బైడెన్ కు లైన్ క్లియర్.. అధికార మార్పిడికి ట్రంప్ గ్రీన్ సిగ్నల్

అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరించని డొనాల్డ్ ట్రంప్ అధికార మార్పిడికి కొద్దిరోజులుగా పేచీ పెడుతున్న సంగతి తెలిసిందే. కోర్టుల్లో కేసులు కూడా వేస్తున్నాడు. ఈ క్రమంలోనే జనవరిలో కొత్త అధ్యక్షుడి బాధ్యతల నియామకానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి.

ఈ క్రమంలోనే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. జోబైడెన్ కు బాధ్యతలు అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అధికార మార్పిడికి అవసరమైన ప్రక్రియను ప్రారంభించాలని అధికార యంత్రాగానికి సూచించారు.

తాజాగా ట్రంప్ ట్వీట్ చేశారు. ‘దేశం పట్ల ఉన్న నిబద్ధత విధేయతకు జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ (జీఎస్ఏ) చీఫ్ ఎమిలీ ముర్ఫీకి ధన్యవాదాలు. కొద్దిరోజులుగా ఆమె వేధింపులకు బెదిరింపులకు గురవుతున్నారు. దేశ ప్రయోజనాల రీత్యా నిబంధనల ప్రకారం అధికార మార్పిడికి అనుసరించాల్సిన ప్రక్రియను ప్రారంభించాలని ఎమిలీని కోరుతున్నారు.’ అని ట్రంప్ పేర్కొన్నారు.

ఇక ట్రంప్ మరో ట్విస్ట్ కూడా ఇచ్చారు. ఎన్నికల్లో అవకతవకలపై తన న్యాయ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఒకవేళ ట్రంప్ వైట్ హౌస్ను వీడేందుకు మొండికేస్తే అనుసరించాల్సిన ప్రక్రియపై నిన్నటిదాకా సర్వత్రా చర్చ జరిగింది. ట్రంప్ తాజా ప్రకటనతో ఇక బైడెన్కు అధికారం కట్టబెట్టేందుకు అడ్డంకులు తొలగిపోయాయి.

అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన జోబైడెన్ కు జీఎస్ఏ చీఫ్ ఎమిలీ ముర్ఫీ లేఖ రాశారు. అధికార మార్పిడి ప్రక్రియను షూరూ చేసేందుకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సిద్ధంగా ఉందని అందులో పేర్కొన్నారు. ఈ లేఖ బైడెన్ కు చేరిన కొద్ది గంటలకే ట్రంప్ ట్విట్టర్ ద్వారా స్వయంగా ప్రకటన చేశారు.

ట్రంప్ తాజా ప్రకటనతో బైడెన్ అధికారాన్ని చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ఇటీవలి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ 306 ఎలక్టోరల్ ఓట్లతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ప్రస్తుత అధ్యక్షుడురిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ 232 ఎలక్టోరల్ ఓట్లు మాత్రమే దక్కించుకున్నారు.

Related Images:

వర్మ ‘మర్డర్’ కు కోర్టు గ్రీన్ సిగ్నల్!

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ‘మర్డర్’ సినిమా విడుదలను అడ్డుకుంటూ అమృత కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో నల్లగొండ కోర్టు సినిమా విడుదలపై స్టే విధించింది. నల్లగొండ కోర్టు స్టేను హైకోర్టు కొట్టి వేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రణయ్.. అమృతల ప్రేమ కథ ఆ తర్వాత జరిగిన పరిణామాలు మారుతిరావు చనిపోవడం ఇలా అన్ని విషయాలను ఈ సినిమాలో వర్మ తెర రూపం ఇచ్చాడు. ఈ సినిమాలో అమృతను నెగటివ్ షేడ్స్ తో వర్మ చూపించినట్లుగా ప్రోమో మరియు ఫొటోలను చూస్తుంటే అనిపిస్తుంది అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మర్డర్ సినిమాను తన కథతో తన అనుమతి లేకుండా వర్మ తీశాడు అంటూ అమృత పోలీసులకు ఫిర్యాదు చేయడం కోర్టుకు వెళ్లడం జరిగింది. ఇప్పుడు వర్మకు అనుకూలంగా హైకోర్టులో తీర్పు రావడంతో సినిమా విడుదలకు సిద్దం చేస్తున్నట్లుగా వర్మ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. మర్డర్ సినిమాకు గౌరవనీయమైన కోర్టు నుండి అనుమతి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ విషయాన్ని ప్రకటిస్తున్న నాకు ఆనందంగా ఉందంటూ వర్మ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. త్వరలో పూర్తి వివరాలను వెళ్లడిస్తామంటూ అందరికి వర్మ కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తాడా లేదంటే ఓటీటీ ద్వారా విడుదల చేస్తాడా అనే విషయమై అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related Images:

అంతర్జాతీయ రాకపోకలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

ఎప్పుడైతే దేశంలో కరోనా ఎంట్రీ అయ్యిందో అప్పటి నుంచే దేశంలో విదేశాల నుంచి రాకపోకలను కేంద్రం నిషేధించింది. వందే భారత్ మిషన్ అంటూ అప్పట్లో నడిపింది. కరోనా బాగా ప్రబలడంతో ఇక చేసేందేం లేక మొత్తం విమానాల రాకపోకలు ఆ మధ్య బంద్ చేసింది. విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని మాత్రమే ప్రత్యేక విమానాలు వేసి తీసుకొచ్చింది.

తాజాగా అంతర్జాతీయ రాకపోకలపై ఆంక్షలను దశలవారీగా ఎత్తివేసేందుకు కేంద్రం సిద్ధమైంది. దేశంలోకి ఇతర దేశాల నుంచి భారతీయులు.. విదేశీయుల రాకపోకలపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. పర్యాటక వీసా మినహా అన్ని వర్గాల ప్రయాణాలకు అనుమతులు ఇవ్వనున్నట్లు కేంద్ర హోంశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

అయితే ప్రయాణికులంతా ఆరోగ్యశాఖ సూచించిన ప్రకారం క్వారంటైన్ తదితర కరోనా నిబంధనలను పాటించాల్సి ఉంటుందని పేర్కొంది. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు భారత మూలాలున్న భారతీయులతోపాటు విదేశీయులు ఎవరైనా వాయు జల మార్గాల ద్వారా భారత్ కు వచ్చేందుకు కేంద్ర హోంశాఖ అనుమతులు జారీ చేసింది. ఇక నుంచి విదేశాల నుంచి రావచ్చు.. భారత్ నుంచి విదేశాలకు వెళ్లవచ్చని పేర్కొంది.

ప్రస్తుతం ఉన్న వీసాలన్నింటిని యాక్టివ్ చేస్తున్నట్టు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఎలక్ట్రానిక్ పర్యాటక వైద్య సంబంధ వీసాలు మినహా ఇతర అన్ని వీసాలను కేంద్రం పునరుద్ధరించింది.భారత్ లో చికిత్స కోసం మెడికల్ వీసాలను కేంద్ర హోంశాఖ మంజూరు చేస్తోంది.

Related Images:

అన్ లాక్ 5.0 లో థియేటర్లకు గ్రీన్ సిగ్నల్…!

కేంద్ర ప్రభుత్వం తాజాగా అన్ లాక్ 5.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా ఆంక్షలను సడలిస్తూ కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. అందరు అనుకున్నట్లుగానే థియేటర్లు మరియు మల్టీప్లెక్సులు రీ ఓపెన్ చేసుకునేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్టోబరు 15 నుంచి సినిమా థియేటర్లు తెరుచుకోడానికి అనుమతినిస్తూ.. 50 శాతం సీట్ల సామర్థ్యాన్ని వినియోగించుకోవాలని నిబంధన విధించింది.

అన్ లాక్ 5.0 నిబంధనల్లో పాఠశాలలు – ఉన్నత విద్యాసంస్థలు తెరవడంపై పూర్తి స్వేచ్ఛను రాష్ట్రాలకే వదిలివేసింది. వాటి పున ప్రారంభంపై ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి స్థానిక ప్రభుత్వాలనే నిర్ణయం తీసుకునేందుకు అనుమతిచ్చింది. అలానే కోవిడ్ నిబంధనలను అమలు చేస్తూ పార్కులను కూడా తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. అక్టోబర్ 15 తర్వాత క్రీడాకారుల కోసం స్విమ్మింగ్ పూల్స్ తెరిచేందుకు కూడా అనుమతినిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రాల మధ్య అన్ని రకాల రాకపోకలను అనుమతిస్తున్నామని.. ఎలాంటి షరతులు విధించవద్దని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. అయితే కంటోన్మెంట్ జోన్లలో ఉన్న వాటిని తెరించేందుకు అనుమతి లేదని కేంద్రం పేర్కొంది. కంటోన్మెంట్ జోన్ లలో అక్టోబరు 31వ తేదీ వరకూ లాక్ డౌన్ విధిస్తున్నట్లు పేర్కొంది.

Related Images: