ఆచార్య మరో డేట్ వచ్చింది

మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల శివల కాంబోలో రూపొందుతున్న ఆచార్య సినిమా షూటింగ్ కరోనా లాక్ డౌన్ కారణంగా మార్చిలో నిలిచిన విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ఇటీవలే మళ్లీ పునః ప్రారంభించేందుకు తేదీ ఫిక్స్ చేశారు. అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. చిరంజీవి కూడా సెట్ లో జాయిన్ అవ్వబోతున్నాడు అనుకుంటున్న సమయంలో అందరికి జనరల్ గా కరోనా పరీక్షలు నిర్వహించగా చిరంజీవి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో చిరంజీవి వెంటనే ఐసోలేషన్ కు వెళ్లి పోవడం జరిగింది. మూడు రోజుల తర్వాత కరోనా టెస్టు రిపోస్ట్ తప్పు అని ఆ తర్వాత చేయించుకున్న మూడు రిపోర్ట్ ల్లో కూడా నెగటివ్ వచ్చిందని చిరంజీవి ప్రకటించడంతో మళ్లీ ఆచార్య సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలయ్యే అవకాశం ఉందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కొరటాల శివ ఇప్పటికే ఆచార్య సెట్ లో జాయిన్ అయ్యాడు. ఏర్పాట్లలో మునిగి తేలారు. కొన్ని చిరంజీవి లేకుండా షాట్ లను చిత్రీకరించారు. అధికారికంగా ఈ సినిమా చిత్రీకరణలో చిరంజీవి ఈనెల 20వ తారీకు నుండి జాయిన్ అవ్వబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. చిరంజీవి కరోనా నెగటివ్ అంటూ నిర్థరణ అవ్వడంతో ఈ కొత్త డేట్ ను ఫిక్స్ చేశారు. సినిమాకు సంబంధించిన చిత్రీకరణ కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిరంజీవి కూడా ఇకపై ఎలాంటి బ్రేక్ లేకుండా చాలా తక్కువ సమయంలోనే ఈ సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నారు. వచ్చే సమ్మర్ లో సినిమా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా రామ్ చరణ్ కీలకమైన గెస్ట్ రోల్ లో కనిపించబోతుంది.

Related Images:

జవానీకి మత్తు దించేసే డేట్ వచ్చేసింది!

2019 కియరా నామ సంవత్సరంగా డిక్లేర్ అయ్యింది. వరుస హిట్లతో అమ్మడు మోతెక్కించేసిన సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్ తో కబీర్ సింగ్ .. అక్షయ్ కుమార్ తో గుడ్ న్యూజ్ చిత్రాలలో నటించి బంపర్ హిట్లు అందుకుంది. ఆ రెండు విజయాలతో అందరి కళ్ళకు ఆపిల్ లా కనిపించింది. ఆ తర్వాతనే మహమ్మారీ ఈ అమ్మడికి ఊపిరాడనివ్వలేదు. 2020 ఇంకా పెద్ద టార్గెట్లతో దూసుకుపోవాలని ప్లాన్ చేసింది కానీ అది సాధ్యం కావడం లేదు.

ఎట్టకేలకు కియారా నటించిన తాజా చిత్రం `ఇందూ కి జవానీ` ఓటీటీలో రిలీజవుతోంది. ఈ మూవీ అభిమానులకు ప్రత్యేకించి ఆశ్చర్యం కలిగించే రేంజులో ఉంటుందని ప్రచారం సాగిపోతోంది. తాజాగా కియరా ఓ చమత్కారమైన వీడియోను అభిమానులకు షేర్ చేసింది. ఇందులో ఆమె ఇందూ గుప్తాగా కనిపించింది. ఇది ఇందూ కి జవానీలో తన పాత్ర. ఇందూ కోసం ఉత్సాహంగా ఎలా చూస్తున్నారా.. డేటింగ్ తేదీ ఫిక్స్ చేసేద్దామా అంటూ కియరా ట్విస్టిచ్చింది. స్క్రీన్ పైనే 16 సెప్టెంబర్ ఇది తేదీ అంటూ న్యూస్ చదివేసింది. కియారా వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. “మెయిన్ తోహ్ టైమ్ సే ఆ జాంగి డేట్ కే లియే ఆప్ లేట్ మాట్ హోనా! ఇందూను కలవడానికి ఇంకొంచెం వేచి ఉండండి! #IndooKiJawani. ” అని కోట్ చేసింది. గజియాబాద్ కు చెందిన ఇందూ అనే అమ్మాయి పాత్రలో నటిస్తున్నందున కియారా ఇదిగో ఇలా ప్రత్యేకంగా చమత్కారమైన అవతారంలో కనిపించింది. తన ప్రవర్తన డిక్షన్ పై కియరా చాలానే వర్కవుట్ చేసినట్లు తెలుస్తోంది.

అబీర్ సేన్ గుప్తా ఈ చిత్రానికి దర్శకుడు. `ఇందూ కి జవానీ` డేటింగ్ నేపథ్యంలో సినిమా. ప్రేమలో రకరకాల సాహసాల చుట్టూ తిరిగే ఏజ్డ్ లవ్ స్టోరితో కామెడీ ఆకట్టుకుంటుందట. కియారాతో పాటు ఆదిత్య సీల్ ప్రధాన పాత్రలో నటించింది.

Related Images:

కాఫీ డేట్ కి పిలుస్తోంది ఈ కిలాడీ పిల్ల

నేహాశర్మ సోదరి ఐషా శర్మ ఫిగర్ గురించి ఏమని చెప్పాలి. ఈ అమ్మడు ఇటీవల ఉన్నట్టుండి సోషల్ మీడియాల్లో చెలరేగిపోతోంది. నిరంతరం వేడెక్కించే ఫోటోషూట్లతో ఇన్ స్టాలో దుమారం రేపుతోంది. నిన్నటికి నిన్న బ్లాక్ బికినీ సోయగాన్ని షేర్ చేసిన అయేషా కుర్రకారుకి ఓ రేంజులోనే మెంటలెక్కించింది.

ఈ దూకుడు చూస్తుంటే ఇప్పట్లో ఆగేట్టు లేదు. అలాగని ఐషా శర్మ బాలీవుడ్ కెరీర్ జస్ట్ అంతంత మాత్రమే. కానీ సోదరి నేహాతో కలిసి సోషల్ మీడియాల్లో చెలరేగే తీరు చూస్తుంటే స్టార్ హీరోయిన్ కి అయినా ఇంత లేదేమో ! అంటూ పంచ్ లేస్తారు బోయ్స్. అదంతా సరేకానీ.. ఐషా శర్మలో మాస్ యాంగిల్ ఎంతో తెలియాలంటే .. ఇదిగో లేటెస్టుగా షేర్ చేసిన ఆ ఫోటో దాంతో పాటే ఆ చాట్ ని చూస్తే సరి.

“కాఫీ డేట్ ఎనీ వన్.. షూట్ ఆస్క్ మి!“ అంటూ ఐషా శర్మ కాఫీ షాప్ నుంచే టెంప్ట్ చేసే ప్రయత్నం చేసింది. మొత్తానికి ఇదేదో కమర్షియల్ ప్రమోషనే. దానికి అట్నుంచి వచ్చిన స్పందన షాకిచ్చింది. ఐషా శర్మ ఇన్ వోర్ ధరించదంటూ సెటైర్ వేసేందుకు ప్రయత్నించాడో గడుగ్గాయ్. కానీ ఆ కామెంట్ మరీ టూమచ్. ఇకపోతే ఇలాంటివన్నీ కేవలం ప్రమోషనల్ స్ట్రాటజీ అని భావించాల్సిన పరిస్థితి ఇటీవల కనిపిస్తోంది. ఐషా శర్మ ప్రస్తుతం పలు క్రేజీ బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది.

Related Images: