‘రంగ్ దే’ దసరా స్పెషల్

నితిన్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా రంగ్ దే. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది. చివరి షెడ్యూల్ ను యూరప్ లో చేయాల్సి ఉంది. దాంతో షూటింగ్ మొత్తం పూర్తి అవుతుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. లాక్ డౌన్ తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపిన చిత్ర యూనిట్ సభ్యులు యూరప్ కోసం ప్లాన్ చేస్తున్నారు. ఇక నేడు దసరా సందర్బంగా ఈ పోస్టర్ ను విడుదల చేశారు.

ఇది మూవీ స్టిల్ లేదా మేకింగ్ స్టిల్ ఏది అయినా కూడా పోస్టర్ లో కీర్తి మరియు నితిన్ ల జోడీకి ప్రశంసలు అయితే దక్కుతున్నాయి. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ మరియు వీడియోలతో క్లారిటీ వచ్చింది. నితిన్ పెళ్లి సందర్బంగా విడుదలైన ప్రోమోతో సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉంటుందని.. మాస్ ఆడియన్స్ ను కూడా మెప్పించేలా ఈ సినిమా ను దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నాడు. సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది.

Related Images:

బిగ్ బాస్ దసరా స్పెషల్ ఎపిసోడ్ హోస్ట్ సమంత

మూడు వారాలుగా తెలుగు బిగ్ బాస్ కు ఈ వీకెండ్ కొత్త హోస్ట్ రాబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ గత సీజన్ లో రమ్యకృష్ణ గెస్ట్ హోస్ట్ గా వచ్చింది. ఈసారి వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ కోసం నాగార్జున వెళ్లడంతో బిగ్ బాస్ హోస్ట్ గా గెస్ట్ హోస్ట్ రాబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. కాని గత రెండు మూడు వారాలు ఆ పుకార్లు గాలి వార్తలే అని తేలిపోయింది. అయితే ఈసారి నిజంగానే నాగార్జున షూటింగ్ కోసం మనాలి వెళ్లాడు. ఆ విషయాన్ని స్వయంగా నాగార్జున ట్విట్టర్ లో వీడియో షేర్ చేసి మరీ చెప్పాడు. దాంతో ఈ వారం గెస్ట్ హోస్ట్ ఖాయం అయ్యింది.

దసరా మరియు గెస్ట్ హోస్ట్ అవ్వడంతో ప్రత్యేకంగా ఉండే ఉద్దేశ్యంతో సమంతను ఒప్పించారు. రేపు సాయంత్రం ఆరు నుండి తొమ్మిది వరకు మూడు గంటల పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో సమంత సందడి చేయబోతుంది. సమంత హౌస్ లోకి వెళ్తుందా లేదంటే స్టేజ్ పై నుండే నాగార్జున హోస్టింగ్ చేసినట్లుగా చేస్తుందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

గత మూడు నాలుగు రోజులుగా సమంత క్వారెంటైన్ లో ఉందని ఆమెను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించే అవకాశం ఉంది అంటూ ప్రచారం జరుగుతోంది. మొత్తానికి రేపటికి ఎపిసోడ్ కు సమంత హోస్టింగ్ అది కూడా మూడు గంటల పాటు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ను ఇవ్వబోతున్నారు. నేటి ఎపిసోడ్ హోస్ట్ లేకుండానే సాగబోతుంది. ఇంటి సభ్యులు తీసిన సినిమా ప్రీమియర్ వేయడంతో సందడి చేయనున్నారు.

Related Images: