// Header & Footer Code controls (added by assistant) if ( function_exists('add_action') ){ function tn_customize_header_footer( $wp_customize ) { $wp_customize->add_section( 'tn_header_footer_section', array( 'title' => __( 'Header & Footer Code', 'tnnewstheme2025' ), 'priority' => 200, ) ); $wp_customize->add_setting( 'tn_header_code', array( 'default' => '', 'sanitize_callback' => 'tn_sanitize_unfiltered_html', ) ); $wp_customize->add_control( 'tn_header_code', array( 'label' => __( 'Header Code (placed inside
)', 'tnnewstheme2025' ), 'section' => 'tn_header_footer_section', 'type' => 'textarea', ) ); $wp_customize->add_setting( 'tn_footer_code', array( 'default' => '', 'sanitize_callback' => 'tn_sanitize_unfiltered_html', ) ); $wp_customize->add_control( 'tn_footer_code', array( 'label' => __( 'Footer Code (before )', 'tnnewstheme2025' ), 'section' => 'tn_header_footer_section', 'type' => 'textarea', ) ); } add_action( 'customize_register', 'tn_customize_header_footer' ); function tn_sanitize_unfiltered_html( $val ){ if( current_user_can('unfiltered_html') ) return $val; return wp_kses_post($val); } }
సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా రాణించే ప్రతి ముద్దుగుమ్మ ఫైనల్ డెస్టినేషన్ బాలీవుడ్ ఇండస్ట్రీ అవుతోంది. క్రేజ్ కోసమో రెమ్యూనరేషన్ కోసమో కానీ హీరోయిన్స్ అందరూ హిందీ ఇండస్ట్రీ మీద మోజు పడుతుంటారు. అలనాటి హీరోయిన్లు రేఖ – శ్రీదేవి ల నుంచి నేటి పూజాహెగ్డే – రష్మిక మందన్నా వరకు దక్షిణాదిలో స్టార్ స్టేటస్ అందుకున్న ప్రతి హీరోయిన్ కూడా ఇక్కడ క్రేజ్ రాగానే బాలీవుడ్ వైపు పరుగులు తీశారు. అందులో చాలామంది అక్కడ కూడా సక్సెస్ అందుకోగా.. మరికొందరి కెరీర్ మాత్రం అటు బాలీవుడ్ కి ఇటు సౌత్ కి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. ఇక లేటెస్ట్ గా ఈ బ్యాచ్ లోకి వచ్చిన పూజా హెగ్డే – రష్మిక విషయానికొస్తే ఇద్దరూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా వెలుగొందుతూ బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తున్నారు.
పూజా చేతిలో ప్రస్తుతం తెలుగు సినిమాల కంటే హిందీ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. తెలుగులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి ‘రాధేశ్యామ్’ అనే పీరియాడికల్ సినిమాలో నటిస్తోన్న పూజా హెగ్డే.. అక్కినేని అఖిల్ తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు తప్పితే పూజాకు తెలుగులో మరో ఆఫర్ లేదు. ఇక బాలీవుడ్ లో యశ్ రాజ్ వారు చేయబోయే నాలుగు సినిమాల్లో పూజా ఎగ్రీమెంట్ వేసుకున్నట్లుగా టాక్ నడుస్తోంది. అలానే సాజిద్ నాడియాద్ వాలా అండ్ సన్స్ నిర్మించే సినిమాల్లో కూడా పూజాకు ఆఫర్స్ వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే రణవీర్ సింగ్ – డైరెక్టర్ రోహిత్ శెట్టి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘సర్కస్’ అనే సినిమాలో పూజా హీరోయిన్ అని అధికారికంగా ప్రకటించారు. అలానే సల్మాన్ ఖాన్ తో ‘కభీ ఈద్ కభీ దివాళీ’ అనే సినిమాలో పూజా నటించనుందని సమాచారం.
ఇక రష్మిక. మందన్న విషయానికొస్తే తెలుగు తమిళ చిత్రాలతో పాటు కన్నడలోనూ సినిమాలు చేస్తూ అనతికాలంలోనే భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తెలుగులో పెద్ద ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న రష్మిక.. బాలీవుడ్ నుంచి కూడా పిలుపు అందుకుంది. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన ‘మిషన్ మజ్ను’ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. తాజాగా మరో బాలీవుడ్ ఆఫర్ అందుకుందని టాక్ నడుస్తోంది. వికాస్ భల్ దర్శకత్వంలో బిగ్ బీ అమితాబ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘డెడ్లీ’ అనే సినిమాలో అమితాబ్ కూతురిగా రష్మిక కనిపించనుందట. టాలీవుడ్ లో పోటీపడుతున్న ఈ బ్యూటీస్ ఇద్దరూ హిందీలో కూడా పోటీపడతారేమో చూడాలి.
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది పూజా హెగ్డే. తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పక్కన ‘రాధేశ్యామ్’ సినిమాలో నటిస్తోంది. అలానే అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే యూత్ ఫుల్ మూవీలోనూ పూజాహెగ్డే నటిస్తోంది. తాజాగా నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను స్టార్ హీరోయిన్ గా నిలబెట్టిన టాలీవుడ్ ని పొగుడుతూనే సౌత్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
“తెలుగు ప్రేక్షకులు సినిమాలను అమితంగా ప్రేమిస్తారు. స్టార్స్ ను దేవుళ్లుగా పూజిస్తారు. ఓ తెలుగు సినిమా రూ.200 కోట్లను వసూళ్లు చేస్తున్నాయంటే కారణం ప్రేక్షకులే. ఓ సినిమాను చాలా ఇష్టపడితే మళ్ళీ మళ్ళీ చూస్తారు. నేను సినిమా విడుదలైన రోజున సినిమాను చూడటానికి ఇష్టపడతారు. సినిమాను స్టార్స్ ను ఎంతగా ప్రేమిస్తారంటే థియేటర్ కు డ్రమ్స్ తో వచ్చి డ్యాన్స్ చేస్తారు. పేపర్లు చల్లుతారు. సినిమా అంటే వాళ్లకి ఓ పండుగే” అని తెలుగు ప్రేక్షకులను ఆకాశానికి ఎత్తింది పూజాహెగ్డే. నటిగా తనని తాను నిరూపించుకోవడానికి తెలియని విషయాలను తెలుసుకోవడానికి టాలీవుడ్ ఎంతగానో ఉపయోగపడిందని కొనియాడింది.
అదే సమయంలో ”సౌత్ ఇండియన్ సినిమా వాళ్లు నావెల్(నడుము) మత్తులోనే ఉంటారని మిడ్ డ్రెస్ లలో తమని చూడాలనుకుంటారు” అని సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఆమె ఈ కామెంట్స్ నవ్వుతూనే చేసినప్పటికీ దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. స్టార్ హీరోయిన్ ని చేసిన సౌత్ ఇండస్ట్రీపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అలాంటప్పుడు దక్షిణాది చిత్రాల్లో నటించంకుండా బాలీవుడ్ లోనే నటించాలని సూచిస్తున్నారు. మరి దీనిపై పూజాహెగ్డే వివరణ ఇస్తుందేమో చూడాలి. ఇంతకముందు హీరోయిన్ తాప్సి కూడా టాలీవుడ్ పై ఇలాంటి వ్యాఖ్యలే చేసిన సంగతి తెలిసిందే.
టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రస్తుతం ఎవరైనా వున్నారా? అంటే వెంటనే వినిపించే పేరు పూజాహెగ్డే. అందం.. అభినయం.. సక్సెస్ లాంటివి పక్కన పెడితే వరుస అవకాశాలతో టాప్ హీరోయిన్ జాబితాలో చేరిపోయిందీ పొడుగు కాళ్ల సుందరి. బన్నీతో ఈ ఏడాది ప్రారంభంలో `అల వైకుంఠపురములో`తో ఇండస్ట్రీ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇదే ఊపులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కు జోడీగా `రాధేశ్యామ్`లో నటిస్తోంది.
అక్కినేని అఖిల్ తో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో బన్నీవాసు నిర్మిస్తున్న `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` చిత్రంలో నటిస్తన్న పూజా హెగ్డే కరోనా క్రైసిస్ వున్నా పారితోషికం విషయంలో ఎక్కడా తగ్గనంటోంది. గతానికి మించి భారీగానే తన పారితోషికాన్ని పెంచేసి ప్రొడ్యూసర్స్ కి షాకిచ్చిన పూజా హెగ్డే దక్షిణాది చిత్రాలకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటోందట. ప్రస్తుతం ముంబైలో వుంటున్న పూజా హైదరాబాద్ లోనూ సొంత ఇంటిని ఏర్పాటు చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
ఈ బుట్టబొమ్మకి తెలుగు.. తమిళ భాషల్లో వరుసగా ఆఫర్లు వస్తుండటంతో ఇక్కడే మకాం పెట్టాలని భావిస్తోందట. ట్రిపుల్ బెడ్రూమ్ లగ్జరీ ఫ్లాట్ ని కొనుగోలు చేయాలన్న ప్రయత్నాల్లో వుందట. ఎక్కడ ఏ ఏరియా అన్నది మాత్రం ఇంకా పూజ బయటపెట్టలేదు. అల్ మోస్ట్ జూబ్లీ హిల్స్ ఏరియాలోనే పూజా ఓ ఫ్లాట్ ని తీసుకోబోతోందని మాత్రం ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
సినీ ఇండస్ట్రీలో ఒక్కసారి స్టార్ స్టేటస్ వచ్చాక వెనక్కి తిరిగి చూడాలని ఎవరూ అనుకోరు. అదే ఇమేజ్ ని కాపాడుకుంటూ ముందుకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో మేల్ డామినేషన్ ఉండే ఇండస్ట్రీలో హీరోయిన్స్ కూడా అలానే ఆలోచిస్తుంటారు. హీరోయిన్ గా కొనసాగినన్ని రోజులు మంచి ఇమేజ్ తెచ్చుకొని నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని చూస్తుంటారు. ఈ నేపథ్యంలో ఒక్కసారి స్టార్ హీరోయిన్ అనిపించుకున్న తర్వాత మీడియం రేంజ్ మార్కెట్ ఉన్న హీరోలతో నటించడానికి వెనకడుతుంటారు. అయితే సౌత్ ఇండస్ట్రీలో ఇద్దరు మీడియం రేంజ్ హీరోలతో నటించడానికి స్టార్ హీరోయిన్స్ రెడీగా ఉంటారు. వారెవరో కాదు బెల్లకొండ శ్రీనివాస్ – విశాల్.
కాగా ‘అల్లుడు శీను’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్.. తాను నటించే ప్రతి సినిమాలో స్టార్ హీరోయిన్ ఉండేలా చూసుకుంటాడు. ఈ క్రమంలో అక్కినేని సమంత – కాజల్ అగర్వాల్ – పూజాహెగ్డే – తమన్నా – రకుల్ ప్రీత్ సింగ్ – అనుపమ పరమేశ్వరన్ – మెహ్రీన్ – నభా నటేష్ వంటి హీరోయిన్స్ తో కలిసి నటించాడు బెల్లంకొండ. కోలీవుడ్ లో విశాల్ కూడా తన సినిమాల్లో ఆల్మోస్ట్ స్టార్ హీరోయిన్స్ నే తీసుకుంటున్నాడు. అయితే ఈ ఇద్దరు హీరోల సినిమాలలో నటించడానికి స్టార్ హీరోయిన్స్ ఇంట్రెస్ట్ చూపించడానికి కారణంగా వారి సినిమాలకు ఇచ్చే రెమ్యూనరేషన్ అని తెలుస్తోంది. ఈ హీరోల సినిమాలలో హీరోయిన్లకి మార్కెట్ రేటు కంటే ఎక్కువ ఇస్తారని టాక్. సినిమా హిట్ అయితే డబ్బులతో పాటు క్రెడిట్ కొట్టేయొచ్చు.. అదే ప్లాప్ అయితే రెమ్యూనేషన్ ఎలానూ ఎక్కువగానే వస్తోందిగా అనే విధంగా హీరోయిన్స్ ఆలోచిస్తున్నారని కాస్టింగ్ వర్గాలు చెప్తున్నాయి.
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అందాల భామ పూజాహెగ్డే స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతుంది. తన గ్లామర్ తో వరుసగా సినిమా అవకాశాలను దక్కించుకుంటూ బిజీ బిజీగా గడుపుతున్న పూజ ఇటీవలే జోరు పెంచేసింది. ముకుంద సినిమాతో తెరంగేట్రం చేసిన పూజా.. దువ్వాడ జగన్నాథం ‘అరవింద సమేత’ – మహర్షిల భారీ విజయాల తర్వాత తన స్టార్డం కొనసాగిస్తూ ఈ ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం పూజా డార్లింగ్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమా చేస్తోంది. కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్ లకు బ్రేక్ పడటంతో.. స్వీయ నిర్బంధంలో ఉన్న పూజ ఇంట్లో సమయాన్ని బాగా ఎంజాయ్ చేస్తుందట.
ప్రస్తుతం ఇంటిపట్టునే ఉంటున్న పూజా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను కొత్త కొత్త ఫోటోషూట్లను తన అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ భామ ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ ఫోటో షేర్ చేసింది. ఆ ఫోటోలో పూజాను చూస్తూ గ్లామర్ ప్రియులు కళ్లప్పగించి చూస్తున్నారు. వైట్ కలర్ పెన్సిల్ స్టైల్ డ్రెస్సులో బుట్టబొమ్మలా ముస్తాబై కూర్చుని ఉంది. ఇక ఫోటోలో అమ్మడు ఎలాంటి స్కిన్ షో చేయకుండానే కేవలం తన చిరునవ్వుతోనే కుర్రాళ్ళ హృదయాలను దోచుకుంటుంది. ఇదిలా ఉండగా.. పూజా ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ కాబోతుంది. షూటింగ్స్ మొదలైతే మాత్రం ఎవరికీ దొరకనంత బిజీ కాబోతుందట. ప్రస్తుతం అమ్మడి చేతిలో రాధేశ్యామ్ తో పాటు అఖిల్ హీరోగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హిందీలో సల్మాన్ ఖాన్ సరసన ‘కబీ ఈద్ కబీ దీవాలి’.. అలాగే స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన మరో సినిమాలో నటించనుందట. మొత్తానికి షెడ్యూల్ ఫుల్ చేసుకుంది పూజా.