మాస్ మహారాజా రవితేజ హీరోగా డైరెక్టర్ రమేష్ వర్మ రూపొందిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఖిలాడి’. ‘ప్లే స్మార్ట్’ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. ఇందులో రవితేజ సరసన మీనాక్షి చౌధరి మరియు డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. రవితేజ డ్యూయల్ రోల్ లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏ స్టూడియోస్ బ్యానర్ పై సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ అధినేత జయంతీ లాల్ గడ ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. హవీష్ ప్రొడక్షన్ లో రూపుదిద్దుకుంటున్న ‘ఖిలాడి’ మూవీకి సంబంధించి హైదరాబాద్ షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఆధ్వర్యంలో చెన్నైలో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. సంగీత దర్శకుడితో పాటు దర్శకుడు రమేష్ వర్మ ఇందులో పాల్గొంటున్నారు.
కాగా రమేష్ వర్మ ‘ఖిలాడి’ చిత్రాన్ని ఉన్నత స్థాయి టెక్నికల్ విలువలతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్నారు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్ మరియు ‘లూసిఫర్’ సినిమాటోగ్రాఫర్ సుజిత్ వాసుదేవ్.. ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ వంటి టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా – దేవిశ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ కలసి డైలాగ్స్ రాస్తున్నారు. శ్రీమణి సాహిత్యం అందిస్తుండగా.. అమర్ రెడ్డి ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ‘రాక్షసుడు’ వంటి బ్లాక్ బస్టర్ మూవీతో సూపర్ హిట్ కాంబినేషన్ అని నిరూపించుకున్న సత్యనారాయణ కోనేరు – రమేష్ వర్మ.. ఇప్పుడు ‘ఖిలాడి’ చిత్రాన్ని ఏ విషయంలోనూ రాజీ పడకుండా భారీ బడ్జెట్ తో ఉన్నత ప్రమాణాలతో తీస్తున్నారు.
రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందబోతున్న ఖిలాడి సినిమాపై ఇప్పటికే సినీ వర్గాల వారితో పాటు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఖిలాడి టైటిల్ తో ఇప్పటికే సినిమా వెయిట్ పెరిగింది. మాస్ కా బాస్ అంటూ పేరున్న రవితేజ అంతకు మించిన మాస్ టైటిల్ ను ఎంపిక చేయడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందనే నమ్మకంను రమేష్ వర్మ సన్నిహితుల వద్ద అంటున్నాడు. ఈ సినిమా వెయిట్ ఇంకా పెంచడం కోసం యాక్షన్ కింగ్ అర్జున్ ను ఈ సినిమాలో నటింపజేస్తున్నారు.
తెలుగు మరియు తమిళంలో పలు సినిమాల్లో విలన్ గా నటించిన యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో కూడా విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. రవితేజ వర్సెస్ అర్జున్ అన్నట్లుగా సినిమాలో యాక్షన్ సీన్స్ హోరా హోరీగా ఉంటాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ సినిమాలో అర్జున్ ఉండటంతో ఖచ్చితంగా బజ్ మరింత ఎక్కువ అవుతుందంటూ విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో అను ఎమాన్యూల్ మరియు మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ ప్రారంభం అయిన ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ చివరి వరకు పూర్తి చేయాలని భావిస్తున్నారు. దసరా సీజన్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంతకు ముందు రవితేజ నటించిన క్రాక్ సినిమాను విడుదలకు సిద్దంగా ఉంది.
రవితేజ హీరోగా క్రాక్ సినిమా తెరకెక్కి విడుదలకు సిద్దం అయ్యింది. ఆ సినిమాను ముగించిన రవితేజ ఇటీవలే రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ సినిమాను మొదలు పెట్టాడు. ఈ సినిమాపై రవితేజ చాలా అంచనాలు పెట్టుకున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాలో రవితేజకు జోడీగా డింపుల్ హయతీ మరియు మీనాక్షి చౌదరి లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకు మరింత అందం తీసుకు వచ్చేందుకు గాను జబర్దస్త్ బ్యూటీ హాట్ యాంకర్ అనసూయను నటింపజేస్తున్నట్లుగా మీడియా సర్కిల్స్ ద్వారా సమాచారం అందుతోంది.
అనసూయ ఒక వైపు బుల్లి తెరపై ఎంటర్ టైన్ చేస్తూనే మరో వైపు వెండి తెరపై వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వస్తుంది. హీరోయిన్ గా నటించకుండానే మంచి పాత్రల్లో కనిపిస్తుంది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించిన తర్వాత అనసూయ క్రేజ్ బాగా పెరిగింది. ఆమెకు అందాల ఆరబోత పాత్రలు మాత్రమే కాకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం ఈమెకు ఆచార్య మరియు రంగమార్తాడ సినిమాల్లో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఈమె ఖిలాడి సినిమాలో కూడా నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఖిలాడి సినిమాను వచ్చే ఏడాది ద్వితాయార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
రవితేజ క్రాక్ (#RT66) చిత్రీకరణ పెండింగ్ పనులు పూర్తి చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కొత్త ప్రాజెక్ట్ ఖిలాడీ (#RT67) ప్రారంభమైంది. మాస్ రాజా నటిస్తున్న 67వ చిత్రమిది. ఇంతకుముందు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే అంతర్జాలంలో వైరల్ అయ్యింది. నేడు హైదరాబాద్ లో కె.ఎల్.యూనివర్శిటీ యువ సీఈవో కం హీరో హవీష్ క్లాప్ నివ్వగా ఖిలాడీ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. శ్రీను కెమెరా స్విచ్చాన్ చేశారు.
ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభియం చేయనున్నారు. మీనాక్షి చౌదరి – డింపుల్ హయతి నాయికలుగా నటిస్తున్నారు. రాక్షసుడు ఫేం రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఖిలాడి వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది.
ఈ కార్యక్రమంలో రవితేజ-హవీష్ సహా దర్శకుడు రమేష్ వర్మ.. ఇతర చిత్రబృందం పాల్గొన్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఏ స్టూడియోస్ ఎల్.ఎల్.పి- పెన్ మూవీస్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. లాంచింగ్ వేడుకలో మాస్ రాజాతో పాటు హీరో కం నిర్మాత హవీష్ ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఆయన విజయవాడలోని ప్రఖ్యాత సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్శిటీ కె.ఎల్ వర్శిటీ అధినేత వారసుడు అన్న సంగతి విధితమే. కె.ఎల్ యూనివర్శిటీ కొత్త బ్రాంచీని హైదరాబాద్ లోనూ ప్రారంభించారు.