పెళ్లి తర్వాత నిహారిక ఫస్ట్ బర్త్ డేను చైతన్య ఎక్కడ చేస్తున్నాడో తెలుసా?

మెగా వారి ఇంటి అమ్మాయి నిహారిక కొనిదెల ఇటీవలే చైతన్య ను పెళ్లి చేసుకుని జొన్నలగడ్డ వారి అమ్మాయిగా మారిపోయింది. ఇక నేడు నిహారిక పుట్టిన రోజు జరుపుకుంటుంది. తన 28వ వసంతంలోకి అడుగు పెడుతున్న నిహారికకు ప్రముఖులు మరియు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా పెద్ద ఎత్తున వేడుకలను ఇటు కొనిదెల ఫ్యామిలీ అటు జొన్నలగడ్డ వారి ఫ్యామిలీ నిర్వహిస్తుంది. నిన్న రాత్రి సమయంలో జబర్దస్త్ మరియు అదిరింది కమెడియన్స్ తో పాటు తన సన్నిహితులకు నాగబాబు పిలిచి నిహారిక బర్త్ డే పార్టీని ఇచ్చాడు.

ఇక నేడు నిహారిక బర్త్ డే పార్టీని పలక్ నుమా ప్యాలెస్ లో వైభవంగా చైతన్య నిర్వహించబోతున్నాడు. ఈ బర్త్ డే వేడుకలో మెగా ఫ్యామిలీతో పాటు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నారు. పెళ్లి తర్వాత వచ్చిన నిహారిక మొదటి పుట్టిన రోజు అవ్వడంతో ఎప్పటికి గుర్తు ఉండేలా ఈ వేడుకను నిర్వహిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇటీవలే పెళ్లి తంతు పూర్తి చేసుకుని కార్యక్రమాలు ముగించుకుని వచ్చేసిన కొత్త జంట నేడు మళ్లీ బర్త్ డే వేడుకల సందర్బంగా సోషల్ మీడియాలో సందడి చేయబోతున్నారు.

Related Images:

జూనియర్ కేజీఎఫ్ ఫస్ట్ బర్త్ డే

కన్నడ సెన్షేషనల్ స్టార్ యశ్ ఇద్దరు పిల్లలు కూడా ఎప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటారు. యశ్ లేదా ఆయన భార్య రాధిక అయిన ఇద్దరు పిల్లలకు సంబంధించిన వీడియోలను మరియు ఫొటలోను షేర్ చేస్తూ ఉండటంతో చిన్నప్పటి నుండే వారు పెద్ద సెలబ్రెటీలు అయ్యారు. వారికి ఎంతో మంది అభిమానులు కూడా ఉన్నారు అనడంలో సందేహం లేదు. యశ్ కూతురు మరియు కొడుకులు సోషల్ మీడియా సెన్షేషన్ అంటూ ఉంటారు. అలాంటి సోషల్ మీడియా సెన్షేషన్ జూనియర్ యశ్ యథర్వ్ యశ్ పుట్టిన రోజు సందర్బంగా భారీ వేడుక కాకుండా చాలా విభిన్నంగా ప్లాన్ చేశారు.

అతి తక్కువ మంది సన్నిహితల సమక్షంలో యథర్వ్ పుట్టిన రోజును బోట్ లో యశ్ నిర్వహించాడు. చుట్టు నీరు మద్యలో పెద్ద బోట్ లో ఏర్పాటు చేసిన కేక్ ను కొడుకుతో యశ్ కట్ చేయించాడు. ఈ సందర్బంగా తీసిన వీడియో మరియు ఆ వీడియోకు ఉన్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. యథర్వ్ బర్త్ డే సందర్బంగా మరింత క్యూట్ గా కనిపిస్తున్నాడు అంటూ యశ్ అభిమానులు అంటున్నారు.

యథర్వ్ కు మొదటి పుట్టిన రోజు శుభాకాంక్షలను దేశ వ్యాప్తంగా ఉన్న కేజీఎఫ్ అభిమానులు చెబుతున్నారు. ఇక యశ్ వచ్చే ఏడాది ఆరంభంలోనే కేజీఎఫ్ తో వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నాడు. షూటింగ్ ముగింపు దశకు వచ్చేసింది. మొన్నటి వరకు యశ్ ఇతర యూనిట్ సభ్యులు హైదరాబాద్ లో చిత్రీకరణ జరిపిన విషయం తెల్సిందే. కేజీఎఫ్ షూటింగ్ కు బ్రేక్ తీసుకుని కొడుకు పుట్టిన రోజు వేడుకలో యశ్ పాల్గొన్నాడు.

 

View this post on Instagram

 

U may not remember the flavour of your cake, u may not know why that day was so special.. but to us, as parents it was a celebration we will cherish for life.. a year gone by as parents of a lil bundle of happiness!! Happy birthday ❤️ Vc: @focusphotographyservice

A post shared by Radhika Pandit (@iamradhikapandit) on

Related Images: