బ్లాక్ అండ్‌ వైట్ లోనూ అందాల మెరుపులు

కర్ణాటక కి చెందిన హాట్ బ్యూటీ నభా నటేష్ తెలుగు లో నన్ను దోచుకుందువటే సినిమా తో ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా కమర్షియల్ గా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అంతే కాకుండా నటిగా నభా నటేష్ కి మంచి మార్కులు తెచ్చి పెట్టింది. ప్రముఖులు కూడా నభా నటేష్ యొక్క నటన బాగుంది అని కితాబిచ్చారు.

నటిగా ప్రతిభ కనబర్చిన నభా నటేష్ కి దర్శకుడు పూరి జగన్నాధ్ తన ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాలో లీడ్ రోల్‌ ఇవ్వడంతో ఆమె క్రేజ్ మరింతగా పెరిగింది. ఇస్మార్ట్‌ శంకర్‌ మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, ఆ సినిమా లోని నభా పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. అయితే అదృష్టం కలిసి రాకపోవడంతో నభా నటేష్‌ కి ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు.

నభా నటేష్ సినిమా ల్లో కనిపించకున్నా కూడా సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా సందడి చేస్తూనే ఉంది. హాట్ అందాల ఆరబోత ఫోటోలతో రెగ్యులర్‌ గా నభా నటేష్ కుర్రకారులో హీట్‌ పెంచుతూనే ఉంది. తాజాగా మరోసారి ఈ అమ్మడు బ్లాక్ అండ్‌ వైట్‌ ఫోటోలను షేర్‌ చేసి మెరుపులు మెరిపించింది.

సాధారణంగా బ్లాక్‌ అండ్ వైట్ ఫోటోలను ఎక్కువ ఆసక్తిగా నెటిజన్స్ చూడాలి అనుకోరు. కానీ నభా నటేష్ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోలు షేర్‌ చేసినా కూడా ఆమె క్లీ వేజ్ షో తో పాటు ఆకట్టుకునే అందాలను చూపించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ రేంజ్ లో అందంగా ఉన్నా కూడా పాపం నభా నటేష్ కి టాలీవుడ్‌ లో కానీ ఇతర భాషల్లో ఆఫర్లు రావడం లేదు అంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related Images:

అల్లుడుతో కలవబోతున్న సోనూసూద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నభా నటేష్ మరియు అను ఎమాన్యూల్ లు హీరోయిన్స్ గా రూపొందుతున్న ‘అల్లుడు అదుర్స్’ సినిమా షూటింగ్ దాదాపుగా సగం పూర్తి అయ్యింది. కరోనా లాక్ డౌన్ కారణంగా దాదాపు ఆరు నెలలుగా షూటింగ్ కు వెళ్లని ఈ చిత్ర యూనిట్ సభ్యులు ఇటీవలే మళ్లీ షూటింగ్ ను మొదలు పెట్టారట. అన్ని జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ చేస్తున్నారట. ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్న సోనూసూద్ వచ్చే వారం నుండి షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఈ విషయాన్ని యూనిట్ సభ్యులు తెలియజేశారు.

గత ఏడాది సీత సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో కలిసి సోనూసూద్ నటించాడు. ఆ సినిమాలో ఇద్దరి కాంబోకు మంచి ఆధరణ లభించింది. ఇద్దరు కూడా పోటీ పడి నటించినట్లుగా అనిపించింది. అందుకే తప్పకుండా వీరిద్దరి కాంబోలో రాబోతున్న అల్లుడు అదుర్స్ మూవీ కూడా ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. వచ్చే వారం నుండి షూటింగ్ లో జాయిన్ అయ్యి సింగిల్ షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేయాలని దర్శకుడు భావిస్తున్నాడు.

కోవిడ్ సమయంలో రియల్ హీరో అయిన సోనూసూద్ ఈ సినిమాలో నటించడం వల్ల ఈ సినిమాకు మంచి హైప్ దక్కుతుందని మీడియా సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. మొత్తానికి సోనూసూద్ మరియు బెల్లంకొండల ఫైట్ తో నిజంగానే అల్లుడు అదుర్స్ అనిపించుకుంటుందేమో చూడాలి.

Related Images:

ఇలా అయితే స్టార్ హీరోయిన్ ఎప్పుడవుతావ్ అమ్మడూ…!

యంగ్ బ్యూటీ నభా నటేష్ ‘వజ్రకాయ’ అనే కన్నడ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. సుధీర్ బాబు హీరోగా నటించిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. అయితే ఈ సినిమా ప్లాప్ అవడం వల్ల అమ్మడు ఈ మూవీలో నటించిందని కూడా చాలామందికి తెలియలేదు. ఆ తర్వాత రవిబాబు ‘అదుగో’ సినిమాలో నటించినా ఈ బ్యూటీ కెరీర్ కి ఉపయోగపడలేదు. అయితే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. తన గ్లామర్ తో కుర్రకారుని మెస్మరైజ్ చేసిన నభా కుర్రకారు హృదయాల్లో అలజడి సృష్టించింది. ఈ సినిమాతో ఇస్మార్ట్ గర్ల్ గా మారిపోయిన నభా.. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్తుందని అందరూ అనుకున్నారు. అయితే ఈ బ్యూటీ మాత్రం రెమ్యూనరేషన్ చూసుకొని సెకండ్ హీరోయిన్ రోల్స్ కి కమిట్ అవుతోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

కాగా ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ‘డిస్కోరాజా’ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ ని పట్టించుకున్న ఆడియన్స్.. నభా నటించిందనే విషయమే మర్చిపోయారు. ఇక సాయి ధరమ్ తేజ్ సరసన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాలో సోలో హీరోయిన్ గా నటించింది. అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అవుతోందని సమాచారం. ప్రస్తుతం బెల్లకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో నటిస్తోంది నభా. దీంతో పాటు మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ డెబ్యూ మూవీలో కూడా నభా ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తోంది. కాకపోతే ఈ సినిమాలో మరో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ క్రమంలో లేటెస్టుగా నితిన్ హీరోగా నటించనున్న ‘అంధాదున్’ తెలుగు రీమేక్ లో నభా నటేష్ ని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు ప్రకటించారు. అయితే దీంట్లో హీరోయిన్ రోల్ అయినప్పటికీ సినిమాలో పెద్దగా ప్రాధాన్యత ఉండదు. మరో మెయిన్ రోల్ తమన్నా కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ నేపథ్యంలో నభా అంతగా ప్రాధాన్యత లేని రోల్స్ కే పరిమితం అవుతోందని ఫిలిం సర్కిల్స్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలా అయితే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎప్పుడు వెళ్తావ్ నభా అని తన అభిమానులు అంటున్నారు.

Related Images:

ఇక్కడ బెల్లకొండ.. అక్కడ విశాల్…!

సినీ ఇండస్ట్రీలో ఒక్కసారి స్టార్ స్టేటస్ వచ్చాక వెనక్కి తిరిగి చూడాలని ఎవరూ అనుకోరు. అదే ఇమేజ్ ని కాపాడుకుంటూ ముందుకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో మేల్ డామినేషన్ ఉండే ఇండస్ట్రీలో హీరోయిన్స్ కూడా అలానే ఆలోచిస్తుంటారు. హీరోయిన్ గా కొనసాగినన్ని రోజులు మంచి ఇమేజ్ తెచ్చుకొని నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని చూస్తుంటారు. ఈ నేపథ్యంలో ఒక్కసారి స్టార్ హీరోయిన్ అనిపించుకున్న తర్వాత మీడియం రేంజ్ మార్కెట్ ఉన్న హీరోలతో నటించడానికి వెనకడుతుంటారు. అయితే సౌత్ ఇండస్ట్రీలో ఇద్దరు మీడియం రేంజ్ హీరోలతో నటించడానికి స్టార్ హీరోయిన్స్ రెడీగా ఉంటారు. వారెవరో కాదు బెల్లకొండ శ్రీనివాస్ – విశాల్.

కాగా ‘అల్లుడు శీను’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్.. తాను నటించే ప్రతి సినిమాలో స్టార్ హీరోయిన్ ఉండేలా చూసుకుంటాడు. ఈ క్రమంలో అక్కినేని సమంత – కాజల్ అగర్వాల్ – పూజాహెగ్డే – తమన్నా – రకుల్ ప్రీత్ సింగ్ – అనుపమ పరమేశ్వరన్ – మెహ్రీన్ – నభా నటేష్ వంటి హీరోయిన్స్ తో కలిసి నటించాడు బెల్లంకొండ. కోలీవుడ్ లో విశాల్ కూడా తన సినిమాల్లో ఆల్మోస్ట్ స్టార్ హీరోయిన్స్ నే తీసుకుంటున్నాడు. అయితే ఈ ఇద్దరు హీరోల సినిమాలలో నటించడానికి స్టార్ హీరోయిన్స్ ఇంట్రెస్ట్ చూపించడానికి కారణంగా వారి సినిమాలకు ఇచ్చే రెమ్యూనరేషన్ అని తెలుస్తోంది. ఈ హీరోల సినిమాలలో హీరోయిన్లకి మార్కెట్ రేటు కంటే ఎక్కువ ఇస్తారని టాక్. సినిమా హిట్ అయితే డబ్బులతో పాటు క్రెడిట్ కొట్టేయొచ్చు.. అదే ప్లాప్ అయితే రెమ్యూనేషన్ ఎలానూ ఎక్కువగానే వస్తోందిగా అనే విధంగా హీరోయిన్స్ ఆలోచిస్తున్నారని కాస్టింగ్ వర్గాలు చెప్తున్నాయి.

Related Images: