ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం అందరినీ విషాదంలోకి నెట్టేసింది. ఇప్పటికీ సినీ రాజకీయవర్గాల్లో అదొక విషాదకర వార్తగా మిగిలిపోయింది. అంత గొప్ప గాన గంధర్వుడికి స్మారక మందిరం నిర్మించాలనే డిమాండ్ ఇప్పుడు ఊపందుకుంది.
దీనిపై ఎస్పీ బాలు కుమారుడు ఎస్పీ చరణ్ స్పందించాడు. నాన్న బాలును ఖననం చేసిన ప్రాంతంలోనే స్మారక మందిరం త్వరలో నిర్మిస్తామని కుమారుడు చరణ్ ఆదివారం మీడియాకు తెలిపారు.
ప్రభుత్వ లాంఛనాలతో బాలు అంత్యక్రియలు శనివారం తిరువళ్లూరు జిల్లా తామరపాక్కం క్రాస్ రోడ్డు వద్ద ఉన్న ఆయన వ్యవసాయ క్షేత్రంలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఖననం చేసిన ప్రాంతంలోనే ఆదివారం కుటుంబ సభ్యులు సంప్రదాయ ఆచారాలను పూర్తి చేసి పూజలు చేశారు. ఇక్కడే ఎస్పీ బాలు స్మారక మందిరం నిర్మించనున్నట్లు ఎస్పీ చరణ్ వెల్లడించారు.
ఎస్పీ బాలుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే మీడియాకు వివరిస్తామని ఎస్పీ చరణ్ తెలిపారు. తండ్రికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన తమిళనాడు ప్రభుత్వానికి సహకరించిన పోలీసులు మీడియాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు సందర్శించేలా ఈ స్మారక మందిరం నిర్మిస్తామని వివరించారు..
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దాదాపు 51 రోజులపాటు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చనిపోయిన సంగతి తెలిసిందే.. బాలు మృతిపై దేశవ్యాప్తంగా విషాదం నెలకొంది.
అయితే బాలు మృతిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలకు తెరతీశారు. బాలు చికిత్సకు ఆ హాస్పిటల్ బిల్లు భారీగా వేసిందని సోషల్ మీడియాలో ప్రచారమైంది. ఎస్పీ బాలు చికిత్సకు దాదాపు 3 కోట్ల బిల్లును ఎంజీఎం ఆస్పత్రి వేసిందని.. తమిళనాడు ప్రభుత్వంను ఆశ్రయించగా.. ఆ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదని.. ఆ తర్వాత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసినట్లు ప్రచారం జరిగింది. బ్యాలెన్స్ అమౌంట్ ను ఉపరాష్ట్రపతి వెంకయ్య కూతురు చెల్లించిందని అప్పుడు మృతదేహాన్ని అప్పగించారని సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారం జరిగింది. ఈ వార్తలపై ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు.
తన తండ్రికి చికిత్సనందించిన ఎంజీఎం ఆస్పత్రిపై విష ప్రచారం చేయడం సరికాదని ఎస్పీ చరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రిని కోల్పోయి బాధపడుతున్న సమయంలో ఇలా లైవ్ లోకి రావడం దురదృష్టకరమని చరణ్ వాపోయాడు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త అబద్ధమని చరణ్ తెలిపారు. ఇలాంటి వార్తలు తమ కుటుంబానికి బాలుకు చికిత్స అందించిన డాక్టర్లకు ఆస్పత్రికి నష్టం చేకూరుస్తాయని.. తప్పుడు ప్రచారం ఆపాలని చరణ్ తెలిపారు.
త్వరలోనే ఎంజీఎం ఆస్పత్రి వైద్యులతో కలిసి బాలు చికిత్స వివరాలు బిల్లులు బయటపెడుతామని విలేకరుల సమావేశంలో చెబుతామని చరణ్ క్లారిటీ ఇచ్చారు. అపోలో హాస్పిటల్ కూడా తన నాన్న బాలు కోసం వైద్య పరికరాలు పంపించి సహకరించిందని చరణ్ తెలిపారు.
ఎస్పి బాలు ఆసుపత్రి బిల్లులను తాము చెల్లించామనే ప్రచారంపై ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు కుమార్తె దీపా వెంకట్ స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పుకార్లపై దీపా ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది ఎస్పీ బాలు ఆసుపత్రి బిల్లులు చెల్లించలేదని.. ఇలాంటి పుకార్లను ప్రచారం చేయవద్దని లేదా అలాంటి వాట్సాప్ ఫార్వార్డ్లను నమ్మవద్దని ప్రతి ఒక్కరినీ కోరారు.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చికిత్స పొందిన ఎంజిఎం హెల్త్కేర్ హాస్పిటల్ 2 వారాల క్రితమే బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించారని దీపా అన్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం సర్ మా కుటుంబానికి దగ్గరగా ఉన్నందున ఆసుపత్రి అధికారులు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితుల గురించి.. కొన్ని సార్లు నా తండ్రి వెంకయ్యకి కూడా తెలియజేస్తున్నారు ”అని దీప తెలిపారు.
ప్రముఖ తెలుగు గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి అత్యంత క్షీణించినట్టు ఆస్పత్రి వర్గాలు బులిటెన్ లో తెలిపాయి. . కరోనా వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆగస్టు 5న చెన్నై ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన చికిత్స తీసుకుంటున్నారు.
గత 40 రోజులుగా చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో ఎస్పీ బాలు చికిత్స పొందుతున్నారు. కిందట వారం బాలు ఆరోగ్యం మెరుగ్గా ఉందని బాలు కుమారుడు చరణ్ వెల్లడించారు. కరోనా కూడా నెగెటివ్ గా వచ్చిందని.. కుర్చీలో కూర్చుంటున్నారని కూడా తెలిపాడు.
అయితే ఎస్పీ బాలు కోలుకుంటుండగా.. అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు అభిమానులు ఆందోళనకు గురి అవుతున్నారు. ఇతర ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారని సమాచారం. బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు ప్రార్థిస్తున్నారు.
కాగా బాల సుబ్రహ్మణ్య ఆరోగ్య పరిస్థితిపై తాజాగా ఎంజీఎం ఆస్పత్రి బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో ఎస్పీ బాలు ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
ప్రస్తుతం ఎస్పీ బాలుకు ఎక్మో వెంటిలేటర్ ఇతర ప్రాణధార చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు. కాగా కోలుకున్నట్టే కోలుకొని మళ్లీ బాలు ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారడం అందరినీ కలవరపాటుకు గురిచేస్తోంది.
అందరి ప్రార్థనలు ఫలించాయి. ప్రముఖ నేపధ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం చాలా మెరుగైంది. ప్రస్తుతం ఆయన సొంతంగానే శ్వాస పీల్చుకోగలుగుతున్నారు. బాలు కుమారుడు ఎస్పీ చరణ్ తాజాగా విడుదల చేసిన వీడియోలో తన తండ్రి ఆరోగ్యంపై పలు విషయాలు వెల్లడించారు. ‘ తన తండ్రి వేగంగా కోలుకుంటుండడంతో సంతోషంగా ఉంది. సోమవారం కల్లా గుడ్ న్యూస్ వినబోతున్నాం. ఆ రోజు ఆయనను ఐసీయూ నుంచి సాధారణ గదికి మార్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ సహాయం లేకుండానే సొంతంగా శ్వాస తీసుకోగలుగుతున్నారు. సోమవారం కల్లా ఆయన కోలుకొని అందరితో మాట్లాడగలుగుతారని ‘ ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆగస్టు 5న ఎస్.పి.బాలు కరోనాతో చెన్నైలోని ఎమ్జీఎమ్ ఆస్పత్రిలో చేరారు. ముందు కాస్త బాగున్నప్పటికీ ఆ తర్వాత ఆయన పరిస్థితి చాలా క్రిటికల్ గా మారింది. దీంతో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రధాని మోదీకి విషయాన్ని వివరించి ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ నుంచి ప్రత్యేక వైద్య బృందాన్ని పంపించారు.
ఎప్పటికప్పుడు ఎమ్జీఎమ్ ఆస్పత్రి సిబ్బంది తో పీఎంవో కార్యాలయం సంప్రదింపులు జరుపుతూనే వచ్చింది. ఆగస్టు 13న ఆయన పరిస్థితి పూర్తిగా క్షీణించిందనే అనే పుకార్లు వచ్చాయి. అయితే ఎమ్జీఎమ్ ఆస్పత్రి వైద్యులు విదేశాల నుంచి ప్రత్యేక వైద్య నిపుణులను రప్పించి ఆయన్ను రక్షించడంలో విజయవంతం అయ్యారు. ఐసీయూలో ప్రత్యేక గది ఏర్పాటు చేసి ఆయన సినిమాల్లోని ప్రఖ్యాత పాటలు వినేలా చర్యలు చేపట్టారు. అత్యుత్తమ వైద్య సేవలతో ఎస్పీ బాలు మెరుగ్గా కోలుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఆసుపత్రిలో ఎస్పీ బాలు కోలుకొని తిరిగి పాటలు కూడా పాడుతున్నారనే పుకార్లు చెలరేగాయి. ‘ విశ్వం నాకోసమే విస్తరించిందని పుడమి నాకోసమే పుట్టిందని ‘ లిరిక్స్ తో సాగే ఈ సోలో గీతం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఇది బాలు ఆసుపత్రి బెడ్ పై పాడిన పాట కాదు. గతంలో ఆయన ఓ కవిత కు ఇచ్చిన గీతా రూపం ఇది.
తన తండ్రి ఆరోగ్యంపై ఎస్పీ చరణ్ ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తుండగా.. మరోవైపు ఆయన వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే.. బెడ్ పై పాట పాడారంటూ ప్రచారంలోకి తేవడం ఏమిటని.. పలువురు ప్రశ్నిస్తున్నారు. పాటలు పాడే పరిస్థితి ఉంటే ఐసీయూలో ఎందుకుంటారంటూ విమర్శిస్తున్నారు.
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ మేరకు ఆయన కోలుకోవాలని హీరోలు అభిమానులు గాయకులు ఈ సాయంత్రం దేవుడిని మూకుమ్మడిగా ప్రార్థించారు. సూపర్ స్టార్ రజినీకాంత్ పిలుపు మేరకు ఈ ప్రార్థన జరిగింది.
ఈ క్రమంలోనే కొడుకు ఎస్పీ చరణ్ తన తండ్రి బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి స్పందించారు. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కళ్లలో నీళ్లు తిరుగుతుండగా వణుకుతున్న గొంతుతో మాట్లాడారు. చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో బాలు వెంటిలేటషన్ పైనే చికిత్స పొందుతున్నాడని తెలిపారు. బాలు ఆరోగ్యం ఇంకా ఆందోళనకరంగానే ఉన్నట్లు ఆయన తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా సంగీతాభిమానులు సినీ పరిశ్రమ చూపుతున్న ఆదరణకు ధన్యవాదాలు ఎస్పీ చరణ్ తెలిపారు. ‘ఎస్పీ బాలు ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉంది. పురోభివృద్ధి లేదు. ఆయన కోలుకోవాలని వేడుకున్న అందరికీ ధన్యవాదాలు..’ అంటూ ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ వీడియోలో పేర్కొన్నారు.