నార్త్ కొరియా.. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అనగానే నియంత పాలన కఠినాతికఠిన శిక్షలు టక్కున గుర్తుకొచ్చేస్తాయి. ప్రపంచం మొత్తం ఒకలా ఉంటే కిమ్ ఒక్కడే ఒకలా ఉంటాడు. ఆయనకి జాలి దయ అనే పదాలకు తావుండదు. ఎప్పుడూ ఏదో ఒక సంఘటనతో వార్తల్లో నిలిచే ఆ దేశం తాజాగా ఒక దుశ్చర్యకు ఒడిగట్టింది. తమ దేశానికీ చెందిన ఓ అధికారిని బహిరంగంగా కాల్చి హత్య చేయించాడు కిమ్.
దీనికి కారణం ఏంటి అంటే .. ఉత్తర కొరియాలో అక్కడ విదేశీ వస్తువులు నిషేదం. అంతేగాక విదేశాలకు చెందిన టీవీ రేడియో చానెళ్లు ఏవీ చూడకూడదు వినకూడదు. ప్రపంచంలో జరుగుతుందనే విషయాన్ని ప్రజలు తెలుసుకోకుండా అక్కడి ప్రభుత్వం కఠిన నియమాలు అమల్లోకి తెచ్చింది. పలు రేడియోలు టీవీ చానెళ్లపై నిషేదం విధించింది. స్థానిక పత్రికల్లో కూడా విదేశీ వార్తలు ప్రచురణ కాకూడదు. దీంతో అక్కడి ప్రజల్లో ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ పెరిగింది. ఈ సందర్భంగా వారు అక్రమ మార్గాల్లో సీడీలు పెన్ డ్రైవ్ లు మొబైళ్లను కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారుల కంటపడి ప్రాణాలు సైతం కోల్పోతున్నారు.
తాజాగా ఉత్తర కొరియా ఫిష్షింగ్ బోట్ కు కెప్టెన్ గా పనిచేస్తున్న చోయ్ అనే 40 ఏళ్ల వ్యక్తిని అధికారులు బహిరంగంగా కాల్చి చంపారు. అమెరికా నిధులతో పనిచేస్తున్న రేడియో ఫ్రీ ఆసియా కథనం ప్రకారం.. ఆ దేశంలో 15 ఏళ్ల కిందటే విదేశీ రేడియో చానెళ్లను నిషేదించారు. ఎవరైన వాటిని వినేందుకు ప్రయత్నిస్తే మరణ దండన తప్పదని హెచ్చరించారు. అయితే సముద్రంలో చేపల వేటకు వెళ్లే జాలర్లు సైలర్లు RFA రేడియో చానెల్ ను వింటూ అంతర్జాతీయ సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. దీంతో అధికారులు వీరిపై నిఘా ఉంచారు. చోయ్ కు కూడా RFA రేడియో చానెల్ లో న్యూస్ వినడం ఇష్టం. ఒకప్పుడు ఉత్తరకొరియా సైన్యంలో రేడియో ఆపరేటర్గా పనిచేసిన చోయ్.. ఈ కారణంతో బాధ్యతల నుంచి తప్పించారు. సైన్యంలో ఉంటే విదేశీ రేడియోల నుంచి సమాచారం తెలుసుకుంటున్నాడనే కారణంతో అతడిని ఫిష్షింగ్ విభాగానికి మార్చారు. అయితే ఇది చోయ్ కు మరింత కలిసొచ్చింది. సముద్రంలోకి వెళ్లినప్పుడల్లా ఆ రేడియో చానెల్ వింటూ సమాచారాన్ని తెలుసుకొనేవాడు. దీనితో ఫిష్షింగ్ ప్రాసెసింగ్ ప్లాంట్ వద్ద సుమారు 100కు పైగా వివిధ బోట్ల కెప్టెన్లు మేనేజర్ల సమక్షంలో నుదుటి మీద గన్ పెట్టి దారుణంగా కాల్చి చంపారు. చోయ్ చేస్తున్న తప్పును కప్పిపుచ్చినందుకు ఆ టీమ్ కు చెందిన అధికారులు సెక్యూరిటీ సిబ్బందిని సైతం విధుల నుంచి తొలగించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న సమయంలో రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే కరోనాను వ్యాప్తి చెందడాన్ని నివారించడంలో డొనాల్డ్ ట్రంప్ విఫలం అయ్యారంటూ డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ ఆరోపణలు చేస్తున్నారు. ట్రంప్ కు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదంటూ స్వయానా ఆయన సోదరి మాట్లాడినట్టుగా ఆడియో టేపులు వెలుగులోకి రావడం మరింత ఇరకాటంలో పడేశాయి. ఈ పరిస్థితుల్లో ట్రంప్ ఇబ్బందులను మరింత పెంచేలా చేస్తోంది రేజ్ బుక్.
ప్రముఖ జర్నలిస్ట్ బాబ్ వుడ్ వర్డ్స్ రాసిన పుస్తకం అది. రేజ్ పేరుతో ఇది మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చింది. ట్రంప్ ఫోటోతో దీన్ని ముద్రించారు. డొనాల్డ్ ట్రంప్ కు సంబంధించిన కొన్ని కీలక అంశాలను ఇందులో ప్రస్తావించినట్లు చెబుతున్నారు. ప్రత్యేకించి ఈ నాలుగేళ్ల కాలంలో ట్రంప్ అనుసరించిన విదేశాంగ విధానాలు కోవిడ్ పరిస్థితులను ఎదుర్కొనడానికి తీసుకున్న చర్యలు చైనాపై అమెరికా ఎలాంటి వైఖరిని ప్రదర్శించిందనే విషయాలపై ఈ పుస్తకంలో బాబ్ వుడ్ వర్డ్స్ చర్చించినట్లు తెలుస్తోంది.
ఈ బుక్ ట్రంప్ ను రాజకీయంగా ఇబ్బందులకు గురి చేసేదిగా అంచనా వేస్తున్నారు. అన్నింటికంటే కిమ్ జొంగ్ ఉన్ మామ దారుణ హత్యకు సంబంధించిన సమాచారం ఇప్పుడు హాట్ టాపిక్ గా రేపుతోంది. కిమ్ జొంగ్ ఉన్ మామ కిమ్ జొంగ్-నామ్ 2017 ఫిబ్రవరి 13వ తేదీన మలేసియా రాజధాని కౌలాలంపూర్ విమానాశ్రయంలో హత్యకు గురయ్యారు. ఉత్తర కొరియా ఏజెంట్లే ఆయనను హత్య చేసి ఉంటాయంటూ అప్పట్లో అనుమానాలు వెల్లువెత్తాయి. ఇదే అంశాన్ని బాబ్ వుడ్ వర్డ్స్ తాను రాసిన రేజ్ పుస్తకంలో ప్రస్తావించారు. ఈ హత్యలో డొనాల్డ్ ట్రంప్ ప్రమేయం కూడా ఉండొచ్చనే అనుమానాలను వ్యక్తం చేశారు. 46 సంవత్సరాల కిమ్ జొంగ్- నామ్ మకావులో నివసిస్తున్నారు. అక్కడికి వెళ్లే ప్రయత్నంలో విమానాశ్రయానికి చేరుకోగా ఈ దాడి చోటు చేసుకుంది.
ఆ సమయంలో డొనాల్డ్ ట్రంప్.. కిమ్ లేఖ రాశారని ఎలాంటి సహాయమైనా అందిస్తానని హామీ ఇచ్చారని బాబ్ వుడ్వర్డ్స్ పేర్కొన్నారు. తాను ఇదివరకు ట్రంప్తో నిర్వహించిన ఇంటర్వ్యూలో కిమ్ ను ప్రశంసించారని నామ్ హత్యోదంతంపై కిమ్ సమాచారం ఇచ్చినట్లు ట్రంప్ తన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారని బాబ్ తెలిపారు . ట్రంప్-కిమ్ మధ్య ఈ హత్యకు డీల్ కుదరిందనే సమాచారం ఏదీ తమ వద్ద లేదని వెల్లడించినట్లు తెలిపారు. అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారనే ఆరోపణలు కిమ్జొంగ్ మీద ఉన్నాయి. తన అధికారానికి అడ్డుగా వస్తారని భావించిన ప్రతి ఒక్కరినీ ఆయన హతమార్చారంటూ ఇప్పటికే పలు వార్తలు వెలువడ్డాయి. కిమ్జొంగ్ నామ్ను కూడా ఆ కారణంతోనే హత్య చేయించి ఉండారని అప్పట్లో వార్తలు వెలువడ్డాయి
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ కొద్ది రోజుల క్రితమే తన సోదరి కిమ్ యో జోంగ్‌కు ప్రమోషన్ ఇచ్చినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. కాగా కిమ్ కోమాలో ఉన్నారని.. అందుకే యో జోంగ్‌కు కిమ్ తర్వాతి స్థానాన్ని కట్టబెట్టారని తెలుస్తోంది. ఉత్తర కొరియా పగ్గాలను యో జోంగ్ అందుకుంటారని మరోసారి ప్రచారం జరుగుతోంది. దక్షిణ కొరియా దౌత్యవేత్త చాంగ్ సాంగ్-మిన్ ఈ విషయాన్ని వెల్లడించారని కథనాలు వెలువడుతున్నాయి. దివంగత అధ్యక్షుడు కిమ్ డే జంగ్ దగ్గర రాజకీయ వ్యవహారాల కార్యదర్శిగా చాంగ్ పని చేశారు.
‘కిమ్ కోమాలో ఉన్నారు. కానీ ఆయన జీవితం ముగిసిపోలేద’ని చాంగ్ చెప్పినట్లు కొరియా హెరాల్డ్ కథనాన్ని వెలువరించింది. అధికార పగ్గాలను పూర్తిగా యో జోంగ్‌కు కట్టబెట్టే ప్రక్రియ జరగలేదు. కానీ సుదీర్ఘ కాలంపాటు శూన్యత ఉండొద్దనే ఉద్దేశంతోనే కిమ్ యో జోంగ్‌ను ముందుకు తీసుకొచ్చారని చాంగ్ తెలిపారు. చైనా నుంచి అందిన సమాచారం ప్రకారం కిమ్ కోమాలో ఉన్నారని చాంగ్ వెల్లడించారు. కిమ్ ఆరోగ్యం క్షీణిస్తోన్న విషయాన్ని ఉత్తర కొరియా దాచిపెడుతోందని ఆయన ఆరోపించారు.
అత్యంత నమ్మకస్తులతో తన అధికారం, బాధ్యతలను పంచుకునేలా కిమ్ ఓ ఏర్పాటు చేశారని… కిమ్ ఆరోగ్య సమస్యలకు ఈ వ్యవస్థతో సంబంధం లేదని దక్షిణ కొరియా నిఘా వర్గాలు వెల్లడించినట్లు సమాచారం.
ఈ ఏడాది కిమ్ అంతగా ప్రజల్లోకి రాలేదు. దీంతో ఆయన ఆరోగ్యంపై రకరకాల రూమర్లు వెలువడ్డాయి. ఏప్రిల్ 11న పార్టీ పొలిట్ బ్యూరో మీటింగ్ సందర్భంగా కిమ్ ప్రజలకు కనిపించారు. ఆ తర్వాత మే 2న ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీని కిమ్ ప్రారంభించినట్లు మే 2న మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ ఈ ఫొటోలు ఫేక్ అని చాంగ్ చెబుతుండటం గమనార్హం.