దక్షిణాది ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ‘కేజీఎఫ్’ వంటి పాన్ ఇండియా మూవీని నిర్మించిన సంగతి తెలిసిందే. కన్నడ రాకింగ్ స్టార్ యష్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా వస్తున్న ‘కేజీఎఫ్ 2’ చిత్రాన్ని కూడా హోంబేల్ ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇదే క్రమంలో పునీత్ రాజ్ కుమార్ తో ‘యువరత్న’ అనే సినిమా చేస్తున్నారు. తాజాగా మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయనున్నట్లు హోంబలే ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ 2న మధ్యాహ్నం 2 గంటల 9 నిమిషాలకు ఈ చిత్ర వివరాలు వెల్లడించనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే ఈ సినిమా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబోలో ఉంటుందని టాక్ నడుస్తోంది.
ఇటీవలే దర్శకుడు ప్రశాంత్ నీల్.. ప్రభాస్ ని కలిసినట్లు తెలుస్తోంది. వీరి మధ్య ఓ ప్రాజెక్టు విషయమై మంతనాలు జరిగాయని.. దీనిపై ప్రభాస్ కూడా నమ్మకంగా ఉన్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ‘కేజీఎఫ్’ మేకర్స్ అనౌన్స్ చేయబోయే సినిమా ప్రభాస్ – ప్రశాంత్ కాంబోలో రానున్న ప్రాజెక్ట్ అని అనుకుంటున్నారు. వాస్తవానికి ప్రశాంత్ నీల్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయడానికి ప్రయత్నాలు చేసారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రశాంత్ తో దీని కోసం ఒప్పందం కూడా కుదుర్చుకుందని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ‘కేజీఎఫ్’ దర్శక నిర్మాతలు ప్రభాస్ తో సినిమా చేస్తున్నారనే న్యూస్ రావడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ప్రభాస్ మూడు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. మరి హోంబలే ఫిల్మ్స్ ప్రకటించే క్రేజీ ప్రాజెక్ట్ ఏంటో తెలియాలంటే డిసెంబర్ 2 వరకు ఆగాల్సిందే.
బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలకు సంతకాలు చేస్తూ మరోవైపు సొంత ప్రొడక్షన్ లో సినిమాలు నిర్మిస్తూ సదరు స్టార్ హీరోయిన్ వేస్తున్న ప్లాన్స్ ఇటీవల ఇండస్ట్రీలో చర్చకు వచ్చాయి. ఇప్పటికే ఓంరౌత్ ప్లాన్ చేసిన సౌత్ క్రేజీ వెంచర్ ఆదిపురుష్ 3డి కి సదరు బ్యూటీ సంతకం చేసింది. ఏకంగా బాహుబలి స్టార్ ప్రభాస్ సరసన నటించే ఆఫర్ అందుకుంది. ఇంతకీ ఈ భామ ఎవరో కనిపెట్టేయడం ఈజీనే. ది గ్రేట్ పద్మావత్ ఫేం ది గ్రేట్ దీపిక పదుకొనే గురించే ఇదంతా.
ఇటీవల దీపిక వేస్తున్న ప్రతి ప్లాన్ కి కరోనా చెక్ పెట్టేస్తోందన్న గుసగుస వినిపిస్తోంది. 2019-20 సీజన్ లో భారీ ప్రణాళికలతో ముందుకు సాగాలనుకుంటే ఉన్నట్టుండి కరోనా చెక్ పెట్టేసింది. నిర్మాతగా ఇప్పటికే భారీ పెట్టుబడులు వెదజల్లి తెరకెక్కించిన ఓ రెండు సినిమాలు ఇబ్బందికర పరిణామాన్ని ఎదుర్కొంటున్నాయి. ఒకటి ఇప్పటికే రిలీజై ఫ్లాపైంది. మరొకటి కరోనా క్రైసిస్ వల్ల థియేటర్లు తెరవక రిలీజ్ కాలేదు. అదే పాన్ ఇండియా మూవీ 83. హబ్బీ రణవీర్ ఈ చిత్రంలో కథానాయకుడి(కపిల్ దేవ్)గా నటిస్తే తాను అతడు సతీమణి పాత్రను పోషించింది. టీమిండియా 1983 విక్టరీ నేపథ్యంలో కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది.
తాజాగా కింగ్ ఖాన్ షారూక్ ప్రతిష్ఠాత్మక చిత్రం పఠాన్ లోనూ దీపిక ఆఫర్ దక్కించుకుంది. పఠాన్ లో దీపికా పదుకొనే షారుఖ్ ఖాన్ తో కలిసి పని చేసే ఏజెంట్ గా కనిపించనుందట. ఇందులో భారీ యాక్షన్ తో అదరగొట్టనుందట. YRF సంస్థ ప్రతిష్టాత్మకంగా 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా `పఠాన్`ని ప్లాన్ చేసింది. దీనికి వార్ దర్శకుడు సిధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో జాన్ అబ్రహాం విలన్ పాత్రలో కనిపిస్తారు. నవంబర్ ప్రారంభంలో SRK స్పోర్టింగ్ ఎడ్జీ లుక్ తో షూటింగ్ ప్రారంభమైంది.
ఇప్పుడు ఈ చిత్రంలో ఏజెంట్ పాత్రను దీపికా పదుకొనే రాయనున్నట్లు తెలిసింది. దినపత్రిక ప్రకారం సోమవారం దీపిక రెండు రోజుల షూట్ కోసం జట్టులో చేరింది. ఈ సినిమాకు షకున్ బాత్రాకి మధ్య ఆమె గారడీ చేస్తోంది. ఆమె డిసెంబర్ మధ్యలో SRK లో చేరడానికి సిద్ధంగా ఉంది మరియు 2021 జనవరి మరియు జూన్ మధ్య ప్రధాన యాక్షన్ ప్యాక్డ్ సీక్వెన్సులు చిత్రీకరించబడతాయి.
దీపిక పాత్రకు సంబంధించినంతవరకు చూస్తే తాను తొలిసారి ఒక రా ఏజెంట్ పాత్రను పోషిస్తోంది. అది పఠాన్ లోని ఒక మిషన్ లో పాల్గొనే డేరింగ్ గాళ్ పాత్ర. టైగర్ జిందా హై ఫ్రాంచైజీ నుండి కత్రినా కైఫ్ జోయా తరహాలో ఇది యాక్షన్ మిక్స్ డ్ గా ఉంటుందట. పఠాన్ లో ఎస్.ఆర్.కె పాత్రను `టైగర్ జిందా హై`లో సల్మాన్ పాత్రతో పోలుస్తున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల నడుమ ఆరోగ్యకరమైన ఆసక్తికరమైన పోటీ నెలకొంది. ఒకరితో ఒకరు పోటీపడుతూ పాన్ ఇండియా స్టార్లుగా ఇరుగు పొరుగు భాషల్లోనూ నిరూపించుకోవాలనే పంతంతో ఉన్నారు. ఇక ఇరుగు పొరుగు స్టార్లకు మన పరిశ్రమలో కావాల్సినంత ప్రోత్సాహం ఉంది.
టాలీవుడ్ లో ప్రభాస్ పాన్ ఇండియా ట్రెండ్ ని పీక్స్ కి తీసుకెళ్లడంలో పెద్ద సక్సెసయ్యారు. ఆ క్రమంలోనే మహేష్.. అల్లు అర్జున్.. ఎన్టీఆర్.. రామ్ చరణ్ వంటి స్టార్లు పోటీబరిలోకొచ్చారు. వీరంతా ఉత్తర భారతదేశంలోనూ తమ అదృష్టాన్ని పరీక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. సదరు హీరోలు నటించిన తదుపరి చిత్రాలు పాన్-ఇండియన్ రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. హిందీ బెల్ట్ అంతటా తెలుగు హీరోలకు ఇమేజ్ అంతకంతకు పెరుగుతోంది. మన సినిమాలపై వ్యామోహం స్పష్ఠంగా కనిపిస్తోంది. అందుకే మన హీరోలంతా పాన్ ఇండియా మంత్రాన్ని జపిస్తున్నారు.
ఇప్పుడు ఇదే రేస్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరు వినిపిస్తోంది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న #PSPK 27 పైనే అందరి గురి. పవన్ తొలిసారి పాన్ ఇండియా మార్కెట్ ను అన్వేషిస్తున్నాడు. స్పష్టంగా తాజా చిత్రాన్ని నాలుగు దక్షిణ భారత భాషలలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అంతేకాదు రాబిన్ హుడ్ తరహా కథాంశాన్ని ఎంచుకోవడం పైగా కోహినూర్ వజ్రం నేపథ్యాన్ని కథలో చేర్చడంతో యూనివర్శల్ అప్పీల్ తెచ్చారు క్రిష్. అందుకు తగ్గట్టే విజువల్ వండర్ గా ఈ మూవీని ప్లాన్ చేశారు. అలాగే ఇందులో గ్లామర్ ఏమాత్రం తగ్గకుండా జాగ్రత్త పడ్డారు. ఇద్దరు పాపులర్ హీరోయిన్లు .. అందునా జాక్విలిన్ లాంటి హాట్ హీరోయిన్ ని ఎంపిక చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. బాలీవుడ్ నుండి ఒక విలన్ ఈ మూవీలో నటిస్తునున్నారు. అధికారికంగా ప్రతిదీ ప్రకటించాల్సి ఉంది. మొఘలుల కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ భారీ పాన్ ఇండియా చిత్రానికి ఎ.ఎమ్.రత్నం రాజీకి రాకుండా పెట్టుబడులు పెడుతున్నారు.