అందంతో పాటు పొడుగు కాళ్ల సుందరిగా పాపులరైన హీరోయిన్ల జాబితాలో కియరా అద్వాణీ పేరు కూడా ఉంది. ఈ అమ్మడు కెరీర్ ప్రారంభించిన నాలుగైదేళ్లలోనే అగ్ర తారగా నీరాజనాలు అందుకుంటోంది. బాలీవుడ్ టు టాలీవుడ్ కియరా జర్నీ గురించి తెలిసినదే. అయితే కియరాకు స్ఫూర్తి ఎవరు? ఎవరిని చూసి అసూయ పడుతుంది? అంటే దానికి తన నుంచి ఆన్సర్ వచ్చేసింది.
నిజానికి తాను కెరీర్ ప్రారంభించక ముందే కత్రిన – దీపిక లాంటి స్టార్లను చూసి అసూయ పడేదట. అందానికి అందం ఒడ్డు పొడుగు ఉన్న నాయికలుగా వారిని గుర్తించి ఈర్ష్యతో కుళ్లుకుపోయేదట. వారిలా పొడుగుకాళ్లు అందరికీ రావు. ఇక ప్రతిభ అనేది హార్డ్ వర్క్ తో ముడిపడినది అని విశ్లేషించిందిట. ఏదైతేనేం.. ఆ రెండు క్వాలిటీస్ తనలో పుష్కలంగా ఉన్నాయి. ప్రతిభతో రాణిస్తోంది. టాప్ హీరోయిన్ల జాబితాలో ఇప్పటికే చోటు దక్కించుకుంది. కియరా సాధించింది తక్కువేమీ కాదు అంటూ అభిమానులు పొగిడేస్తున్నారు.
అందం ప్రతిభతో పాటు ఎలాంటి సినీనేపథ్యం లేకుండా కత్రిన- దీపిక లాంటి భామలు బాలీవుడ్ లో రాణించారు. ఇప్పుడు వారి బాటలోనే కియరా కూడా రాణిస్తోంది. ‘కబీర్ సింగ్’ బ్లాక్ బస్టర్ అయ్యాక కియరాకు హిందీ చిత్రసీమలో ఎదురే లేకుండా పోయింది. ఇటీవలే అక్షయ్ సరసన నటించిన లక్ష్మీ (బాంబ్) ఓటీటీలో రిలీజైన సంగతి తెలిసిందే.
స్కై అబౌ.. ఎర్త్ బిలో.. అండ్ పీస్ వితిన్..! అంటూ అదిరిపోయే కొటేషన్ చెప్పింది కియరా అద్వాణీ. చూస్తుంటే తపోవనంలో మోడ్రన్ సీతలా మైమరిపిస్తోంది. అన్నిటినీ మర్చిపోయి ఎంతో హాయిగా ఇలా తపమాచరిస్తున్న కియరాను చూస్తుంటే ముచ్చటేస్తోంది కదా!
ఆకాశానికి భూమికి మధ్య ఏదో తోకచుక్క వాలినట్టుగా ఉందా లుక్కు. గలగలా పారే సెలయేటి మధ్యలో ఇలాంటి ఫీట్ వేసిందేమిటో. ఏ చెట్టో పుట్టో పట్టుకుని అక్కడ నార దుస్తులు ధరించి ఎంతో సాధా సీదాగా సీతమ్మలా సెటప్ చేయాలి కానీ.. మరీ ఇలా అల్ట్రా మోడ్రన్ సీతలా అలా వాగులో దిగి తపమాచరిస్తే మునులు ఊరుకుంటారా? దేవుళ్లు ప్రత్యక్షమవుతారా?
అయితే కియరా ఉద్ధేశం మాత్రం వేరుగా ఉంది. కేవలం మనశ్శాంతిని సంపాదించేందుకు ఇలా చేస్తే చాలు సింపుల్ గా. మంచి ప్రకృతి రమణీయతలో జీవించడమే అన్ని ఒత్తిళ్లకు సెలవిస్తుందనేది తన ఉద్ధేశం. ఇటీవల లక్ష్మీ బాంబ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీ అయిపోయిన కియరా వేరే షెడ్యూళ్లను మ్యానేజ్ చేయాల్సొస్తోంది. మధ్యలో ఇలా రిలాక్స్ అయిపోయిందన్నమాట.
కిలాడీ అక్షయ్ కుమార్ సరసన లక్ష్మీ బాంబ్ చిత్రంలో నటించింది కియరా అద్వాణీ. దీపావళి సందర్భంగా నవంబర్ 9 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ మూవీ విడుదలవుతోంది. ఓటీటీలో విడుదలవుతున్న అగ్ర హీరో సినిమా కావడంతో అంచనాలు ఆ స్థాయిలోనే ఉన్నాయి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో పాటు నవంబర్ 9 న ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్.. యుఎఇ థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ సమాచారాన్ని ఇటీవల విశ్లేషకుడు తరణ్ ఆదర్ష్ తన అధికారిక ట్విట్టర్ లో వెల్లడించారు.
లక్ష్మి బాంబ్ పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నేడు ట్రైలర్ విడుదలవుతుందని అక్షయ్ కుమార్ సోషల్ మీడియా ద్వారా సమాచారం ఇచ్చారు. ట్రైలర్ ఎంతో మెప్పిస్తుంది. లక్ష్మీ బాంబ్ ట్రైలర్ చూడండి అంటూ అక్షయ్ ప్రచారం వేడెక్కిస్తున్నారు.
‘లక్ష్మీ బాంబ్’ చిత్రం నిజానికి సెప్టెంబర్ 9 న విడుదల కావాల్సి ఉండగా… దురదృష్ఠవశాత్తూ.. కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. దీంతో చిత్ర నిర్మాతలు విడుదల తేదీని వాయిదా వేశారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ – అక్షయ్ కుమార్ రొమాన్స్ ఓ రేంజులో ఆకట్టుకోనుందట. ఇది హర్రర్-కామెడీ చిత్రం. రాఘవ్ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది కాంచన చిత్రానికి రీమేక్ అన్న సంగతి విధితమే. ప్రచారంలో భాగంగా ఓ సాంగ్ స్టిల్ ని చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో కియరా అడవి మల్లె బిజిలీలా ఎంతో అందంగా కనిపిస్తోంది. ప్రత్యేకించి జూట్ తో తయారు చేసిన ఆ డిజైనర్ డ్రెస్ అమ్మడి లుక్ ని అమాంతం మార్చేసింది.
ప్రభాస్ కథానాయకుడిగా నటించనున్న `ఆదిపురుష్ 3డి` ప్రస్తుతం బాలీవుడ్ టౌన్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీలో ప్రభాస్ శ్రీరాముడుగా నటిస్తున్నారని.. సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రకు ఎంపికయ్యారని ప్రకటనలు రాగానే ఉత్తరాది అభిమానులు ఒక్కసారిగా సోషల్ మీడియాల్లో ఆరాలు తీసారు. బాహుబలి స్టార్ నుంచి మరో భారీ పాన్ వరల్డ్ మూవీ చూడబోతున్నామన్న ఆసక్తిని కనబరిచారు.
అయితే ఇందులో సీత పాత్రలో ఎవరు నటిస్తారు? అన్నదానిపై రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. కియరా అద్వాణీ సీతగా నటిస్తుందన్న ప్రచారం సాగిపోయింది. అయితే ఇదే ప్రశ్నను ఒక అభిమాని కియారాను అడిగాడు. మరిన్ని సౌత్ చిత్రాలలో మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నా! అని ఆ అభిమాని అనగానే.. దానికి సమాధానమిస్తూ “మీరు త్వరలో దానిని చూస్తారు” అని నర్మగర్భంగా వ్యాఖ్యానించింది కియరా.
ఆదిపురుష్ లో సీతాదేవి పాత్రలో కీర్తి సురేష్ కనిపించనుందని అభిమానులు ఊహిస్తున్నారు. ఇప్పుడు కియారా ఈ చిత్రంలో ఎలాంటి పాత్ర చేస్తుంది? అన్నది సస్పెన్స్ గా మారింది. కియరా వ్యాఖ్యల్ని బట్టి చూస్తే ఓం రౌత్ కి టచ్ లోనే ఉందని అర్థమవుతోంది. ముంబై-హైదరాబాద్ లింక్ ఉన్న హీరోయిన్ గా కియరా ఈ మూవీకి కలిసొచ్చే ఆప్షనే. అందువల్ల తనకు ఏ పాత్రలో నటించే వీలుంది? అన్నది తేల్చాల్సి ఉంటుంది. అయితే ఇంతకుముందు `చంద్రముఖి 2`లో కియరా నటిస్తుందని తొలుత ప్రచారం సాగినా ఆ ఆఫర్ మిస్ అయ్యింది. ఈసారి అలా జరగదనే ఆశిద్దాం. ఇక ఇందులో సైఫ్ ఖాన్ ఈ చిత్రంలో ‘అత్యంత తెలివైన రాక్షస రాజు’ లంకేష్ పాత్రను పోషించనున్నారు.
ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ సాగుతోంది. ఈ చిత్రం 2021లో ప్రారంభమై 2022 లో థియేటర్లలోకి వస్తుందని భావిస్తున్నారు. టి-సిరీస్ బ్యానర్ లో భూషణ్ కుమార్ – క్రిషన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.
డార్లింగ్ ప్రభాస్ కథానాయకుడిగా `తానాజీ` ఫేం ఓం రౌత్ `ఆదిపురుష్ 3డి` చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం దాదాపు 500 కోట్ల మేర బడ్జెట్ ని టీసిరీస్ ఖర్చు చేయనుంది. పురాణేతిహాసం రామాయణ కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించనున్నారని ప్రచారమవుతోంది.
అంతేకాదు.. ఈ మూవీలో సీతా దేవి పాత్రలో ఎవరు నటిస్తారు? అన్న ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఓం రౌత్ కీలక పాత్రలకు నటీనటుల్ని ఎంపిక చేస్తున్నారు. ఇందులో ప్రతినాయకుడి పాత్రకు సైఫ్ అలీఖాన్ ని ఎంపిక చేసుకోగా.. పలువురు బాలీవుడ్ నటులకు అవకాశం ఇవ్వనున్నారని సమాచారం.
అంతేకాదు సీతాదేవి పాత్రకు కియరా అద్వాణీ పేరును పరిశీలిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు ఆ పాత్రకు తను సూటబులేనా? అంటే.. ఇదిగో ఈ రూపం చూస్తే `ఎస్` అనకుండా ఉండలేరు. నిలువెత్తు బుట్టబొమ్మ తీరైన రూపం ఆకట్టుకుంటోంది. ఇక సంప్రదాయ చీరకట్టులో సీతాదేవినే తలపిస్తుంది కియరా. మోడ్రన్ ఔట్ ఫిట్ కి ఎంతగా సూటవుతుందో ఇటు ట్రెడిషనల్ లుక్ కి అంతే యాప్ట్ గా ఉంటుంది. అందుకే కియరాకు ఆ పాత్ర సూటబుల్ అని భావిస్తున్నారట. ఇక ప్రభాస్ -నాగ్ అశ్విన్ మూవీలో నటిస్తున్న దీపిక పదుకొనే సైతం ట్రెడిషనల్ లుక్ కి బాగా సూటవుతుందని పద్మావత్ 3డి చూసాక అందరూ అంగీకరించారు. భాజీరావ్ మస్తానీ సహా పద్మావత్ 3డిలో రాణి పాత్రలో దీపిక అదరగొట్టింది. అందుకే సీతగానూ తను యాప్ట్ అన్న చర్చా సాగుతోంది. ఒకవేళ ప్రభాస్ వరుసగా రెండో ఛాన్స్ తనకే ఇస్తే బెటర్ ఆప్షనే అవుతుంది.