‘ఖిలాడి’ కోసం జబర్దస్త్ హాటీ

రవితేజ హీరోగా క్రాక్ సినిమా తెరకెక్కి విడుదలకు సిద్దం అయ్యింది. ఆ సినిమాను ముగించిన రవితేజ ఇటీవలే రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ సినిమాను మొదలు పెట్టాడు. ఈ సినిమాపై రవితేజ చాలా అంచనాలు పెట్టుకున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాలో రవితేజకు జోడీగా డింపుల్ హయతీ మరియు మీనాక్షి చౌదరి లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకు మరింత అందం తీసుకు వచ్చేందుకు గాను జబర్దస్త్ బ్యూటీ హాట్ యాంకర్ అనసూయను నటింపజేస్తున్నట్లుగా మీడియా సర్కిల్స్ ద్వారా సమాచారం అందుతోంది.

అనసూయ ఒక వైపు బుల్లి తెరపై ఎంటర్ టైన్ చేస్తూనే మరో వైపు వెండి తెరపై వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వస్తుంది. హీరోయిన్ గా నటించకుండానే మంచి పాత్రల్లో కనిపిస్తుంది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించిన తర్వాత అనసూయ క్రేజ్ బాగా పెరిగింది. ఆమెకు అందాల ఆరబోత పాత్రలు మాత్రమే కాకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం ఈమెకు ఆచార్య మరియు రంగమార్తాడ సినిమాల్లో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఈమె ఖిలాడి సినిమాలో కూడా నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఖిలాడి సినిమాను వచ్చే ఏడాది ద్వితాయార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Related Images:

వచ్చే జన్మలో ఏనుగులా పుట్టాలనుకుంటున్నా : అనసూయ

జబర్దస్త్ యాంకర్ అనసూయ ఒక వైపు బుల్లి తెరపై మరో వైపు వెండి తెరపై బిజీ బిజీ గా ఉంటూ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఏదో ఒక పోస్ట్ పెట్టడం లేదంటే లైవ్ ఛాట్ నిర్వహించడం చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఈమెను రెగ్యులర్ గా నెటిజన్స్ ట్రోల్స్ చేస్తూనే ఉంటారు. వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. తనను వ్యక్తిగతంగా మరీ బ్యాడ్ వర్డ్స్ తో ట్రోల్ చేసిన వారి తాట తీస్తుంది. తాజాగా ఈమె ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ పై మాట్లాడింది.

తనకు మళ్లీ జన్మ అంటూ ఉంటే ఏనుగులా జన్మించాలనుకుంటున్నాను. ఏనుగు ఫ్యామిలీలో చాలా బాధ్యతలు అన్యోన్యత ఉంటుందని ఆమె పేర్కొంది. వచ్చే జన్మలో ఏనుగుగా పుట్టాలనుకోవడానికి కారణం వెళ్లడిస్తూ… ఏనుగుల జాతిలో వాటి జంట ఏనుగుల్లో ఒక ఏనుగు చనిపోతే మరో ఏనుగు నిద్ర హారాలు మానేసి చనిపోతుంది. ఇక ఏనుగుల కుటుంబాలకు ఆడ వృద్ద ఏనుగులు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఆడ ఏనుగుకు ఏనుగుల జాతిలో ఎక్కువ గౌరవం ఉంటుంది. అందుకే తాను ఏనుగుల జాతిలో పుట్టాలని ఆశిస్తున్నట్లుగా ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెళ్లడించింది.

Related Images:

అనసూయ నాకస్సలు నచ్చేది కాదు

జబర్దస్త్ యాంకర్ అనసూయ ప్రస్తుతం ఈ పేరును తెలుగు బుల్లి తెర మరియు వెండి తెరు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. బుల్లి తెర నుండి వెండి తెర వరకు ఎక్కడ చూసినా ఈమె కనిపిస్తుంది. రంగస్థలంలో రంగమ్మత్త పాత్రతో తనదైన ముద్ర వేసిన అనసూయను లీడ్ రోల్స్ కోసం కూడా సంప్రదిస్తున్నారు. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత కూడా ఆమె క్రేజు జోరు ఏమాత్రం తగ్గలేదు అనడంలో సందేహం లేదు. అంతగా బ్రాండ్ అయిన అనసూయ పేరు అంటే అనసూయకు ఇష్టం లేదట.

తాజాగా అలీతో సరదాగా టాక్ షో లో పాల్గొన్న అనసూయ పలు వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంది. ఇప్పుడు మిమ్ములను పవిత్ర అని పిలవాలా లేదంటే అనసూయా అంటూ పిలవాలా అంటూ అలీ ప్రశ్నించగా అసలు విషయం చెప్పింది. అమ్మ నాకు పవిత్ర అని పేరు పెట్టింది. అయితే నాకు గుర్తు తెలియని సమయంలోనే నాన్న పేరు మార్చాడు. నాన్న తరపు ఫ్యామిలీలో నేను మొదటి అమ్మాయిని. అందుకే వారి అమ్మ పేరుతో నాన్న నాకు అనసూయ అంటూ పేరు పెట్టారు. స్కూల్ ల్లో నన్న అంతా అనసూయ అంటూ అంత పెద్దగా పిలుస్తుంటే నాకు చిరాకుగా ఉండేది.

స్కూల్ లో అందరు నన్ను అను అంటూ పిలవాలని చెప్పేదాన్ని. స్కూల్ రిజిస్ట్రర్ లో కూడా నా పేరు అను అని ఉంటుంది. అనసూయ అంటే పలికేదాన్ని కాదు. కాలేజ్ ఎన్సీసీ కి వెళ్లిన సమయంలో నా పేరు విషయంలో జ్ఞానోదయం అయ్యింది. అప్పటి నుండి నా పేరు అనసూయ అంటూ నేనే గర్వంగా చెప్పుకునేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. భరద్వాజ్ తో ప్రేమ విషయంలో కుటుంబ సభ్యులు అస్సలు ఒప్పుకోలేదు. దాంతో తప్పనిసరి పరిస్థితిలో నాన్నకు తెలియకుండా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని అనసూయ పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంది.

Related Images:

ఓటీటీలను నమ్ముకునే సినిమాలు తీస్తున్నారా…?

సినీ ఇండస్ట్రీ గత ఐదు నెలలుగా గడ్డు కాలం ఎదుర్కుంటున్న నేపథ్యంలో నిర్మాతలు పెద్ద ఎత్తున నష్టాలను చవి చూస్తున్నారు. అయినా సరే టాలీవుడ్ లో మాత్రం కొందరు మేకర్స్ వరుసగా కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ వస్తున్నారు. అయితే వీరంతా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ ఉన్నాయనే ధైర్యంతోనే సినిమాలు తీస్తున్నారని తెలుస్తోంది. ఒకప్పుడు చిన్న నిర్మాతలు తక్కువ బడ్జెట్ లో సినిమాలు తీసి.. వాటిని థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి చాలా ఇబ్బందులు పడేవారు. కానీ ఇప్పుడు పద్ధతి మారింది. థియేటర్స్ దొరకకపోయినా ఓటీటీలు ఉన్నాయనే ధైర్యంతో నిర్మాతలు సినిమాలు చేసేస్తున్నారు.. దీంతో ఇండస్ట్రీకి చాలామంది నటీనటులు కొత్త దర్శకులు పరిచయం అవుతున్నారు.

కాగా జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ ని హీరోగా పెట్టి ఈ మధ్య వరుసగా సినిమాలు తీస్తున్నారు. జబర్దస్త్ కామెడీ షోతో క్రేజ్ దక్కించుకున్న సుధీర్ కామెడీని అభిమానించే వాళ్లు చాలామందే ఉన్నారు. ఈ క్రేజ్ తో ఇప్పుడు సినిమాల్లో కూడా గుర్తింపు తెచ్చుకోడానికి ట్రై చేస్తున్నాడు సుధీర్. ఇప్పటికే ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ ‘3 మంకీస్’ వంటి సినిమాల్లో నటించిన సుడిగాలి సుధీర్.. మరికొన్ని సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. మరోవైపు జబర్దస్త్ షోతో గుర్తింపు తెచ్చుకున్న ఆర్పీ కూడా దర్శకుడిగా మారుతున్నాడు. జేడీ చక్రవర్తిని హీరోగా పెట్టి ఓ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. అయితే ఓటీటీలను నమ్ముకొని మేకర్స్ చిన్న సినిమాలు తీయడానికి ముందుకొస్తున్నారని తెలుస్తోంది. ఫ్యూచర్ లో ఈ సినిమాలకి థియేటర్స్ అందుబాటులో లేకపోయినా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో లేదా ఏటీటీలలో రిలీజ్ చేసుకోవచ్చని మేకర్స్ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.

Related Images: