బోయ్ ఫ్రెండా? ప్రియుడా? కియరానే చెప్పాలి

స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ మల్హోత్రాతో లవ్ లో ఉందని అతడితో సుదీర్ఘ కాలం డేటింగ్ చేస్తోందని ప్రచారం సాగుతోంది. తాజాగా నూతన సంవత్సర వేడుకల కోసం మల్హోత్రాతో కలిసి వెళుతూ విమానాశ్రయంలో కెమెరా కంటికి చిక్కడంతో తన సంబంధాన్ని అధికారికమేనని అంగీకరించినట్టేనని బాలీవుడ్ మీడియా కథనాల్ని ప్రచురిస్తోంది. అయితే ఇది స్నేహమేనా లేక ఇంకేదైనానా? అన్నది కియరా కానీ సిద్ధార్థ్ మల్హోత్రా కానీ కన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. అసలింతకీ ఆ ఇద్దరి మధ్యా ఏం జరుగుతోందో వారే రివీల్ చేసేవరకూ కన్ఫామ్ చేయలేం. కియారా అద్వానీ ప్రస్తుత యువనాయికల్లో బిజీ స్టార్. బ్యాక్ టు బ్యాక్ భారీ క్రేజీ ఆఫర్లతో బిజీగా ఉంది. బాలీవుడ్ లో అలియా తర్వాత మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్న కియరాకు డేటింగ్ చేసేంత సమయం ఉందా?

ఇంతకుముందు అలియా భట్ సైతం సిద్ధార్థ్ మల్హోత్రాతో చాలా కాలం పాటు స్నేహంలో ఉంది. కానీ మీడియా దానిని ప్రేమాయణం అంటూ ప్రచారం చేసింది. కానీ ఆ ఇద్దరూ దానిని అధికారికం చేయలేదు.

కియారా-సిద్ధార్థ్ ఈ రోజు ముంబై విమానాశ్రయంలో కలిసి జంటగా కనిపించారు. ఈ జంట నూతన సంవత్సర వేడుకల కోసం మాల్దీవులకు బయలుదేరుతున్నారు. ముఖం దాచుకుని కియారా పెద్ద ముసుగు ధరించి సిద్ధార్థ్ కారులోనే విమానాశ్రయానికి రావడంతో ఒక్కసారిగా ఊహాగానాలు పీక్స్ కి చేరుకున్నాయి. మేం ప్రేమ పక్షులం అని చెప్పేందుకే ఇలా చేశారు! అంటూ ఒకటే కథనాలు వేడెక్కిస్తున్నాయి. మాల్దీవులకు వెళ్లినంత మాత్రాన అది డేటింగేనా? తమ మధ్య డేటింగ్ నిజమేనని ప్రేమలో ఉన్నామని ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు కన్ఫామ్ చేయాల్సి ఉంటుంది.

Related Images:

ఈ గ్లామర్ బ్యూటీకి మాత్రమే 2020 బాగా కలిసొచ్చిందట!!

యంగ్ హీరోయిన్ కియారా అద్వానీ.. పేరు ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలోని అందరి నోళ్ళలో తెగ నానుతుంది. ఎందుకంటే ఆమె ఎంచుకుంటున్న సినిమాలు కియారాకు అలాంటి క్రేజ్ తీసుకొస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కియారా మరీ బోల్డ్ గా తయారైంది. ఎంతగా అంటే అందాల ఆరబోతతో పాటు శృంగార సన్నివేశాలలో కూడా రాజీపడట్లేదు. అమ్మడు సినిమాలతోనే కాదు ఫోటోషూట్లతో కూడా సోషల్ మీడియాను వేడెక్కిస్తుంది. అయితే కియారాకి ఈ ఏడాది బాగా కలిసి వచ్చిందట. అందరు సినీతారల విడుదలలు మహమ్మారి వలన ఆగిపోతే.. కియారా సినిమాలు మాత్రం థియేటర్లలో ఓటిటి వేదికలలో విడుదల అవుతూనే ఉన్నాయి. ప్రెసెంట్ ఇండస్ట్రీ దృష్టంతా కియారా పైనే ఉండటంతో ఇదే సరైన సమయం అని అమ్మడు బోల్డ్ ప్రకటనలు ప్రకటిస్తుంది. ఇప్పటికే కబీర్ సింగ్.. లస్ట్ స్టోరీస్ లతో పాటు గిల్టీ వెబ్ సిరీస్ లో కూడా అలాంటి పాత్రే చేసింది.

ఇక ఈ సినిమాలలో అమ్మడు పండించిన రొమాన్స్ చూసి ఫిదా అయినవారిలో స్టార్ హీరోలు దర్శక నిర్మాతలు కూడా ఉన్నారు. ఈ ఏడాది కియారా నుండి ఓటిటిలో “గిల్టీ” “లక్ష్మి” చిత్రాలు విడుదలయ్యాయి. అలాగే ఈ నెలలో “ఇందూకి జవానీ” విడుదలై థియేటర్లలో ఆడుతోంది.2014 లో “ఫగ్లీ” సినిమాతో బాలీవుడ్ తన ప్రయాణాన్ని ప్రారంభించిన కియారా.. ఎంఎస్ ధోని: ది అన్టోల్డ్ స్టోరీ కబీర్ సింగ్ గుడ్ న్యూజ్ లతో పాటు లస్ట్ స్టోరీస్ అనే డిజిటల్ వెబ్ సిరీస్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. అయినా ఈ భామకు ప్రస్తుతం రెస్ట్ అవసరం లేదంట. “నేను ఇంకా ఎంతో ఆసక్తిగా ఉన్నాను. నేను కంటెంట్ చూసే రకం కాదని అనుకోను – ఎప్పుడూ ముందుకు సాగాలని మాత్రమే కోరుకునే రకం. నేనిదే రకం” అంటూ తన గురించి మరో బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేసింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అమ్మడి చేతిలో మూడు బాలీవుడ్ సినిమాలు ఉన్నాయట. అవి సిధార్థ్ మల్హోత్రా సరసన షెర్షా కార్తీక్ ఆర్యన్ తో ‘భూల్ భూలైయా 2’ అలాగే వరుణ్ ధావన్ సరసన ‘జగ్ జగ్ జీయో’ మూవీస్ ఉన్నట్లు తెలుస్తుంది.

Related Images:

మోస్ట్ వాంటెడ్ జాబితాలో కియారా అద్వానీ

ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ జాబితాలో కియారా అద్వానీ చేరింది అనడంలో సందేహం లేదు. ఏడాదిలో నాలుగు అయిదు పెద్ద సినిమాల్లో నటిస్తున్న కియారా అద్వానీ క్రేజ్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. నటిగా మంచి ప్రతిభ కనబర్చడంతో పాటు ఎలాంటి పాత్రలను అయినా చేసేందుకు సిద్దంగా ఉండే ఆమె తత్వం అందాల ప్రదర్శణ విషయంలో వెనక్కు తగ్గక పోవడం వల్ల ముద్దుగుమ్మ కియారా అద్వానీకి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ వెయిటింగ్ మూవీలో అవకాశం దక్కించుకుంది.

బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు యావత్ దేశ సినీ అభిమానులు ఎదురు చూస్తున్న ‘క్రిష్ 4’ సినిమా లో ఈమెకు అవకాశం దక్కింది. హృతిక్ రోషన్ హీరోగా రూపొందబోతున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో ఆమె ఒక హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. వచ్చే ఏడాది పట్టాలెక్కబోతున్న క్రిష్ 4 సినిమా కోసం ఒక హీరోయిన్ గా కృతి సనన్ ను ఎంపిక చేయడం జరిగింది. అయితే ఆమె ఇతర ప్రాజెక్ట్ లు ఉన్నాయంటూ తప్పుకోవడంతో ఆ స్థానంలో కియారా అద్వానీని ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. తెలుగులో కిరాయా అద్వానీ ‘భరత్ అనే నేను’ మరియు ‘వినయ విధేయ రామ’ సినిమాల్లో నటించిన విషయం తెల్సిందే.

Related Images:

ఆ ఫ్లాప్ తో మళ్లీ ఆఫర్ వస్తుందనుకోలేదు

బాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ల జాబితాలో కియారా అద్వానీ ముందు ఉంటారు అనడంలో సందేహం లేదు. తెలుగులో కూడా ఈమె రెండు సినిమాలు చేసిన విషయం తెల్సిందే. తెలుగులో ఈమె చేసిన రెండు సినిమాల్లో ఒకటి సూపర్ హిట్ అవ్వగా రెండవది ప్లాప్ గా నిలిచింది. అట్టర్ ఫ్లాప్ అయినా కూడా ఈమెకు క్రేజ్ మాత్రం టాలీవుడ్ ప్రేక్షకుల్లో తగ్గలేదు. అలాగే ఈమె బాలీవుడ్ మొదటి సినిమా కూడా నిరాశ పర్చిందట. తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పింది. ఈమె కెరీర్ ఆరంభంలో చేసిన ఒక సినిమా ఫ్లాప్ అవ్వడంతో మళ్లీ ఆఫర్ వస్తుందని ఆశించలేదట. కాని అనూహ్యంగా ధోని సినిమా ఆఫర్ రావడంతో ఆమె కెరీర్ మొత్తం మారిపోయింది.

కియారా అద్వానీ మాట్లాడుతూ.. అంతా అనుకుంటున్నట్లుగా నేను ధోని సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవ్వలేదు. నేను నటించిన మొదటి సినిమా 2014లో ఫగ్లీ విడుదల అయ్యింది. ఆ సినిమా చాలా మందికి తెలియదు. కాని నేను నటించిన మొదటి సినిమా అది. ఆ సమయంలో కొన్ని కారణాల వల్ల ఆ సినిమా నిరాశ పర్చింది. ఆ సినిమా తర్వాత ఇక నా కెరీర్ ఖతం అనుకున్నాను. మొదటి సినిమాతోనే నేను చివరి సినిమా చేసినట్లయ్యిందని అనిపించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్లీ సినిమాల్లో ప్రయత్నించడం మొదలు పెట్టాను. అనూహ్యంగా ధోని సినిమాలో ఆఫర్ వచ్చింది. ఆ ఆఫర్ కాస్త నా జీవితాన్ని కెరీర్ ను మార్చేసిందంటూ కియారా పేర్కొంది. కెరీర్ కష్టంలో ఉన్నప్పుడు ప్రయత్నించకుండా ఉంటే నాకు మళ్లీ ఇన్ని ఆఫర్లు వచ్చేవి కాదంటూ కియారా చెప్పుకొచ్చింది.

Related Images:

ఎన్టీఆర్ కి జోడీగా మహేష్ హీరోయిన్..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై రాధాకష్ణ(చినబాబు) – నందమూరి కల్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తారక్ ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ కంప్లీట్ చేసిన వెంటనే ఈ సినిమాని ప్రారంభిస్తారని తెలుస్తోంది. ‘అరవింద సమేత వీర రాఘవ’ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అయితే ఇందులో తారక్ సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తారన్న దానిపై రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని ఎన్టీఆర్ కి జోడీగా తీసుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

కియారా ‘భరత్ అనే నేను’ అనే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఒక్క సినిమాతో తెలుగులో స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకున్న కియారా.. వెంటనే ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించింది. ఈ మూవీ ప్లాప్ అయిన తర్వాత ఈ బ్యూటీ మరో తెలుగు సినిమాలో నటించలేదు. ఈ క్రమంలో తారక్ – త్రివిక్రమ్ సినిమాలో నటించడానికి ఒప్పుకుందని టాక్ నడుస్తోంది. ఈ పాత్ర గురించి చెప్పగానే కియారా కూడా సుముఖత వ్యక్తం చేసిందని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

Related Images:

కియారా ‘ఇందూ కీ జవానీ’ నుంచి న్యూ వీడియో సాంగ్..!

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ – ఆదిత్యా సీల్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ”ఇందూ కీ జవానీ”. కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తోన్న ఈ ప్రాజెక్టుకు అభీర్ సేన్ గుప్తా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా డిసెంబర్ 11న థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంది. జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికి డేటింగ్ యాప్స్ ను ఆశ్రయించిన ఇందూ గుప్తా అనే యువతికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యారనే నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. చిత్ర ప్రమోషన్ లో భాగంగా ‘ఇందూ కీ జవానీ’ టీమ్ ‘హీలీనే తూట్ గయీ’ అనే వీడియో సాంగ్ విడుదల చేసింది.

మ్యూజిక్ డైరెక్టర్ బాద్ షా స్వరపరిచిన ఈ సాంగ్ లో కియారా అద్వానీ – ఆదిత్యా సీల్ స్టెప్స్ అలరించాయి. ఇందులో కియారా తన అందంతో క్యూట్ ఎక్సప్రెషన్స్ తో మెస్మరైజ్ చేసింది. దీనికి బాద్ షా లిరిక్స్ అందించడంతో పాటు ఆస్తా గిల్ తో కలిసి ఆలపించారు. ఆదిల్ షేక్ ఈ సాంగ్ కి కొరియోగ్రఫీ అందించాడు. సంతాన కృష్ణన్ రవిచంద్రన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. టీ సిరీస్ గుల్షన్ కుమార్ సమర్పణలో ఎమ్మే ఎంటర్టైన్మెంట్ అండ్ ఎలక్రిక్ యాపిల్స్ బ్యానర్ పై భూషణ్ కుమార్ – దివ్య కోస్లా కుమార్ – కృష్ణ కుమార్ – స్టీపెన్ – నిరంజన్ నిర్మించారు. డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ఇందూ కీ జవానీ’ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani)

Related Images:

మహేష్ హీరోయిన్ తో బాలీవుడ్ హీరో డేటింగ్!

బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కియారా అద్వానీ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. `లస్ట్ స్టోరీస్` నుంచి బాలీవుడ్ తో పాటు దక్షిణాదిలోనూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. తాజాగా మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ లో కలిసి కియారా పోజులిచ్చిన ఫొటోలు ఇన్ స్టాలో సందడి చేస్తున్నాయి. కియారా అద్వానీ ….హీరో సిద్ధార్ధ్ మల్హోత్రా ఈ ఇద్దరూ గత కొంత కాలంగా డేటింగ్ లో వున్నారంటూ ఇటీవల వరుస కథనాలు వినిపించాయి.

అయితే ఈ వార్తలపై ఈ ఇద్దరు మండిపడ్డారు. తాము డేటింగ్ లో లేమని స్పష్టం చేశారు. అయితే అప్పటి నుంచి వీరద్దిరిపై నెటిజన్స్.. అభిమానులు ప్రత్యేక అభిమానాన్ని చూపించడం మొదలుపెట్టారు. తాజాగా వీరిద్దరూ కలిసి `షేర్ షా` చిత్రంలో నటిస్తున్నారు. `పంజా` ఫేమ్ విష్ణువర్ధన్ దర్శకత్వం వహిస్తున్నాడు. కరణ్ జోహార్ తో కలిసి మరో ఐదుగురు నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చాలా రోజుల తరువాత కియారా.. సిద్ధార్ధ్ల ఫొటోల్ని ఇన్ స్టా వేదికగా ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన షబ్బీర్ బాక్స్ వాలా షేర్ చేశారు.

సినిమాలో వీరిద్దరి పాత్రల్ని పరిచయం చేశారు. సిద్ధార్ధ్ మల్హొత్రాని `షేర్ షా` చిత్రంలో విక్రమ్ బాత్రగా… కియారా డింపుల్ చీమగా నటిస్తున్నట్టు పరిచయం చేశాడు. ట్రాక్ సూట్ లో సిద్ధార్ధ్ మల్హోత్రా.. క్యాజువల్ ఔట్ ఫిట్ లో కియారా అద్వానీ కనిపించారు. దీంతో చాలా రోజుల తరువాత ఈ జోడీ నవ్వులు చిందిస్తూ కనిపించడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Related Images:

ఆ విమర్శల్ని ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నాను

నటి కియారా అద్వానీ తనను ట్రోల్ చేసిన సమయాన్ని గుర్తు చేసుకుంటుంది. నెటిజన్లు ఆమె బొటాక్స్ చికిత్స చేయించుకుందని ఇటీవల ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది ట్రోలర్స్ కి కియారా ప్రధాన టార్గెట్గా నిలిచింది. డీప్ గా హర్ట్ అయిన గత సంగతుల్ని నేహా దూపియా నిర్వహిస్తున్న `నో ఫిల్టర్ విత్ నేహా`లో వెల్లడించింది కియారా.

ఈ వార్తలు విని కియారా మదర్ ప్రారంభంలో చాలా ఫీలైందట. ఇలాంటి వార్తలు నా దాకా రానివ్వకని చెప్పిందట. ఇలాంటి వార్తల్ని నేను చదవనని పట్టించుకోనని అమెకు తెలుసు అయితే ఇలాంటి వాటిని కొంత మంది పతాక శీర్షికల్లోకి ఎక్కించడం బాధించింది. చిన్న చిన్న విషయాలకే భయపడిపోయి చమటపట్టేయడం నా నైజం కాదు. ఇవి ముఖ్యమైనవి కావు. పెద్ద సమస్యలు పరిశీలించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. కాని మీరు చదివినవన్నీ ఎల్లప్పుడూ నిజాలు కావు అనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను` అంటోంది కియారా.

`నేను స్టైలింగ్ చేయడాన్ని గుర్తుంచుకున్నాను.. నేను చాలా తరచుగా ఇలా చేస్తాను. నా జుట్టు.. మేకప్ అలాగే స్టైల్ ని నేనే చేస్తాను. నేను మొత్తం పరివారం అని పిలుస్తాను మరియు ఆ రోజు నేను చాలా మంచి పని చేయలేదు. నా ఐ షాడోను కొంత ఎక్కువగా చేశాను. దాని వల్ల నన్ను ఎవరో కన్నుపై గుద్దినట్టుగా కనిపించాను. దీంతో ఆమెకు బొటాక్స్ వచ్చింది అని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఆ విమర్శల్ని ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నాను. దాంతో నా నోటిఫికేషన్స్ అన్నింటినీ క్లోజ్ చేయాలనుకున్నాను. `నా కోసం.. నా దర్శకుడు ఏమనుకుంటున్నారో అది నాకు ముఖ్యం కాని మీరు ఎక్కడ గీత గీసుకోవాలో అది మీరు నిర్ణయించుకోవాలి` అని స్ట్రాంగ్ గా కౌంటరిచ్చింది కియారా.

Related Images:

భువికి దిగివచ్చిన దేవకన్యలా కియారా..!

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ గ్లామర్ షోలో ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటుంది. సినిమాల్లోనే కాకుండా బయట కూడా హాట్ డ్రెస్సులతో కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. ఎప్పటికప్పుడు ట్రెండీ అవుట్ ఫిట్స్ తో దర్శనమిచ్చి అందరి కళ్ళు తనవైపు తిప్పేలా చూసుకునే కియారా.. తాజాగా ఎథిక్ దుస్తుల్లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కరోనా కారణంగా గత కొన్ని నెలలుగా ఇంటికే పరిమితమైన కియారా.. ఆమె నటించిన ‘లక్ష్మీబాంబ్’ త్వరలో ఓటీటీలో విడుదల అవుతున్న నేపథ్యంలో విస్తృతంగా ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. ఇంతకముందు ఓ షో కోసం బ్లాక్ స్కర్ట్ లో వచ్చి అదరగొట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు ఫెస్టివల్ మూడ్ లోకి మారిపోయింది. కియారా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ ఫొటోలో కియారా అద్వానీ.. బెర్రీ బ్లర్డ్ పోల్కా ప్రింట్ హ్యాండ్-ఎంబ్రాయిడరీ ఘరారా మరియు జాకెట్టు ధరించి అదరగొట్టింది. దీనికి సరైన దుపట్టా కూడా ధరించింది. ఎథిక్ దుస్తుల్లో ఉన్న ఆమెకు ఇయర్ రింగ్స్ మరియు నెక్లెస్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. లూజ్ హెయిర్ తో స్మైల్ ఇస్తూ అమ్మడు ఇచ్చిన పోజ్ కి అందరూ ఫిదా అవుతున్నారు. ఈ ఫోటోలను చూసిన యువ హృదయాలు దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్యలా ఉందని కామెంట్స్ పెడుతున్నారు. ‘ఎం.ఎస్.ధోని’ సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న కియారా.. మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ అనే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ ఒక్క సినిమాతో తెలుగులో స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకుంది. అయితే ‘వినయ విధేయ రామ’ సినిమా తర్వాత మరో తెలుగు సినిమాలో నటించలేదు. బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలతో సత్తా చాటుతోంది.

Related Images:

‘ఆదిపురుష్’ లో సీతగా లస్ట్ బ్యూటీని యాక్సెప్ట్ చేస్తారా…?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్ లో ”ఆదిపురుష్” అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 3-డీలో రూపొందనున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ – కృష్ణ కుమార్ – ప్రసాద్ సుతార్ – రాజేష్ నాయర్ – ఓం రౌత్ లు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ‘చెడుపై మంచి సాధించిన విజయం’ అనే థీమ్ తో రానున్న ఈ మూవీ టైటిల్ మోషన్ పోస్టర్ ఇటీవల విడుదల చేశారు. ఈ పోస్టర్ ని చూసిన సినీ అభిమానులకు ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడని అర్థం అయింది. అయితే అప్పటి నుంచి ‘రావణాసురుడు’ ‘సీత’ పాత్రలు ఎవరు పోషిస్తారనే దానిపై సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ‘ఆది పురుష్’లో ప్రభాస్ ని ఢీకొట్టే ప్రతినాయకుడు ‘లంకేష్’ గా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

కాగా ఇప్పుడు ‘సీత’ పాత్రలో ఎవరు కనిపిస్తారనే దానిపై ఆసక్తి మొదలైంది. ఈ క్రమంలో ‘మహానటి’ కీర్తి సురేష్.. ‘భరత్ అనే నేను’ ఫేమ్ కియారా అద్వానీ పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే కియారా అద్వానీని ఉత్తమురాలైన సీత పాత్రలో అంగీకరిస్తారా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే కియారా ఇంతకముందు ‘లస్ట్ స్టోరీస్’ అనే వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటించడంతో పాటు వైబ్రేటర్ సీన్ లో కూడా నటించి అందరిని షాక్ కి గురి చేసింది. అంతేకాకుండా ‘గిల్టీ’ ఒరిజినల్ మూవీలో డ్రగ్స్ తీసుకుంటూ సిగరెట్స్ మందు తాగే అమ్మాయిగా కనిపించింది. అలాంటి పాత్రల్లో నటించిన కియారా ని ఇప్పుడు ‘సీత’ పాత్రలో యాక్సెప్ట్ చేస్తారా అని సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. అయితే మరికొందరు మాత్రం నటీనటులు ఎలాంటి పాత్రల్లో అయినా నటిస్తారని.. అది వారి వృత్తి ధర్మం అని.. అప్పుడు బోల్డ్ గా నటించినట్లే ఇప్పుడు సాంప్రదాయ బద్దమైన పాత్రలో నటిస్తే తప్పేంటని కామెంట్ చేస్తున్నారు. మరి పాన్ ఇండియా మూవీగా రానున్న ‘ఆదిపురుష్’ లో మేకర్స్ హీరోయిన్ గా ఎవరికి ఓటేస్తారో చూడాలి.

Related Images:

ఇంత అందంగా ఉంటే మోస్ట్ వాంటెడ్ కాకుండా ఎలా ఉంటుంది

2016వ సంవత్సరంలో వచ్చిన ఎంఎస్ ధోనీ సినిమాతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ కియారా అద్వానీ. ఈ అమ్మడు ఒక వైపు సినిమాల్లో నటిస్తూ మరో వైపు వెబ్ సిరీస్ లు చేస్తూ నటిగా మంచి గుర్తింపు దక్కించుకోవడంతో పాటు తన అందంతో రెగ్యులర్ గా సోషల్ మీడియాలో కనువింధు చేస్తూనే ఉంది. తెలుగులో ఈమె నటించింది రెండే సినిమాలు అయినా ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం బాలీవుడ్ కే ఈమె పూర్తి సమయం కేటాయిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం కియారా బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.

హీరోయిన్స్ ఇలాంటి హాట్ ఫొటో షూట్స్ పోస్ట్ చేయడం కామన్. అయితే కియారా పోస్ట్ చేసే ఫొటో షూట్ స్టిల్స్ చాలా ప్రత్యేకంగా అనిపిస్తాయి. ఆమె అందాల ఆరబోతతో పాటు విభిన్నమైన కాన్సెప్ట్ తో ఉంటాయి. కనుక ఈ అమ్మడిని నెట్టింట చూడాలని చాలా మంది ఆశిస్తూ ఉంటారు. ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ ను మిలియన్స్ ల్లో ఫాలో అవుతూ ఉంటారు. ఇక మింత్ర కోసం తీసుకున్న ఈ ఫొటో షూట్ లో కియారా లుక్ అదిరింది. ఇంత అందంగా ఉండటం వల్లే ప్రస్తుతం ఈమె బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Related Images: