కంగనతోనే పెట్టుకున్నాడు! ఇక నాన్ స్టాప్ బాక్సింగే!!

కొన్ని సెకన్లు నిమిషాల్లోనే ప్రత్యర్థిపై వేగంగా పంచ్ లు కురిపిస్తూ రింగ్ లో బాక్సర్లు చేసే హంగామా మామూలుగా ఉండదు. అందుకు భిన్నంగా మాటల తూటాలు పేలుస్తూ.. పంచ్ లు విసురుతూ వైరి వర్గాల తాట తీయడం కంగనకు వెన్నతో పెట్టిన విద్య.

అయితే ఇప్పుడు ఓ యువ బాక్సర్ ఏకంగా కంగన అండ్ కోతోనే పెట్టుకోవడంపై ఆసక్తికర చర్చ మొదలైంది. ఇంతకీ ఎవరా యంగ్ బాక్సర్ అంటే.. ఇంకెవరు.. ఒలింపిక్స్ పథక విజేత విజేందర్ సింగ్. పంజాబీ గాయకుడు కం నటుడు దిల్జీత్ కి మద్ధతు పలుకుతూ అతడు ఏకంగా కంగననే కెలికాడు. తప్పుడు వ్యక్తులతో స్నేహం చేసి ఇలా చేస్తున్నారు! అంటూ కంగనను తప్పు పట్టే ప్రయత్నం చేశాడు విజేందర్.

దిల్జిత్ దోసంజ్పై కంగనా రనౌత్ వ్యాఖ్యలపై విజేందర్ సింగ్ కొన్ని నినాదాలు చేశారు. ఉత్తర భారతదేశం అంతటా కొనసాగుతున్న రైతు నిరసనల గురించి గాయకుడు కం నటుడు దిల్జిత్ దోసంజ్ ట్విట్టర్ లో వ్యాఖ్యను జోడించగా.. దానికి కౌంటర్ గా కంగన వరుస ట్వీట్లు చేయడం సంచలనమైంది. కంగన వర్సెస్ దిల్జీత్ ఎపిసోడ్ తీవ్రంగానూ మారింది.

అయితే దిల్జీత్ తో గొడవకు దిగిన కంగన పై బాక్సర్ విజేందర్ సింగ్ విరుచుకుపడ్డారు. తప్పుడు వ్యక్తులతో స్నేహం వల్ల కంగన గందరగోళంలో పడిందని వ్యాఖ్యానించారు. దానికి కంగన రిప్లయ్ ఇచ్చారు. “క్యున్ తు భీ శివసేన బనాయేగా ….. భాయ్ (ఎందుకు మీరు కూడా శివసేన తో కలిసి పని చేయాలనుకుంటున్నారా?) అని ప్రశ్నించగా… శివసేన ఇప్పటికే ఉంది.. మంచి పనులు చేస్తోంది అంటూ విజేందర్ బదులిచ్చారు.

కంగనా మహారాష్ట్రలోని ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ప్రభుత్వంతో మాటల యుద్ధంలో పాల్గొంటున్న సమయంలో విజేందర్ ఆ పార్టీకి మద్ధతు పలకడంపై యువతరంలో చర్చ సాగుతోంది. సినీ సోదర సభ్యులైన స్వరా భాస్కర్- మికా సింగ్- రిచా చద్దా తదితరులు దిల్జీత్ కి మద్ధతుగా కంగనకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించారు.

Related Images:

కంగన ముద్దాడిన ఆ బుడతడు ఎవరూ?

నిరంతరం ఎవరో ఒకరిపై చిర్రుబుర్రులాడే కంగన ఇదిగో ఇలా అదిరే ముద్దిచ్చింది. అది కూడా ఓ చిన్నారి బాలకుడి పెదవి అంచుపై ముద్దాడి ఆశ్చర్యపరిచింది. అయితే అది అన్ని ముద్దుల్లాంటిది కాదు. అభిమానం ఆత్మీయతను కురిపించే ముద్దు. తన ప్రేమను మేనల్లుడిపై ది బెస్ట్ గా ఆవిష్కరించిన ముద్దు అది. కంగనా రనౌత్ ఆదివారం నాడు మేనల్లుడు పృథ్వీరాజ్ ని ఇలా ముద్దాడేస్తున్నప్పటి ఫోటోని అభిమానులకు షేర్ చేసింది.

ప్రస్తుతం `తలైవి` హైదరాబాద్ షూట్ కోసం బయలుదేరిన రోజును ప్రతిసారీ గుర్తుచేసుకునేలా .. ఇలా స్పెషల్ గా తన మేనల్లుడిని ముద్దాడిందట. అతను ఆమెను వెళ్లవద్దని మారాం చేస్తే ఆమె ఇలా చక్కని ముద్దిచ్చి సర్ధి చెప్పి షూట్ కి వచ్చేసిందట.

“మేము షూట్ కోసం బయలుదేరినప్పుడు నన్ను వెళ్ళవద్దు అని అన్నాడు. నేను పనికి వెళ్లాలని పట్టుబట్టాను. అతను ఆలోచనాత్మకంగా చూసాడు. వెంటనే నా ఒడిలో కూర్చుని నవ్వుతూ అన్నాడు …. సరే మీరు వెళ్ళండి కానీ నన్ను మీతో కూర్చోనివ్వండి అన్నాడు. రెండు నిమిషాల పాటు …. అతని ముఖం చూస్తూ ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాను” అంటూ కంగన మేనల్లుడి పెదవులపై ముద్దాడేసిందిలా. ఈ నెల ఆరంభం ఉదయపూర్ లో జరిగిన ఆమె సోదరుడు అక్షత్ వివాహం నుండి వచ్చిన అనంతర పరిణామమిది.

ఇప్పుడు ఒక నెలకు పైగా కంగనా.. ఫ్యామిలీలో వివాహాల సందడితో బిజీగా ఉంది. కంగనా తమ్ముడు అలాగే బంధువు ఒకరు అక్టోబర్-నవంబర్ కాలంలో వివాహం చేసుకున్నారు. కంగన సోదరి రంగోలి ఈ వేడుక నుండి టన్నుల కొద్దీ ఫోటోలు.. వీడియోలను పంచుకున్నారు. ఆమె బంధువు స్వస్థలం హిమాచల్ ప్రదేశ్ లో వివాహం చేసుకున్నారు. ఆమె సొంత సోదరుడి వివాహం కోసం..ఉదయపూర్ కు వెళ్లింది.

కంగన ప్రస్తుతం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె.జయలలిత బయోపిక్ తో బిజీగా ఉంది. మార్చి నుండి ఆగస్టు మధ్య కరోనావైరస్ లాక్ డౌన్ కాలంలో ఆమె తన స్వస్థలమైన మనాలిలో గడిపింది. లాక్ డౌన్ నిబంధనలను ప్రభుత్వాలు సడలించాక కంగనా చెన్నైలో ఒక షెడ్యూల్ చేసింది. ఇప్పుడు హైదరాబాద్ లో నివాసం ఉంది.

కంగనకు మరో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. ధాకడ్ .. తేజస్ చిత్రాలతో కంగన బిజీ. తలైవి షూట్ కోసం ఆమె 70 కిలోల బరువు కు పెరిగింది. అయితే ఇప్పుడు బరువు తగ్గుతోంది. తదుపరి చిత్రాల కోసం కఠినంగా శిక్షణ తీసుకుంటోంది.

ధాకడ్ కోసం కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ యాక్షన్ రిహార్సల్స్ నుండి చిత్రాలను పంచుకుంటూ.. “మల్టీ టాస్క్ చేయడం ఇష్టం లేదు.. కానీ ఈ కాలంలో నేను గుర్రంలా పనిచేయాలి“ అంటూ వ్యాఖ్యను జోడించింది.

తేజస్లో ఆమె ఫైటర్ పైలట్ గా కనిపిస్తుంది. కొన్ని నెలల క్రితం ఈ చిత్రం నుండి ఒక పోస్టర్ షేర్ చేయగా.. కంగనా ఎయిర్ ఫోర్స్ పనిలో అలసట చెందిన దానిగా కనిపించింది. యుద్ధ విమానంతో నిలబడిన ఫోటో క్యూరియాసిటీని పెంచింది.

Related Images:

కంగన మనాలి ఇంటికి సమీపంలో వైల్డ్ డాగ్

ఇటీవల గత కొంతకాలంగా క్వీన్ కంగన హడావుడి తెలిసినదే. ముంబై టు మనాలి కంగన ఎపిసోడ్స్ హీటెక్కించాయి. కంగనకు మనాలిలో పర్వతసానువుల నడుమ ఒక సుందరమైన స్వగృహం కొలువు దీరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అటు చైనా బార్డర్ లో ప్రత్యర్థి సైనికుల కవాతు గురించి దేశమంతా ఆసక్తికర చర్చ సాగిస్తుంటే.. ఏ సమయంలో యుద్ధం వస్తుందోనన్న ఆందోళన నెలకొన్న వేళ .. మనాలి లోనే కంగన నివశిస్తోంది. ఇక మనాలి నుంచి ప్యాంగ్ యాంగ్ లేక్ వరకూ షూటింగుల కోసం మన దర్శకనిర్మాతలు ఉవ్విళ్లూరుతుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

తాజాగా అక్కినేని నాగార్జున టైటిల్ రోల్ పోషిస్తోన్న తాజా చిత్రం `వైల్డ్ డాగ్` షూటింగ్ కూడా మనాలిలోనే చేస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇది మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మాణమవుతోన్న 6వ చిత్రం. అహిషోర్ సాల్మన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ మనాలీలోని సుందర ప్రదేశాల్లో మొదలైంది. సుదీర్ఘంగా కొనసాగే ఈ షెడ్యూల్లో నాగార్జునతో సహా ప్రధాన పాత్రధారులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఏసీపీ విజయ్ వర్మగా నాగార్జున ఇప్పటివరకూ చేయని విభిన్న తరహా పాత్రను చేస్తున్నారు. క్రిమినల్స్ ను నిర్దాక్షిణంగా డీల్ చేసే విధానం వల్ల సినిమాలో ఆయనను వైల్డ్ డాగ్ అని పిలుస్తుంటారు. ఈ చిత్రంలో నాగార్జున జోడీగా దియా మీర్జా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓ కీలక పాత్రలో సయామీ ఖేర్ కనిపించనున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిరంజన్ రెడ్డి అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిరణ్ కుమార్ సంభాషణలు రాస్తుండగా షానీల్ డియో సినిమాటోగ్రాఫీ అందిస్తుస్తున్నారు. అన్నట్టు కంగన ఇంటి పరిసరాల్లోనే షూటింగ్ చేస్తున్నారు కాబట్టి ఓసారి అటెళ్లి కలిసొస్తారా వైల్డ్ డాగ్ టీమ్? కంగన స్వయంగా నాగార్జున టీమ్ ని డిన్నర్ కి ఇన్వయిట్ చేస్తుందేమో చూడాలి.

Related Images:

కంగననే అత్యాచారం చేస్తానని బెదిరించిన ఆ రేపిస్ట్ ఎవరు?

కంగనా రనౌత్ ప్రస్తుతం మనాలిలో తన సోదరుడి వివాహ ఉత్సవాల్లో బిజీగా ఉన్న సంగతి విధితమే. పెళ్లి సందడిలో ఫుల్ చిలౌట్ లో ఉన్న క్వీన్ కి ఊహించని ట్విస్టు ఎదురైంది. ఒక న్యాయవాది సోషల్ మీడియాలో కంగనను అత్యాచారం చేస్తానని బెదిరించాడు.

ఇంతకీ క్వీన్ కంగననే బెదిరించిన ఆ మొనగాడెవరు? అంటే.. ఒడిశా ఆధారిత న్యాయవాది నుండి అత్యాచారం చేస్తానని బెదిరింపులు ఎదురయ్యాయట. అయితే అతగాడు తన ఖాతా హ్యాక్ అయ్యిందని ఆ తప్పు తాను చేయలేదని చెబుతున్నాడు.

కంగనా రనౌత్ సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులకు వ్యతిరేకంగా చేసిన ధైర్యమైన ప్రకటనలు .. ఎటాకింగ్ విధానం కారణంగా తరచుగా ముఖ్యాంశాల్లో నిలుస్తున్న వైనం తెలిసినదే. మత ఉద్రిక్తతను ప్రేరేపించింది అంటూ ఇదివరకూ ఆమెపై ఎఫ్.ఐ.ఆర్ దాఖలు చేశారు. ఆమె కొంతకాలం క్రితం తనను తాను ఇబ్బందుల్లో పడేసుకునే ప్రవర్తనతో దొరికిపోయారు. ఒడిశాకు చెందిన ఒక న్యాయవాది నుండి నటికి అత్యాచారం బెదిరింపు వచ్చిందని మాకు తెలుసు. నవరాత్రిలో తన అనుచరులను కోరుకునే కొద్ది రోజుల క్రితం ఆమె ఫేస్ బుక్ లో ఒక పోస్టును పంచుకున్నప్పుడు రేప్ బెదిరింపులు ఎదురయ్యాయి.. అయితే ఈ బెదిరింపులకు కారణం హ్యాకింగా? అన్నది సైబర్ క్రైమ్ వాళ్లు తేల్చాల్సి ఉంటుంది.

దేవీ నవరాత్రుల వృతాచరణలో భాగంగా ఎరుపు సాంప్రదాయ దుస్తులలో ధరించిన కంగన వాటిలో కొన్ని చిత్రాలను పంచుకుంది. వాటికి ఒక శీర్షికను జతచేసింది… “నవరాత్రిలో ఎవరు ఉపవాసం ఉన్నారు? నేటి వేడుకల నుండి పిక్చర్స్ క్లిక్ చేశాను. నేను కూడా ఉపవాసంలో ఉన్నాను. అదే సమయంలో నాపై మరొక ఎఫ్.ఐ.ఆర్ దాఖలు చేశారు. మహారాష్ట్రలోని పప్పు సేన నాపై మక్కువతో ఉన్నట్లు అనిపిస్తుంది. నన్ను మిస్ చేసుకోవద్దు ప్లీజ్.. నేను త్వరలో అక్కడకు వస్తాను” అంటూ వ్యాఖ్యానించింది. వ్యాఖ్యల విభాగంలో నవరాత్రి శుభాకాంక్షలతో ఆమె అభిమానులకు టచ్ లోకి వెళ్లారు. మరికొందరు కూడా కంగనపై ద్వేషపూరిత వ్యాఖ్యలను పోస్ట్ చేయడం సోషల్ మీడియాల్లో బయటపడింది.

Related Images:

ఫైర్ బ్రాండ్ కంగన ఇంట్లో పెళ్లి సందడి!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ ఏది చేసినా సంచలనమే. ఇటీవల సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి తరువాత వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ లో బంధుప్రీతి వుందని ఆకారణంగానే సుశాంత్ మృతి చెందాడంటూ కంగన చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో దుమారం సృష్టించాయి.

ఇదిలా వుంటే కంగన ఇంట పెళ్లి సందడి మొదలైంది. కంగన సోదరి రంగోలి చండేల్ వివాహం తరువాత మళ్లీ ఆ ఇంట్లో మంగళవాయిద్యాలు మోగుతున్నాయి. అయితే కంగన కోసం కాదండోయ్.. కంగన బ్రదర్స్ కోసం. కంగన సోదరులు అక్షిత్ అండ్ కరణ్ ల ప్రీ వెడ్డింగ్ హంగామా ఈ రోజు మొదలైంది. ఈ విషయాన్ని స్వయంగా కంగన సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

రంగోలి వివాహం జరిగి ఒక దశాబ్దానికి పైగా అవుతోంది. అప్పటి నుంచి కుటుంబంలో నాకు వివాహం జరగలేదు. ఎలాంటి శుభకార్యం జరగలేదు. ఇన్నేళ్ల తరువాత మా ఇంట్లో ఈ రోజు నా సోదరులు కరణ్ అక్షత్ వివాహం జరుగుతోంది. మా పూర్వీకుల ఇల్లు వివాహ ఉత్సవాల్లో మునిగిపోయింది. మూడు వారాల్లో రెండు వివాహాలు ఈ రోజు కరణ్ కి హల్దితో పెల్లి వేడుకలు మొదలయ్యాయి` అని ట్వీట్ చేసింది.

Related Images:

ఆ ఏడుగురు ప్రముఖులంటే క్వీన్ కంగన భగభగ

హృతిక్ రోషన్ .. కరణ్ జోహార్ మొదలు ఓ ఏడుగురి పేర్లు ఎత్తితే కంగన అగ్గిమీద గుగ్గిలమే అవుతుంది. క్వీన్ కి ఒళ్లంతా సలసలా కాగిపోతుంది. సదరు బాలీవుడ్ ప్రముఖులపై కంగన నిరంతరం ఫిరంగి దాడులతో విరుచుపడడం చూస్తున్నదే. ఇంతకీ ఎవరా ఏడుగురు? ఏమా ఏడు చేపల కథ?

సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం అనంతరం ఇటీవల మహారాష్ట్రలోని రాజకీయ పార్టీలతో ఆమెకు ఎలాంటి కౌంటర్లు మొదలయ్యాయో చూస్తున్నాం. ఈ ఘటనల తర్వాత కంగనా రనౌత్ తిరిగి ఆ ఏడుగురిపై దృష్టి సారించారని అర్థమవుతోంది.

కంగనా రనౌత్ `మణికర్ణిక`లో ఝాన్సీకి చెందిన రాణి లక్ష్మి బాయిగా నటించారు. వీరనారిగా నటించాక కంగన దూకుడు స్వభావం రెట్టింపైంది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తరువాత కంగనాలో ఈ లక్షణం పీక్స్ కి చేరుకుంది. పలువురు పురుష పుంగవులపై ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా కంగన బహిరంగంగా పోరాడిన ప్రముఖ వ్యక్తుల పేర్లు హైలైట్ అయ్యాయి.

కంగనా లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఉర్మిలను ఓ రేంజులో టార్గెట్ చేసింది. శృంగార తార అంటూ తిట్టేసింది. ముంబైలోని కంగనా రనౌత్ కార్యాలయాన్ని BMC కూల్చివేశాక “ఉద్ధవ్ థాకరే తుజే క్యా లగ్తా హై? (మీరు ఏమనుకుంటున్నారు?) మీరు ఫిల్మ్ మాఫియాతో ఒప్పందం కుదుర్చుకుని .. నా ఇంటిని కూల్చివేసి నాపై ప్రతీకారం తీర్చుకున్నారా? మీ అహంకారం రేపటి రోజున మిగలదు“ అంటూ థాక్రేపై విరుచుకుపడింది. ముంబైని మరో POK తో పోల్చింది క్వీన్. కంగనా రనౌత్ డ్రగ్స్ కనెక్షన్ కు వ్యతిరేకంగా అధ్యాయన్ సుమన్ మాట్లాడితే అతడిపై మాటల తూటాలు కూరి చివరిగా ఫిరంగులు విసిరింది.

క్రిష్ 3 చిత్రీకరణ సమయంలో కంగనతో హృతిక్ డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. ఆ తర్వాత హృతిక్ తో రాకేష్ రోషన్ తో కంగన ఫికర్ తెలిసినదే. కోర్టు గొడవల వరకూ వెళ్లింది. హృతిక్ కుటుంబ జీవితంలో కలతలు అప్పుడే బహిర్గతం అయ్యాయి.

ఇక కరణ్ జోహార్ అంటే కంగన ఒళ్లు మంట. కాఫీ విత్ కరణ్ లో కనిపించిన కంగన కరణ్ జోహార్ ను స్వపక్షపాతం .. మూవీ మాఫియా జెండా మోసే వ్యక్తి అని కౌంటర్లతో సతాయించేసింది. “నా బయోపిక్ ఎప్పుడైనా తెరకెక్కిస్తే మీకు తెలిసిన ఆ మూస బాలీవుడ్ బిగ్గీస్ ని ఆటాడతాను“ అంటూ పంచ్ లు వేసింది కంగన.

ఇటీవల రాజ్యసభ ప్రసంగంలో జయ బచ్చన్ మాట్లాడుతూ వినోద పరిశ్రమను సోషల్ మీడియా కొట్టిపారేస్తోందని దానిని రక్షించి మద్దతు ఇవ్వమని ప్రభుత్వాన్ని కోరింది. “జిస్ థాలి మెయిన్ ఖాటే హై ఉస్మే ఛేడ్ కర్తే హై గాలత్ బాత్ హై ” అని చెప్పింది. దీనిపై స్పందిస్తూ కంగనా ట్విట్టర్ లో చెలరేగింది.
“మీరు జయ జిని ఏ ప్లేట్ గురించి ప్రస్తావిస్తున్నారు? ఒక థాలి (ప్లేట్) ఇచ్చారు. దీనిలో రెండు నిమిషాల పాత్ర.. ఐటెమ్ నంబర్లు .. శృంగార సన్నివేశం ఛాన్సులే దక్కాయి. అది కూడా హీరోతో ఒక రేయి నిదురించాక వచ్చిన ఆఫర్లు అవి. నేను చిత్ర పరిశ్రమకు స్త్రీవాదం నేర్పించాను.. దేశీయ చిత్రాలతో ‘తాలి’ అలంకరించాను. ఇది నా సొంత ప్లేట్ జయ జీ.. ఇది మీది కాదు“ అంటూ పోయెటిక్ గా విరుచుకుపడింది.

రిపబ్లిక్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కనంగా తాప్సీ పన్నూ.. స్వరా భాస్కర్ లను బి-గ్రేడ్ నటీమణులు అంటూ కామెంట్ చేసింది. “నేను ఇక్కడ మాత్రమే ఓడిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే రేపు వారు (మూవీ మాఫియాని సూచిస్తూ) తాప్సీ పన్నూ.. స్వరా భాస్కర్ వంటి 20 మందిని లాక్కుంటారు అంటూ పంచ్ లు వేసింది కంగన.

ఇక ప్రతిసారీ యష్ రాజ్ ఫిలింస్ అధినేత పైనా కంగన నిరంతరం విరుచుకుపడడం చూస్తున్నదే. చోప్రాలు అంటే కంగన భగభగ మండిపోతుంది. అలియా భట్ .. అనన్య పాండే లాంటి నటీమణులపైనా కంగన పదే పదే చురకలు వేస్తూనే ఉంటుంది. ఇలా చూస్తే ఏడుగురు కంగనకు బద్ధ శత్రువులు ఉన్నారని అర్థమవుతోంది. అయితే కంగన నోటి దురుసుకు పలువురు దర్శకరచయితలు నిర్మాతలు కూడా శత్రువులుగా మారిన వైనం తెలిసిందే. వారితో పార్ట్ టైమ్ గొడవలు తప్ప ఫుల్ టైమ్ ఇలా విరుచుకుపడేది లేదు.

Related Images:

అవమానించారు.. కంగనకు నష్టపరిహారం చెల్లించండి!

ఎవరికైనా అవమానం అవమానమే. క్వీన్ కంగన రనౌత్ కార్యాలయాన్ని ముంబై మున్సిపల్ (బీఎంసీ) అధికారులు కుప్పకూల్చడం అన్యాయమని వాదించేవారి సంఖ్య అంతకంతకు అధికమవుతోంది. ఒకరకంగా కంగనకు బలం పెరుగుతోందనే చెప్పాలి. బాంద్రాలో అధికారుల అనుమతి లేకుండా మూడు అంగుళాల పాటు ఇంటికి అదనపు హంగులు చేయించుకోవడంతో దానిని బీఎంసీ కూల్చి వేసింది.

అయితే కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే కంగనను ఓదార్చడమే గాక మీడియా ముందుకు వచ్చి తనకు అండగా నిలిచారు. ఆమెకు అవమానం జరిగిందని నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ముంబైలో నివశించేందుకు భయపడాల్సిన అవసరం లేదని .. ఇది అందరి ఆర్థిక రాజధాని అని అన్నారు. తనకు ఆర్పీఐ పార్టీ మద్ధతు ఉంటుందని ప్రకటించారు.

కంగన జనవరిలోనే ఇంటి నిర్మాణం పూర్తి చేయగా.. మూడు అంగులాళ అధిక స్థలాన్ని బిల్డర్ ఉపయోగించిన విషయం కంగనకు తెలియదని ఆయన అన్నారు. బీఎంసీ అధికారులు అధికంగా ఉన్న భాగాన్ని కూల్చివేసినా ఫర్నీచర్ గోడలు పడిపోయాయని న్యాయస్థానంలో తనకు న్యాయం జరుగుతుందని అన్నారు. కంగనకు ఇప్పటికే కేంద్రంలోని భాజపా వత్తాసు పలుకుతుంటే ఇప్పుడు ఒకటొకటిగా శివసేన వ్యతిరేక పార్టీలన్నీ కంగనకు మద్ధతు పలుకుతుండడం విశేషం.

Related Images:

‘బుల్లీవుడ్’ అంటూ కంగన సంచలన ట్వీట్…!

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ముంబై పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని తలపిస్తోందంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు గాను మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆమెకు మధ్య వివాదం కొనసాగుతోంది. కంగనాకు ముంబైలో అడుగు పెట్టనివ్వబోమని శివసేన హెచ్చరించిన నేపథ్యంలో నేను ముంబై వస్తున్నానని దమ్ముంటే అడ్డుకోమని ఛాలెంజ్ చేసింది కంగనా. ఈ క్రమంలో కంగనా తన సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ నుంచి ముంబైకి బయలుదేరింది. అయితే ఇదే సమయంలో బీఎంసీ అధికారులు కంగనా మణికర్ణిక కార్యాలయ కూల్చివేత ప్రక్రియను మొదలుపెట్టారు. ఈ కూల్చివేత గురించి తెలుసుకున్న కంగనా మరోసారి తీవ్రంగా స్పందించింది. ‘మహారాష్ట్ర ప్రభుత్వం గూండాలు ముంబైలో తన ఆస్తులపై విధ్వంసానికి తెగబడ్డారని.. కానీ మహారాష్ట్ర కోసం తన రక్తాన్ని ధారపోసేందుకైనా రెడీ అని.. తన స్పిరిట్ ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయికి వెళ్తూనే ఉంటుందని’ ట్వీట్ చేసింది.

అంతేకాకుండా ‘నేను ఎప్పుడూ తప్పు కాదని నా శత్రువులు మళ్లీ మళ్లీ నిరూపిస్తున్నారు. నా ముంబై నగరం ఇప్పుడు నిజంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లా మారిపోయింది’ అని కంగనా రనౌత్ ట్వీట్ చేసింది. ముంబైలోని తన ఆఫీసును బీఎంసీ సిబ్బంది కూల్చి వేస్తున్న ఫోటోలను షేర్ చేసింది. డెత్ ఆఫ్ డెమోక్రసీ అనే హ్యాష్ ట్యాగ్ తో ‘పాకిస్తాన్’ ‘బార్బర్.. అతని సైన్యం’ అని కామెంట్స్ పోస్ట్ చేసింది. ”నా ఇంట్లో ఎలాంటి అక్రమ నిర్మాణం లేదు. సెప్టెంబర్ 30 వరకు కోవిడ్ లో కూల్చివేతలను ప్రభుత్వం నిషేధించింది. బుల్లీవుడ్ ఇప్పుడు చూడండి ఇదే ఫాసిజం లాగా ఉంది” అని మరో ట్వీట్ చేసింది.

Related Images:

ముంబైకొస్తున్నా..దమ్ముంటే ఆపుకో! కంగన బస్తీ మే సవాల్!!

ఫేస్ టు ఫేస్ .. హ్యాండ్ టు హ్యాండ్ .. చూస్కుందామా నీ పెతాపమూ నా పెతాపమూ? దివంగత విలన్ కం కమెడియన్ జయప్రకాష్ రెడ్డి డైలాగ్ లా ఉంది కదూ? కానీ ఇంచుమించు ఇలానే సవాల్ చేసింది క్వీన్ కంగన రనౌత్. ముంబైలో తన ఇంటిని కూల్చేందుకు సిద్ధమైన బీఎంసీని.. లోకల్ నాయకుల్ని కలిపి ఈ అమ్మడు ఓ రేంజులో ఎటాక్ చేస్తోంది.

ముంబై గల్లీకి వస్తున్నా.. చూస్కుందామా నీ పెతాపమూ నా పెతాపమూ!! అంటూ శివసేన కీలక నేత పార్లమెంటు సభ్యుడు సంజయ్ రౌత్ నే ఎదిరించింది. తనను ముంబైకి తిరిగి రావద్దంటూ బెదిరించిన ఆయనపై కౌంటర్ ఎటాక్ కి దిగింది క్వీన్.

“ముంబైకి తిరిగి రాకూడదని చాలా మంది బెదిరిస్తున్నారు. ఐ డోంట్ కేర్.. సెప్టెంబర్ 9 న ముంబైకి వస్తున్నా.. ఎవరికైనా దమ్ముంటే ఆపుకోండి“ అంటూ ఓపెన్ సవాల్ చేసింది. హిమచల్ ప్రదేశ్ మనాలిలో ఎంతో మోజుపడి కట్టుకున్న ఇంట్లో ప్రస్తుతం కంగన తల దాచుకుంది. ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్ గా అభివర్ణించిన కంగన డేర్ కి జనం ఫిదా అయిపోయారు.

ఇక మనాలి ఇంటి నుంచి బయల్దేరే ముందే కరోనా పరీక్షలు చేయించుకుందట. కరోనా నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇక క్వీన్ ఫిక్స్ చేసిన ముహూర్తం ప్రాకరం ముంబైలో అడుగుపెడుతుంది. మరి శివ సైనికుల నుంచి ఎలాంటి ప్రతిఘటన ఉంటుందా? అన్న ఆసక్తికర చర్చ సాగుతోంది.

Related Images:

కంగనకు తొలి పంచ్ ఇదిగో ఇలా పడింది

క్వీన్ కంగన రనౌత్ ఎటాకింగ్ నేచుర్ గురించి చెప్పాల్సిన పనే లేదు. తనతో పని చేసిన దర్శకరచయితలు.. నిర్మాతలతోనూ పలుమార్లు గొడవపడిన సంగతి చిలువలు పలువులుగా ప్రచారమైంది. కంగన తలబిరుసుకు బెదిరిపోయి చాలామంది తనని దూరం పెట్టేయడంపై ఆసక్తికర చర్చ సాగింది. అదొక్కటే కాదు.. హృతిక్ రోషన్ .. మహేష్ భట్ .. కరణ్ జోహార్ సహా ఎందరో ప్రముఖులపై నిరంతరం కారాలు మిరియాలు నూరుతుంది కంగన. తన ధీరత్వాన్ని మెచ్చేవాళ్లు ఎందరు ఉన్నారో తనతో పెట్టుకోకూడదు అనుకునేవాళ్లు అంతే ఉన్నారు.

ఇప్పుడు ఏకంగా తాను బాలీవుడ్ మాఫియా అంటూ కొందరు స్టార్ హీరోల పేర్లను బయటపెట్టడం అలానే డ్రగ్స్ లో వీళ్లంతా ఉన్నారని వాదించడంతో హాట్ టాపిక్ గా మారింది. ఇకపై కంగనకు అన్ని వైపుల నుంచి డోర్స్ క్లోజ్ అయినట్టేనన్న చర్చా సాగుతోంది. ఆసక్తికరంగా కంగన రెబలిజానికి బయపడి చాలామంది ఇప్పటికే ఆఫర్లు ఇవ్వకపోవడంతో తనే నిర్మాత అవతారం ఎత్తి సొంత సినిమాలు తీస్తోంది. స్టార్ హీరోల్ని సైతం దూరం పెట్టేస్తోంది.

ఇదంతా ఇలా ఉంటే కంగనను ఓ క్రేజీ ప్రాజెక్టు నుంచి తొలగించడం చర్చనీయాంశమైంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కం దర్శకుడు పీసీ శ్రీరామ్ ఇటీవలే కంగన ప్రధాన పాత్రలో నటించే ఓ సినిమాకి పని చేసేందుకు అంగీకరించారు. కానీ ఇంతలోనే ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అంటూ ప్రకటించడం వేడెక్కిస్తోంది. లెజెండరీ సినిమాటోగ్రాఫర్ ఎంత సౌమ్యుడు అన్న సంగతి తెలిసిందే. కంగన లాంటి వివాదాల క్వీన్ తో పని చేయడం కష్టమని భావించి ఇలా చేశారా? అంటూ చర్చ సాగుతోంది. ఆలోచిస్తే తనకు అసౌకర్యంగా అనిపించింది. అందుకే వద్దనుకున్నాను అని తెలిపారాయన. కంగన పైలెట్ గా నటించనున్న ఈ మూవీ టైటిల్ `తేజస్`గా ప్రచారమైంది. ఇప్పుడు ఈ మూవీ నుంచి సినిమాటోగ్రఫీ లెజెండ్ పీసీ శ్రీరామ్ తప్పుకోవడం హీట్ పెంచే వ్యవహారమే. ఇదే తీరుగా ఇతర ప్రాజెక్టులకు ఇబ్బందులు తలెత్తితే కంగనకు ఇబ్బందికర సన్నివేశమే అది.

Related Images:

ముంబై ఎవరి బాబు గారి ఆస్తి? కంగనకు మద్ధతు..!

కంగన వర్సెస్ శివసేన నాయకుడు సంజయ్ రౌత్ వివాదం గురించి తెలిసిందే. ఆ ఇద్దరి గొడవా ముంబైకి చిక్కులు తెచ్చి పెడుతోంది. మాటా మాటా పెరిగి అది ఆన్ లైన్ రచ్చగా మారింది. ఈ గొడవలోకి ఇతర పార్టీల నేతలు ఒక్కొక్కరుగా దిగుతున్నారు. ఇక శివసేన వ్యతిరేకులంతా ఒక తాటిపైకి వచ్చి కంగనకు మద్ధతు పలుకుతున్నారు.

శివసేన నాయకుడు సంజయ్ రౌత్ .. అసలు ముంబైకి రావొద్దని నన్ను హెచ్చరిస్తున్నారని కంగన ఆరోపించారు. అదేమైనా పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనుకుంటున్నాడా? అంటూ కంగన ఫైరైన సంగతి విధితమే. అయితే క్వీన్ కి నైతిక మద్ధతుగా హరియాణా హోం మంత్రి అనీల్ విజ్ నిలిచారు.

ఇది (ముంబై) ఎవరైనా బాబు గారి (తండ్రి) ఆస్తినా? ముంబై భారతదేశంలో ఒక భాగం. ఎవరైనా అక్కడికి వెళ్ళవచ్చు.. పోవచ్చు.. ఇలాంటి ప్రకటనలు జారీ చేసే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. మీరు ఎవరైనా నిజం మాట్లాడకుండా ఆపలేరు అంటూ హోం మంత్రి అనీల్ విజ్ ఎవరి పేరును పెట్టకుండా కామెంట్లు చేసారు. ఇది కంగనకు భేషరతుగా మద్ధతునివ్వడమే.

కంగన ఏం మాట్లాడినా స్వేచ్ఛగా వెల్లడించడానికి అనుమతించాలి అని విజ్ అన్నారు. ఆమెకు పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు. `ముంబై ఒక పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) లాంటిది` అన్న కంగన వ్యాఖ్యకు ముంబై జనం మరిగిపోతున్న సంగతి తెలిసిందే. నగరంలోకి అడుగు పెడితే కొడతామని సోషల్ మీడియాల్లో హెచ్చరించారు. శివసైనికులు అయితే చెలరేగిపోతున్నారు.

“ప్రతి సమస్యపైనా రోడ్డుపైకి వచ్చే ఒక కొవ్వొత్తి ఆమె (కంగన). తను మాట్లాడటం మానేసినప్పుడు వారు తమ పతకాలను ఎందుకు తిరిగి ఇవ్వడం లేదు? అని మంత్రి గారు ప్రశ్నించారు. మొత్తానికి శివసేన వర్సెస్ హరియాణా మంత్రి ఎపిసోడ్ చూస్తుంటే కంగనకు మద్ధతు అంతకంతకు పెరుగుతోందనే దీనర్థం.

Related Images:

కంగనకు మద్దతుగా జాతీయ మహిళా కమిషన్

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ హీరోయిన్ కంగనా రౌనత్ తాజాగా సోషల్ మీడియా ద్వారా నిప్పులు చెరుగుతోంది. ముఖ్యంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ది హత్య అని.. బాలీవుడ్ సినీ మాఫియానే చంపేసిందని ఆరోపిస్తోంది. ఇక మహారాష్ట్రలోని శివసేన ప్రభుత్వంపై కూడా మండిపడుతోంది.

ఈ క్రమంలోనే ఆమెకు శివసేన నేతలు కూడా బాగానే కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సార్నైక్ ఏకంగా కంగనాను బెదిరించాడు. ఇది పెద్ద వివాదాదమైంది.

ఈ వివాదంపై జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖ శర్మ స్పందించారు. ఎమ్మెల్యే ప్రతాప్ సార్నైక్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

కంగనాను బెదిరించిన ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలి. కంగనకు మద్దతుగా తాను ఉన్నానని మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖ శర్మ సంచలన ప్రకటన చేశారు.

తనకు ముంబై.. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లా కనిపిస్తోందని ఇటీవల కంగనా రౌనత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో కొంతమంది శివసేన ఎమ్మెల్యేలు ఆమె మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Images:

కంగన దెబ్బకు శివసేన ఔట్

బాలీవుడ్ నటుడు సుశాంత్ చుట్టూ ఎన్నో అనుమానాలు.. ఆ అనుమానాలకు బలం చేకూరేలా ఎన్నో మలుపులూ.. అయితే ఈ క్రమంలోనే బాలీవుడ్ లోని నెపోటిజం.. ఇతర వ్యక్తులను తొక్కేసే అగ్ర సినీ ప్రముఖుల బండారాలు బయటపడుతున్నాయి. దీనిపై బాలీవుడ్ హీరోయిన్ కంగనా నిప్పులు చెరుగుతున్నారు. బాలీవుడ్ ప్రముఖులను మహారాష్ట్ర సర్కార్ ను టార్గెట్ చేసి ఉతికి ఆరేస్తున్నారు.

కంగనా రౌనత్.. ఇప్పుడు ఈ ఫైర్ బ్రాండ్ పేరు చెబితేనే బాలీవుడ్ షేక్ అవుతోంది. మహారాష్ట్రలోని శివసేన సర్కార్ షాక్ అవుతోంది. ముక్కుసూటిగా ఈమె చేస్తున్న విమర్శలు బాలీవుడ్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మహారాష్ట్రలో జరుగుతున్న బాగోతాలపై కంగనా నిప్పులు చెరుగుతోంది

కంగనా రౌనత్ పెట్టే ట్వీట్లకు వ్యాఖ్యలకు బాలీవుడ్ లోనే కాదు.. మహారాష్ట్ర ప్రభుత్వంలో కూడా వణుకుపడుతోందట.. అందుకే ఇప్పుడు కంగన మీద శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అందుకే కంగనను టార్గెట్ చేశాడని అర్థం అవుతోందంటున్నారు. కంగనకు శివసేన భయపడుతోందని.. సుశాంత్ సింగ్ కేసు గురించి.. పోలీస్ విచారణ గురించి.. బాలీవుడ్ డ్రగ్స్ గురించి మాట్లాడేత శివసేన ఎంపీకి ఎందుకు నొప్పి అని కొందరు ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు.

సుశాంత్ సింగ్ కేసుకు… బాలీవుడ్ లో ఉన్న పెద్దలకు.. శివసేనలో ఉన్న పెద్దలకు లింక్ ఉంది కాబట్టి మహారాష్ట్రలో కేసు ముందుకు కదలడం లేదని ప్రచారం సాగుతోంది. అందుకే కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇన్ వాల్వ్ అయ్యే పరిస్థితి వచ్చిందని కూడా అంటున్నారు. చూద్దాం.. సుశాంత్ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో..

Related Images:

కంగనను దుబాయ్ కి సప్లయ్ చేయాలనుకున్న పెద్ద మనిషి?

చిత్ర పరిశ్రమలో మాదకద్రవ్యాల గురించి బాలీవుడ్ పార్టీల గురించి కంగనా రనౌత్ పబ్లిగ్గా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాను గతంలో డ్రగ్స్ తీసుకున్నట్లు అంగీకరించిన కంగన బాలీవుడ్ పార్టీల్లో కొకైన పార్టీ చాలా స్పెషల్ అని చెప్పడం షాకిచ్చింది. హీరోల బాలీవుడ్ ప్రముఖుల రక్త శాంపిళ్లు తీసుకుంటే గుట్టు తెలిసిపోతుందని వెల్లడించింది. అంతేకాదు భట్స్ క్యాంప్ పై కంగన నర్మగర్భ వ్యాఖ్యలు మార్మిక వ్యాఖ్యలు తాజాగా కలకలం రేపుతున్నాయి. తనకు గ్యాంగ్ స్టోరి వినిపించేందుకు పిలిచి దుబాయ్ మనుషుల మధ్య కూచోబెట్టారని.. తనని దుబాయ్ కి సరఫరా చేసేయడం వీళ్లకు చాలా తేలిక అని భావించానని వ్యాఖ్యానించింది ఓ ఇంటర్వ్యూలో.

తాజాగా కంగనా ఓ ప్రముఖ వార్తా చానెల్ తో మాట్లాడుతూ.. తాను `క్యారెక్టర్ యాక్టర్` అని పేర్కొన్న వ్యక్తి నుంచి గతంలో డ్రగ్స్ తీసుకున్నట్లు నటి వెల్లడించింది. బాలీవుడ్ లో డ్రగ్స్ వాడకం గురించి కూడా ఓపెన్ గా మాట్లాడారు. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం గురించి కూడా ఈ నటి షాకిచ్చే కామెంట్లు చేసింది. సుశాంత్ సింగ్ కి మాదకద్రవ్యాల్ని బలవంతంగా అలవాటు చేశారని.. అతని మనస్సు విరిచేసి… అతని హత్యకు కుట్ర చేశారని కంగన పేర్కొంది. రియా చక్రవర్తి గంజాయి కోసం ఏర్పాట్లు చేసి ఉండవచ్చని ఇది కొన్ని దేశాలలో చట్టబద్ధంగా అమ్ముడవుతుందని విదేశాల నుంచి రప్పించేదని నటి పేర్కొంది.

సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఎల్.ఎస్.డి వంటి మాదకద్రవ్యాలను సేవించేంత చెత్త నేపథ్యం నుంచి రాలేదని ఆమె అన్నారు. బాలీవుడ్ పరిశ్రమను మాదకద్రవ్యాలతో సంబంధం కలిగి ఉన్న పరిశ్రమగానే చూస్తానని అన్నారు. దీనిని గట్టర్ అని కూడా పిలిచింది. తన 16 ఏళ్ళ వయసులో మనాలిని విడిచిపెట్టడం ఎంత కష్టమో చెప్పింది. ముంబైలో ఒక ఆంటీతో కలిసి జీవించడం ప్రారంభించానని పేర్కొంది. తాను క్యారెక్టర్ యాక్టర్ అని పిలిచే వ్యక్తితో స్నేహం చేశానని కంగన తెలిపింది. ఈ వ్యక్తి ఆమెను దుబాయ్ నుంచి వచ్చే వారితో సమావేశాలకు తీసుకువెళతారని కంగనా వెల్లడించి షాకిచ్చింది.

దుబాయ్ వ్యక్తుల మధ్య లో తనను కూర్చోబెట్టారని.. ఆ తర్వాత ఆ వ్యక్తి వెళ్లిపోతాడని తెలిపింది. ఆ సమయంలో తనను దుబాయ్ కు ఎలా సరఫరా చేయవచ్చో వీళ్లకు తెలుసని భావించానని కంగనా పేర్కొంది. భట్ సోదరుల తో గ్యాంగ్ స్టర్ చిత్రం గురించి చర్చించేప్పటి లోగుట్టును అలా బయటపెట్టేసింది. పర్వీన్ బాబీ మార్గంలో సుశాంత్ ని పంపుతామని భట్స్ అన్నారట. `స్వయం నియమిత గురువు` (మహేష్ భట్ అని మీనింగ్) సూచిస్తే ఎవరైనా.. పర్వీన్ బాబీ లాగా అవుతారని.. తాను కూడా అలానే అవుతానని తనకు చెప్పారని కంగనా పేర్కొంది. ఇంతకీ భట్స్ కి కంగనకు మధ్య ఉన్న ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కం మీడియేటర్ ఎవరు? ఇక తనను అవకాశం పేరుతో దుబాయ్ కి పంపాలనుకున్నారా? అన్న ప్రశ్నలకు సూటిగా ఆన్సర్ అయితే లేదు. అంతా నర్మగర్భంగానే మాట్లాడింది క్వీన్.

Related Images:

కంగనలా శ్రుతికి కూడా మెంటల్ హై క్యా..!

ప్రతి ఒక్కొరికి పెరిగిన నేపథ్యం అనేది జీవితంలో చాలా కీలక పాత్రను పోషిస్తుంటుంది. ఒంటరితనం డిప్రెషన్ లాంటి కారణాలు మనిషి మెంటల్ కి కారణం అవుతుంటాయి. అలాంటి రకరకాల కారణాలు మానసిక సమస్యల్ని సృష్టిస్తే ఆ ఒంటరి యువతి ఎలా ప్రవర్తించింది? ఆ యువతి జీవితంలో ప్రవేశించిన మరో మెంటల్ మేన్ కథాకమామీషు ఏమిటి? అతడి వల్ల తన జీవితంలో ఏం జరిగింది? అన్న ఆసక్తికర కథాంశంతో తెరకెక్కించారు `మెంటల్ హై క్యా`. ఈ సినిమా టైటిల్ వివాదాస్పదం కావడంతో జడ్జిమెంటల్ హై క్యా అని మార్చారు. ఇక టైటిల్ కి తగ్గట్టే పిచ్చి చేష్ఠల్ని ప్రదర్శించే యువతిగా కంగన రనౌత్ నటన అందరినీ ఆకట్టుకుంది.

అంతేకాదు.. కంగన వేషధారణతో పాటు మెంటల్ కి తగ్గట్టే తన రూపాన్ని డిజైన్ చేసుకోవడం ఇంట్రెస్టింగ్. డార్క్ లిప్ స్టిక్ .. థిక్ కాటుక.. ఐ లైనర్ ప్రతిదీ సంథింగ్ వెరైటీనే. ఇదిగో ఇక్కడ చూస్తున్న శ్రుతిహాసన్ సన్నివేశం కూడా ఇంచుమించు అలానే ఉన్నట్టుంది మరి. కావాలనే చేస్తోందా.. లేక తన మానసిక పరిస్థితిని వ్యక్తపరిచే ప్రయత్నమా? మొత్తానికి ఈ రూపం చూడగానే అందరూ షాక్ తింటున్నారు.

డార్క్ లిప్ స్టిక్ తో విచిత్రమైన ఆహార్యంతో బెదిరించేస్తోంది శ్రుతి. పాశ్చాత్య ధోరణి పక్కాగా కనిపిస్తోంది తన యాటిట్యూడ్ లో. ఏదైతేనేం.. యూత్ ని ఆకర్షించేందుకు సోషల్ మీడియాల్లో ఫాలోవర్స్ ని పెంచుకునేందుకు ఇలాంటి వేషాలే అవసరం. ఇక ఈ ఫోటో చూడగానే శ్రుతికి కూడా మెంటల్ హై క్యా! అంటూ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. కంగనను మించి మెంటల్ వేషాలేస్తోందనేది కుర్రాకారు కామెంట్. 34 ఏజ్ లో శ్రుతి ఈ వేషాలు చూస్తుంటే భయం వేస్తోందంటూ కామెంట్లు పడిపోతున్నాయ్. `మండే మూడ్` అంటూ అందరికీ మూడ్ చెడగొట్టేసింది .. ప్ఛ్!

Related Images:

అమీర్ ఖాన్ ఆ తానులో ముక్కే అన్న కంగన

మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ డబుల్ స్టాండార్డ్ (ద్వంద్వ ప్రమాణాలు) ఉన్న మనిషా? అంటే అవుననే విమర్శిస్తోంది క్వీన్ కంగన. అతడు భారతదేశంలో అసహనం గురించి ఫిర్యాదు చేస్తున్నాడు. కానీ టర్కీ వెళ్లి అక్కడ అధ్యక్షరాలితో ఆతిథ్యం అందుకుంటున్నాడు! అంటూ కంగన తీవ్ర విమర్శలు చేస్తోంది.

అతడు మంచి స్నేహితుడు. కానీ స్నేహితుడు తప్పు చేస్తుంటే చూస్తూ అలా వదిలేయాలా? అని ప్రశ్నించి వేడి పెంచింది. అంతేకాదు సుశాంత్ సింగ్ మరణంపై అతడు స్పందించక పోవడానికి.. కనీసం సంతాపం చెప్పడానికి మనసు రాకపోవడానికి కారణమేమిటో కూడా విడమర్చి చెప్పింది క్వీన్.

“సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణానికి ఆమీర్ ఎందుకని సంతాపం చెప్పలేదు? అమీర్ ఖాన్ సుశాంత్ తో కలిసి పీకేలో పనిచేశారు. అతను ఏమీ అనకపోతే.. అనుష్క కూడా ఏమీ అనదు.. రాజు హిరానీ ఏమీ అనడు.. ఆదిత్య చోప్రా .. అతని భార్య రాణి ముఖర్జీ కూడా ఏమీ అనరు. ఈ రాకెట్ ఒక ముఠా లాగా పనిచేస్తుంది“ అంటూ మాఫియా తీరును ఎండగట్టింది. మొత్తానికి మిస్టర్ పెర్ఫెక్టునే వదల్లేదు బొమ్మాళీ.

Related Images: