీనన్- విఘ్నేష్ శివన్ ఈ సిరీస్ కి దర్శకత్వం వహించారు.
నాలుగు కథల్లో.. మొదటి కథ ఒక తండ్రి గురించి.. అతని కుమార్తె ఇతర కులానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంటుంది. ప్రకాష్ రాజ్ తండ్రి పాత్రలో.. సాయి పల్లవి కుమార్తె పాత్రలో నటించారు. రెండవ కథ వ్యోమగామి కావాలని కోరుకునే అమ్మాయికి తండ్రి పాత్ర పోషిస్తున్న దర్శకుడు గౌతమ్ మీనన్ గురించి.
విగ్నేష్ శివన్ తెరకెక్కించిన మూడవ కథ.. కల్కి కోచ్లిన్ అనే మహిళతో ప్రేమలో పడే అంజలి గురించి. ఇది లెస్బియన్ కథ.. అంజలి తండ్రి ఈ లెస్బియన్ ప్రేమికుల విషయంలో ఎలా వ్యవహరిస్తాడు అనేది కథాంశం. అంజలి ’లెస్బియన్ చర్య చర్చనీయాంశంగా మారింది. నాల్గవ కథ ముస్లిం వ్యక్తి హిందూ అమ్మాయి మధ్య మతాంతర ప్రేమ గురించి. ఎంచుకున్న కథాంశాల్లోనే బోలెడంత ఎమోషన్ దాగి ఉంది. ఇక నటీనటులు ఉద్ధండులే కాబట్టి తెర నిండుగా ప్రతిదీ పండాయనే చెప్పాలి. ట్రైలర్ ఆద్యంతం ఎమోషన్ తో రక్తి కట్టిస్తోంది.
ఈ ఆంథాలజీ ట్రైలర్ చాలా హైప్ ని సృష్టిస్తోంది. అందరిలో అంజలి లెస్బియన్ యాక్ట్ యువతరంలో ప్రముఖంగా చర్చకు వస్తోంది. ఈ చిత్రం నుండి ఆమె స్టిల్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.
బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇటీవలే కోవిడ్ 19కి చికిత్స పొంది రికవరీ అయిన సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యంగా తిరిగి ఇంటికి రావడంతో అభిమానులు ఊపిరి తీసుకున్నారు. అయితే అప్పుడు కూడా అమితాబ్ అంతగా ఎమోషన్ అవ్వలేదు. కానీ ఈరోజు ఆయన చేసిన ఎమోషనల్ ట్వీట్ అందరి హృదయాల్ని కాస్త డెప్త్ తోనే టచ్ చేసింది.
ఆయన తన తండ్రిగారైన.. దివంగత హరివంశ్ రాయ్ బచ్చన్ పేరు మీద వ్రోక్లా(పోల్యాండ్)లోని స్క్వేర్ చిత్రాన్ని పంచుకున్నారు. దీనికి ఆయన దివంగత తండ్రి.. ప్రముఖ హిందీ కవి హరివంశ్ రాయ్ బచ్చన్ పేరు పెట్టారు. తన కుటుంబానికి భారతదేశానికి ఎంతో గర్వకారణమిదని ఈ సందర్భంగా బిగ్ బి పేర్కొన్నారు.
“పోలాండ్లోని సిటీ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ వ్రోక్లా నా తండ్రి పేరును ఒక స్క్వేర్ (చతురస్ర నిర్మాణం) కి పెట్టాలని నిర్ణయించుకుంది .. దసరా రోజున ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం వేరొకటి ఉండకపోవచ్చు . ఇది మా కుటుంబానికి ఎంతో గర్వకారణం. ఎందుకంటే వ్రోక్లాలోని భారతీయ సమాజం ..చేస్తున్నది ఇది. జై హింద్ ”
అంటూ ఎమోషన్ కి గురయ్యారు అమితాబ్. దేశం కాని దేశంలో నా తండ్రి ఈ గౌరవానికి అర్హుడు. నేను కాదు. ఇది నా తండ్రిని గౌరవించే దేశం. కొడుకుకు ఎక్కువ గౌరవం ఇచ్చే క్షణం ఉండకూడదు అంటూ ఎంతో ఎమోషన్ కి అమితాబ్ గురయ్యారు.
బిగ్ బి సహచరులు చాలా మంది ఈ వార్తలపై స్పందించారు. నటుడు రణవీర్ సింగ్.. సునీల్ శెట్టి ..యు షమితా శెట్టి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఎమోజీల సమూహాన్ని షేర్ చేశారు. టీవీ నటుడు అహానా కుమ్రా ఇలా రాశారు.. “ఎంత అద్భుతమైన @amitabhbachchan సార్ !! అద్భుతమైన వార్తలు! హ్యాపీ దసరా! అంటూ ఎగ్జయిట్ అయ్యారు.
2019 డిసెంబరులో తన తండ్రి పేరు మీద ఒక చతురస్రానికి పేరు పెట్టాలని వ్రోక్లా నిర్ణయించుకున్నట్లు అమితాబ్ ప్రకటించారు. అతను తన తండ్రిని గౌరవించటానికి ఆ దేశంలోని ఒక చర్చి నుండి కొన్ని చిత్రాలను పంచుకున్నారు. “యూరప్లోని పురాతన చర్చిలలో ఒకదానిలో పోలాండ్లోని బాబూజీ కోసం ఒక ప్రార్థన .. అంతగా మనసును తాకిన అలాంటి భావోద్వేగ క్షణం .. అతని ఆత్మకు శాంతి తో ప్రేమతో .. బిషప్ మరియు పోలాండ్ ప్రజలకు ధన్యవాదాలు .. అటువంటి గౌరవం దక్కినందుకు“ అని అప్పట్లో ట్వీట్ చేశారు. గౌరవం యతో నిండిన పోలాండ్ ప్రజలు .. 300 సంవత్సరాల పురాతన చర్చి ఇది.. WW 2 సమయంలో నగరంలో 85% కంటే ఎక్కువ నాశనమైనది.. . కానీ ఈ చర్చిని మాత్రం యుద్ధం తాకలేదు అని తెలిపారు.